Search
  • Follow NativePlanet
Share
» »ఈ శివలింగానికి ఇనుము తాకిస్తే ఏమవుతుందో తెలుసా?

ఈ శివలింగానికి ఇనుము తాకిస్తే ఏమవుతుందో తెలుసా?

కర్నాటకలోని హావేరి జిల్లాలో గళగనాథ ఉంది. ఇక్కడ గళగేశ్వర దేవాలయం ఉంది. ఈ దేవాలయం విశిష్టతలు మీ కోసం.

భారతదేశం దేవాలయాల నిలయం. ఇక్కడ ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అటువంటి కోవకు చెందినదే గళగేశ్వర దేవాలయం. ఈ దేవాలయంలోని శివలింగానికి విశిష్టమైన అతీత శక్తులు ఉన్నాయని చెబుతారు. ఈ దేవాలయం మన పొరుగున ఉన్న కర్నాటకలోనే ఉంది. ఆ శివలింగానికి ఉన్న శక్తులతో పాటు ఆ దేవాలయం విశిష్టతలకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...

హావేరి, గళగేశ్వర దేవాలయం

హావేరి, గళగేశ్వర దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం గోడల పై అనేక శిల్పాలు ఉన్నాయి. ఇందులో పంచతంత్ర కథలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాకుండా రామాయణ, మహాభారత కథలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా శివతాండవ శిల్పాలు, శివుడు అంధకాసురుడిని సంహరించే శిల్పాలు మనకు కనువిందును చేస్తాయి.

హావేరి, గళగేశ్వర దేవాలయం

హావేరి, గళగేశ్వర దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని స్పర్శలింగమని పిలుస్తారు. ఇటువంటి శివలింగం ప్రపంచంలో మరెక్కడా లేదని చెబుతారు. ఈ శిలింగానికి ఏదేని లోహాన్ని తాకించిన వెంటనే ఆ లోహం బంగారంగా మారేదని ఇక్కడి స్థానికుల కథనం.

హావేరి, గళగేశ్వర దేవాలయం

హావేరి, గళగేశ్వర దేవాలయం

P.C: You Tube

అయితే ఈ శివలింగం విశిష్టత తెలుసుకొన్నవారి నుంచి ఈ శివలింగానికి ప్రమాదం ముంచుకువచ్చే అవకాశం ఉందని భావించిన కొంతమంది మునులు ఈ శివలింగాన్ని కొన్ని రకాల పదార్థాలతో కప్పివేశారు. అందువల్లే ఈ శివలింగాన్ని ప్రస్తుతం ఎవరూ తాకలేరు.

హావేరి, గళగేశ్వర దేవాలయం

హావేరి, గళగేశ్వర దేవాలయం

P.C: You Tube

అయితే అభిషేకానికి ఇబ్బందులు కలగకూడదని పేర్కొంటూ ఈ శివలింగం పై ఒక సూక్ష్మ రంద్రాన్ని ఏర్పాటు చేశారు. అందువల్లే ఈ గళగనాథేశ్వర స్వామి దేవాలయం ఒక విశిష్టమైన శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ముఖ్యంగా కార్తికమాసంలో ఇక్కడ విశిష్ట పూజలు జరుగుతాయి.

హావేరి, గళగేశ్వర దేవాలయం

హావేరి, గళగేశ్వర దేవాలయం

P.C: You Tube

ఇక్కడ శివలింగంతో పాటు సుబ్రహ్మణ్యస్వామి, గణపతికి వేర్వేరుగా ఉపాలయాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు అనేక దేవుళ్ల విగ్రహాలను కూడా మనం చూడొచ్చు. ఇక్కడకు వెళితే పంచలింగాల దర్శనం కూడా మనకు కలుగుతుంది. అందుకే సోమవారంతో పాటు కార్తిక పౌర్ణమి రోజుల్లో ఇక్కడకు ఎక్కువగా వెలుతూ ఉంటారు.

హావేరి, గళగేశ్వర దేవాలయం

హావేరి, గళగేశ్వర దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. తుంగభద్రానది కుడికాలువ గట్టు మీద ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ దేవాలయం దర్శనం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ దేవాలయం గర్భగుడితో పాటు మంటపం ఉంటుంది.

హావేరి, గళగేశ్వర దేవాలయం

హావేరి, గళగేశ్వర దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం కర్నాటకలోని హావేరి నుంచి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాణిబెన్నూరు నుంచి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో గళగనాథేశ్వర దేవాలయానికి చేరుకోవచ్చు. నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X