Search
  • Follow NativePlanet
Share
» »రాజస్థాన్ లోని ఈ ప్రదేశాలు కొత్తగా పెళ్లైన జంటలకు స్వర్గదామం వంటివి...

రాజస్థాన్ లోని ఈ ప్రదేశాలు కొత్తగా పెళ్లైన జంటలకు స్వర్గదామం వంటివి...

రాజస్థాన్ అన్న వెంటనే మనకు గుర్తుకు వచ్చేది ఇసుక తిన్నెలతో కూడిన ఎడారి. అక్కడి ఒంటె ప్రయాణం. మరికొంతగా ఆలోచిస్తే ఆకాలంలో నిర్మించిన ప్యాలెస్ లు. వాటి పై ఒంటెల బారులు. అయితే ఈ ఎడారి రాష్ట్రం కూడా అందాలకు నెలవు. ముఖ్యంగా వర్షాకాలం ఆరంభంలో అక్కడి కొన్ని ప్రాంతాలు కొత్త అందాలను సింగారించుకొంటాయి. ముఖ్యంగా మౌంట్ అబు లాంటి హిల్ స్టేషన్లతో పాటు పుష్కర్ వంటి ఆధ్యాత్మిక నగరాలు కూడా ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా మునెస్కో చేత గుర్తించబడి సంరక్షింబడే ప్రాంతాల్లో చేర్చబడిన రాజస్థాన్ లోని భరత్ పూర్ పక్షి సంరక్షణ కేంద్రంలో పక్షుల కుహ కుహలు ఈ వర్షాలకాలంలోనే ఎక్కువగా వినిపిస్తాయి. ఇటువంటి వాతావరణం కొత్తగా పెళ్లైన జంటలకు స్వర్గ దామంలా ఉంటుంది...మరి అటువంటి ప్రదేశాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

జైపూర్:

జైపూర్:

రాజస్థాన్ రాజధాని జైపూర్ కూడా ఈ వర్షాకాలంలో కొత్త అందాలను సంతరించుకొంటుంది. ఒక రకంగా పర్యాటకులు ఎక్కువ మంది సందర్శించే సమయం కూడా ఇదే. ఇక్కడ వర్షాల రాకను పురస్కరించుకొని తేజి అనే పండుగను జరుపుకొంటారు. వివాహితులు, మహిళలు సంప్రదాయ దుస్తులతో పార్వతీ దేవిని పూజిస్తారు. అంతేకాకుండా ఆ మాత విగ్రహంతో ఊరేగింపును కూడా నిర్వహిస్తారు. ఇక చుట్టు పక్కల ప్రాంతాలన్ని పచ్చదనం పరుచుకొని కంటికి ఇంపును కలుగ చేస్తాయి. జైపూర్ అవలోకనంఎలా చేరాలి?ఆకర్షణలువారాంతపు విహారాలువాతావరణంహోటళ్ళుఫొటోలుట్రావెల్ గైడ్

పుష్కర్ :

పుష్కర్ :

రాజస్థాన్ లోని ఈ ప్రాంతం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కూడా. ఇక్కడ వర్షాకాలంలో పుష్కర్ సరస్సు చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఉష్ణోగ్రత అంతగా ఉండని ఉదయం, సాయంత్రం సమయాల్లో ఒంటె పై పుష్కర్ సరస్సు చుట్టూ ప్రదక్షిణలు చేయడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. అందుల్లే ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి మిగిలిన రోజులతో పోలిస్తే వర్షాకాలంలో ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు.

జోద్పూర్:

జోద్పూర్:

మేహరంగర్ కోట జోద్పూర్ లో ఉంది. ఈ కోట పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది.ఇండియాలో అత్యంత ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి. ప్రతి సంవత్సరం అనేక మంది విదేశీ పర్యాటకులు ఈమేహెరంగర్ కోటను సందర్శిస్తుంటారు. ఇది ఒక అసాధారణమైన కోటి. ఈ కోటను సందర్శిస్తున్నంత సేపు ఉత్తేజంతో పాటు ఆశ్చర్యం కలుగుతుంది. ఇండియాలో ఉన్న అతి పెద్ద కోటల్లో ఇంది ఒకటి. విదేశీ పర్యాటలకుతో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ కోట చుట్టూ ఉన్న గోడ శత్రువల నుండి రక్షక కవచంగా ఉంది.

జైసల్మేర్:

జైసల్మేర్:

గరం నడిబొడ్డున వుండే జైసల్మేర్ కోట ను జైసల్మేర్ కు గర్వ కారణంగా భావిస్తారు. పసుపు రంగు ఇసుకరాయి తో నిర్మించిన ఈ కోట సూర్యాస్తమయం లో బంగారంలా మెరిసిపోవడంతో దీన్ని సోనార్ ఖిల్లా లేదా బంగారు కోట అని కూడా అంటారు. త్రికురా కొండ మీద 1156లో భాటి రాజపుత్ర రాజు జైసల్ దీన్ని నిర్మించాడు. జైసల్మేర్ కోటలో చాల అందమైన భవంతులు, దేవాలయాలు, సైనికులు, వ్యాపారుల నివాస భవనాల సముదాయాలు వున్నాయి. ఈ కోట చుట్టూ 30అడుగుల ఎత్తైన గోడ వుంది. 99 బురుజులు వున్న పెద్ద కోట ఇది.

బ్లూ సిటీ జోద్‌పూర్‌లో..

బ్లూ సిటీ జోద్‌పూర్‌లో..

బ్లూ సిటీ (నీలం రంగు నగరం)గా ప్రసిద్ధిగాంచిన జోద్‌పూర్‌కు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. రాజస్థాన్‌లోనే ఇది రెండో పెద్ద నగరం. ఇక్కడ ప్రజల వేషధారణలోనూ, జీవన విధానంలోనూ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. 125 మీటర్ల ఎత్తులో కొండపై నిర్మితమైన 'మెహరంగా' కోటలోకి ప్రవేశించాం.'లోహ్‌పాల్' ద్వారం నుంచి లోనికి ప్రవేశించినపుడు అక్కడ కొన్ని చేతి గుర్తులు మనకు కనిపిస్తాయి. అవి గతించిన 'సతి' దురాచారానికి సాక్ష్యాలని తెలిసినప్పుడు ఒళ్లు గగుర్పొడిచింది.

మౌంట్ అబు:

మౌంట్ అబు:

రాజస్థాన్ లోని ఒకే ఒక హిల్ స్టేషన్ మౌంట్ అబు. ఇక్కడ ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అయితే వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత శోభను చేకూరుస్తుంది. ఈ సమయంలో ఈ పర్వతం పై ఉన్న పచ్చదనం మన మనస్సుకు ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. నక్కీ సరస్సు దిల్వారా జైన్ దేవాలయాలు ఇక్కడ ప్రధాన పర్యాటక ప్రాంతాలు.

రనక్ పూర్ దేవాలయం

రనక్ పూర్ దేవాలయం

P.C: You Tube జైనులకు అత్యంత పవిత్రమైన ఐదు పుణ్యక్షేత్రాల్లో రనక్ పూర్ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయం కొన్ని ఉప దేవాలయాల సమూహం అని చెప్పపడం సబబుగా ఉంటుంది. ఇది ఉదయ్ పూర్ కు 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాలరాతితో నిర్మించిన ఈ దేవాలయం నిర్మాణశైలి విభిన్నంగా ఉంటుంది. రనక్ పూర్ దేవాలయ సముదాయంలో పార్శనాథ దేవాలయం, అంబా మాతా దేవాలయం, చౌముఖ దేవాలయం, సూర్య దేవాలయం తదితర ఆలయాలు ఎన్నో ఉన్నాయి.

దిల్వార దేవాలయం

దిల్వార దేవాలయం

P.C: You Tube రాజస్థాన్ లోని మౌంట్ అబు పర్వత శిఖరం పై ఈ దిల్వారా దేవాలయం ఉంది. జైనుల పుణ్యక్షేత్రమైన ఈ దేవాలయంలోని అద్భుత శిల్ప సంపద ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించినట్లు చెబుతారు.

ఆల్వార్

ఆల్వార్

P.C: You Tube మొఘల్ వాస్తు రీతిలో నిర్మించిన కోటలకు నిలయం ఆల్వార్. చరిత్రను తెలుసుకోవాలనుకొనే వారికి నిస్సందేహంగా జైపూర్ సమీపంలోని ఆల్వర్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడి సరస్సులో బోటు షికారు చేస్తూ శిథిలమై పోయిన కోట గోడలను చూస్తూ ఆ కాలంలోకి వెళ్లిపోవచ్చు. ఆల్వార్ లో ఎప్పుడూ ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ముఖ్య్ంగా ఫిబ్రవరిలో జరిగే అల్వార్ ఫెస్టివల్స్ ను చూడటానికే వివిధ దేశాల నుంచి ఎక్కవు మంది పర్యాటకులు ఇక్కడకు వస్తారు. ప్రధాన ఆకర్షణ...బాలా ఖిల్లా, భాన్ ఘర్ ఫోర్ట్, చాంద్ బారీ సిటీ ప్యాలెస్, జై పోల్, విజయ్ మందిర్ ప్యాలెస్ తదితరాలు

సాగర్ సరస్సు, అల్వార్ సిటీ ప్యాలెస్

సాగర్ సరస్సు, అల్వార్ సిటీ ప్యాలెస్

సాగర్ సరస్సు, అల్వార్ సిటీ ప్యాలెస్ వెనుక సాగర్ సరస్సు ఉంది. ఈ సరస్సు ను పవిత్ర స్నానపు ఘాట్ గా పరిగణిస్తారు. అంతే కాదు సంప్రదాయంగా పావురాలకు ఆహారం అందిస్తారు. ఈ సరస్సు గట్టుపై విగ్రహాలు, ఆలయాలు ఉండి మనోహరమైన వాతావరణాన్ని రేకెత్తిస్తున్నది. చిత్ర కృప : Carlton Browne

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X