Search
  • Follow NativePlanet
Share
» »బతికున్న పామును ముడుపుగా ఇస్తే ‘ఆ’ నొప్పి తగ్గిపోతుందంటా

బతికున్న పామును ముడుపుగా ఇస్తే ‘ఆ’ నొప్పి తగ్గిపోతుందంటా

తిర్పూర్ లోని గరుడ దేవాలయానికి సంబంధించిన కథనం.

By Kishore

భారత దేశంలో గరుడునకు అత్యంత తక్కువ దేవాలయాలు ఉంటాయి. అందులో గాడ్స్ ఓన్ కంట్రీగా పేర్కొనే కేరళ రాష్ట్రంలో కూడా ఒక ఒక గరుడ దేవాలయం ఉంది. ఇది దాదాపు 1800 ఏళ్ల క్రితం నాటిదిగా చెబుతుంటారు. ఇక్కడ చెల్లించే ముడుపు చాలా విచిత్రంగా ఉంటుంది. అయితే సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. ఇక ఇదే ప్రాంతంలో వేల ఏళ్లనాటి శివలింగాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడకు వెళితే చావు భయం నుంచి తప్పించుకోవచ్చునని భక్తులు నమ్ముతారు. అందుకు సంబంధించిన పురాణ కథనం కూడా ఉంది. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ రెండు దేవాలయాలు కూడా దగ్గర దగ్గరగానే ఉన్నాయి. ఆ విశిష్టతలన్నీ మీ కోసం ఈ కథనంలో...

శ్రీరాముడు పూజించిన చర్మరోగాలను నయం చేసే శివలింగం ఇదేశ్రీరాముడు పూజించిన చర్మరోగాలను నయం చేసే శివలింగం ఇదే

1. కేరళలోని మలప్పురంలో ఉన్న తిరూరు

1. కేరళలోని మలప్పురంలో ఉన్న తిరూరు

Image Source:

కేరళలోని మలప్పురం జిల్లాలోని ఒక చిన్న పట్టణమే తిరూరు. మలప్పురం నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక కోజికూడ్ నుంచి తిరూరుకు 41 కిలోమీటర్ల దూరం. ఇక్కడ చేపల వ్యాపారం కూడా బాగా జరుగుతుంది.

2. పాము కాటుకు గురైనవారు

2. పాము కాటుకు గురైనవారు

Image Source:

తిరూరు నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఒక గరుడ దేవాలయం ఉంది. ఈ దేవాలయం దాదాపు 1800 ఏళ్లకు పూర్వం నాటిదని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. చుట్టు పక్కల వివిధ వ్యాధులతో బాధపడే వారు ముఖ్యంగా పాము కాటుకు గురైన వారే ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

3. విష ప్రభావం తగ్గుతుందంటా

3. విష ప్రభావం తగ్గుతుందంటా

Image Source:

ఇక్కడి గరుడ దేవాలయానికి పూజ జేస్తే పాము కాటుకు గురైనవారికి విష ప్రభావం తగ్గి సాంత్వన చేకూరుతుందని చెబుతారు. ముఖ్యంగా ఎవరైతే పాముకు గురవుతారో వారు తమను కాటేసిన పామును చంపకుండా అలాగే ఈ దేవాలయానికి తీసుకువస్తే విష ప్రభావం తగ్గిపోతుందని భక్తుల నమ్మకం.

4. మృత్యుంజయ దేవాలయం

4. మృత్యుంజయ దేవాలయం

Image Source:

తిరూరులోనే మరో ప్రముఖ దేవాలయం ఉంది. దీనిని త్రిప్రంగూడ్ కలాశ్రమ మూర్తి దేవాలయం అని అంటారు. ఇక్కడే మార్కెండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగలించుకొని యముడి నుంచి తన ప్రాణాన్ని రక్షించుకోవడమే కాకుండా చిరంజీవిగా మారాడని చెబుతారు. ఆ శివలింగాన్ని దర్శించుకుంటే చావు భయం ఉండదని చెబుతారు. అందుకే దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడకు ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు.

5. తిరూరు చేరుకోవడం ఎలా?

5. తిరూరు చేరుకోవడం ఎలా?

Image Source:

దేశంలోని వివిధ నగరాల నుంచి మలప్పురానికి రైలు సర్వీసులు ఉన్నాయి. అదే విధంగా బస్సు సర్వీసులు కూడా ఉన్నాయి. మలప్పురం నుంచి తిరూరుకు ట్యాక్సీలు, బస్సులు, షేరింగ్ ఆటోలు కూడా దొరుకుతాయి. వసతి అంతగా బాగుండదు. అందువల్ల దైవ దర్శనం తర్వాత తిరిగి మలప్పురానికి వస్తే బాగుంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X