Search
  • Follow NativePlanet
Share
» »శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు ఈ రైతు సొంతం !

శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు ఈ రైతు సొంతం !

చండీఘర్ లోని లుథియానా జిల్లా. ఇక్కడే ఆ జిల్లా కోర్టు ఒక సంచలనమైన తీర్పును ఇవ్వటం జరిగింది. మరి ఆ తీర్పు ఏంటి అంటే రైలు మార్గ నిర్మాణసమయంలో భూమిని కోల్పోయిన రైతుకి రైలునే అప్పజెప్పటం.

By Venkatakarunasri

దేశం అభివృద్ది చెందటానికి ప్రభుత్వాలు ఎన్నో ప్రయోజనాలను చేపడుతుంటాయి. ఎన్నో కట్టడాలు నిర్మిస్తుంటాయి.అలా అభివృద్ది పనుల్లో భాగంగా ఎంతో మంది ప్రజలు, రైతులు కొంత భూమిని కూడా కోల్పోవాల్సివుంటుంది. దానికి నష్టపరిహారంగా ప్రభుత్వం వారికి భారీ స్థాయిలో డబ్బును కూడా చెల్లిస్తారు.

చండీఘర్ వీడియో కోసం క్లిక్ చేయండి

మరికొందరికి వేరే చోట భూమిని రాసివ్వటం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం కోర్టు ఒక సంచలన తీర్పును ఇవ్వటం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఒక వింతైన నష్ట పరిహారాన్ని ఒక రైతుకు చేకూర్చటం జరిగింది. మరి ఆ సంచలన తీర్పు ఏంటి? ఆ వింతైన నష్టపరిహారం ఏమై వుంటుంది.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. సంచలనమైన తీర్పు

1. సంచలనమైన తీర్పు

ఇది చండీఘర్ లోని లుథియానా జిల్లా. ఇక్కడే ఆ జిల్లా కోర్టు ఒక సంచలనమైన తీర్పును ఇవ్వటం జరిగింది.

PC:youtube

2. తీర్పు ఏంటి ?

2. తీర్పు ఏంటి ?

మరి ఆ తీర్పు ఏంటి అంటే రైలు మార్గ నిర్మాణసమయంలో భూమిని కోల్పోయిన రైతుకి రైలునే అప్పజెప్పటం.

PC:youtube

3. రైతు

3. రైతు

రైలును రైతుకి ఇవ్వటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును.

PC:youtube

4. సంపూరణ్ సింగ్

4. సంపూరణ్ సింగ్

ఇక్కడ రైలు మార్గాన్ని నిర్మిస్తున్న సమయంలో సంపూరణ్ సింగ్ అనే 45 సంవత్సరాలకు చెందిన ఒక రైతు పొలాన్ని 2012లో ఆక్రమించుకోవడం జరిగింది.

PC:youtube

5. కోటి నలభై లక్షల నగదు

5. కోటి నలభై లక్షల నగదు

దానికి నష్టపరిహారంగా అతనికి రైల్వే శాఖ వారు ఒక కోటి నలభై లక్షల వరకు నగదు ఇవ్వాల్సి వుంది.

PC:youtube

6. నష్టపరిహారం

6. నష్టపరిహారం

కానీ నలభై రెండు లక్షలు మాత్రం ఇచ్చారట.

PC:youtube

7. కోర్టు

7. కోర్టు

దాంతో సంపూరణ్ సింగ్ కోర్టును ఆదేశించటం జరిగింది.

PC:youtube

8. పిటిషన్ కారు

8. పిటిషన్ కారు

కేసును విచారించిన కోర్టు 2015జనవరిలో పిటిషన్ కారుకి రైల్వే ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చేయాలని తీర్పును ఇచ్చింది.

ఐపీఎల్ స్టార్లు... పుట్టిన ప్రదేశాలు!!

PC:youtube

9. సంపూరణ్ సింగ్

9. సంపూరణ్ సింగ్

అప్పటికీ రైల్వే శాఖ స్పందించక పోవటంతో మరో సారి కోర్టు మెట్లు ఎక్కాడు సంపూరణ్ సింగ్.

PC:youtube

10. సంచలనమైన తీర్పు

10. సంచలనమైన తీర్పు

ఈ సమయంలో కేసును విచారించిన జిల్లా అడిషనల్ కోర్ట్ జడ్జ్ జైపాల్ వర్మ స్వర్ణ శతాబ్ది ఎక్స్ ప్రెస్ నెం12030ని రైతుకిస్తున్నట్టు సంచలనమైన తీర్పును ఇవ్వటం జరిగింది.

PC:youtube

11. ట్రైన్ డ్రైవర్

11. ట్రైన్ డ్రైవర్

ఈ క్రమంలో ఆ కోర్టు పత్రాలను ట్రైన్ డ్రైవర్ కి చూపించాడు సంపూరణ్ సింగ్.

PC:youtube

12. అనూజ్ ప్రకాశ్

12. అనూజ్ ప్రకాశ్

అప్పుడు అక్కడి డివిజనల్ రైల్వే మేనేజర్ అనూజ్ ప్రకాశ్ స్పందించటం జరిగింది.

PC:youtube

13. నష్ట పరిహారాలు

13. నష్ట పరిహారాలు

నష్టపోయిన వారికి పరిహారాలు చెల్లించటంలో కొన్ని సమస్యలు వచ్చాయని వాటిని తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

PC:youtube

14. రైల్వేశాఖ

14. రైల్వేశాఖ

అంతేకాదు రైలును రైతుకిస్తే అతనేం చేసుకుంటాడని కనీసం ఇంటిక్కూడా తీసుకెళ్లలేని పరిస్థితి వుంటుందని ప్రశ్నించారు కాకపోతే నష్టపరిహారం చెల్లించటంలో రైల్వేశాఖ త్వరగా స్పందిస్తుందని సమాధానమిచ్చారు.

మొహాలి ఒక అద్భుత శాటిలైట్ నగరం!!

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X