Search
  • Follow NativePlanet
Share
» »గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

అమృతసర్ గోల్డెన్ టెంపుల్ గురించి మనం ఈ వ్యాసంలో తెలుసుకుందాం.అమృతసర్ గోల్డెన్ టెంపుల్ అనగానే మనకు 2విషయాలు గుర్తుకొస్తాయి. 1. 700కిలోల బంగారంతో నిర్మించబడిన గోల్డెన్ టెంపుల్ 2. సిక్కుల ఊచకోత.

By Venkatakarunasri

అమృతసర్ గోల్డెన్ టెంపుల్ గురించి మనం ఈ వ్యాసంలో తెలుసుకుందాం.అమృతసర్ గోల్డెన్ టెంపుల్ అనగానే మనకు 2విషయాలు గుర్తుకొస్తాయి. 1. 700కిలోల బంగారంతో నిర్మించబడిన గోల్డెన్ టెంపుల్ 2. సిక్కుల ఊచకోత. ఊచకోత వెనుకవున్న అసలు రహస్యాలు తెలుసుకునే ముందు అమృతసర్ గోల్డెన్ టెంపుల్ గురించి కొంతసమాచారం తెలుసుకోవాలి. అమృతసర్ గోల్డెన్ టెంపుల్ ఈ టెంపుల్ కు మరోపేరు కూడా వుంది.హర్ మందిర్ సాహెబ్ లేదా దర్బార్ సాహెబ్ గా. అనధికారికంగా స్వర్ణదేవాలయం అనే పేరుతో ప్రసిద్ధిచెందింది. ఇది భార్తేశంలో అమృతసర్ లో వున్న ప్రముఖ సిక్కు గురుద్వారం. దీనిని 16వ శతాబ్దంలో నాలుగవ సిక్కు గురువు గురురాందాస్ సాహిబ్ జీ నిర్మించారు.1604లో గురు అర్జున్ సిక్కు మతంయొక్క పవిత్రగ్రంథమైన ఆదిగ్రంథాన్ని పూర్తిచేసాడుమరియు దీనిని గురుద్వారలో ప్రతిష్టించాడు.

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

భారత దేశపు వాయువ్య ప్రాంతంలో కల పంజాబ్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరాలలో అమృత్సర్ నగరం ఒకటి. ఇది సిక్కు జాతీయులకు సాంస్కృతికంగా, మత పరంగా ప్రధాన కేంద్రం. అక్కడ కల అమృత్ సరోవర్ పేరుపై కల ఈ నగరం 16వ శతాబ్దంలో నాల్గవ సిక్కు గురువు గురురామ్ దాస్ జి చే కనుగొనబడినది. ఆయన గురువైన గురు అర్జన్ దేవ్ జి ఈ నగరాన్ని అభివృద్ధి చేసారు.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గురు రామ్ దాస్ జి తలపెట్టిన గుడి నిర్మాణాన్ని 1601 లో పూర్తి చేసారు. 1947 లో ఇండియా విభాజించక ముందు అవిభజిత పంజాబ్ లో అమ్రిత్సర్ పట్టణానికి వ్యాపార పరంగా ఎంతో ప్రాధాన్యత వుండేది. విభజన తర్వాత అమ్రిత్సర్ ఇండియా - పాకిస్తాన్ లకు సరిహద్దు టవున్ గా ఏర్పడి పాకిస్తాన్ కు పశ్చిమ సరిహద్దు అయింది.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

ఇపుడు ఈ పట్టణ వ్యాపారాలు కార్పెట్ లు, దుస్తులు, హేండి క్రాఫ్ట్స్, వ్యవసాయ ఉత్పత్తులు, సేవా వ్యాపారాలు, లైట్ ఇంజనీరింగ్, కు మాత్రమే పరిత మయ్యాయి. అమ్రిత్సర్ లో పర్యటన ఈప్రాంతంలో ఒక వ్యాపారం అయ్యింది. అమ్రిత్సర్ లోను మరియు చుట్టుపట్ల కల పర్యాటక ఆకర్షణలు అమ్రిత్సర్ లో అనేక గురుద్వారాలు కలవు.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

వాటిలో హర మందిర్ సాహిబ్ ప్రధానం. దీనిని సాధారణంగా గోల్డెన్ టెంపుల్ అని అంటారు. పవిత్రమైన ఈ సిక్కుల నగరం ఏటా సుమారు ఒక లక్షకు పైగా సందర్శకులను ప్రపంచం నలుమూలల నుండి ఆకర్షిస్తుంది. గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ లోనే ఖల్స, శ్రీ అకాల్ తఖ్త్ కలవు. అమ్రిత్సర్ టూరిజం అంటే బిబెక్సర్ సాహిబ్, బాబా అటల్ సాహిబ్, రామ్సార్ సాహిబ్ , సంతోఖ్సర్ సాహ్లిబ్ ల పర్యటన కూడాను.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

సిక్కులకు ప్రధాన యాత్రా స్థలం అవటమే కాక, అమ్రిత్సర్ ఇండియా స్వాతంత్ర పోరాటం లో 1919 జిలియన్ వాలా బాగ్ హత్యా కాండ తో కూడా చరిత్రలో చోటు చేసుకుంది. జిలియన్ వాలా బాగ్ లో ఇప్పటికి అక్కడ నిర్మించిన స్మారకాలలో మృత వీరుల దినోత్సవం చేస్తారు.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన మరి కొన్ని ప్రదేశాలు, మహారాజ రంజిత్ సింగ్ మ్యూజియం, ఖైర్ ఉద్ దిన్ మసీద్, బతిండ ఫోర్ట్, సరగార్హి మెమోరియల్ మరియు గోవింద్ ఘర్ కోట మొదలైనవి. ఇండియా - పాకిస్తాన్ ల మధ్య కల సైనిక ప్రదేశాన్ని వాగా సరిహద్దు అంటారు. ఇక్కడ జరిగే పెరేడ్ చూసేందుకు టూరిస్టులు వస్తారు.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

అంతేకాక, ఈ నగరంలో అనేక హిందూ దేవాలయాలు దుర్గియానా టెంపుల్, మందిర్ మాతా లాల్ దేవి, ఇస్కాన్ టెంపుల్ , హనుమాన్ మందిర్ మరియు శ్రీ రామ్ తీర్థ్ టెంపుల్ కలవు. కైజర్ బాగ్, రాం బాగ్, ఖల్స కాలేజ్ మరియు గురు నానక్ దేవ్ యూనివర్సిటీ, తార్న్ తారన్ మరియు పుల్ కన్జారి వంటివి మరికొన్ని పర్యాటక ఆకర్షణలు.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

హర్ మందిర్ సాహెబ్ లోకి వెళ్లేందుకు 4తలుపులుంటాయి. అవి సిక్కులయొక్క అన్ని వర్గాల ప్రజల మరియు మతాలవైపునకు ఉన్నట్లువుంటాయి. ఇప్పుడు సిక్కుల వూచకోత వెనకవున్న రహస్యాలగురించి అంతటి మారణహోమానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.ఆ ప్రాంతంలోని చాలా సిక్కుకుటుంబాలు ఒకరినో,ఇద్దరినో ప్రాణాలను కోల్పోయిన బాధల్లో వున్నారు.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

చనిపోయినవారు ఇక తిరిగి రారు.అనే బాధ.బాధతో కన్నీరు బయటకొస్తున్న సమయం. ఒక వార్త అందరినీ భయపెట్టింది. ఆ వార్త ఏంటో తెలుసా? అప్పటిప్రధాని ఇందిరాగాంధీని తన బాడీగార్డ్ లే కాల్చి చంపేసారు అనే వార్త. ఒక్క సారిగా భయానికిలోనయేలాచేసింది.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

చంపింది ఎవరో కాదు సిక్కులు అని తెలిసాక అక్కడ సిక్కుల గుండెల్లో పరుగులు మొదలయ్యాయి.అభంశుభం తెలియని ఎన్నో కుటుంబాలు రోడ్డున పడాల్సివచ్చిన రోజు అది. ఏమి జరగబోతుందో అనే భయం.తప్పించుకుని ఎక్కడికెళ్ళాలో దారి కూడా తెలియని పరిస్థితి. అంతా అనుకున్నట్లుగానే అల్లర్లు మొదలయ్యాయి.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

సిక్కుమతస్తులు కనిపిస్తే చాలు సజీవ దహనం చేయటం మొదలుపెట్టారు.కొంతమంది అల్లరిమూకలసమూహం.చిన్న పెద్ద ముసలి,ముతక,ఆడ,మగ అనే తేడాయేలేకుండా పెట్రోల్ పోసి తగలబెట్టేసారు.దాదాపు వేలమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

ఇంతటి ఘటనకి కారణమైన ఆ రోజు ఏం జరిగింది? అల్లరి మూకలు రెచ్చిపోయి ప్రాణాలు తీయటానికి కారణం ఏమిటి? ఆ రోజు గోల్డెన్ టెంపుల్ లో ఏం జరిగింది?ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం.అమృతసర్ గోల్డెన్ టెంపుల్ లో అంతా ప్రశాంతంగా పూజలు చేస్తున్నారు.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

అందులో తిష్టవేసిన కలిస్తాన్ వేర్పాటువాదులు వున్నారని ప్రభుత్వానికి సమాచారం అందింది.వెంటనే వాళ్ళని అణిచివేయటానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూస్టార్ అనే ఆపరేషన్ కి అనుమతిచ్చింది.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

భారతసైన్యం ఒక్కసారిగా గురుద్వార్ లోకి దూసుకుపోయింది.అందులో తిష్టవేసిన కలిస్తాన్ వేర్పాటువాదులను మట్టికరిపించే అభంశుభం తెలియని ఎంతోమంది సిక్కుల ప్రాణాలను బలిగొంది ఆపరేషన్ బ్లూస్టార్.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

అయితే అది జరిగిన అనంతరం ఆపరేషన్ బ్లూ స్టార్ కు ప్రతీకారంగా ఇందిరాగాంధీ బాడీగార్డులైన ఇద్దరు సిక్కులు ఆమెను హత్యచేసారు.ఇందిరా హత్యానంతరం ఆమెను డిల్లీ, హర్యానా, పంజాబ్ ప్రాంతాలలో తీవ్రఅల్లర్లు చెలరేగాయి. డిల్లీలో తీవ్రమారణహోమం జరిగింది.ఈ మారణహోమంలో సుమారు 3000మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఆ మారణహోమం జరిగి ఇప్పటికి 33ఏళ్ళు గడిచింది.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

1984ఆపరేషన్ లో 400ల మంది సిక్కులు, 87మంది సైనికులు చనిపోయారని భారతప్రభుత్వం చెబుతుంది. అయితే వివిధ సిక్కు సంస్థలు 1000కి పైగా సిక్కులు మరణించారని చెబుతారు.చనిపోయినవారిలో దేవాలయంసందర్శనకు వచ్చిన అనేకమంది యాత్రికులు వున్నారని సిక్కుసంస్థలు వాదిస్తాయి.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

నీలంరంగు, కాషాయపురంగు ధరించిన రెండు తలపాగాలవాళ్ళు పరస్పరం కేకలు వేసుకుంటూ,ఈటలువిసురుకుంటూ వీడియోలో కనిపించారని పత్రికలు తెలిపాయి. టెలిగ్రాఫ్ లాంటి పత్రికలు పలుఫోటోలను ప్రచురించాయికూడా. ఆ మారణహోమంలో చనిపోయిన ప్రతీఒక్కరికీ శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

పర్యాటక ఆకర్షణలు

గురుద్వారా సంతోష్కర్ సాహిబ్, అమ్రిత్ సర్

గురుద్వారా సంతోష్కర్ సాహిబ్ హరమందిర్ సాహిబ్ పక్కనే వుంది. ఇక్కడ అయిదు పవిత్ర కొలను లలో ని ఒక కొలను గురు అర్జన్ దేవ్ జి చే కట్టబడినది కలదు. ఈపవిత్ర కొలను తవ్వకం గురు రాం దాస్ జి తన మామ, అప్పటి సిఖ్ గురువు అయిన గురు అమర్దాస్ జి అదేసాను సారం నిర్మించాడు. గురు అర్జన్ దేవ్ జి 1587 మరియు 1589 లలో బాబా బుద్ధ సహాయంతో తవ్వకం పూర్తి చేసాడు. గురు రామ్ దాస్ జి ఈ ట్యాంక్ కు తవ్వకంలో తాను ధ్యానంలో కనుగొన్న సంతోఖ్సార్ సాహిబ్ అనే రుషి పేరు పెట్టాడు. సంతఖ అనే ఈ యోగి తాను గురువుకు మోక్షం ఇవ్వటాని కి వేచి వున్నానని చెపుతూ మరణించాడు. గురుద్వారా తాహ్లి సాహిబ్ అని కూడా పిలువబడే ఈ చారిత్రక ప్రదేశం అమ్రిత్సర్ లో తప్పక చూడాలి.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోవింద్ ఘర్ ఫోర్ట్, అమ్రిత్ సర్

గోవింద్ ఘర్ ఫోర్ట్ కు అసలు పేరు భంగియాన్ డా కిలా. అమ్రిత్సర్ లో తప్పక చూడవలసిన ప్రదేశం. గుజ్జర్ సింగ్ భంగి యొక్క సైన్యం ఈ కోటను నాలుగు బురుజులు, రెండు బలమైన గేట్లతో సున్నం, ఇటుకలతో 1760 లో నిర్మించింది. దీనిని మహారాజ రంజిత్ సింగ్ 1805 మరియు 1809 లలో పునర్ నిర్మించాడు. 1849 లో బ్రిటిష్ వారు దీనిని తీసుకుని దీనికి దర్బార్ హాల్, హవా మహల్ మరియు ఫాన్సీ ఘర్ జత చేసారు. జనరల్ డయ్యర్ యొక్క నివాసం ఫాన్సీ ఘర్ కు సరిగ్గా ఎదురుగా వుండేది. అతడు ఖైదీల శిక్షలను చూసి ఆనందించేవాడు. స్వాతంత్రం తర్వాత భారత సైన్యం 1948 లో ఈ కోటను వశ పరచుకొని పాకిస్తాన్ నుండి వచ్చిన వారికి పునరావాసం కల్పించింది. ఎన్నో చారిత్రక సంఘటనలకు సాక్ష్యం అయిన ఈ గురు గోవింద్ ఫోర్ట్ ను 2006 లో పంజాబ్ అప్పటి ముఖ్య మంత్రి కెప్టన్ అమరీందర్ సింగ్ ప్రజలకు తెరిచారు.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

ఖైర్ -ఉద్-దిన్ మసీదు, అమ్రిత్ సర్

అమృత్సర్ హాల్ బజార్ లో మహాత్మా గాంధీ గేట్ సమీపంలో ఖైర్-ఉద్-దిన్ మసీదు ఉన్నది. భారతదేశం యొక్క స్వాతంత్ర్య ఉద్యమం యొక్క చరిత్రలో విపరీతమైన ప్రాముఖ్యం కలిగిన మందిరాలలో ప్రముఖమైనది. దీనిని 1876 వ సంవత్సరంలో మహమ్మద్ ఖైరుద్దీన్ నిర్మించారు. ఈ గొప్ప భవనం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా టూటీ ఇ హింద్,షా అత్తౌల్లహ్ బుఖారి ప్రకటించిన యుద్ధం యొక్క మహా పిలుపుకు గుర్తుగా ఉన్నది. అసమానమైన భవన నిర్మాణం గాంభీర్యం వంటి ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నది. ఖైర్ -ఉద్-దిన్ మసీదు ముస్లింలకు అమృత్సర్ లో అత్యంత గౌరవించే మతపరమైన కేంద్రాలలో ఒకటిగా ఉంది. నమాజ్ సమయంలో ఈ మసీదు యొక్క పెద్ద ప్రాంగణంలో అల్లాహ్ ప్రార్థనలు చెయ్యాలనుకునే వందల మంది పురుషులతో నిండిపోయి ఉంటుంది. ఈ గంభీరమైన మసీదు యొక్క వ్యూహాత్మక స్థానం వలన ఒక ఆకర్షనీయమైన పర్యాటక ప్రదేశంగా ఉన్నది.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

అమ్రిత్సర్ పర్యటనకు అనుకూల సమయం

అమ్రిత్సర్ లో మూడు ప్రధాన కాలాలు వుంటాయి. అవి వేసవి, వర్షాకాలం శీతాకాలం. సంవత్సరంలో అన్ని కాలాలు అనుకూలమే అయినప్పటికీ, అమ్రిత్సర్ పర్యటన అక్టోబర్ నుండి మార్చ్ చివరి వరకు మరింత అనుకూలంగా వుంటుంది.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

అమ్రిత్సర్ ఎలా చేరాలి

పంజాబ్ లో ముఖ్య పట్టణమైన అమ్రిత్సర్ ను ఇండియా లోని ప్రధాన నగరాలనుండి వాయు, రైలు, రోడ్డు మార్గాలలో చేరవచ్చు. శ్రీ గురు రాం దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అమ్రిత్సర్ కు ప్రధాన వాయు మార్గం కాగా అమ్రిత్సర్ రైల్వే స్టేషన్ రైలు మార్గంలో ఇండియా లోని ప్రధాన ప్రదేశాలకు అనుసంధానిస్తుంది. అమ్రిత్సర్, గ్రాండ్ ట్రంక్ రోడ్ పై వుండటం వలన బస్సు, లేదా టాక్సీ లలో రోడ్డు మార్గం లో కూడా తేలికగా చేరవచ్చు.

PC: youtube

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

రోడ్డు మార్గం

NH-1 అని పిలిచే గ్రాండ్ ట్రంక్ రోడ్ అమృత్సర్ రహదారి ద్వారా భారతదేశంలో అనేక ప్రధాన నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. ఢిల్లీ,చండీఘర్,జమ్మూ వంటి ఉత్తర ప్రాంతాల నుండి అమృత్సర్ కు ప్రయాణం చేయడానికి బస్సులు మరియు టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. GT రోడ్ పాకిస్తాన్ లోని లాహోర్,అమృత్సర్ లను కూడా కలుపుతుంది.

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

రైలు మార్గం

అమృత్సర్ రైల్వే స్టేషన్ భారతదేశం యొక్క అనేక ప్రాంతాల్లో బాగా అనుసంధానించబడింది. ఢిల్లీ,ముంబై, కోలకతా మరియు జమ్మూ వంటి ప్రధాన నగరాల నుండి రోజువారీ రైళ్లు అమృత్సర్ లో ప్రధాన టెర్మినల్ కు అందుబాటులో ఉన్నాయి. వగహ్-అత్తరి బోర్డర్ ద్వారా పాకిస్థాన్లోని లాహోర్కు కు,సమ్ఝౌత ఎక్స్ప్రెస్ లింకులు అమృత్సర్ కు ప్రత్యేక రైలు ఉన్నాయి.

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ వెనుక ఊహించని రహస్యాలు !

విమాన మార్గం

అమృత్సర్ శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం పట్టణం నుండి 11 కిమీ దూరంలో ఉన్నది. ఢిల్లీ,ముంబై,కోలకతా,బెంగుళూర్,చెన్నై,హైదరాబాద్,అహ్మదాబాద్ మరియు శ్రీనగర్ వంటి ప్రముఖ నగరాలకు విమానాశ్రయ లింకులు అమృత్సర్ కు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాలు ప్రపంచవ్యాప్తంగా ఇతర గమ్యస్థానాలకు విమానాశ్రయం అనుసంధానం కలిగి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X