Search
  • Follow NativePlanet
Share
» »శ్రావణమాసంలో నందిలేని శివాలయం, జడఉన్న శివలింగం దర్శిస్తే...

శ్రావణమాసంలో నందిలేని శివాలయం, జడఉన్న శివలింగం దర్శిస్తే...

శ్రావణ మాసం సందర్శించాల్సిన శివాలయాల గురించి కథనం.

శ్రావణమాసం హిందువులకు పరమ పవిత్రమైన నెల. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో శైవులు పరమ నిష్టగా ఉంటారు. అందువల్లే శైవాలయాలు ఈ శ్రావణ మాసంలో కిటకిటలాడుతూ ఉంటాయి. ఈ నెలలో శివారాధన చేస్తే కుటుంబ సమస్యలన్నీ తీరుతాయని దేవుడు మంచిగా చూస్తాడని భక్తులు నమ్ముతారు. ఈ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన శైవలాలకు కూడా భక్తుల తాకిడి పెరిగింది.

ఈ నేపథ్యంలో రెండు విశిష్టమైన శివాలయాలకు సంబంధించిన వివరాలు మీ కోసం....శ్రావణమాసం హిందువులకు పరమ పవిత్రమైన నెల. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో శైవులు పరమ నిష్టగా ఉంటారు. అందువల్లే శైవాలయాలు ఈ శ్రావణ మాసంలో కిటకిటలాడుతూ ఉంటాయి.

ఈ నెలలో శివారాధన చేస్తే కుటుంబ సమస్యలన్నీ తీరుతాయని దేవుడు మంచిగా చూస్తాడని భక్తులు నమ్ముతారు. ఈ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన శైవలాలకు కూడా భక్తుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో రెండు విశిష్టమైన శివాలయాలకు సంబంధించిన వివరాలు మీ కోసం....

మరెక్కడా లేదు

మరెక్కడా లేదు

P.C: You Tube

శివాలయం అన్న వెంటనే మనకు సాధారణంగా ఓ శివలింగం దానికి ఎదురుగా నంది ఉన్న ఓ ధార్మిక క్షేత్రం గుర్తుకు వస్తుంది. అయితే ఇందుకు పూర్తిగా విరుద్ధమైన పుణ్యక్షేత్రం ఉంది. ఇటువంటి పుణ్యక్షేత్రం భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇది ఒక్కటే అని చెప్పవచ్చు. అదే సిద్ధేశ్వర దేవాలయం.

హేమావతి

హేమావతి

P.C: You Tube

అనంతపురం జిల్లా అమరాపురం లోని హేమావతి గ్రామంలో ఈ దేవాలయం ఉంది. ఇక్కడ శివుడు లింగ రూపంలో కాకుండా మానవుడి రూపంలో దర్శనమివ్వడం విశేషం. అంతే కాకుండా ఆయన ఉగ్రరూపంగా ఉంటాడు. ఆయన శిరస్సు పై అటు శివుడితో పాటు చంద్రుడు కూడా ఉండటం గమనార్హం.

నందిని తోడుగా పంపిస్తాడు

నందిని తోడుగా పంపిస్తాడు

P.C: You Tube

ముఖ్యంగా ఇక్కడ శివుడికి ఎదురుగా నంది ఉండడు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రాచూర్యంలో ఉంది. దీనిని అనుసరించి దక్షయాగం చేసే సమయంలో ఆహ్వానం లేకపోయినా సతీదేవి ఆ యాగానికి వెలుతుంది. అప్పుడు పరమశివుడు సతీదేవి వెంట నందిని తోడుగా పంపిస్తాడు.

అందుకే ఉండదు.

అందుకే ఉండదు.

P.C: You Tube

అయితే అక్కడ జరిగిన అవమానానికి సతీదేవి తన ప్రాణాలను కోల్పోతుంది. భార్య మరణ వార్త తెలుసుకొన్న శివుడు ఉగ్రతాండవం చేస్తాడు. ఆ ఉగ్రశివుడి రూపమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక సతి వెంట నంది వెళ్లినందు వల్ల ఈ శివాలయంలో నంది విగ్రహం మనకు కనిపించదు. ఈ దేవాలయాన్ని శివుడి పరమ భక్తుడైన నాళంబరాజు కట్టించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.

ఝటాజూటం

ఝటాజూటం

P.C: You Tube

పరమశివుడుకి ఝటాజూటం ఉండటం మనకు తెలిసిందే. అయితే లింగ రూపంలో ఉన్న సమయంలో ఆ పరమేశ్వరుడికి ఝటాజూటాన్ని ఊహించగలా? అయితే ఒకే ఒక చోట మాత్రం శివలింగానికి కూడా ఝటాజూటాన్ని చూడగలం. అదే తూర్పుగోదావరి జిల్లాలోని పలివెలలో ఉంది.

ఒకే పానుపట్ట పై

ఒకే పానుపట్ట పై

P.C: You Tube

పరమ భక్తుడైన ఓ వేశ్యాలోలుడైన ఓ పూజారిని చావు నుంచి రక్షించడం కోసం ఈ శివలింగం పై ఏకంగా శివుడు ఝటాజూటాన్ని మొలిపించాడని చెబుతారు. అంతేకాకుండా ఒకే పానుపట్టం పై పార్వతీ పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. ప్రపంచంలో ఒకే పానుపట్టం పై శివుడు పార్వతి కొలువై ఉండటం ఇక్కడ మాత్రమే చూడగలం. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని ఉమా కొప్పు లింగేశ్వరస్వామి అని పిలుస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X