• Follow NativePlanet
Share
» »గోవాలోని రహస్య శృంగార బీచ్ లు ఇవే....

గోవాలోని రహస్య శృంగార బీచ్ లు ఇవే....

భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన స్థలమేదంటే అది గోవా.ఇక్కడికి అనేకమంది ఎంజాయ్ చేయటానికి వస్తూవుంటారు. విహారానికి, వాటర్ గేమ్స్ ఆడటానికి, వారి ఏకాంతాన్ని గడపటానికి, పార్టీలు జరుపుకోవటానికి,ఈ విధంగా అనేకమంది పర్యాటకులను గోవా ఆకర్షిస్తుంది. ఇక్కడి సముద్రతీరాలు అందరినీ ఎంతో ఆత్మీయంగా ఆకర్షిస్తుంది.

కేవలం యువకులనే కాక వృద్ధులకు కూడా ఒకే విధంగా ఎంజాయ్ కలిగించే ఒకే ఒక స్థలమేదంటే అది గోవా. దేశంలోని మూలమూలలనుంచి సందర్శించే ఈ ప్రాంతానికి ఏవిధంగా ఎంజాయ్ చేయాలిఅనేది తెలీదు.

గోవాలోని రహస్యమైనశృంగారానికే అనేక బీచ్లు వున్నాయి. ఆ బీచ్లలో ఏకాంతంగా కాలంగడపటానికి చెప్పుకోవలసిన స్థలమిది అని చెప్పవచ్చును. దేశవిదేశాల నుంచి వచ్చే ఈ స్థలానికి తన భాగస్వామిని సంతోషపరచుటకు ముఖ్యంగా ఏకాంతంగా గడుపుటకు వస్తూవుంటారు. మీ ఏకాంతానికి భంగంకాకుండావుండుటకు గోవాలోని ఈ బీచ్లకు వెళ్ళిరండి.

వేల్సావ్ బీచ్

వేల్సావ్ బీచ్

ఇది గోవాలోని అద్భుతమైన బీచ్ లలో ఒకటి. వేల్సావ్ క్యాన్సులిం గ్రామానికి సమీపంలోవున్న ఒక పెద్దఇసుకద్రతీరం. ఈ బీచ్ తన అందమైన మరియు మృదువైన ఇసుకతో ఆకర్షిస్తుంది. ఈ బీచ్ ముఖ్యంగా సూర్యాస్థమయానికి పేరుగాంచినది. ఇక్కడి బీచ్ తాటిచెట్లతో కూడుకుని వుంటుంది. పనాజినుంచి సుమారు 14కిమీ దూరంలోవున్నందువలన అనేకమంది పర్యాటకులు ఈ అందమైన బీచ్లకు వస్తూవుంటారు.

ఇదొక రహస్యమైనశృంగారాన్ని మరింతపెంచే బీచ్.

PC:Tanya Dedyukhina

సిరిడావో బీచ్

సిరిడావో బీచ్

సిరిడావో బీచ్ ఏకాంతంగా శృంగారమయంగా సమయాన్ని గడుపుటకు అనుకూలమైన బీచ్. సిరిడావో బీచ్ అనేది గోవారాష్ట్రంలోని వుత్తరభాగంలోని జిల్లాతాలూకాలో ఈ గ్రామం వుంది. ఇక్కడ అనేక మంది పర్యాటకస్థలాలు కూడా వున్నాయి. సిరిడావో బీచ్ పనాజీ నుంచి సుమారు 7.5 మైల్ దూ రం వుంది. ఈ బీచ్ రాళ్ళు మరియు ఇసుకతో కూడుకుని వుంది. చాలా మంది పర్యాటకులు ఈ స్థలాన్ని సందర్శించడానికి వస్తూవుంటారు. ఇక్కడ స్విమ్మింగ్, ఫిషింగ్, బోట్ రైడింగ్ లాంటి ఆనందకరమైన కార్యకలాపాలు కూడా వుంటాయి.

PC:abcdz2000

లవర్స్ బీచ్

లవర్స్ బీచ్

బీచ్ ను సందర్శించే పర్యాటకులకి లవర్స్ బీచ్ అత్యంత రహస్యమైన మరియు అందమైన బీచ్ లలో ఒకటి.ఇది బెటల్బాటిమ్ బీచ్ కి ఉత్తరాన ఉంది. స్థానికులు లవర్స్ బీచ్ అని పేరు పెట్టారు. ఎందుకంటే రొమాంటిక్ జంట సాయంత్రం ఇక్కడ సందర్శిస్తుంటారు.ఈ బీచ్ గోవా నుండి 6 కిమీ ల దూరంలో వుంది. దంపతులు మరియు ప్రేమికులే కాకుండా చాలామంది పర్యాటకులుకూడా ఈ బీచ్ ను సందర్శిస్తారు.

పైన్ చెట్లు ఇక్కడ చూడవచ్చు.

PC:Adi

హోలంట్ బీచ్

హోలంట్ బీచ్

గోవాలోని హోలాంట్ బీచ్ జంటలను మరియు పర్యాటకులను చాలా ఆకర్షిస్తుంది. ఇక్కడ సూర్యోదయం చూడటానికి ఒక గొప్ప ప్రదేశం. బొగ్మాలో బీచ్ ని సందర్శించినవారు ఈ అద్భుతమైన బీచ్ ని మిస్ చేయరు. ఇదొక శృంగారకరమైన బీచ్. ఇది గోవా నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోవాయొక్క ప్రముఖ దక్షిణసముద్ర తీరాలు మరియు పశ్చిమ కనుమల పర్వతాల యొక్క అందమైన దృశ్యాన్ని తిలకించవచ్చును.

PC:ShadesofIndia

గ్రాండ్ మదర్ హోల్ బీచ్

గ్రాండ్ మదర్ హోల్ బీచ్

గ్రాండ్ మదర్స్ బీచ్ గోవాలోని అత్యంత అందమైన, ఏకాంత బీచ్లలో ఒకటి. ఈ బీచ్ చాలా శుభ్రంగా ఉంటుంది. దుర్గ మరియు శివునిదేవాలయం కూడా ఇక్కడ ఉంది. శిలలపై ఒక జపనీస్ పార్కు కూడా ఉంది. ఇది భారతదేశంలో ఒక ప్రత్యేక పార్కు.

గాల్గిబాగా బీచ్

గాల్గిబాగా బీచ్

గాల్గిబాగా బీచ్ గోవా యొక్క దక్షిణ భాగంలో కనకోన ప్రాంతం నుండి 7 కి. మీ. ల దూరం లో ఉంది. మొత్తం అరేబియా సముద్రపు తీరం తీరంవెంబడి తల్పూనా నదినుంచి గల్గిబాగా నది వైపున మొత్తం తీరం వెంబడివుంది. ఈ బీచ్ నవదంపతులు ఏకాంతంగా కాలంగడపటానికి సరైన బీచ్.

డౌనా పౌలా బీచ్, గోవా

డౌనా పౌలా బీచ్, గోవా

ఇదొక అందమైన బీచ్. ఎంతో మంది కొత్త జంటలు ప్రేమికులు ఒంటరిగా గడపటానికి ఇదొకఅందమైన బీచ్. ఈ బీచ్ పనాజి నుండి 7 కి.మీ.ల దూరంలో కలదు. గోవా లోని చాలా బీచ్ లలో ఇది ఒకటి.

ఈ బీచ్ ముఖ్యంగా "ప్రేమికులకు స్వర్గం" అనే పేరువుంది. ఇది మర్మూగో వచ్చినవారికి ఒక అద్భుతమైన వీక్షణను అందిస్తుంది. ఈ ప్రదేశంఎక్కువగా పామ్ చెట్లతో చుట్టబడి ఉంటుంది.

PC:SahilSahadevan

కోలాబీచ్ బ్యూటీ

కోలాబీచ్ బ్యూటీ

కోలా బీచ్ ని ఖోలా బీచ్ అని కూడా పిలుస్తారు. ఇదొక రహస్యమరియు శృంగారమయమైన బీచ్. ప్రశాంతమైన సెలవులు గడపటానికిగోవాకి వచ్చిన వారు ఖచ్చితంగా స్వర్గంచూస్తారనిచెప్పవచ్చును. గోవాలోని బీచ్ల కంటే ఇది ఒక స్వచ్ఛమైన మరియు నిశ్శబ్ద బీచ్. ఇది విలక్షణమైన సౌందర్యం మరియు ప్రశాంతతకు నెలవు అని చెప్పవచ్చును.

PC:Vishalnagula

క్యాండోలిం బీచ్

క్యాండోలిం బీచ్

గోవా యొక్క బాగా మరియు కలన్ గూట్ బీచ్ అందమైన బీచ్లలో ఒకటి.జనాదరణ పొందిన వినోదభరితమైనవి చాలా ప్రజాదరణ పొందాయి. ఈ బీచ్ హనీమూనర్లు, స్నేహితులు లేదా కుటుంబంతో సమయాన్ని గడపడానికి సరైన ప్రదేశంగా చెప్పవచ్చు.ఇక్కడ జంటలు ఏకాంతంగా గడవటానికే ఏర్పరచిన బీచ్. పనాజీ నుంచి సుమారు 14కిమీ ల దూరంలో వుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఈ బీచ్ ను సందర్శించుటకు పర్యాటకులు వస్తూంటారు.

బటర్ ఫ్లై బీచ్

బటర్ ఫ్లై బీచ్

బటర్ ఫ్లై బీచ్ దక్షిణ గోవా, పెటిట్ బీచ్ వద్ద ఉంది. ఇది దట్టమైన చెట్లతో ఆవరించివున్న చిన్న గుహలు మరియు ప్రకృతి ప్రియులకు అందమైన ప్రదేశం. చుట్టుపక్కల చెట్లు తరచుగా వివిధ సీతాకోకచిలుకలు ఆకర్షిస్తాయి. రంగురంగుల సీతాకోకచిలుక సూర్యాస్తమయంలో ముఖ్యంగా అందంగా ఉంటుంది.ఏకాంతంగా కాలంగడుపుటకు ఇది ఒక ప్రత్యేక స్థలం అని చెప్పవచ్చును.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి