Search
  • Follow NativePlanet
Share
» »వేసవి విడిదికి ఆహ్లాదపరిచే మన ఆంధ్రా ఊటిగా పిలువబడే ‘హార్సిలీ హిల్స్’

వేసవి విడిదికి ఆహ్లాదపరిచే మన ఆంధ్రా ఊటిగా పిలువబడే ‘హార్సిలీ హిల్స్’

మనకు ఎప్పుడైనా సెలవులు దొరికితే కుటుంబ సభ్యులతో ఎక్కడకైనా వెళ్ళి సంతోషంగా గడపాలనుకుంటాం. మరి అలాంటి ఆనందాలకు నెలవైన ప్రదేశాలు మన రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ప్రకృతి అందాలను వీక్షించాలనుకునేవారికి హార్సిలీ హిల్స్‌ చూడచక్కని ప్రదేశం. ఎటుచూసినా కొండలుకోనల సోయగాలు, పొడవాటి నీలగిరి జాతుల వృక్షాలు, ఆ మధ్యన తారాడే సెలయేటి జలపాతాలు.. ఇలా ప్రకృతి సమేత సౌందర్యం హార్సిలీహిల్స్‌ సొంతం. అంతేకాదు, ఇక్కడి వైవిద్యభరితమైన వాతావరణం పర్యాటకులకు ఓ సరికొత్త అనుభూతి.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ వేసవి విడిది చిత్తూరు జిల్లా దగ్గర ఉన్న మదనపల్లె హార్సిలీ హిల్స్. ఆంధ్రా ఊటీ అని దీనికి పేరు. ఏనుగు మల్లమ్మ కొండ అని కూడా అంటారు.

తూర్పు కనుమలలోని దక్షిణ భాగపు కొండలనే వరుసే హార్సిలీ హిల్స్ అంటారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా ఎత్తైన ప్రదేశం హార్సిలీ హిల్స్ లోనే ఉంది.

హార్సిలీ హిల్స్ కు వెళ్ళే కొండదారి ఎంతో అందంగా ఉంటుంది. రెండు వైపులా నీలగిరి (యూకలిప్టస్) వంటి అనేక జాతుల చెట్లతో కళ్ళకింపుగా ఉంటుంది. జింకలు, చిరుతపులుల వంటి వన్యమృగాలు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తుంటాయి.

హార్స్లే హిల్స్ మదనపల్లె పట్టణం సమీపంలో

హార్స్లే హిల్స్ మదనపల్లె పట్టణం సమీపంలో

హార్స్లే హిల్స్ ఆంధ్రప్రదేశ్ లో మదనపల్లె పట్టణం సమీపంలో ఉన్న చాలా ప్రజాదరణ పొందిన వేసవి హిల్ రిసార్ట్.ఈ రిసార్ట్ కు బెంగుళూర్, హైదరాబాద్ మరియు తిరుపతి వంటి దక్షిణ ప్రధాన నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. ఏప్రిల్ మరియు మే నెలల్లో వేడి పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సుందరమైన పర్వతం వేడి వాతావరణం నుంచి బాగా అవసరమైన ఉపశమనం ను కలిగిస్తుంది.

హార్సిలీ హిల్స్ బెంగళూరు నుండి 160 కి.మీ

హార్సిలీ హిల్స్ బెంగళూరు నుండి 160 కి.మీ

హార్సిలీ హిల్స్ బెంగళూరు నుండి 160 కి.మీ., తిరుపతి నుండి 140 కి.మీ. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1,314 మీ ఎత్తులో ఉంది. చలికాలంలో 3 డిగ్రీల సెంటీగ్రేడు నుండి మండు వేసవిలో 32 డిగ్రీల సెంటీ గ్రేడు వరకు ఉష్ణోగ్రత ఉంటుంది.

భవనం యొక్క చరిత్ర

భవనం యొక్క చరిత్ర

డబ్ల్యూ.హెచ్.హార్సిలీ అనే బ్రిటిషు అధికారి 1863 - 67 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో కలెక్టరుగా పనిచేసాడు. 1863 లో వేసవి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మించాడు. దీన్ని ఫారెస్టు బంగ్లా అంటారు. ఆ తరువాత కార్యాలయ భవనం నిర్మించారు. ఈ భవనాలు ఇప్పటికీ నివాస యోగ్యంగా ఉండి, వాడుకలో ఉన్నాయి. ఫారెస్టు బంగ్లాలోని నాలుగు గదుల్లో ఒక దానికి హార్సిలీ పేరు పెట్టారు. pc:Bipin Gupta

సందర్శించదగ్గ స్థలాలు

సందర్శించదగ్గ స్థలాలు

హార్సిలీ హిల్స్ కు వెళ్ళే కొండదారి ఎంతో అందంగా ఉంటుంది. రెండు వైపులా నీలగిరి (యూకలిప్టస్) వంటి అనేక జాతుల చెట్లతో కళ్ళకింపుగా ఉంటుంది. జింకలు, చిరుతపులుల వంటి వన్యమృగాలు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తుంటాయి.

pc:Colin Smith

ఇక్కడి ప్రత్యేకతలు

ఇక్కడి ప్రత్యేకతలు

ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సౌందర్యం ఇక్కడి ప్రత్యేకతలు.

pc:Andrew Curtis

ఇక్కడ చూడదగ్గ ఇతర ప్రదేశాలు

ఇక్కడ చూడదగ్గ ఇతర ప్రదేశాలు

ఇక్కడ చూడదగ్గ ఇతర ప్రదేశాలు 142 సంవత్సరాల వయసు కలిగిన యూకలిప్టస్ చెట్టు ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. అంతేకాకుండా జూ పార్క్, గవర్నర్ బంగ్లా, జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన రిషివ్యాలీ విద్యాలయము ఉంది.
pc:Adam Morse

హిల్ రిసార్ట్

హిల్ రిసార్ట్

హార్స్లే హిల్స్ ఆంధ్రప్రదేశ్ లో మదనపల్లె పట్టణం సమీపంలో ఉన్న చాలా ప్రజాదరణ పొందిన వేసవి హిల్ రిసార్ట్. pc:NAYASHA WIKI

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

ఈ రిసార్ట్ కు బెంగుళూర్, హైదరాబాద్ మరియు తిరుపతి వంటి దక్షిణ ప్రధాన నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. pc:Peter Trimming

సందర్శించవలసిన సమయం

సందర్శించవలసిన సమయం

ఏప్రిల్ మరియు మే నెలల్లో ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సుందరమైన పర్వతం వేడి వాతావరణం నుంచి బాగా అవసరమైన ఉపశమనంను కలిగిస్తుంది.

pc:Colin Smith

 ఏనుగు మల్లమ్మ కొండ

ఏనుగు మల్లమ్మ కొండ

ఈ కొండలను ఇంతకు ముందు ఏనుగు మల్లమ్మ కొండ అని పిలిచేవారు. ఆ ప్రదేశంలో మల్లమ్మ చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఏనుగులు సంరక్షించాయి. అందుకే ఏనుగు మల్లమ్మ కొండ అని పేరు వచ్చింది.

pc:suffering_socrates

మల్లమ్మ చరిత్ర

మల్లమ్మ చరిత్ర

మల్లమ్మ సమీపంలోని గిరిజన జాతులు మరియు రోగాల బారిన పడిన వ్యక్తుల కోసం శ్రద్ధ తీసుకునేది. ఆమె ఒక రోజు అకస్మాత్తుగా అదృశ్యమవడంతో గిరిజన ప్రజలు తన కోసం ఒక ఆలయం నిర్మించాలని నిర్ణయించారు.

pc:Ram Prasad

బ్రిటిష్ అధికారి,

బ్రిటిష్ అధికారి,

బ్రిటిష్ అధికారి, డబ్ల్యూడి హార్స్లే వేసవి విడిది కోసం వచ్చిన ఒక బ్రిటిష్ అధికారి డబ్ల్యూడి హార్స్లే ఈ హిల్ స్టేషన్ లో రెండు ఇళ్ళు, కరాచీ రూమ్ మరియు పాల బంగళా నిర్మించడం ద్వారా అయన పేరుతో పిలవబడుతుంది. pc:Bidgee

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X