Search
  • Follow NativePlanet
Share
» » గజ్నేర్ వన్యప్రాణుల అభయారణ్యం విశేషాలు మీకోసం!

గజ్నేర్ వన్యప్రాణుల అభయారణ్యం విశేషాలు మీకోసం!

గజ్నేర్ వన్యప్రాణుల అభయారణ్యం విశేషాలు మీకోసం!

ఎడారి ప్రాంతం రాజ‌స్థాన్‌లో దాగిన వ‌న్య‌ప్రాణుల‌ అభ‌యార‌ణ్యం గ‌జ్నేర్ అభ‌యార‌ణ్యం. భారతదేశంలో చిరుతలను ప్రవేశపెట్టడానికి ప్రతిపాదించబడిన అడవులలో ఇది కూడా ఒకటి. ఒక చిన్న కొండపై ఉన్న గజ్నేర్ వన్యప్రాణుల అభయారణ్యం దట్టమైన పచ్చటి అటవీ ప్రాంతంతో వృక్షజాలం మరియు జంతుజాలం సమృద్ధిగా ఉన్న ప్ర‌కృతిసిద్ధ ప్ర‌దేశం.

రాజ‌స్థాన్‌లోని బికనీర్ నుండి 37 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది గజ్నేర్ వన్యప్రాణుల అభయారణ్యం. గజ్నేర్ ప్యాలెస్ సమీపంలోని గజ్నేర్ సరస్సు ఒడ్డున ఆక‌ర్ష‌ణీయ ప‌ర్యాట‌క ప్ర‌దేశంగా ప్ర‌సిద్ధి చెందింది. ఇది రాజస్థాన్‌లోని ప్ర‌ఖ్యాత‌ వన్యప్రాణుల అభయారణ్యాలలో ఒకటి మరియు బికనీర్ పర్యటనలో తప్పనిసరిగా చేర్చవలసిన ప్రదేశాలలో ముందుస్థానంలో నిలిచేది. ఈ అభయారణ్యం గతంలో బికనీర్ మహారాజా శ్రీ గంగా సింగ్ వేట ప్రాంతంగా ఉపయోగించబడింది. అభయారణ్యంలో ఒక అందమైన స‌ర‌స్సు కూడా ఉంది. ఇక్కడ నివసించే జంతువులు తమ దాహాన్ని తీర్చుకోవడానికి కేంద్రంగా ఇక్క‌డి స‌ర‌స్సు పేరుగాంచింది.

rampuriahaveli

ఎడారి ప్రాంతం నడిబొడ్డున..

గజ్నేర్ వన్యప్రాణుల అభయారణ్యం గురించి ఆసక్తికరమైన విష‌యాలు తెలుసుకునేందుకు ఇక్క‌డికి వచ్చే సంద‌ర్శ‌కులు ఎక్కువ ఆస‌క్తి చూపుతారు. ఎడారి ప్రాంతం నడిబొడ్డున ఉన్నందున ఇది అరుదైన వన్యప్రాణుల అభయారణ్యంగా చెప్పుకోబ‌డుతోంది. అడవి కోళ్లు, జింకలు, చింకారాస్, బ్లాక్ బక్స్, ఎడారి నక్కలు మరియు అడవి పందులు వంటి జాతులు ఈ ఎడారి అడవిలో కనిపించే కొన్ని సాధారణ జాతులుగా గుర్తించ‌బ‌డ్డాయి.

ఆ అడవి మధ్యలో ఒయాసిస్‌లా పనిచేసే సహజమైన సరస్సు జంతువులు ఎడారి వేడి నుండి ఉపశమనం పొందటానికి స‌హ‌క‌రించే ప్ర‌దేశం. ఈ సరస్సు వేల సంఖ్యలో నీటి పక్షులను ఆకర్షిస్తుంది. వీటిలో ఇంపీరియల్ సాండ్ గ్రౌస్, ఇండియన్ హౌబారా బస్టర్డ్స్, వాటర్ ఫౌల్స్‌తోపాటు అనేక‌ రకాల వలస పక్షులు క‌నిపిస్తాయి. చుట్టూ పచ్చని తోటలు, చెట్లతో కూడిన అడవులు జీవితంలో మ‌ర్చిపోలేని అనుభూతుల‌ను అందిస్తాయి.

gajnerwildlifesanctuary

ఎన్నో జీవిత పోరాటాల‌ను చూపిస్తుంది..

ఈ ఎడారి అడవికి వెళ్లడం వల్ల జంతువులు జీవించడం, ఎడారిలో నివసించడం ఎంత కష్టమో క‌నులారా వీక్షించ‌వ‌చ్చు. జంతువులు క్లిష్టమైన‌ వాతావరణాన్ని మరియు సీజ‌న్‌ను బ‌ట్టీ వృక్షసంపద త‌రుగుద‌ల స‌మ‌యంలో ఇక్క‌డి జీవ‌న పోరాటం పర్యాట‌కుల‌కు ఎన్నో జీవిత పోరాటాల‌ను చూపిస్తుంది. ఇక్క‌డి సంద‌ర్శ‌న‌లో ఎక్కువ దూరం కాలిన‌డ‌క‌న వెళ్లాల్సి ఉంటుంది. అంచేత దృఢమైన బూట్లను ధరించడం మంచిది. కెమెరాలను లోపలికి తీసుకెళ్లడానికి కెమెరాకు టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో అవ‌స‌ర‌మైన మెడిక‌ల్ కిట్‌ను వెంట తీసుకెళ్లాలి.

అంతేకాదు, ఈ ప్రాంతంపై అవ‌గాహ‌న ఉన్న‌వారిని తీసుకువెళ్ల‌డం మంచిది. భారతీయులకు మరియు విదేశీయులకు వేర్వేరుగా ఉండే నామమాత్రపు రుసుముతో అభయారణ్యం నుండే గైడ్‌లను నియమించుకోవచ్చు. నవంబర్ నుండి మార్చి నెలల మధ్య ఉండే చలికాలం ఈ ప్రదేశం సంద‌ర్శించేంద‌కు అనువైన స‌మ‌యం. వేసవికాలం ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఈ సమయంలో ఈ స్థలాన్ని సందర్శించడం మంచిది కాదు.

గజ్నేర్ వన్యప్రాణుల అభయారణ్యం నగరం నుండి 37 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి నగరంలోని ఏ ప్రాంతం నుండయినా క్యాబ్ లేదా ఆటోను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించడం ద్వారా ముందుగానే బుక్ చేసుకున్న సాహసోపేతమైన ఒంటె రైడ్‌ను కూడా ఈ వన్యప్రాణుల అభయారణ్యంలో చేసుకోవ‌చ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X