Search
  • Follow NativePlanet
Share
» »ఉద్యోగం కోసమైనా, శత్రునాశనమైనా ఈ మంత్రంతో సరి

ఉద్యోగం కోసమైనా, శత్రునాశనమైనా ఈ మంత్రంతో సరి

గాయత్రీ తపోభూమి హిందువులకు పరమ పవిత్రమైనది. ఈ దేవాలయం చరిత్రతో పాటు మరికొన్ని వివరాలు మీ కోసం.

గాయత్రీ మంత్రం ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అన్ని వేదాలకు మూలం గాయత్రీ మంత్రమేనని చెబుతారు. ఈ గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే ఏ దుష్టశక్తి మనలను ఏమీ చేయలేదని చెబుతారు. అటువంటి గయిత్రీ దేవీ దేవాలయం ఒకటి కర్నాటకలో ఉంది. ఈ దేవలయానికి సంబంధించిన కథనాలు మీ కోసం...

గాయిత్రీ దేవాలయం, తడాస్

గాయిత్రీ దేవాలయం, తడాస్

P.C: You Tube

ఈ గాయత్రీ దేవాలయం కర్నాటకలోని హావేరి జిల్లా శిగ్గావి తాలూకాలోని తాడస అనే గ్రామంలో ఉంది. హావేరి నుంచి దాదాపు 30 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు. శ్వేతవర్ణంలోని ఈ దేవాలయ దర్శనం మనస్సుకు ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

గాయిత్రీ దేవాలయం, తడాస్

గాయిత్రీ దేవాలయం, తడాస్

P.C: You Tube

దక్షిణ భారతదేశం పైకి ఒకే ఒక గాయిత్రీ దేవి దేవాలయం ఇదే. ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల కోరిన కోర్కెలన్నీ తీరుతాయని చెబుతారు. ముఖ్యంగా ఓం భూర్భువ: స్వహా, తత్సవితుర్వరేణ్యం, భర్గోదేవస్స ధీ మహీ, ధియో యోన: ప్రచోదయాత్...అంటూ గాయిత్రీ మంత్రాన్ని చదవడం వల్ల శరీరం, మనస్సు చైతన్యవంతమవుతుందని అంటారు.

గాయిత్రీ దేవాలయం, తడాస్

గాయిత్రీ దేవాలయం, తడాస్

P.C: You Tube

ఈ క్షేత్రానికి సంబంధించిన ఒక కథనం ప్రచారంలో ఉంది. పూర్వం అరుణాసుర అనే రాక్షసుడు ఉండేవాడు. అతను తన తపస్సు చేత మనుష్యుల నుంచి, స్త్రీల నుంచి ఎటువంటి చావు ఉండకూడదని వరం కావాలనుకొంటాడు. అయితే దేవతలు గాయిత్రీ మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ మంత్రాన్ని పఠించడం ఆపేసినప్పుడు అతనికి చావు వస్తుందని అంతవరకూ రాదని చెబుతాడు.

గాయిత్రీ దేవాలయం, తడాస్

గాయిత్రీ దేవాలయం, తడాస్

P.C: You Tube

అయితే వర గర్వంతో దేవతలనే ఈ అరుణాసరుడు హింసించడం మొదలుపెడుతాడు. దీంతో దేవతలు ఉపాయంతో ఆ అరుణాసురుడిని గాయిత్రీ మంత్రం పఠించకుండా అడ్డుకొని సంహరిస్తారు. ఆ సంహరించిన ప్రాంతమే తపోభూమి అని చెబుతారు.

గాయిత్రీ దేవాలయం, తడాస్

గాయిత్రీ దేవాలయం, తడాస్

P.C: You Tube

ఈ గాయత్రీమంత్రం అత్యంత శక్తి వంతమైనదని చెబుతారు. ఉద్యోగం దొరకగాడినికి, చేతబడి నుంచి విముక్తి పొందడానికి ఈ మంత్ర పఠనం ఉపయోగపడుతుందని చెబుతారు. ఇక్కడ కుంకుమార్చన, రుద్రాభిషేకంతో పాటు హోమాలను చేస్తారు.

గాయిత్రీ దేవాలయం, తడాస్

గాయిత్రీ దేవాలయం, తడాస్

P.C: You Tube

అంతేకాకుండా శత్రువులను నాశనం చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, ధర్మ పాలనకు, వినయం, గౌరవం, కీర్తి పొందడానికి సుఖ దాంపత్యానికి, శాంతిని పొందడానికి, ఆరోగ్యం, ఐశ్వర్యం అభివ`ద్ధి చెందడానికి గాయిత్రీ మంత్రం చాలా బాగా ఉపయోగ పడుతుందని చెబుతారు.

గాయిత్రీ దేవాలయం, తడాస్

గాయిత్రీ దేవాలయం, తడాస్

P.C: You Tube

ఈ గాయత్రీ మంత్రం అత్యంత విశిష్టమైనదని మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తిని సుసంపన్నం చేసుకోవడానికి ఈ గాయత్రీ మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేవారు.

గాయిత్రీ దేవాలయం, తడాస్

గాయిత్రీ దేవాలయం, తడాస్

P.C: You Tube

ఇక ఈ తపోభూమిలో గాయత్రీ దేవి విగ్రహంతో పాటు గణపతి, స్కంద, అన్నపూర్ణ విగ్రహాన్ని కూడా పూజిస్తారు. ఇక్కడ ప్రతి రోజూ మూడు పూటలు పూజలు జరుగుతాయి. భక్తులకు ఉచిత అన్నదానం, వసతి సౌకర్యాలు ఉన్నాయి.

గాయిత్రీ దేవాలయం, తడాస్

గాయిత్రీ దేవాలయం, తడాస్

P.C: You Tube

కర్నాటకలోని వేర్వేరు నగరాల నుంచి హావేరి బస్సు సౌకర్యం ఉంది. బెంగళూరు నుంచి హావేరికి 334 కలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా బెంగళూరు నుంచి హావేరికి అనేక రైళ్లు ఉంటాయి. అక్కడి నుంచి తడాస అనే గ్రామానికి చేరుకోవడానికి బస్సులు, ట్యాక్సీలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X