Search
  • Follow NativePlanet
Share
» »ఎగ‌సిప‌డే అల‌లపై విహారానికి వ‌ర్కాల ఆహ్వానిస్తోంది

ఎగ‌సిప‌డే అల‌లపై విహారానికి వ‌ర్కాల ఆహ్వానిస్తోంది

ఎగ‌సిప‌డే అల‌లపై విహారానికి వ‌ర్కాల ఆహ్వానిస్తోంది

వర్కాల తిరువనంతపురం జిల్లాలోని ఒక అందమైన తీర పట్టణం. ఇది కేరళ దక్షిణ భాగంలో ఉంది. కేరళలో కొండలు సముద్రానికి దగ్గరగా ఉండే ఏకైక ప్రదేశం ఇది. కొండ చరియలు అరేబియా సముద్రంలో కలిసిపోవడం ఇక్కడి ప్రత్యేకత. వర్కాల తీర‌ప్రాంతం ఒక ప్రసిద్ధ ప‌ర్యాట‌క ప్ర‌దేశంగా గుర్తింపుపొందింది. ఇక్కడ మీరు పారా సెయిలింగ్ మరియు పారాగ్లైడింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.

కేరళలోని దక్షిణ భాగంలో ఉన్న ఈ తీర పట్టణం హిప్పీ సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. రుచుక‌ర‌మైన‌ సముద్రపు ఆహారాన్ని అందించడం ద్వారా ప‌ర్యాట‌క ఆస‌క్తి ఉన్న‌వారిని ఆక‌ర్షిస్తోంది. అంతేకాదు, వర్కలా జ‌నార్థ‌న‌ స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. వర్కలాలో సహజసిద్ధ‌మైన తీర‌ప్రాంతాలు, కొండలు, సరస్సులు, కోటలు, లైట్‌హౌస్‌లు, సహజ మత్స్య సంపద కార‌ణంగా కుటుంబ‌స‌మేతంగా విహ‌రించేందుకు ఓ మంచి ప‌ర్యాట‌క ప్ర‌దేశాంగా గుర్తింపు పొందింది.

Varkala Beach

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని వర్కాల స‌హ‌జ‌సిద్ధ నిర్మాణంగా పిలుస్తుంది. డిస్కవరీ ఛానల్ వర్కాలను టాప్ టెన్ సీజనల్ బీచ్‌లలో ఒకటిగా పేర్కొంది. ఇక్క‌డ హీబ్రూలో మ్యాట్‌లు, ఆక్సిడైజ్డ్ వెండి ఆభరణాలు, వివిధ క‌ళాకృతుల‌ను విక్ర‌యించే చౌకైన అనేక దుకాణాలను కూడా చూడవచ్చు. ఆయుర్వేద స్పాలు, రిసార్ట్‌లు, హాస్టళ్లు సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ర్షిస్తాయి.

వర్కాలలో వాటర్ స్పోర్ట్స్..

తీర‌ప్రాంతంలో చాలామంది వాటర్ స్పోర్ట్స్ ఆపరేటర్లు కనిపిస్తారు. ప‌ర్యాట‌కులు వినోదంతో కూడిన అనేక వాట‌ర్ స్పోర్ట్స్ కార్యకలాపాలకు కేంద్ర బిందువు. విండ్‌సర్ఫింగ్, పారాసైలింగ్, పారాగ్లైడింగ్ మరియు స్నార్కెలింగ్ వంటి అనేక థ్రిల్లింగ్ సాహస క్రీడలను ఆస్వాదించవచ్చు. అరేబియా సముద్ర జలాలపై మీ పాదాల‌ను మోపాల‌నుకుంటే మాత్రం ఇక్కడ వర్కాల బీచ్‌లో సర్ఫింగ్ చేయాల్సిందే. సర్ఫ్‌కు అవ‌స‌ర‌మైన నాణ్య‌మైన స‌ర్ఫింగ్ గేర్‌ను స‌మీపంలోని కేంద్రాల నుంచి అద్దెకు తీసుకోవచ్చు. అలా స్వ‌తంత్రంగా చిన్న సాహసయాత్రకు వెళ్లవచ్చు. ఇక్క‌డి నీటి ఉష్ణోగ్రతలు డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు సుమారు 24 డిగ్రీలు ఉంటాయి. ఈ స‌మ‌యం విహారానికి అనువుగా ఉంటుంది.

బీచ్‌కు సమీపంలో ఉన్న కపిల్ సరస్సు ప్ర‌శాంత‌మైన‌ క్షణాలను ఆస్వాదించడానికి మరొక ప్రసిద్ధ ప్రదేశంగా చెప్పొచ్చు. వర్కాల పట్టణానికి సమీపంలో ఉన్న చిలక్కూరు బీచ్ సూర్యాస్తమయాన్ని వీక్షించడానికి సరైన గమ్యస్థానం. ఈ బీచ్ వాణిజ్యపరంగా అభివృద్ధి చెందనప్పటికీ, సాయంత్ర స‌మ‌యంలో ప్రశాంతంగా నడవడానికి ఇది అనువైన ప్రదేశం.

Varkala Beach

పాపనాశం బీచ్..

నిజానికి ఇక్క‌డి తీర‌ప్రాంతాలు రెండు భాగాలుగా విభజించబడ్డాయి. హిందువులు పవిత్రంగా భావించే జనార్థ‌న‌ స్వామి ఆలయం నుండి వెళ్లే రహదారి చివరన బీచ్ యొక్క దక్షిణ ప్రాంతం ఉంది. అయితే, ప‌ర్యాట‌కులు కొండ దిగువన ఉన్న బీచ్ యొక్క ఉత్తర భాగంలో విహ‌రించేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. ఇక్క‌డ తీర‌ప్రాంతంలోని నీరు ఔషధ గుణాలను క‌లిగి ఉంద‌ని విశ్వ‌సిస్తారు.

ఈ నీరు ప‌లు చ‌ర్మ‌వ్యాధుల‌కు నివార‌ణ‌గా భావిస్తారు. ఈ నీటిలో మున‌గ‌డం వల్ల శరీరంలోని మలినాలు మరియు అన్ని పాపాలను దూర‌మ‌వుతాయ‌ని, అందుకే దీనిని పాపనాశం బీచ్ అనే పేరు పెట్టార‌ని అంటారు. వర్కలా బీచ్‌లోని సూర్యాస్తమయాన్ని ఆస్వాదించేందుకు ప‌ర్యాట‌కులు క్యూక‌డ‌తారు. అలాగే సముద్ర ఆహార ప్రియుల‌కైతే ఈ ప్రదేశం స్వర్గధామం అనే చెప్పాలి.

Read more about: varkala beach kerala
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X