» »జీసస్ ఇండియాలో ఎక్కడికి వచ్చారో తెలుసా ?

జీసస్ ఇండియాలో ఎక్కడికి వచ్చారో తెలుసా ?

Written By:

జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ దాల్ లేక్ కు పక్కనే అనుకోని ఉన్న ఎత్తైన పర్వతం పై శ్రీ ఆది శంకరాచార్యుల దేవాలయం ఉన్నది. ఈ ఎత్తైన పర్వతాన్ని ఆయన పేరుమీదనే 'ఆది శంకరాచార్య పర్వతం' అని పిలుస్తారు. వెయ్యేళ్ళ క్రితం ఆది శంకరాచార్య భారతదేశ యాత్ర లో భాగంగా ఈ పర్వతం వద్దకు చేరుకొని, పైకి ఎక్కి జ్యేష్టేశ్వర రాతి దేవాలయంలో ప్రార్థనలు జరిపారు. శంకరాచార్యుల వారు ఈ ప్రాంతానికి రాక ముందు ఈ పర్వతాన్ని "గోపాలకొండ" అని పిలిచేవారని కల్హణుడు వ్రాసిన రాజతరంగిణి గ్రంథంలో పేర్కొనబడింది.

కాలడి : జగద్గురు ఆది శంకరాచార్యుల జనన ప్రదేశం !

ఆచార్యులవారు శ్రీనగర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అభినవ గుప్తుడు ను డిబేట్ లో ఓడించి అతనిని అద్వైత్వం వైపు మళ్లించేటట్లు చేశారు. 4500 సంవత్సరాల క్రితం జ్యేష్టేశ్వర రాతి మందిరం ను శ్రీనగర్ రాజ్యాన్ని పాలించే రాజా సాండిమన్ నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు.

శ్రీనగర్

శ్రీనగర్

జ్యేష్టేశ్వరగా కూడా విదితమైన పవిత్ర శంకరాచార్య దేవాలయం, కొండల యొక్క పైభాగాన్ని ఆక్రమించుకుని .. ఆగ్నేయ శ్రీనగర్ చుట్టుపక్కల ఉన్న తఖ్త్-ఎ -సులేమాన్ మైదానాలకు ఎగువన ఉంటుంది.

చిత్రకృప : Soumyadeep Paul

గోపాలకొండ

గోపాలకొండ

మొదట గోపాద్రి లేదా గోపాలకొండ గా పేరుపెట్టబడిన ఈ స్థలం, ఒక బౌద్ధమత స్మారకకట్టడంగా ఉండి క్రీస్తు పూర్వం 250 నాటికి చెందింది. బహుశా అశోక చక్రవర్తి యొక్క కుమారుడు ఝలోకాచే నిర్మింపబడి ఉంటుంది. 7వ శతాబ్దంలో రాజు లలితాదిత్యచే అది ప్రస్తుత దేవాలయంగా పునః స్థాపించబడింది.

చిత్రకృప : Tauqee Zahid

సనాతన ధర్మం

సనాతన ధర్మం

తత్వవేత్త శంకరాచార్యుడు సనాతన ధర్మాన్ని బ్రతికించేందుకు పది శతాబ్దాల క్రితం కాశ్మీరును సందర్శించినప్పుడు ఈ ప్రదేశంలో నివసించినట్లుగా లిఖితం చేయబడింది.

చిత్రకృప : Burke, John

శంకరాచార్య దేవాలయం

శంకరాచార్య దేవాలయం

ఒక ఎత్తైన ఎనిమిది పలకల పునాదితో ఎత్తులో ఒక దృఢమైన రాయిపై నిర్మింపబడి మరియు ఒకప్పుడు శాశనాలు కలిగి ఉన్న పక్క గోడలు కలిగిన మెట్ల మార్గం ద్వారా చేరుకోబడుతుంది.

చిత్రకృప : Ravik

ప్రధాన పుణ్యస్థలం

ప్రధాన పుణ్యస్థలం

ప్రధాన ధార్మిక స్థలంగా ఉన్న ఈ ప్రదేశం ప్రదేశం ఒక గుండ్రని గోడతో చతురస్రాకార భవనాన్ని కలిగి ఉంటుంది. ఇది శ్రీనగర్ లోయ మొత్తాన్ని చూపిస్తుంది. ఈ ఎత్తైన పర్వతాన్ని చేరుకోవాలంటే కాలినడకన లేదా కారు ద్వారా చేరుకోవచ్చు.

చిత్రకృప : Ankur P

గర్భగుడి

గర్భగుడి

గర్భగుడిని ఒక అధునాతన లోకప్పు కప్పి ఉంటుంది మరియు పెర్షియన్ శాసనం దీని యొక్క పుట్టుకను షాజహాన్ కాలానికి చెందినదిగా జాడ చూపిస్తుంది.

చిత్రకృప : Divya Gupta

విస్మయం

విస్మయం

గర్భగుడి లోపల నెలకొని ఉన్న ఒక పాత్రలో, సర్పంతో చుట్టబడి ఉన్న ఒక శివలింగం కూడా ఉంది. అసలు లోకప్పు గోపురం ఆకారంలో ఉండేది మరియు ప్రస్తుతం ఉన్న ఇటుక కప్పు దాదాపు ఒక శతాబ్దం నాటిదిగా చెప్పబడుతుంది.

చిత్రకృప : Divya Gupta

శివుడు

శివుడు

శంకరాచార్య దేవాలయం లేదా జ్యేష్టేశ్వర దేవాలయం శ్రీనగర్ ఉపరితలానికి 1100 అడుగుల ఎత్తులో ఉన్నది మరియు ఈ ఆలయం హిందూ మతానుసారం లయకారి అయిన శివుడు కు అంకితం చేయబడినది.

చిత్రకృప : Burke, John

పురాతన దేవాలయం

పురాతన దేవాలయం

కాశ్మీర్ లో ఉన్న పురాతన దేవాలయాలలో అది శంకర దేవాలయం ఒకటి. క్రీ.పూ. 371 లో రాజా గోపాదత్య పేరునే ఈ పర్వత శిఖరానికి పెట్టారు. ఆతర్వాత ఆదిశంకరచార్యులు ఇక్కడ బస చేయటంతో పర్వతానికి 'ఆది శంకర పర్వతం' గా, ఇక్కడ దేవాలయానికి 'ఆదిశంకర దేవాలయం' గా మార్చారు.

చిత్రకృప : Divya Gupta

భక్తుల సౌకర్యం

భక్తుల సౌకర్యం

పర్వతం మీద ఉన్న దేవాలయం చేరుకోవటానికి మెట్లు ఉండేవికావు. ఆతర్వాత వచ్చిన దోగ్రా పాలకుడు మహారాజా గులాబీ సింగ్, భక్తులు పడుతున్న ఇక్కట్లను చూసి ఆలయానికి రాతి మెట్లు కట్టాడు.

చిత్రకృప : Burke, John

విద్యుద్దీప పనులు

విద్యుద్దీప పనులు

ఆలయానికి కొత్త శోభ క్రీ.శ. 1925 లో వచ్చింది. ఆ సంవత్సరం నుండి ఆలయానికి కరెంట్ సరఫరా చేయబడింది. మతకేంద్రం గానేకాక పురావస్తు కేంద్రంగా కూడా దేవాలయం పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

చిత్రకృప : PrasanthR

జీసస్

జీసస్

దేవాలయానికి ఎటువంటి మెట్లు, వసతులు లేని కాలంలో జీసస్ కాశ్మీర్ ప్రాంతాన్ని సందర్శించాడని కొంతమంది నమ్ముతారు.

చిత్రకృప : Kreativeart

అమ్మవారి శ్లోకాలు

అమ్మవారి శ్లోకాలు

ఆది శంకరాచార్యులు 'సౌందర్యలహరి' ని గోపదరి కొండల పర్వతం పై కూర్చొని వ్రాశారని చెబుతారు. ఇందులో అమ్మవారి శ్లోకాలు ఉన్నాయి.

చిత్రకృప : Hvadga

అమర్నాథ్ యాత్ర

అమర్నాథ్ యాత్ర

భక్తులు ఏటా జరిగే అమర్నాథ్ యాత్ర లో భాగంగా శ్రీనగర్ చేరుకున్నాక ఈ దేవాలయాన్ని దర్శిస్తుంటారు. కొందరు కాలినడకన, మరికొందరు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని శంకరాచార్య మందిరానికి చేరుకుంటారు.

చిత్రకృప : Chinthalapudi Srividya

సమాచారం

సమాచారం

భక్తులు పర్వతం పైకి చేరుకోవటానికి 243 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. టెంపుల్ హాల్ లోకి ప్రవేశించటానికి మరో 8-10 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. కొండ ప్రవేశం వద్ద ఆర్మీ దళాలు పహారా కాస్తూ ఉంటాయి. సాయంత్రం 5 గంటల తర్వాత వాహనాలను కొండపైకి అనుమతించారు. రాత్రి 8 గంటల వరకు దేవాలయాన్ని తెరిచే ఉంటుంది. కొండ పై నుండి కాశ్మీర్ అందాలను తిలకించవచ్చు.

చిత్రకృప : Didier Lamouche

సందర్శనీయ స్థలాలు

సందర్శనీయ స్థలాలు

ఆది శంకరాచార్య దేవాలయం చుట్టుపక్కల సందర్శనీయ స్థలాలు : దాల్ సరస్సు, చార్ చినార్ ద్వీపం, నాగిన్ సరస్సు, చష్మే షాహి, హరి పర్బత్, కాశ్మీర్ పడవ ఇల్లు మరియు షికారా, హాజరత్బల్ పుణ్యక్షేత్రం మొదలుగునవి చూడదగ్గవి.

చిత్రకృప : McKay Savage

శ్రీనగర్

శ్రీనగర్

శ్రీనగర్ లో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి విమానాలు, పలు రైళ్ళు వస్తుంటాయి. లోకల్ గా తిరిగే ఆటో రిక్షాలు, ప్రవేట్ టాక్సీలు, క్యాబ్ లలో ప్రయాణించి ఆదిశంకరాచార్య దేవాలయానికి చేరుకోవచ్చు.

చిత్రకృప : Pkvan