Search
  • Follow NativePlanet
Share
» » శత్రువుల గుండుకు ఎదురు నిల్చిన వీటి రహస్యాలు నిగూడం

శత్రువుల గుండుకు ఎదురు నిల్చిన వీటి రహస్యాలు నిగూడం

భారత దేశంలో పర్యాటక కేంద్రాలుగా మారిన పురాతన కోటలకు సంబంధించిన కథనం.

సువిశాల, సుసంపన్నమైన భారత దేశాన్ని ఎంతోమంది రాజులు పాలించారు. పాలనలో భాగంగా తమ ప్రజలకు రక్షణ కల్పించడం కోసం రాజులు కోటలను నిర్మించుకొనేవారు. భారత దేశంలో ఇలా నిర్మించిన కోటల్లో దాదాపు 500 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన కోటలు కూడా ఉన్నాయి. ఎన్నో ఫిరంగి గుళ్లకు ఎదురొడ్డి నిలబడిన ఆ కోటల్లో ఇప్పటికీ కొన్ని చెక్కుచెదరకుండా ఉన్నాయి. అంతేకాకుండా ఈ కోటలు ఎన్నో రహస్యాలను తమలో ఇముడ్చుకొన్నాయి. మరో వైపు ఈ కోటలు ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా మారి పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అంటే ఒకప్పుడు శత్రు భయంకరమైన కోటలు కొన్ని నేటు మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయని స్పష్టమవుతోంది. అటువంటి కోటలు చాలా వరకూ పర్వత శిఖరాల పై భాగానే ఉండటం వల్ల ఇవి వేసవి విడదిగా కూడా ఉంటున్నాయి. ఇలా పర్యాటక కేంద్రాలుగా మారిన కొన్ని ముఖ్యమైన కోటల గురించిన క్లుప్త సమాచారం మీ కోసం ఈ కథనంలో అందిస్తున్నాం.

జోథ్ పుర కోట

జోథ్ పుర కోట

P.C: You Tube

రాజస్థాన్ లో జోథ్పురలో దాదాపు 500 ఏళ్ల క్రితం నిర్మించిన మెహ్రాన్ ఘర్ జోథ్ పుర కోట పేరుతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఈ కోటను రావ్ జోథ నిర్మించినట్లు చెబుతారు. ఈ కోటకు ఏడు ద్వారాలు ఉన్నాయి. మహారాజ మాన్ సింగ్ నిర్మించిన జోయాపాల్ అనే ద్వారం మిగిలిన ద్వారాలతో పోలిస్తే అందంగా ఉంటుంది. ఈ కోట లోపల ఉన్న చాముండి దేవాలయం, మ్యూజియం కూడా చూడదగినవే.

ఎర్రకోట, ఢిల్లీ

ఎర్రకోట, ఢిల్లీ

P.C: You Tube

మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఢిల్లీలోని ఈ కోట భారతీయ సార్వభౌమత్వానికి చిహ్నం. ఎర్రని ఇసుకరాయితో నిర్మించినందువల్ల ఈ కోటను ఎర్రకోటగా పిలుస్తారు. ఈ కోట లోపల కూడా అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయి. అందులో మోతీ మసీదు, భారతీయ యుద్ధ స్మారక వస్తు సంగ్రహాణాలయం ప్రధానమైనవి.

గ్వాలియర్ కోట, మధ్యప్రదేశ్

గ్వాలియర్ కోట, మధ్యప్రదేశ్

P.C: You Tube

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కోట ప్రాచీన భారతీయ వాస్తు కళకు ప్రతిరూపం. దీనిని రాణా మాన్ సింగ్ తోమర్ నిర్మించారు. ఈ కోట లోపల సాస్ బహు దేవాలయం. గుజారీ మహల్, తో పాటు మ్యూజియం చూడదగిన పర్యాటక స్థలాలు. భారత దేశంలోని అతి విశాలమైన కోటలో దీనిది అగ్రస్థానం. ఈ కోట ప్రాముఖ్యతను గుర్తించిన తపాల శాఖ ఒక స్టాంపు కూడా జారీ చేసింది.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

హైదరాబాద్ లోని ఏడు వింతల్లో గొల్కొండ కోట ఒకటి. దీనిని కాకతీయులు నిర్మించారు. అప్పటి యుద్ధ తంత్రాల నైపుణ్యాలకు ప్రతీకగా ఈ గోల్కొండ కోటను నిర్మించినట్లు చెబుతారు. ఈ కోటలో ఎన్నో రహస్య మార్గాలు ఉన్నట్లు చెబుతారు. అవన్నీ శత్రువులను తికమక పెట్టడం కోసమే నిర్మించినట్లు చెబుతారు. భారతీయ చరిత్రలో గోల్కొండ కోటది ప్రత్యేక స్థానం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

జైసల్మేర్ కోట

జైసల్మేర్ కోట

P.C: You Tube

రాజస్థాన్ లోని ఈ జైసల్మేర్ కోట ప్రపంచంలో అతి పొడవైన కోటల్లో ఒకటి. దీనిని రవాల్ జైసాల్ నిర్మించాడు. త్రికోణాకారంలో త్రికూడ పర్వతం పై నిర్మించిన ఈ కోట శత్రు దుర్భేద్యం. ఈ కోట లోపల జైన దేవాలయం, నిలువెత్తు ద్వారాలు, దాని పై చెక్కిన నగిషీలు, హవేలీలు చూడదగినవి.

ఆగ్రా కోట

ఆగ్రా కోట

P.C: You Tube

ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం తాజ్ మహల్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ కోట ఉంది. సికిందర్ లోడి ఈ కోటలో ఎక్కువ కాలం నివశించినట్లు చెబుతారు. ఈ కోట నిర్మాణానికి వాడిన రాళ్ల రంగు వల్ల ఈ కోటను కూడా రెడ్ ఫోర్ట్ అని పిలుస్తారు. ఇక్కడకు దగ్గరగా ఉన్న జాన్సీ కోట కూడా చాలా ప్రాచూర్యం పొందిన కోట.

కాంగ్రా కోట, హిమాచల్ ప్రదేశ్

కాంగ్రా కోట, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube

హిమాచల్ ప్రదేశ్ లోని బగంగా, మాంజీ నదుల సంగమ ప్రదేశంలో ఉన్న ఈ కోట ప్రపంచంలోని అత్యంత పురాతన కట్టడాల్లో ఒకటి. అదే విధంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో నిర్మించిన అతి పెద్ద కోట. ఈ కోట లోపల వజ్రేశ్వరీ దేవి ఆలయం ప్రధానంగా చూడదగినది. ధర్మశాల ఇక్కడకు దగ్గరగానే ఉంటుంది.

చిత్తోర్ ఘర్ కోట, రాజస్థాన్

చిత్తోర్ ఘర్ కోట, రాజస్థాన్

P.C: You Tube

జలదుర్గంగా పేరొందిన ఈ కోట రాజస్థాన్ లోని బిరాచ్ నదీ ఒడ్డున నిర్మించారు. ఈ కోట లోపల మొదట్లో 84 సరస్సులు ఉన్న ప్రస్తుతం అందులో 22 మాత్రమే నీరు ఉంది. మహారాణ ప్రతాప్ తో పాటు రాజ్ పుత్ ల యుద్ధనిరతికి ఈ కోట ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడ జరిగే జవహర్ మేళ ప్రపంచ ప్రఖ్యాతి చెందినది.

 శ్రీరంగపట్నం కోట, కర్నాటక

శ్రీరంగపట్నం కోట, కర్నాటక

P.C: You Tube

టిప్పు సుల్తాన్ నిర్మించిన ఈ కోట అనేక శత్రురాజుల తూటాలకు ఎదురొడ్డి నిలబడింది. బెంగళూరుకు దగ్గర్లోని శ్రీరంగ పట్టణంలో కావేరీ నదీ తీరంలో ఈ కోట ఉంది. భారత దేశ ప్రముఖ కట్టడాల్లో శ్రీరంగ పట్నంలోని కోటది ఎప్పుడూ ప్రత్యేక స్థానమే. ఈ కోట దగ్గరగా అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X