• Follow NativePlanet
Share
» »భారత్ లో ఆత్మలు ఉండే భయంకరమైన ప్రదేశాలు...

భారత్ లో ఆత్మలు ఉండే భయంకరమైన ప్రదేశాలు...

సినిమాల్లో దెయ్యాలు ఉండే సీన్లు రాగానే మనం భయపడిపోతాం. మన భారతదేశంలో నిజంగానే దెయ్యాలున్నాయా? ఒక వేళ వుంటే కేవలం పాడుబడిన బంగ్లాలలో వుంటాయా?లేక ఖాళీస్థలాలలో తిరుగుతూవుంటాయా? మన భారతదేశంలో ఇప్పటికీ జనాలు అటుపక్కకి వెళ్ళాలంటే భయపడే ప్లేస్ లు వున్నాయి. అవేంటో తెలుసుకుందాం.ఎటుచూసినా పచ్చదనంతో నిండిపోయుంటుంది ఆ ప్లేస్. ఇక్కడికి చాలామంది పగలు పిక్నిక్ కోసం వస్తూవుంటారు. సాయంత్రం 6దాటితే ఇక్కడ ఒక్కమనిషి కూడా కనిపించడు. ఇక్కడ చుట్టుప్రక్కల వుండే వారు చెప్పేదాని ప్రకారం ఇక్కడ ఒక ఆత్మవుందట.ఆ ఆత్మ వెనకాలవున్న స్టోరీఏంటంటే కొన్నేళ్ళ క్రితం ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి రోడ్డుప్రమాదంలో చనిపోయిందట.ఆ ఆత్మే ఇక్కడ తిరుగుతుందిఅనేది ఇక్కడ చుట్టుప్రక్కల వుండేవారి వాదన.

ఆర్య మిల్క్ కాలనీ రోడ్

ఆర్య మిల్క్ కాలనీ రోడ్

ఎటుచూసినా పచ్చదనంతో నిండిపోయుంటుంది ఆ ప్లేస్. ఇక్కడికి చాలామంది పగలు పిక్నిక్ కోసం వస్తూవుంటారు. సాయంత్రం 6దాటితే ఇక్కడ ఒక్కమనిషి కూడా కనిపించడు. ఇక్కడ చుట్టుప్రక్కల వుండే వారు చెప్పేదాని ప్రకారం ఇక్కడ ఒక ఆత్మవుందట.

PC:youtube

ఆర్య మిల్క్ కాలనీ రోడ్

ఆర్య మిల్క్ కాలనీ రోడ్

ఆ ఆత్మ వెనకాలవున్న స్టోరీఏంటంటే కొన్నేళ్ళ క్రితం ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి రోడ్డుప్రమాదంలో చనిపోయిందట.ఆ ఆత్మే ఇక్కడ తిరుగుతుందిఅనేది ఇక్కడ చుట్టుప్రక్కల వుండేవారి వాదన.ఇక్కడ రెగ్యులర్ గా బస్సు నడిపే డ్రైవర్ ఏం చెప్పాడు అంటే సాయంత్రం ఇక్కడ ట్రిప్ అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి ఒక చెట్టువెనకాల కూర్చొని ఏడుస్తున్నశబ్దం మనకు వినిపించేది.

PC:youtube

ఆర్య మిల్క్ కాలనీ రోడ్

ఆర్య మిల్క్ కాలనీ రోడ్

ఆమె ఎందుకేడుస్తుందో తెలుసుకుందామని అటుపక్కకి వెళితే ఆ అమ్మాయిఒక్కసారిగా నాపై దాడి చేసింది.ఈ బస్ డ్రైవర్ ఒక్కడేకాదు.ఇటుగా వెళ్ళే అందరినీ ఆ అమ్మాయిలిఫ్ట్ అడుగుతుందట. ఆ బండి ఆగినతర్వాత వారిపై దాడిచేస్తుందట.అలాగే ఇటుగా వచ్చే వాళ్ళందర్నీ ఆ ఆత్మఆకర్షిస్తుందట. చాలాసార్లు ఈ ఆత్మవల్ల ఈ రోడ్ లో యాక్సిడెంట్స్ జరిగాయి.

PC:youtube

రాజ్ కిరణ్ హోటల్

రాజ్ కిరణ్ హోటల్

మహారాష్ట్రలోని ఈ రాజ్ కిరణ్ హోటల్ ని భూతాలహోటల్ అని కూడా పిలుస్తారు. ఇది మహారాష్ట్రలోనే అత్యంత భయంకరమైనచోటు. ఇక్కడ దెయ్యంవుంది అని తెలీక వచ్చిన టూరిస్ట్ లు చెప్పిందిఏంటి అంటే?

PC:youtube

రాజ్ కిరణ్ హోటల్

రాజ్ కిరణ్ హోటల్

మాకూ ఒక రూం యలాట్ చేసారు.ఆ రూంలోకి వెళ్ళినతర్వాత మేము నిద్రపోయాం. అప్పుడు మా దుప్పటిని ఎవరో లాగినట్టుమాకనిపించేది. మేం తెచ్చుకున్న సామాన్ రాత్రి ఒక గదిలో పెడితే పొద్దునకల్లా వేరే దగ్గర వుండేది.

PC:youtube

రాజ్ కిరణ్ హోటల్

రాజ్ కిరణ్ హోటల్

సడెన్ గా బాత్రూం లాకయిపోయేది.అంటూ టూరిస్ట్ లు వాళ్ళ అనుభవాలు పంచుకున్నారుమాతో. ఈ హోటల్ లో ఒక రూమ్లో 21ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.అదే ఆత్మ ఈ హోటల్ లో తిరుగుతూవుంది అని ప్రచారంవుంది. ఈ రోజుకీ అక్కడ పరిస్థితి ఇదే.రాజ్ కిరణ్ హోటల్ పేరుని భూతల హోటల్ గా మార్చేసారు అక్కడి ప్రజలు.

PC:youtube

రబిందర్ నగర్

రబిందర్ నగర్

హైదరాబాద్ లోని రబిందర్ నగర్ గురించి సీతాఫల్ మండీలో ప్రతీ ఒక్కరికీ తెలిసేవుంటుంది. 2012లో నలుగురు బ్యాచిలర్స్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య జరిగిన రోజునుంచి ఈ ఏరియాలో ఎక్కడోదగ్గర ఏదోవిధంగా డిస్టర్బెన్స్ అనేది ఏర్పడేదట.

PC:youtube

రబిందర్ నగర్

రబిందర్ నగర్

అర్ధరాత్రిరోడ్ల మీద ఎవరో నడుస్తున్నట్లు కనిపించేదట.ఇక అప్పటినుంచి ఈ రబీంద్రనగర్ లో వుండే జనాలు ఆ యేరియా మొత్తం జైశ్రీరాం అనే పేరుతో వుండే జెండాలని ప్రతీవీధిలో పెట్టారు.

PC:youtube

అపార్ట్మెంట్ ఆఫ్ జోగేశ్వరీ

అపార్ట్మెంట్ ఆఫ్ జోగేశ్వరీ

ఈ అపార్ట్మెంట్ రోడ్ మీదే వుంటుంది. 4అంతస్థులు వుంటుంది.అయినప్పటికీ ఈ అపార్ట్మెంట్ లోని రెండోఫ్లోర్ లో ఆత్మ వుంటుందని ఆ బిల్డింగ్ వారు చెప్తున్నారు. ఒకప్పుడు ఈ బిల్డింగ్ లో ఎయిర్ హోస్టిస్ వుండేదట.అనుకోకుండా ఒక రోజు హత్యకు గురైందట.

PC:youtube

అపార్ట్మెంట్ ఆఫ్ జోగేశ్వరీ

అపార్ట్మెంట్ ఆఫ్ జోగేశ్వరీ

ఆ తరువాత కొద్దిరోజులకి అదే రూంకి ఇంకో ఎయిర్ హోస్టిస్ వచ్చింది ఆమెకి కొద్ది రోజులు గడిచినతర్వాత ఎవరో తనని ఫాలో అవుతున్నట్టు తనమీద నిఘాపెట్టినట్లు అనిపించిందట.తాను నిద్రపోతున్న సమయంలో ఎవరో ఏడుస్తున్నశబ్దం తనకి వినిపించిందట.వెంటనే ఎవరబ్బా అని వెతుక్కుంటూ టెర్రస్ పైకి వెళ్లిందట.

PC:youtube

అపార్ట్మెంట్ ఆఫ్ జోగేశ్వరీ

అపార్ట్మెంట్ ఆఫ్ జోగేశ్వరీ

అక్కడ ఒక మూలాన కూర్చొని ఎవరో యేడుస్తున్నారట.ఈ ఎయిర్ హోస్టెస్ దగ్గరికి వెళ్లి చూసేసరికి అక్కడ ఎవరూలేరు ఆ తర్వాత ఈ బిల్డింగ్ ని 2గా విడదీసారు.రెండో పక్కకి ఎవ్వరూ వెళ్ళటానికి ధైర్యం చేయరు.ఈ ఒకటోపక్కే అందరూ వుంటారు.

PC:youtube

అపార్ట్మెంట్ ఆఫ్ జోగేశ్వరీ

అపార్ట్మెంట్ ఆఫ్ జోగేశ్వరీ

ఇక్కడుండే రెంటర్స్ కూడా ఏంచెబుతున్నారంటే అవునుమాకిక్కడ ఒకఅమ్మాయి యేడుస్తున్నశబ్దం, ఎవరో పరుగెడుతున్న శబ్దం రాత్రివేళల్లో వినిపించేది అంటూ చెప్పుకొచ్చారు.వీటన్నిటినీ కొద్దిమందినమ్ముతారు.కొద్దిమంది నమ్మరు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి.

PC:youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి