Search
  • Follow NativePlanet
Share
» »అరుదైన ‘సబ్బురాయి’ తో నిర్మించిన దేవాలయాలు ఈ జంట నగరాల్లో

అరుదైన ‘సబ్బురాయి’ తో నిర్మించిన దేవాలయాలు ఈ జంట నగరాల్లో

హలేబీడు, బేలూరు ఆలయాల గురించి

భారత దేశంలోని ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక, ధార్మిక క్షేత్రాలుగానే కాకుండా భారతీయ వాస్తు, శిల్ప కళా రీతులకు నిదర్శనాలు. అందులోనూ ఉత్తర భారత దేశంతో పోలిస్తే దక్షిణ భారత దేశంలో ఆలయాల్లో శిల్ప సంపద చాలా బాగుంటుంది. అందువల్లే శిల్పకళ గురించి అధ్యయనం చేసేవారిలో ఎక్కువ శాతం ఈ ఆలయాలకే వస్తుంటారు. ఇందుకు కర్నాటక అతీతం కాదు. ఇక్కడ ఉన్నటువంటి అనేక దేవాలయాలు శిల్పకళ కణాచిగా పేరు తెచ్చుకొన్నాయి. అటువంటి దేవాలయాల్లో విభిన్న రాతిని వినియోగించి తయారైన అందమైన శిల్పాలను కలిగి ఇప్పటి తరానికి కూడా కంటికింపును కలిగిస్తున్న రెండు ప్రముఖ దేవాలయాల గురించిన కథనం మీ కోసం...

ఇక్కడికే వెళితే మోక్షం, అదృష్టం ఉంటే అనంత చోళ సంపద మీ చెంతకుఇక్కడికే వెళితే మోక్షం, అదృష్టం ఉంటే అనంత చోళ సంపద మీ చెంతకు

హాసన్ జిల్లాలో

హాసన్ జిల్లాలో

P.C: You Tube

కర్నాటకలోని హాసన్ జిల్లాలో చిన్న పట్టణం బేలూరు. ఇది జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన చెన్నకేశవాలయం ఉంది.

స్వర్ణ దేవాలయాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ?స్వర్ణ దేవాలయాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

గతంలో వేలాపురీ

గతంలో వేలాపురీ

P.C: You Tube

హొయ్సళ శైలి శిల్పకళకు ఈ దేవాలయం నిలువుటద్దం. బేలూరును గతంలో వేలా పురీ అని పిలిచేవారు. కాలక్రమంలో ఇది వేలూరుగా అటు పై బేలూరుగా మారిపోయింది.

యాగాచి నది ఒడ్డున

యాగాచి నది ఒడ్డున

P.C: You Tube

ఈ బేలూరు యాగచి నది ఒడ్డున ఉంది. ఇది ఒకప్పుడు హోయ్సళ రాజధాని.అటు పై రాజధానిని హళేబీడుకు మార్చారు. ఈ హళేబీడు బేలూరుకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

బేలూరు హళేబీడు

బేలూరు హళేబీడు

P.C: You Tube

ఈ రెండు నగరాలను కర్నాటక జంటనగరాలు అంటారు. ఇవి రెండు ప్రధాన పర్యాటక ప్రాంతాలు. హోయ్సళ రాజులు ఈ రెండు ప్రాంతల్లోనూ అద్భుత శిల్పాలతో కూడిన ఆలయాలను ఈ రెండు ప్రాంతాల్లో నిర్మించారు.

బేలూరులో వైష్ణవాలయం

బేలూరులో వైష్ణవాలయం

P.C: You Tube

బేలూరులో వైష్ణవాలయాన్ని నిర్మిస్తే హళేబీడులో శైవాలయాన్ని నిర్మించారు. మొదట బేలూరులోని చెన్నకేశవాలయం గురించి చెప్పుకొందాం. దీనిని హెయ్సళ రాజు విష్ణువర్థనుడు నిర్మించాడని చెబుతారు.

అనేక కథనాలు

అనేక కథనాలు

P.C: You Tube

క్రీస్తుశకం 1117లో పశ్చిమ చాళుక్యుల పై విజయానికి సూచికగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. చోళుల పై తాలకాడ్ యుద్ధ విజయానికి సూచికగా ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.

ఆలయాల సముదాయం

ఆలయాల సముదాయం

P.C: You Tube

అదే విధంగా వైష్ణవ మత ప్రాశస్త్యం కోసం జగద్గురు రామానుజాచార్యుల సూచన మేరకు ఈ ఆలయాన్ని విష్ణువర్థన రాజు నిర్మింపజేశాడని చెబుతారు. ఈ చెన్నకేశవాలయన్ని ఆలయాల సముదాయంగా చెప్పవచ్చు. ప్రధానాలయం కేశవాలయం.

ద్రవిడ శైలి

ద్రవిడ శైలి

P.C: You Tube

ఈ కేశవాలయానికి చుట్టూ రంగనాయకి, కప్పే చెన్నగరాయ ఆలయాలను మనం చూడవచ్చు. ఈ ఆలయ నిర్మాణంలో ద్రవిడ శైలి మనకు కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం కోసం సబ్సురాతిని వినియోగించారు.

ఆకుపచ్చ రంగులో

ఆకుపచ్చ రంగులో

P.C: You Tube

ఈ శిల తేలికగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అంతే కాకుండా అతి మెత్తగా ఉండటం వల్ల కావలసిన రీతిలో మలచడానికి అనువుగా ఉంటుంది. అందుకు ఈ దేవాలయంలో శిల్పాలు సూక్ష్మంగా ఉండి అద్భుత సౌదర్యంతో అలరారుతూ ఉన్నాయి.

నర్తకిల భంగిమలు

నర్తకిల భంగిమలు

P.C: You Tube

ఈ దేవాలయం గోడల పై నర్తకిల వివిధ భంగిమలు మనలను మంత్రముగ్ధులను చేస్తాయి. ముఖ్యంగా ఒక చేతిలో అద్దం పట్టుకొని వయ్యారంగా చూసుకొంటున్న దర్పణ సుందరి విగ్రహంతో పాటు భస్మ మోహిని తదితరాలు మనలను మంత్రముగ్దులను చేస్తాయి.

పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తాల లో సందర్శించవలసిన ప్రదేశాలు !!పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తాల లో సందర్శించవలసిన ప్రదేశాలు !!

నలభై రెండు అడుగుల

నలభై రెండు అడుగుల

P.C: You Tube

అదే విధంగా ఆళయం బయట నలభై రెండు అడుగుల ధ్వజస్తంభం ఉంటుంది. ఈ స్తంభం ఒక వైపున భూమిని తాకి ఉండదు. అంటే కేవలం మూడు వైపుల మాత్రమే నేలను తాకి ఉంటుందని చెప్పవచ్చు.

హోయసలేశ్వరాలయం

హోయసలేశ్వరాలయం

P.C: You Tube

ఇక హలేబీడులో హోయసలేశ్వరాలయం ఉంది. ఇక్కడ శివుడు ప్రధాన దైవం. హలేబీడు అనగా శిథిల నగరం లేదా పాత నివాసం అని అర్థం. పూర్వం దీనిని ద్వార సముద్ర లేదా దొర సముద్రం అని పిలిచేవారు.

సముద్ర మార్గానికి ద్వారం

సముద్ర మార్గానికి ద్వారం

P.C: You Tube

అంటే సముద్ర మార్గానికి ద్వారం వంటిదని అర్థం. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఈ హలేబీడు మాలిక్ కాపర్ దాడులను ఎదుర్కొనాల్సి వచ్చింది. అటు పై అనేక శిథిలాలు మిగిలిపోయాయి. అందువల్లే దీనికి హలేబీడు అన్న పేరు స్థిరపడి పోయింది.

రాణి శాంతల దేవి పేరు మీద ఒకటి

రాణి శాంతల దేవి పేరు మీద ఒకటి

P.C: You Tube

ఇక్కడ ప్రధానాలయం హోయసలేశ్వరాలయం. ఇది ద్వికూటాలయం. అంటే ఇందులో హోయసల పేరు మీద ఒకటి. రాణి శాంతల దేవి పేరుమీద మరొకటి అంటే మొత్తం రెండు శివలింగాలను ప్రతిష్టించారు.

రెండు పెద్ద నందులు

రెండు పెద్ద నందులు

P.C: You Tube

ఈ శివలింగాలకు వరుసగా హోయసలేశ్వర, శాంతలేశ్వర అని పేరు. ఈ రెండు శివలింగాలకు ఎదురుగా రెండు పెద్ద నందులు ఉంటాయి. ఇవి రెండు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. ఇవి దేశంలోని అతి పెద్ద నందుల్లో వరుసగా ఐదు, ఆరుస్థానాల్లో ఉండటం గమనార్హం.

హిందూ పురాణాలు

హిందూ పురాణాలు

P.C: You Tube

ఆలయం లోపల పై కప్పు పై హిందూ పురాణలను స్ఫురింపజేసే శిల్పాలు, కళాక`తులు, హోయ్సళ శిల్ప శైలికి నిలువుటద్దాలుగా నిలుస్తాయి. ఈ దేవాలయం నిర్మాణానికి కూడా సబ్బు రాతిని వినియోగించడం గమనార్హం.

నాలుగు ద్వారాలు

నాలుగు ద్వారాలు

P.C: You Tube

ఈ ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయి. ఉత్తర ద్వారం వద్ద ఉన్న ద్వారపాలక విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.

గోమఠేశ్వరుడి విగ్రహం

గోమఠేశ్వరుడి విగ్రహం

P.C: You Tube

ఆలయం వెలుపల ఉద్యానవనంలో గోమఠేశ్వరుడి విగ్రహం ఉంది. ఈ దేవాలయ సముదాయంలో పురావస్తుశాఖ వారి మ్యూజియం, దగ్గర్లోనే ఓ పెద్ద సరస్స ఉంది. ఈ ఆలయంలో శివరాత్రి రోజున పెద్ద ఎత్తున పూజలు జరుగుతూ ఉంటాయి.

రాజధానిగా

రాజధానిగా

P.C: You Tube

ఈ హలేబీడులోని హోయసలేశ్వర దేవాలయం క్రీస్తుశకం 12 నుంచి 13 శతాబ్దం మధ్య కాలంలో హోయ్సళ రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇదే సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించబడింది.

విష్ణువర్థనుడు

విష్ణువర్థనుడు

P.C: You Tube

ఈ ఆలయాన్ని విష్ణువర్థనుడు నిర్మించారని చెబుతారు. మరికొన్ని ఆధారాలను అనుసరించి ఈ దేవాలయం నిర్మాణంలో ఆయన మంత్రి కేతనమల్లు, కేసరశెట్టి అనే శివభక్తుడు ఎంతో సహకారం అందించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X