» »లొంక శ్రీ సప్త ముఖ ఆంజనేయ స్వామి దేవాలయం విశిష్టత

లొంక శ్రీ సప్త ముఖ ఆంజనేయ స్వామి దేవాలయం విశిష్టత

Posted By: Venkata Karunasri Nalluru

తెలంగాణారాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో స్వయంభుగా వెలసిన దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ గల ప్రతి పుణ్యక్షేత్రమూ ఎంతో మహిమగలది. ఇందులో ముఖ్యమైన దేవాలయాలు అనంతగిరి, రాకంచర్ల, దామ గుండం, భైరవ క్షేత్రం, లోంక క్షేత్రం.

పరిగి మండలం కాళ్ళాపూర్ అటవీ ప్రాంతంలో నెలకొనివున్న "లోంక సప్త గిరి ఆంజనేయ స్వామి" క్షేత్రాన్ని దర్శించటానికి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి అనేకమంది భక్తులు తరలి వస్తూ వుంటారు. కాళ్ళాపూర్ గ్రామానికి చెందిన సుమారు రెండు కిలో మీటర్ల దూరంలో స్వామి వెలిసి ఉన్నారు.

hanuman temple in Rangareddy district Telangana

pc: youtube

పూర్వం ఇక్కడంతా అడవీ ప్రాంతంగా క్రూర మృగాలు సంచరిస్తూ వుండేది. త్రేతాయుగంలో ఇక్కడ శ్రీ సీతారాములు, లక్ష్మణుడు సంచరించినట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తుంది.

hanuman temple in Rangareddy district Telangana

pc: youtube

ఈ దేవాలయం సుమారు 200ఏళ్ళ క్రితం నాటిది. ఎవ్వరూ పట్టించుకోకపోవాటం వల్ల ఆలయం శిధిలావస్థకు చేరింది. అప్పుడు ఆలయ ధర్మ కర్త భీమయ్య పంతులు ఆలయాన్ని పునరుద్ధరించారు. ఇక్కడ వేలసిన స్వామి ఏడు ముఖాలు గలవాడు. వీటిని ప్రతిరోజు చందనంతో అలంకరిస్తారు. ఇక్కడ గల సెలయేర్లు ప్రతి కాలంలో ప్రహిస్తూనే వుంటుంది. పూర్వం ఇక్కడ నీటి కొరత లేనందువలన ఋషులు తపస్సులు మరియు యజ్ఞయాగాదులు చేసేవారని చెప్తారు. ఇక్కడ సప్త ఋషులు చేసిన తీవ్ర తపస్సు వల్ల సప్తముఖ ఆంజనేయ స్వామి వారికి సాక్షాత్కారించారట. స్వామి వారిని ఇలా అనుగ్రహించారు. " ఎల్లప్పుడూ భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ ఈ క్షేత్రంలో కొలువై యుంటాను" అని.

hanuman temple in Rangareddy district Telangana

pc: youtube

ఈ ఆలయప్రాంతంలో పుష్కరిణి కూడా ఉంది. ఇందులో స్నానం ఆచరిస్తే సర్వ రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని సుమారు 200 సం క్రితం నిర్మించారు. ఇక్కడ గల ఒక నది దక్షిణం నుంచి ఉత్తరంకు ప్రవహిస్తూ "కాగ్నా నది" లో సంగమిస్తుంది. వేసవిలో కూడా ఈ నది ప్రవహిస్తూనే వుంటుంది. భూగర్భంలో నుంచి పైకి పొంగి పారే ఈ నది మీద "పుష్కరిణి" ని నిర్మించారు. భక్తులు ఈ నదిలో స్నానం చేసి శ్రీ సప్త ముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకొంటారు.

ఈ నదీలో నీరు గంగా జలం వలె పవిత్రమైనది. ఈ పుణ్య జలాన్ని పాత్రలలో నింపుకొని ఇళ్లకు తీసుకొని వెడతారు. ఈ జలాన్ని ఇంటిలో చల్లుకొని పవిత్రం చేసుకొంటారు. పైరుపంటల మీద ఈ నీళ్ళు చల్లితే చీడ పీడలు అన్నీ తొలగి పంటలు బాగా పండుతాయని ప్రజల విశ్వాసం. అందుకే ఈ నదిలోని నీటిని సర్వ రోగ నివారిణి అంటారు.

hanuman temple in Rangareddy district Telangana

pc: youtube

ఆలయ దర్శన వేళలు : ఉదయం 6:00 గం నుండి రాత్రి 8:00 గం వరకు

ఎలా వెళ్ళాలి

హైదరాబాద్ నుండి పరగి వెళ్ళే మార్గంలో రంగాపూర్ అనే గ్రామానికి దగ్గరలో ఈ క్షేత్రం వుంది.