Search
  • Follow NativePlanet
Share
» »కల్కి జన్మించబోయే ఊరి గురించి హిట్లర్ ఎందుకు వెతికాడో తెలుసా?

కల్కి జన్మించబోయే ఊరి గురించి హిట్లర్ ఎందుకు వెతికాడో తెలుసా?

హిందువులు భక్తితో పూజించే విష్ణుమూర్తి వివిధ సమయాలలో ధర్మరక్షణకై 9 అవతారాలనెత్తి అసురులను వధించాడని పురాణాలు చెబుతున్నాయి.

By Venkatakarunasri

హిందువులు భక్తితో పూజించే విష్ణుమూర్తి వివిధ సమయాలలో ధర్మరక్షణకై 9 అవతారాలనెత్తి అసురులను వధించాడని పురాణాలు చెబుతున్నాయి.ఈ కలియుగంలో పెరిగిపోతున్న పాపాలను అంతమొందించి ధర్మసంస్థాపన చేయటానికి శ్రీమహావిష్ణువు కల్కిఅవతారంలో వస్తాడని విష్ణు పురాణం చెబుతుంది.ఆయన జన్మించే స్థలం అత్యంత పవిత్రమైనదై వుండాలి కాబట్టి హిమాలయాలలో ఒక నగరం ప్రపంచానికి కనపడకుండా రహస్యంగా వుందని అందులో మహాపురుషులు,యోగులు,ఋషులు, దేవతలూసంచరిస్తారని వారికి ఎన్నో అమోఘమైన శక్తులు వుంటాయని విష్ణు పురాణంలో వివరించబడింది.ఈ నగరం యొక్క జాడ గురించి ఎన్నో ఏళ్లుగా,ఎంతో మంది ప్రయత్నించారు.ప్రయత్నిస్తూనే వున్నారు.

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల అనునది హిందూ పురాణాలలో పేర్కొనబడిన ఒక ఆధ్యాత్మిక నగరము. బౌద్ధ పురాణాలలో కూడా దీని గురించిన ప్రస్తావన ఉన్నది. కొన్ని పరిశోధనలు, కొన్ని భారతీయ గ్రంథాలూ, బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లొకం ఒకటి హిమాలయాలలో ఉంది. దాని పేరే శంభల . దీనినే పాశ్చాత్యులు హిడెన్ సిటీ అంటారు.

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

ఎందుకంటే వందలు, వేల మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న హిమాలయాలలో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది అని ప్రతీతి. అది అందరకి కనిపించదు. అది కనిపించాలన్న, చేరుకోవాలి అన్నా ఇంతో శ్రమించాలి. మానసికంగా శారీరకంగా కష్టపడాలి. ఆ నగరాన్ని వీక్షించాలంటే అంతో ఇంతో యోగం కుడా ఉండాలని, ఎవరికి పడితె వారికి కనిపించదు అని అంటారు.అక్కడ దేవతలు సంచరిస్తారు అని, ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అని చెప్తారు.

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

ఉత్కృష్ట సంప్రదాయాలకు ఆలవాలం అయిన ఆ నగరం గురించి కొంత మంది పరిశోధకులు తమ జీవితాన్ని ధారపోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు. శంభల నగర ప్రదేశం అంతా అధ్బుతమైన సువాసన అలుముకొని ఉంటుందని అంటారు.

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలాను వీక్షించడం ఎంతో మధురానుబుతి కలిగిస్తుందని చెబుతారు. బౌద్ధ గ్రంథాలును బట్టి శంబాలా చాలా ఆహ్లాదకరమైన చోటు .ఇక్కడ నివసించే వారు నిరంతరం సుఖ, సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు. పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్నీది ఫర్బిడెన్ ల్యాండ్ అని ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స అని అంటారు.

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

చైనీయులకు కుడా శంభల గురించి తెలుసు. లోకంలో పాపం పెరిగిపొయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంభలలోని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లో తీసుకుంటారు అని అప్పటి నుంచి ఈ పుడమి పైన కొత్త శకం ప్రారంభం అవుతుందని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఆ కాలం 2424 లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియచేశాయి.

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

ఈ నగరంలో నివసించేవారు ఏలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారు అని వారి ఆయువు మామూలు ప్రజల కంటే రెట్టింపు ఉంటుందని వారు మహిమాన్వితులు అని పురాణాలలో చెప్పబడింది. ఈ నగర విశిష్టతను తెలుసుకున్న రష్యా 1920 లో శంభల రహస్యాన్ని తెలుసుకొవడానికి తన సైన్యాన్ని పంపి పరిశోధనలు చేయించింది.అప్పుడు శంభలకి చేరుకున్న రష్యా మిలటరీ అధికారులకు అనేక ఆశ్చర్య కరమైన విషయాలు తెలిసాయి.

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

అక్కడ యెగులు గురువులు దాని పవిత్రత గురించి తెలిపారు.ఈ విషయాన్ని తెలుసుకున్న నాజి నేత హిట్లర్ 1930 లో శంభల గురించి తెలుసుకొవడానికి పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలని పంపించాడు.ఆ బృందానికి నాయకత్వం వహించిన హేన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భువి పైన ఏర్పడ్డ స్వర్గమని నాజినేత హిట్లర్ కి చెప్పాడు .

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

అంతే కాక హిమ్లర్ శంభలలో మరెన్నో వింతలు, విశేషాలు మనవ మాత్రులు కలలో కుడా అనుభవించని గొప్ప అనుభూతులని సొంతం చేసుకున్నాడు అని అంటారు. గోభి ఎడారికి దగ్గరిలోని ఉన్న శంభలనే రాబోయే రోజులలో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రాలో రాసాడు అంటారు. దీన్నే పాశ్చాత్యులు ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ అంటారు .

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి ఫ్రాన్స్ కి సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మిక వేత్త, బౌద్ధ మత అభిమాని, రచయత్రి అలెగ్జాండ్రా డెవిడ్ నీల్ పరిశోధించి గ్రంథాలు రచించింది.ఆమె తనకు 56 ఏళ్ళ వయస్సులో ఫ్రాన్సు నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకుంది. వారి ద్వారా శంభల గురించి తెలుసుకుని అక్కడకి వెళ్లి మహిమాన్వితుల ఆశిస్సులు తీసుకొవడం వల్లనే ఆమె ఏకంగా 101 సంవత్సరాలు బ్రతికింది అని అంటారు.

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

ఆమె 1868 అక్టోబరు 24 లో జన్మించి 1969 సెప్టెంబరు 8 లో మరణించింది. అంతే కాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్ లో కాలుమోపిన తొలి యూరోపియన్ వనిత ఆమె. అలాగే షాంగై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ కుడా శంభల పై చాలా పరిశోధన చేసాడు.

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

ఆయన తన పరిశోధన గురించి చెబుతూ శంభల అనేది భుమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొంటారు. ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు. అక్కడి వారు టెలిపతితో ప్రపంచం లోని ఎక్కడి వారితొ నైనా సంభాషించ గలరు అని, ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా, విధ్వంసం అయినా క్షణాలలో వారికి తెలిసిపోతుంది అని తెలిపారు.

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

ఎనిమిది రేఖుల భారి కలువ పువ్వు ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఆ నగరం ఉంటుందని తెలిపాడు. ఇలా ప్రయత్నించిన వాళ్ళెవరు అని మనం పరిశీలిస్తే వారిలో ఒకరిపేరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అతడు సాధారణ మనిషి కాడు.అతడు ఒక దేశ నాయకుడు.అతడు తన జాతి విస్తృతికి కంకణం గట్టిన ఒక నియంత.

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

అతడు సృష్టించిన విధ్వంస కాండతో కోట్లమంది ప్రాణాలను హరించిన ఒక ఉన్మాది.అలాంటి వ్యక్తి హిందువుల పరమ పుణ్య నగరాన్ని గురించి ఎందుకు,ఎప్పుడు వెతికించాడు? అసలు ఆ నగరం ఏమిటి?ఎక్కడుంది? ఆ నియంత ఎవరు? అనే విషయాలను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

ధర్మసంస్థాపనకు కల్కిభగవానుడు వస్తాడని ఆయన జన్మించే నగరమే శంభలఅని, విష్ణుపురాణం చెబుతుంది.ఈ నగరం గురించి ఒక్క భారతదేశంలోనే కాకుండా చైనా, టిబెట్ వంటి దేశాలలోని పురాతన గ్రంథాలలో,బౌద్ధమత గ్రంథాలలో కూడా చెప్పబడింది.1920వ దశకంలో మన సంస్కృతగ్రంథాలలో దాగి వున్న సైన్స్ ని ఉపయోగించి అద్భుతాలను సృష్టించాలనే ఆలోచనలో ఒక దేశం ఉవ్విళ్ళూరుతున్న సమయం అది.

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

ఆ దశకంలో ఒక సైనికుడు తాను రాసిన ఒక బుక్ ద్వారా ఒక్కసారిగా పెద్ద పేరు తెచ్చుకున్నాడు. అతడు బలపరచిన ప్యాన్ జర్మనిజం, యాంటి జర్మనిజం, యాంటి కమ్యూనిజం అనే సిద్దాంతాలకు ప్రజలలో మంచి ఆదరణ వచ్చింది.దాంతో మెల్లమెల్లగా తన స్థాయిని పెంచుకుని ఆ దేశానికి అధ్యక్షుడైపోయాడు.అతడే జర్మెనీ నియంత అడాల్ఫ్ హిట్లర్.

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

చిన్నతనం నుంచీ పురాణాలపై ఎక్కువ ఆశక్తిని చూపించే హిట్లర్ కి నాజీలపై ఎక్కువ మక్కువ.జ్యుడిష్ ద్వేషం వుండేది. దాని వలన అతను మొదలుపెట్టిన విధ్వంస కాండ 2 వ ప్రపంచయుద్ధానికి దారితీసింది. జరగబోయే యుద్ధంలో తన సైన్యం పటిష్టంగా వుండాలని జెర్మనీ అంతటా విస్తృతంగా పరిశోధనలు చేయించి అత్యాధునిక ఆయుధాలు, భయంకరమైన బాంబులు తయారుచేయించాడు.

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

ఈ పరిశోధనలలో భాగంగా భారత పురాతనగ్రంథాలలో గల అత్యద్భుతమైన సైన్స్ గురించి తెలుసుకుని ఆ దిశలో పరిశోధనలు జరిపించాడు.ఆ సమయంలోనే హిందువులు,బౌద్ధులు స్వచ్చతకు, పవిత్రతకు గుర్తుగా భావించే స్వస్తిక్ ని తన పార్టీకి పెట్టుకున్నాడు.

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

ఆ సమయంలోనే మన హిమాలయాలలో గల శంభలనగరం గురించి తెలుసుకున్న హిట్లర్ ఆ నగరం యొక్క జాడను,అక్కడి విశేషాలను, అక్కడ వుపయోగించే టెక్నాలజీగురించి తెలుసుకోమని 1930 లో తనకి అత్యంత నమ్మకమైన కొంత మంది సైనికులను టిబెట్ కి పంపించాడు.ఆ బృందానికి ఇద్దరు అధికారులు నాయకత్వం వహించారు.

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

ఈ బృందం టిబెట్ లోని లామాలను కలిసి ఆ నగరంగురించి ఎన్నో విషయాలను అడిగి తెలుసుకుని ఆ నగరం జాడగురించి సంవత్సరం పాటు వెతికారు. వారికి ఎటువంటి ఆధారం దొరకక పోవటంతో తిరిగి
జర్మెనీకి వెళ్ళిపోయినట్టు కొన్ని ఆధారాలను బట్టి తెలుస్తోంది.ఆ బృందం తిరిగివచ్చేటప్పుడు కొంతమంది సాధువులను కలిసి తమకి ఎందువల్ల శంభలజాడ దొరకలేదని అడగగా ఆ నగరం కేవలం పుణ్యాత్ములకి,స్వచ్చమైన మనసు కలిగిన వారికి మాత్రమే కనిపిస్తుందని సమాధానం ఇచ్చారట. ఈ విషయాలను హిమ్లర్ హిట్లర్ కి వివరించాడట.

PC:youtube

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

శంభల గురించి హిట్లర్ ఎందుకు వెతికాడు ?

అంతగొప్ప నగరం జాడ దొరకకపోవటంతో హిట్లర్ చాలా నిరాశ చెందాదట. శంభల నగరం జాడతెలిస్తే అక్కడ వుండే వింతలు,విశేషాలతో పాటు వారు ఉపయోగించే టెక్నాలజి పై అవగాహన తెచ్చుకుని దానిద్వారా అత్యంత శక్తికలిగిన ఆయుధాలను తయారుచేయాలనే ఆలోచనతో హిట్లర్ వుండేవాడని,హిమ్లర్ ఆనాడు ఒక పత్రికావ్యాసంలో వెల్లడించాడట.హిట్లర్ ని సైతం ఆకర్షించిన అత్యద్భుత నగరం శంభల.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X