Search
  • Follow NativePlanet
Share
» »ఈ ఆశ్రమంలో ఉన్నవారికి చావన్నదేరాదా?

ఈ ఆశ్రమంలో ఉన్నవారికి చావన్నదేరాదా?

గ్యాన్ గంజ్ హిమాలయాల్లో ఉన్న ఒక ఆశ్రమం.

హిమాలయాల్లో సాధువులు, మునులు ధ్యానం, తపస్సు చేసుకొంటారన్నా విషయం మనకు తెలిసిందే. అయితే హిమాలయాల్లో మనకు మరణం లేకుండా చేసే గుహ ఒకటుందన్న విషయం మీకు తెలుసా? అయితే ఆ గుహను చేరుకోవడం అంత సులభం కాదు. ఇంతటి విచిత్రమైన గుహకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

సిద్ధాశ్రమ, హిమాలయాలు

సిద్ధాశ్రమ, హిమాలయాలు

P.C: You Tube

ప్రపంచంలో అత్యంత రహస్య ప్రాంతంలు ఉన్న భౌగోళిక ప్రదేశాల్లో హిమాలయ పర్వత పంక్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటు వంటి ఎన్నో గుహల్లో మరెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాలను ఛేదించడం మాత్రం ఎవరి తరం కావడం లేదు. అందులో గ్యాన్ గంజ్ మఠం హిమాలయాల్లో ఉన్నటు వంటి ఒక చిన్న స్థలం.

సిద్ధాశ్రమ, హిమాలయాలు

సిద్ధాశ్రమ, హిమాలయాలు

P.C: You Tube
దీనిని స్థలం అనడం కంటే గుహ అనడం సబబుగా ఉంటుందేమో? ఇక్కడ ఉన్నవారికి చావు లేదని చెబుతారు. వారంతా మరణం జయించినవారని స్థానికులు చెబుతారు. అయితే ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి అందరికీ సాధ్యం కాదని చెబుతారు. కేవలం సిద్ధపురుషులకు మాత్రమే ఈ గుహను చేరుకోవడానికి వీలవుతుంది.

కాకి కూడా హంసగా మారిన చోటు..సర్వపాపాలు తొలిగే ప్రాంతం..ఎన్నెన్ని వింతలోకాకి కూడా హంసగా మారిన చోటు..సర్వపాపాలు తొలిగే ప్రాంతం..ఎన్నెన్ని వింతలో

సిద్ధాశ్రమ, హిమాలయాలు

సిద్ధాశ్రమ, హిమాలయాలు

P.C: You Tube
ఈ గుహలో సమయాన్ని నిలుపుదల చేసే ఓ గొప్ప వ్యక్తి ఉన్నారని చెబుతారు. దీంతో ఈ గుహను చేరుకున్నవారి వయస్సు పెరగకుండా అలా ఆగిపోతుందని చెబుతారు. అందువల్లే ఇక్కడ ఉన్నవారికి చావు అన్నది లేదని చెబుతారు. హిమాలయ పర్వత పక్తుల్లో అద`శ్య రూపంలో ఉన్న ఈ ఆశ్రమాన్ని సిద్ధాశ్రమ అని కూడా అంటారు.

సిద్ధాశ్రమ, హిమాలయాలు

సిద్ధాశ్రమ, హిమాలయాలు

P.C: You Tube
వాల్మీకి రామాయణం, మహాభారతంలో కూడా ఈ గ్యాన్ గంజ్ ఆశ్రమం ప్రస్తావన ఉంది. ఎవరు ఈ స్థలాన్ని చేరుకోవడానికి అర్హులో వారికే ఈ గుహ కనిపిస్తుందని చెబుతారు. మిగిలిన వారు ఈ గుహ కోసం ఎంతగా ప్రయత్నించినా ఫలితం శూన్యమని తెలుస్తోంది.

సముద్ర నురుగుతో తయారైన వినాయకుడు..సందర్శిస్తే వెంటనే వివాహంసముద్ర నురుగుతో తయారైన వినాయకుడు..సందర్శిస్తే వెంటనే వివాహం

సిద్ధాశ్రమ, హిమాలయాలు

సిద్ధాశ్రమ, హిమాలయాలు

P.C: You Tube
ప్రాచీన కాలం నుంచి మొదలుకొని ఇప్పటి ఆధునిక కాలం వరకూ ఈ గ్యాన్ గంజ్ ఒక రహస్య స్థలం మాత్రమే. ఇది ఆధ్యాత్మిక కేంద్రం కూడా. ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో కూడా ఈ రహస్య ప్రాంతాన్ని కనుగొనడానికి వీలు కాలేదు. సిద్ధయోగులు మాత్రమే ఈ స్థలంలోకి ప్రవేశించడానికి వీలవుతుంది.

సిద్ధాశ్రమ, హిమాలయాలు

సిద్ధాశ్రమ, హిమాలయాలు

P.C: You Tube
ఈ ఆశ్రమం మన సాధారణ ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అన్నిరకాల సౌలభ్యాలు ఉంటాయని చెబుతారు. కొన్ని కొండ గుర్తులను అనుసరించి టిబెట్ వెస్ట్ రీజన్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఈ గుహ ఉంది.

సిద్ధాశ్రమ, హిమాలయాలు

సిద్ధాశ్రమ, హిమాలయాలు

P.C: You Tube
ఈ ఆశ్రామనికి చెందిన గ్యాన్ ఆనంద్ పరమహంస క్రీస్తుశకం 1225లో కనిపించారని సమాచారం. ఈ ప్రాంతం గురించిన పరిశోధన కేవలం భారత దేశంలోనే కాకుండా టిబెట్ లో కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ ఎంతో మంది ఈ ఆశ్రమం కోసం పరిశోధలను చేస్తూనే ఉన్నారు.

శివుడికే యుద్ధంలో సహాయం చేసిన 'అమ్మ'సందర్శనతో అపార శక్తులు మీ సొంతం శివుడికే యుద్ధంలో సహాయం చేసిన 'అమ్మ'సందర్శనతో అపార శక్తులు మీ సొంతంశివుడికే యుద్ధంలో సహాయం చేసిన 'అమ్మ'సందర్శనతో అపార శక్తులు మీ సొంతం శివుడికే యుద్ధంలో సహాయం చేసిన 'అమ్మ'సందర్శనతో అపార శక్తులు మీ సొంతం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X