Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ To శ్రీశైలం వెళ్లే మార్గంలో ఈ అద్భుతమైన ప్రదేశాలు చూశారా?

హైదరాబాద్ To శ్రీశైలం వెళ్లే మార్గంలో ఈ అద్భుతమైన ప్రదేశాలు చూశారా?

పవిత్రమైన గంగా నదిలో వెయ్యి సార్లు మునిగినా లేదా కాశీ క్షేత్రం వంద సార్లు సందర్శించినా లభించేంత పుణ్యం శ్రీశైల క్షేత్రాన్ని దర్శిస్తే అభిస్తుందని ధార్మికుల విశ్వాసం. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులు కొలు

పవిత్రమైన గంగా నదిలో వెయ్యి సార్లు మునిగినా లేదా కాశీ క్షేత్రం వంద సార్లు సందర్శించినా లభించేంత పుణ్యం శ్రీశైల క్షేత్రాన్ని దర్శిస్తే అభిస్తుందని ధార్మికుల విశ్వాసం. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులు కొలువైన ఈ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలో ఉంది. భూమిపైన కైలాసంగా వెలసిన ఈ శ్రీశైలం..దేశంలోనే పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది.

శ్రీశైలం కృష్ణా నది ఒడ్డున ఉన్నది. ఇది హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ పట్టణం హైదరాబాద్ నుండి 212 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి సంవత్సరం లక్షల్లో భక్తులు, పర్యాటకులు శ్రీశైలం సందర్శిస్తుంటారు. నగరంలో ప్రసిద్ది చెందిన ఆలయాలు మరియు పుణ్యక్షేత్రాలకు యాత్రికులు మాత్రమే కాకుండాపర్యాటకులు కూడా వస్తుంటారు. వారాంతాల్లో పర్యాటకులకు ఫర్ఫెక్ట్ డెస్టినేషన్ . ట్రెక్కింగ్ మరియు క్యాంపింగ్ కు అనువైన ప్రదేశం.

ఆదిశక్తి కొలువుదీరిన 18 శక్తి పీఠాల్లో భ్రమరాంబ వెలసిన ప్రాంతంగానూ శ్రీశైలానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే, శ్రీశైలం 'భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి' క్షేత్రంగా పేరొందింది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి ఈ క్షేత్రానికి ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ ప్రదేశాన్ని చూడటానికి శివ భక్తులు మాత్రమే కాదు, టూరిస్ట్ లు కూడా ఎక్కువగా సందర్శిస్తుంటారు.

ఇక్ష్వాకులు, పల్లవులు, విస్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, శివాజీ లాంటి ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పవిత్రధామం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ఠ కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు,అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు.

శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ లో నల్లమల కొండలలో ఉన్న ఒక గొప్ప పుణ్యక్షేత్రం. దేశవ్యాప్తంగా ఇక్కడకు లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తారు. ఈ పట్టణంలో యాత్రీకులకు మరియు పర్యాటకులకు చూడగలిగే అనేక ఆలయాలు మరియు తీర్థాలు వున్నాయి.

కడ్తల్

కడ్తల్

హైదరాబాద్ నుండి 53 కిలోమీటర్ల అటు శ్రీశైలంకు 164 కిలోమీటర్ల దూరంలో కడ్తల్ ఉన్నది. హైదరాబాద్ నుండి శ్రీశైలి చేరుకోవాలంటే కడ్తల్ మీదుగా ప్రయాణం సాగించాలి. ప్రయాణంలో విశ్రాంతి తీసుకోవడానికి ఫర్ఫెక్ట్ ప్రదేశం. ఇక్కడ చుట్టూ పక్కల చూడదగ్గ ప్రదేశాలు పెద్దగా లేకపోయినా మైసగండి మైసమ్మ దేవాలయం ప్రసిద్ది చెంది. కడ్తల్ చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో ఇది చూడదగినటువంటి అద్భుతమైన ప్రదేశం మహేశ్వర పిరమిడ్.

PC-Madhu0216

శ్రీశైలం:

శ్రీశైలం:

హైదరాబాద్ నుండి 213కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం ఉంది. ఆంధ్రప్రదేశ్కే వన్నె తెచ్చే అందాలతో ఆధ్యాత్మిక సందర్శకులును పర్యాటకులను ఆహ్వానిస్తున్న శ్రీశైలం సంస్క్రుతి మరియు ప్రకుతి సహజ సౌందర్యంతో అలరారుతోంది. శ్రీ మల్లికార్జున బ్రమరాంబిక దేవాలయంతో పాటు ఇక్కడ చూడవల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి.

PC-Amit Chattopadhyay

మల్లికార్జున జోతిర్లింగ:

మల్లికార్జున జోతిర్లింగ:

హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది.

PC: Nishant Jajoo

సాక్షి గణపతి ఆలయం

సాక్షి గణపతి ఆలయం

శ్రీశైలానికి 3 కిమీల దూరంలో ఉన్న సాక్షి గణపతి ఆలయం కూడా తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం. హైదరాబాద్‌‌కు 214 కి.మీ, విజయవాడకు 263 కి.మీల, కర్నూలుకు 180 కి.మీల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడికి బస్సులు అందుబాటులో ఉన్నాయి.

నల్లమల హిల్స్ :

నల్లమల హిల్స్ :

నల్లమల అడువుల్లో కొలువైన శ్రీశైలం కేలం పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, పర్యాటక ప్రదేశంగా కూడా ఆకర్షిస్తోంది. పచ్చని పర్వతాలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతంలో పర్యటన భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడి శ్రీశైలం డ్యామ్ అందాలు వర్షాకాలంలో మరింత అందంగా..ఆహ్లాదంగా ఉంటాయి. శ్రీశైలంకు చుట్టుపక్కల నల్లమల హిల్స్ పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్, క్యాంపింగ్, హైకింగ్ వంటి యాక్టివిటీస్ లో పాల్గొనవచ్చు. వీకెండ్ లో విశ్రాంతి తీసుకోవడానికి అనువసన ప్రదేశం. అద్భుతమైన పచ్చని వాతారణంతో కొండల మద్య దాగున్నాయి.

శ్రీశైలం టైగర్ రిజర్వాయర్ :

శ్రీశైలం టైగర్ రిజర్వాయర్ :

శ్రీశైలం చుట్టుపక్కల మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ కల సంరక్షిత అడవిని తప్పక చూడాలి. ఇది ఇండియా లోనే అతి పెద్ద టైగర్ రిజర్వు గా పేరొందినది. సుమారు 3568 చ. కి. మీ. ల విస్తీర్ణం లో వ్యాపించి వుంది. ఏ జంతువు కనబడక పోయినా, ఈ ప్రదేశం లో తిరిగి రావటమే ఒక సాహసంగా భావించాలి. శాంచురి లోపల ఎన్నో రకాల వృక్షాలు, వెదురు మొక్కలు వంటివి చూడవచ్చు. శాంక్చురి లోపల వివిధ రకాల జంతువులను అంటే పులులు, చిరుతలు, హయనాలు, అడవి పిల్లులు, ఎలుగులు, లేళ్ళు , దుప్పులు వంటివి చూడవచ్చు. శ్రీశైలం డాం కు సమీపం లో కల సాన్క్చురి భాగం లో మీరు నీటి మడుగులలో వివిధ రకాల మొసళ్ళ ని కూడా చూడవచ్చు.

PC- Amit Chattopadhyay

అక్క మహాదేవి గుహలు

అక్క మహాదేవి గుహలు

నల్లమలై కొండల శ్రేణులలో ఉన్నాయి. ఈ గుహల చరిత్రలకు ఆధారాలున్నాయి. నిజానికి ఈ గుహలు పట్టణ చరిత్రలో ఒక కీలకమైన పాత్ర పోషించింది. ప్రసిద్ధ 12 వ శతాబ్దపు తత్వవేత్త మరియు గీత రచయిత అయిన అక్క మహాదేవి వల్ల ఈ గుహలకు "అక్క మహాదేవి గుహలు" అని పేరు వచ్చింది. ఈమె గుహ లోపల లోతైన ఉనికిలో ఒక శివలింగానికి భక్తితో మనస్పూర్తిగా తపస్సు చేసి ప్రార్థనలు చేసింది. వంపు తిరిగిన గుహలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. ప్రధాన గుహ సహజంగా ఏర్పడిన రాతి వంపు కలిగినది. 150 అడుగుల పొడవైన ఈ గుహను మీరు శ్రీశైలంకు వచ్చినప్పుడు తప్పక చూడాల్సిన గుహ.

PC-YOGINI

మల్లెల తీర్థం ఫాల్స్

మల్లెల తీర్థం ఫాల్స్

మల్లెల తీర్థంలో ఒక జలపాతం కలదు. ఈ ప్రాముఖ్యతగల్గిన ధార్మిక ప్రదేశాన్ని ప్రతి ఏటా వేలాది మంది భక్తులు సందర్శిస్తారు. జలపాతాలు ఒక దట్టమైన అడవి మధ్యలో ఉన్నాయి కానీ రోడ్ మార్గం ద్వారా సులభంగా చేరవచ్చు. ఈ పవిత్ర జలాల్లో స్నానం చేస్తే పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. ఎందుకంటే జలపాతాలు హిందువులకు ప్రాధాన్యత కలిగినది మరియు మోక్షానికి మార్గంగా వున్నాయి. ఇది చర్మం మరియు కండరాల కీళ్లకు సంబంధించిన అనేక వ్యాధులను నయం చేసే గుణం కలిగివుంటుంది. ఈ జలపాతం చేరుకోవాలంటే మీరు దాదాపు 250 మెట్లు లోయలోకి దిగాలి. ఇక్కడ జలపాతం దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. జలపాతం యొక్క అందమైన దృశ్యం

శ్రీశైలం డ్యాం:

శ్రీశైలం డ్యాం:

శ్రీశైలం డ్యాం ను కృష్ణా నదిపై నిర్మించారు. వ్యూహాత్మకంగా నల్లమల కొండలలో లోపల లోతైన గార్జ్ పైన నిర్మాణం జరిగింది. డ్యామ్ భారతదేశంలో గల అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులలో రెండవది. నేడు ఈ ఆనకట్ట (డ్యాం) 2,200 చదరపు కిమీ విస్తీర్ణం గల నీటిని అందిస్తుంది. వరదల సమయంలో శ్రీశైలం జలాశయం త్వరగా నిండిపోతుంది. మిగిలిన వరద నీటిని తక్కువ ఎత్తులో ఉన్న నాగార్జునసాగర్ ఆనకట్ట ద్వారా ప్రవహించేటట్లు చేస్తారు. ఇక్కడ డ్యామ్ ను చూడటానికి వచ్చిన యాత్రికులు పైనుండి సుందర దృశ్యం చూసి ఆనందిస్తారు.

శ్రీశైలం యొక్క అభయారణ్యం:

శ్రీశైలం యొక్క అభయారణ్యం:

శ్రీశైలం అభయారణ్యం భారతదేశంలోనే అతి పెద్ద పులుల అభయారణ్యంగా ఉంది. అభయారణ్యం లోపలి ప్రాంతంలో పూర్తిగా అనేక వెదురు మొక్కలు ఉన్నాయి. ఇక్కడ ఆకురాల్చు అడవులతో కప్పబడి ఉంటుంది. అభయారణ్యం లోపల పులులు, చిరుతలు, హైనాలు, అడవి పిల్లులు, ఎలుగు బంట్లు, జింకలు మరియు పాంగోలిస్ వంటి అడవి జంతువులు వున్నాయి. శ్రీశైలం డ్యాం కు చాలా దగ్గరగా ఉన్న ఆనకట్ట జలాలు మొసళ్ళకు కేంద్రంగా ఉంది.

పాతాళ గంగ :

పాతాళ గంగ :

శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలము చాలా ఎత్తులో ఉన్నది, నది మాత్రము క్రింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలము నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే సార్థక నామధేయముతో వ్యవహరిస్తారు. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. అయితే అందరూ నీటి క్రిందగల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు.

PC: wikimedia.org

శ్రీశైలం సందర్శించే సమయం :

శ్రీశైలం సందర్శించే సమయం :

వేసవి కాలంలో శ్రీశైలం మరింత వేడిగా ఉంటుంది. కాబట్టి, అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకూ ఈ ఆధ్యాత్మిక ప్రదేశం సందర్శించడం మంచిది. ఈ సమయంలో అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదించడంతో పాటు, దేవుని దర్శనం చేసుకోవచ్చు.

PC-Srinivas Chidumalla

శ్రీశైలంకు ఎలా చేరుకోవాలి?

శ్రీశైలంకు ఎలా చేరుకోవాలి?

హైదరాబాదు నుండి శ్రీశైలం 212 కి.మీ. దూరంలో ఉంది.ఈ రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోతుంది. అటవీశాఖ వారు రాత్రి వేళల్లో ఈ ప్రాంతం గుండా ప్రయాణించటానికి అనుమతించరు కనుక పగటి వేళ మాత్రమే ప్రయాణించాలి. గుంటూరు నుండి శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంది. గుంటూరు నుండి నరసరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం దోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది. అక్కడి నుండి శ్రీశైలంకు కొండ మార్గంలో ప్రయాణం (53 కి.మీ.) కొండల మధ్యగా చాలా బాగుంటుంది.

విమాన మార్గం ద్వారా :

విమాన మార్గం ద్వారా :

శ్రీశైలంలో విమానాశ్రయం లేదు కానీ సమీప విమానాశ్రయం హైదరాబాద్ వద్ద వుంది. శ్రీశైలం పట్టణం నుండి ఇది 201 కి.మీ ల దూరంలో ఉంది. హైదరాబాద్ విమానాశ్రయం ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన నగరాలతో మరియు దేశంలోని ప్రముఖ నగరాలతో మరియు పట్టణాలతో బాగా అనుసంధానించబడింది.

రైలు మార్గం ద్వారా :

రైలు మార్గం ద్వారా :

శ్రీశైలంలో ఏ విధమైన రైల్వేస్టేషన్ లేదు. సమీప రైల్వేస్టేషన్ శ్రీశైలం నుండి 85 కి.మీ ల దూరంలో వున్న మార్కాపూర్ వద్ద ఉంది.మరొకొటి కుంబం రైల్వేష్టేషన్ . ఇక్కడ నుండి క్యాబ్ లేదా బస్సు ద్వారా శ్రీశైలం చేరుకవోచ్చు. కుంబం రైల్వేస్టేషన్ నుండి శ్రీశైలం 102కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవి ఆంధ్రప్రదేశ్ ఇతర రైల్వే జంక్షన్లకు బాగా అనుసంధానించబడి ఉంది. అలాగే ఇండియాలోనే ఏవైపు నుండి అయినా గుంటూరు మీదుగా నరసరావు పేట వరకు రైలు సౌకర్యములు ఉన్నాయి.

రోడ్డు మార్గం ద్వారా :

రోడ్డు మార్గం ద్వారా :

శ్రీశైలం రోడ్లు కొన్ని ప్రధాన పట్టణాలకు మరియు నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం నుండి ఇతర ప్రాంతాలకు అనేక బస్సులు నడపబడుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X