Search
  • Follow NativePlanet
Share
» »గోవా వారసత్వ ప్రదేశాలు చూసొద్దామా !!

గోవా వారసత్వ ప్రదేశాలు చూసొద్దామా !!

గోవా లో బీచులు కాకుండా ఇతర ఆకర్షణలు ఏవైనా ఉన్నాయా అంటే ? భేషుగ్గా ఉన్నాయనే చెప్పాల్సివస్తుంది. అవేవో కావు హెరిటేజ్ ప్రదేశాలు. వారసత్వ ప్రదేశాలైన అగుడా, ఛోపడం, సియోలిం గోవా లో తప్పక సందర్శించాలి.

By Mohammad

గోవా అనగానే అందరికీ గుర్తుకొచ్చేవి సాగర తీరాలు. ఇక్కడ చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా అందరూ బీచ్ ల వద్ద ఆనందిస్తారు. నీటి క్రీడలను ఆచరిస్తారు. ఈత కూడా కొట్టుతారు. గోవా కు ప్రధాన ఆదాయ వనరు ఈ బీచులే !! ఇవి గోవా పర్యాటక రంగానికి ఒకెత్తు. మరి గోవా లో బీచులు కాకుండా ఇతర ఆకర్షణలు ఏవైనా ఉన్నాయా అంటే ? భేషుగ్గా ఉన్నాయనే చెప్పాల్సివస్తుంది. అవేవో కావు హెరిటేజ్ ప్రదేశాలు. వారసత్వ ప్రదేశాలైన అగుడా, ఛోపడం, సియోలిం గోవా లో తప్పక సందర్శించాలి.

అగుడా కోట

అగుడా కోట నిస్సందేహంగా భారతదేశంలో చక్కగా నిర్వహిస్తున్న వారసత్వ కట్టడాలలో ఒకటి. ఈ 17వ శతాబ్దపు కోట పోర్చుగీసు పాలకులు డచ్ మరియు మరాఠా పాలకుల దాడులనుండి తమను సంరక్షించుకోవటానికిగాను నిర్మించారు. వేలాది పర్యాటకులు ఈ కోట సందర్శనకు వస్తారు. అగుడా కోట మరియు అక్కడి లైట్ హౌస్ మీకు చూపు తిప్పుకోలేని అరేబియా సముద్రపు అందాలను ఈ బీచ్ ఒడ్డునుండి చూపుతాయి.

అగుడా

చిత్రకృప : Alan V Mathew

ఇక్కడే ఒక ఫైవ్ స్టార్ రిసార్టు తాజ్ వివంటాగా పిలువబడేది కలదు. ఖర్చుకు వెనుకాడేవారు కాకుంటే, ఈ రిసార్టు అద్భుత సౌకర్యాలను, ఆనందాలను కలిగిస్తుంది. సెలవుల కొరకు మీరు వెళ్ళే ఫైవ్ స్టార్ హోటళ్ళను సైతం ఆహారం, అన్నిటికి అందుబాటుగా వుండటం లో మరపింపచేస్తుంది.

అగుడా మరియు అగుడా బీచ్ లు పేరొందిన కండోలిం బీచ్ నుండి కొద్ది దూరంలోనే ఉన్నాయి. సాయంత్రం అయిందంటే చాలు అగుడా కోట చుట్టు పక్కల ప్రదేశం అంతా అనేక సెకండ్ హ్యాండ్ వస్తువుల మార్కెట్ తో నిండి పోతుంది. ఎన్నో పరికరాలు, దుస్తులు, చేతి కళల వస్తువుల వంటివి అతి చౌకగా కొనుగోలు చేయవచ్చు.

అగుడా

చిత్రకృప : Nanasur

అగుడా కోట చేరాలంటే గోవాలోని అన్ని ప్రదేశాలనుండి తేలికగా చేరవచ్చు. కనుక ఈ ప్రాంతంలో మీరు బస చేయటం ఎంతో ఉపయోగకరం. అగుడా చేరేందుకు అద్దె కారు లేదా టాక్సీలు విమానాశ్రయం మరియు రైలు స్టేషన్ ల నుండి లభిస్తాయి. మీరు స్వంత డ్రైవింగ్ లో చేరాలనుకుంటే, మార్గాన్ని సూచించే బోర్డులు ప్రతి చోటా కనబడుతూనే ఉంటాయి.

ఛోపడం- బీచ్ తీర ఆనందాలు !

మనోహరమైన ఈ ప్రదేశం ఛర్పోరా నది ఒడ్డున ఉత్తరంగా ఉంటుంది. ఛోపడం గోవాను పార్టీలు, విందులు, వినోదాలుగా కాక మరో కోణంలో చూపుతుంది. అది మతపరంగా. యాత్రికులు, చరిత్ర అభిలాషక పర్యాటకులు ఇక్కడ కల భూమిక, వేటాల్, గరుడి మరియు రాంపురుష్ దేవాలయాల పరిరక్షణను తప్పక ప్రశంసిస్తారు.

ఈ ప్రాంతంలో గెస్ట్ హౌస్ లు, లాడ్జిలు అధికంగా ఉండటం చేత, సామాన్య హోటళ్ళు తక్కువగా ఉంటాయి. ఏదో ఒక రకంగా హోటల్ వసతి సంపాదించగలిగితే మాత్రం అది చాలా బాగుంటుందనే చెప్పాలి. ఛోపడం నుండి కొంచెం దూరం బయటకు వెళితే చాలు రిసార్టులు, హోటళ్ళు మీకు కావలసినన్ని దొరుకుతాయి.

ఛోపడం

చిత్రకృప : Biusch

ఛోపడం చేరాలంటే, సియోలిం నుండి ఫెర్రీలో కూడా చేరవచ్చు. కొద్దిపాటి సాహసంగా కనపడుతుంది. హై వే లో ప్రయాణించేవారికి రోడ్డు బాగానే ఉంటుంది కాని అధిక సమయం పడుతుంది. ముంబై లేదా పూనే నగరాలనుండి గోవా చేరే పర్యాటకులు నార్త్ గోవా చేరే ముందుగా ఛోపడెం చూస్తారు.

ఇది కూడా చదవండి : 'దిల్ చహ్ తా హై' కోట చూసొద్దామా !!

సియోలిం - పులులు , సింహాల పూర్వపు నివాసం!

సియోలిం ప్రాంతం మాపూసాకు వాయువ్యంగా ఉంటుంది. అంజునా, కాలన్ గూటే మరియు బాగాలకు ఉత్తరంగా ఉంటుంది. సియోలిం బీచ్ నుండి సూర్యోదయ సూర్యాస్తమయాలు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. సియోలిం అనే పేరుకు తగినట్లు గతంలో ఈ ప్రాంతంలో బహుశ అనేక సింహాలు, పులులు, ప్రత్యేకించి కొండలలో సంచరించి ఉండవచ్చు. ఇది మతపరంగా కేధలిక్కులకు, హిందువులకు కూడా పవిత్ర ప్రదేశం. సీజన్ వచ్చిందంటే చాలామంది యాత్రికులు ఇక్కడి చర్చిలను, దేవాలయాలను దర్శిస్తారు.

సియోలిం

చిత్రకృప : Andrey Fedoseev

సియోలిం చర్చిసెయింట్ ఆంధోనీ, మా డి డూస్, అవర్ లేడీ ఆఫ్ సారోస్ కలిగి ఉంటుంది. శ్రీ దత్త మరియు సతేరి దేవాలయాలు కూడా కలవు. పర్యాటకుల పరంగా సియోలిం చేరాలంటే పెద్ద కష్టమేమీ కాదు. అది మాపూసా, నార్త్ గోవా మరియు పాణిజింలనుండి తేలికగా చేరవచ్చు. ముంబై నుండి ప్రయాణించే పర్యాటకులు గోవా వెళ్ళే దారిలో చూడవచ్చు. సియోలిం అంజునా బీచ్ మరియు కర్లీస్ షాక్ మరియు అంజునా శనివార రాత్రి ఫ్లీ మార్కెట్లకు కూడా సన్నిహితంగా ఉంటుంది.

సియోలిం

చిత్రకృప : Nichalp

ప్రాంతానికి వెగేటర్ మరియు ఛపోరా బీచ్ లు కూడా దగ్గరే. ఛోపడెం ఫిష్ మార్కెట్ కూడా దర్శించవచ్చు. ఇక ఈ ప్రాంత వసతి చాలా తేలికగా దొరుకుతుంది. చిన్న రూముల నుండి 4 స్టార్ లక్జరీ రూమ్ ల వరకు దొరుకుతాయి. పాణజిం లేదా బాగా లనుండి అద్దె కారు లేదా బైక్ లపై కూడా సియోలిం చేరవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X