Search
  • Follow NativePlanet
Share
» »తిరుమల విషయంలో ఓడినా లాభం పొందిన ఆదిశేషుడు

తిరుమల విషయంలో ఓడినా లాభం పొందిన ఆదిశేషుడు

తిరుపతి రహస్యాలకు సంబంధించిన కథనం.

కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలిపెట్టడం వల్లే ఎక్కువ లాభాలు ఉంటాయి. అదే విధంగా గెలవడం కంటే ఓడిపోవడం వల్ల మన పేరు కాలగమనంలో శాశ్వతంగా నిలిచిపోయి తరతరాలు మన గురించి చెప్పుకొంటారు. అటువంటి కోవకు చెందినవాడే ఆది శేషుడు. ఓ పరీక్షలో ఓడి పోవడం వల్ల అతడు ఈ విశ్వం ఉన్నంత కాలం భక్తుల మదిలో నిలిచిపోయాడు. అది కూడా కలిగియుగ వైకుంఠంగా పిలువబడే తిరుమలకు అదిశేషుడికి అవినాభావ సంబంధం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube

ఒకానొక సమయంలో వాయు దేవుడు వైకుంఠానికి ఆ మహావిష్ణువు సందర్శనార్థం వెలుతాడు. అయితే ఆదిశేషుడు ఆ వాయుదేవుడిని అడ్డగిస్తాడు.

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
మహావిష్ణువు లక్ష్మీ దేవితో ఉన్నారని అందువల్ల ఇప్పుడు కలవడం కుదరదని చెబుతాడు. అయితే ఇందుకు అంగీకరించని వాయుదేవుడు తాను తక్షణం ఆ దేవదేవుడిని చూడాలని పట్టుపడుతాడు.

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
దీంతో వారి మధ్య వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారుతుంది. ఈ విషయం తెలుసుకొన్న విష్ణువు పరుగుపరుగున అక్కడికి వచ్చి వారి మధ్య సంధి చేకూర్చడానికి విఫలయత్నం చేస్తాడు.

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
అయితే ఒక్కరు కూడా వెనక్కు తగ్గరు. ఇద్దరు తమ గొప్పలు చెప్పుకోవడం ప్రారంభిస్తారు. దీంతో శ్రీ మహావిష్ణువు వారిద్ధరికి ఒక పరీక్షపెడుతానని ఇందులో నెగ్గినవారే బలవంతులవుతారని చెబుతారు.

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
ఇందుకు అటు వాయుదేవుడితో పాటు ఆదిశేషుడు కూడా అంగీకరిస్తాడు. దీని ప్రకారం మేరు పర్వతానికి ఉత్తర దిక్కులో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుడు గట్టిగా పట్టుకోవాలని విష్ణువు సూచిస్తాడు.

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
వాయు దేవుడు తన బలంతో ఆది శేషుడి పట్టు విడిపించాల్సి ఉంటుంది. ఇందుకు సరేనన్న ఇద్దరు అక్కడికి వెళ్లి ఒకరితో ఒకరు తలపడుతారు.

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
వాయువు తన శక్తినంతటిని కూడదీసుకొని ఆదిశేషుడి పై విరుచుకుపడుతాడు. వాయువు బలానికి ఈ ముల్లోకాలు అతలాకుతలమవుతాయి.

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
దీంతో దేవతలు ఆదిశేషుడిని ప్రార్థించి తమను రక్షించాల్సిందిగా వేడుకొంటారు. అయిష్టంగానే ఆదిశేషుడు తన బలాన్ని కొద్దిగా సడలిస్తాడు.

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
దీంతో ఆ ఆదిశేషుడు ప్రస్తుతం స్వర్ణముఖీ నది ఒడ్డున పడుతాడు. దీంతో ఓటమి చెందానని ఆదిశేషుడు చాలా బాధపడుతూ ఉంటాడు. వెంటనే అక్కడికి వచ్చిన త్రిమూర్తులు ఆదిశేషుడిని ఊరడిస్తారు.

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
నీవు పడిన చోటునే కలియుగంలో మహావిష్ణువు వెలుస్తాడని యుగాంతం వరకూ నీతోనే ఉంటాడని చెప్పి ఆదిశేషుడిని అక్కడ ఉన్న వెంకటాద్రిలో విలీనం చేస్తారు.

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
అందువల్లే విష్ణువు వేకటేశ్వరుడి రూపంలో ఇక్కడ శేషాద్రి పై వెలిశాడని చెబుతారు. ఇలా ఆదిశేషుడు ఓడిపోయినా కూడా కలియుగాంతం వరకూ తనలోనే ఆ వైంకటేశ్వరుడిని నిపుకొనే వరం పొందాడని చెబుతారు.

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
ఇదిలా ఉండగా స్వయంభువుగా మహావిష్ణవు లక్ష్మీ సమేతుడై పుష్కరిణి వద్ద ఉన్న చింత చెట్టు కింద చీమల పుట్టలో వెలిశారని చెబుతారు. దీనిని గోపీనాథ దీక్షితులు మొదట కనుగొని ప్రస్తుతం ఉన్న చోట ప్రతిష్టించాడని చెబుతారు. అప్పటి నుంచి పూజాది కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి.

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
ఇదిలా ఉండగా దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధి గాంచిన తిరుమలలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. అటువంటి నమ్మశక్యం కాని విషయాల్లో కొన్ని వేంకటేశ్వరస్వామి విగ్రహానికి జుట్టు ఉందని చెబుతారు. అది అసలు చిక్కు పడదు.

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
శ్రీవారు భూమి మీదకు వచ్చిన తర్వాత ఓ ఘటనలో తన తల పై భాగంలో కొంత జుత్తును కోల్పోతారు. దీంతో నాలా దేవి తన శిరోజాల నుంచి కొంత భఆగం ఆయనకు ఇస్తుంది. అప్పటి నుంచి తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం మొదలయ్యింది.

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
స్వామివారిని అనంతాల్వారు గుణపంతో కొడతాడు. దీంతో స్వామివారికి గడ్డం పై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయడం చేస్తున్నారు. ఇక గాయం చేసిన గుణపం ఇప్పటికి గుడి మహాద్వారానికి ముందు కుడువైపున ఉంది.

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
స్వామివారి విగ్రహానికి రోజూ కింది వైపున పంచె, పై వైపున చీరతో అలంకరిస్తారు. స్వామివారి విగ్రహానికి వెనుక వైపున సముద్ర హోరు వినిపిస్తుంది. స్వామి వీపువైపున చెవి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుందని చెబుతారు

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
స్వామివారి విగ్రహం వెనుక బాగం ఎప్పుడూ చమ్మగా ఉంటుంది. ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుందని చెబుతారు.

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
ఇక ఆలయంలో స్వామివారి విగ్రహం ముందు ఉన్న దీపాలు ఏ రోజూ కొండెక్కవు. నిత్యం వెలుగుతూనే ఉంటాయి. అవి కొన్న వేల సంవత్సరాల నుంచి అలాగే వెలుగుతూ ఉన్నాయి.

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
సాధారణంగా పచ్చ కర్పూరానికి ఎలాంటి రాతి విగ్రహమైనా బీటలు వారుతుంది. అయితే, శ్రీవారికి నిత్యం కర్పూరం రాస్తున్నా చెక్కు చెదరకపోవడం విశేషం.

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

P.C: You Tube
ఈ విగ్రహం దాదాపు 110 డిగ్రీల ఫారిన్ హీట్ ఉంటుంది. అయితే ఆలయం సముద్ర మట్టానికి 3వేల అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఆ ప్రభావం కనిపించడం లేదని చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X