Search
  • Follow NativePlanet
Share
» »మీకు క్షుద్రపూజలు వచ్చా? అయితే ఈ గ్రామంలో ఉండటానికి అర్హులే

మీకు క్షుద్రపూజలు వచ్చా? అయితే ఈ గ్రామంలో ఉండటానికి అర్హులే

దేవుడు, దెయ్యం వీటి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. దేవుడిని ఆరాధించేవారిని పండితులు, పూజారులు అని పిలిస్తే దెయ్యాన్ని పూజించేవారిని క్షుద్ర మాంత్రికులు అని పిలుస్తారు. అయితే దేవుడితో పాటు దెయ్యాన్ని ప్రత్యక్షంగా చూసినవారు ఎవరూ లేదు. ఈ సాంకేతిక యుగంలో కూడా ఇప్పటికీ చాలా మంది క్షుద్రపూజలను నమ్ముతూ ఉన్నారు. ఇలాంటి క్షుద్ర పూజలు చేసేవారికే ప్రత్యేకంగా భారత దేశంలో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామానికి సంబంధిచిన పూర్తి వివరాలు మీ కోసం....

మయాంగ్

మయాంగ్

P.C: You Tube

అస్సాంలోని ఒక చిన్న పల్లెటూరు మయాంగ్. ఇది ప్రముఖ పర్యాటక ప్రాంతం. అంతేకాకుండా చేతబడి, మాయాలు, మంత్రాలకు కూడా చాలా ప్రాముఖ్యం చెందినది.

మయాంగ్

మయాంగ్

P.C: You Tube

దీనిని భారతదేశ చేతబడి రాజధాని అని అంటారు. ఈ ప్రాంతానికి మయాంగ్ అన్న పేరు రావడం వెనుక అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మౌచోంగ్ వంశానికి చెందిన వారు ఇక్కడ ఎక్కువ మంది నివశించడం వల్లే ఆ పేరు వచ్చినట్లు చెబుతారు.

మయాంగ్

మయాంగ్

P.C: You Tube

మరికొంతమంది మా ఎర్ ఆంగో అనే దేవత పేరుమీద ఈ ప్రాంతానికి మయాంగ్ అన్న పేరు వచ్చినట్లు చెబుతారు. మయాంగ్ ఫూబిచోరా అన్న పేరుమీద ఇక్కడ ప్రతి ఏడాది ఉత్సవాలు జరుగుతాయి.

మయాంగ్

మయాంగ్

P.C: You Tube

ఈ ఉత్సవం ఎప్పటి నుంచి ప్రారంభమయ్యిందనడానికి సరైన సమాధానం మాత్రం లేదు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కథనాన్ని చెబుతారు. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటిలో చేతబడి తదితర క్షుద్రపూజలు చేసేవారు ఒక్కరైనా ఉంటారు.

మయాంగ్

మయాంగ్

P.C: You Tube

ఇంతమంది మాంత్రికులు ఇక్కడ ఉండటానికి గల కారణాలు మాత్రం ఎవరూ చెప్పడం లేదు. వంశపార్యంపర్యంగా ఇక్కడ క్షుద్రపూజలు చేసే విద్యను నేర్చుకొంటూ ఉన్నారు.

మయాంగ్

మయాంగ్

P.C: You Tube

ఈ గ్రామంలోని ప్రతి ఇంటి ముందు జంతువుల, పక్షుల కళేబరాలను మనం చూడవచ్చు. ఇలా ఎన్ని కలేబరాలు ఉంటే అంత గొప్ప మాంత్రికుడని ఆ గ్రామంలో పేరు. అయితే ఇందుకు గల కారణాలను మాత్రం ఎవరూ చెప్పరు.

మయాంగ్

మయాంగ్

P.C: You Tube

ఇక గుహటి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అభయారణ్యాన్ని ఆనుకొని ఈ మయాంగ్ గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఒక విభిన్న మ్యూజియం ఉంది. ఇందులో క్షుద్రపూజలకు వినియోగించే అనేక వస్తువులను ఇక్కడ సేకరించి ప్రదర్శనకు ఉంచారు.

మయాంగ్

మయాంగ్

P.C: You Tube

పర్యాటకులు ఎవరైనా ఈ మ్యూజియంను సందర్శించవచ్చు. ఈ గ్రామంలో దాదాపు 100 మంది క్షుద్ర పూజలు చేసే మాంత్రికులు ఉన్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది విద్యావంతులు కావడం, ఈ క్షుద్ర పూజల పై నమ్మకం తగ్గుతుండటం వల్ల వీరికి రోజురోజుకు బేరాలు తగ్గిపోతున్నాయి.

మయాంగ్

మయాంగ్

P.C: You Tube

దీంతో వీరిలో చాలా మంది కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే తమ ముందు తరాల వారకు వీరు ఆ క్షుద్రపూజల విద్యను ఇప్పటికీ నేర్పిస్తూనే ఉన్నారు. ఇలా క్షుద్ర పూజలను నేర్చుకొనేవారిని బెజ్ లేదా ఒజా అని పిలుస్తారు. సాధారణంగా వీరు ఒంటరిగానే పూజలు చేస్తారు.

మయాంగ్

మయాంగ్

P.C: You Tube

వీరికి సహాయకులుగా ఆత్మలు వస్తాయని చెబుతారు. ఇందులో కొంతమంది చేతబడి చేసేవారే కాకుండా ప్రజలు అనారోగ్యం పాలయినప్పుడు తమకు వచ్చిన విద్య ద్వారా వారి వ్యాధులను తగ్గించడానికి కూడా ప్రయత్నిస్తారు.

మయాంగ్

మయాంగ్

P.C: You Tube

ముఖ్యంగా వెన్నునొప్పితో బాధపడేవారు ఎక్కువగా ఈ గ్రామానికి వస్తుంటారు. అటువంటి వారి వీపు పై కంచుతో చేసిన ప్లేటును ఉంచి కొన్ని మంత్రాలు పఠిస్తారు. దీని వల్ల వారికి వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతారు.

మయాంగ్

మయాంగ్

P.C: You Tube

ఇక్కడ ఉన్నవారిలో చాలా మంది క్షుద్రపూజల వల్ల అతీత శక్తులు లభిస్తాయని వాటి ద్వారా ఈ ప్రపంచాన్నే జయించవచ్చునని నమ్ముతారు. దీని కోసం ఏళ్ల తరబడి స్మశానాల్లోనే గడిపేవారు కూడా ఉన్నారు.

మయాంగ్

మయాంగ్

P.C: You Tube

ఈ గ్రామాన్ని సందర్శించేవారిలో భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఉండటం గమనార్హ. ఇక ఇక్కడ క్షుద్రపూజలను నేర్చుకొనే వారు అప్పుడప్పుడు అఘోరాలను కూడా ఆహ్వానిస్తుంటారని చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X