Search
  • Follow NativePlanet
Share
» » భీమవరంలోని ఈ ఆదినాథ్ భగవాన్ టెంపుల్ ను ఒక్కసారైనా చూడాల్సిందే..

భీమవరంలోని ఈ ఆదినాథ్ భగవాన్ టెంపుల్ ను ఒక్కసారైనా చూడాల్సిందే..

బౌద్ధం, జైనం తెలుగు నేలపై కొన్ని వేల ఏళ్ళ కిందట ఒక వెలుగు వెలిగాయి. అతి కొద్ది జైన్‌ ఆలయాల్లో భీమవరం పట్టణానికి సమీపంలో ఉన్న కాళ్ళ మండలం పెదఅమిరం గ్రామంలో ఆదిజైన్‌ శ్వేతాంబర్‌ ఆలయం ఒకటి. 23 మంది జైన్‌

సహజంగా జైన దేవాలయాలు నార్త్ ఇండియాలో ఎక్కువగా చూస్తుంటాము. అయితే దక్షిణ భారత దేశంలో కూడా ప్రసిద్ది చెందిన జైన భగవానుడి ఆలయాలున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లోని ఉభయగోదావరి జిల్లాలో హిందూ జైన దేవుడు కొలువై ఉన్నాడు. మరి ఆ దేవాలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గోదావరి తీరంలోనూ జైన తీర్థంకరులు ఆనవాళ్ళున్నాయి

గోదావరి తీరంలోనూ జైన తీర్థంకరులు ఆనవాళ్ళున్నాయి

గోదావరి తీరంలోనూ జైన తీర్థంకరులు ఆనవాళ్ళున్నాయి..ఉభయగోదావరి జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో ఆలయాలు వెలిశాయి.. తూర్పున ఆలమూరు మండలం గుమ్మిలేరు. కాకినాడలో జైన్‌ ఆలయాలున్నాయి. ఇక రాజమండ్రిలోనూ ఒక చిన్న ఆలయం ఉంది. పశ్చిమాన కాళ్ళ మండలం పెద అమిరం, ఆచంట మండలం పెనుమంచిలి, ఆచంట, తాడేరు గ్రామాల్లో జైన్‌ విగ్రహాలున్నాయి.

 ప్రతీ సంవత్సరం జైన్‌లు అంగరంగ వైభవంగా ఉత్సవాలు

ప్రతీ సంవత్సరం జైన్‌లు అంగరంగ వైభవంగా ఉత్సవాలు

ఆయా ప్రదేశాల్లోని జైన దేవాలయాల్లో ప్రతీ సంవత్సరం జైన్‌లు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారుజ. ఈ ఉత్సవాలను సుమారు 10 నుండి 12 రోజులు జరుపుకుంటారు. గోదావరి పుష్కరాల సందర్భంగా జైనుల ఆనవాళ్ళు చూస్తే ఇలా మన కళ్ళ ముందే దర్శనమిస్తున్నాయి.

PC:jainsite.com

 బుుషబదేవుని ఆలయంలో ఉన్న దేవుడిని ఆదినాథ్ భగవాన్ అని జైన మతస్తులు కొలుస్తారు

బుుషబదేవుని ఆలయంలో ఉన్న దేవుడిని ఆదినాథ్ భగవాన్ అని జైన మతస్తులు కొలుస్తారు

బౌద్ధం, జైనం తెలుగు నేలపై కొన్ని వేల ఏళ్ళ కిందట ఒక వెలుగు వెలిగాయి. అతి కొద్ది జైన్‌ ఆలయాల్లో భీమవరం పట్టణానికి సుమారు 5కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళ్ళ మండలం పెదఅమిరం గ్రామంలో ఆదిజైన్‌ శ్వేతాంబర్‌ భగవాన్ దేవాలయం ఒకటి. అతి పురాతనమైన విగ్రహం ఉన్న పుణ్యక్షేత్రం ఇది. బీమవరంలోని బుుషబదేవుని ఆలయంలో ఉన్న దేవుడిని ఆదినాథ్ భగవాన్ అని జైన మతస్తులు కొలుస్తారు. ఎందుకంటే ఆయనే ముందుగా ఆవిర్భవించిన జైన దేవుడు.

PC: jainsite.com

23 మంది జైన్‌ తీర్థంకరుల్లో ఇక్కడ పొలాల్లో150 ఏళ్ళ కిందట లభించిన

23 మంది జైన్‌ తీర్థంకరుల్లో ఇక్కడ పొలాల్లో150 ఏళ్ళ కిందట లభించిన

23 మంది జైన్‌ తీర్థంకరుల్లో ఇక్కడ పొలాల్లో150 ఏళ్ళ కిందట లభించిన ఈ విగ్రహాన్ని ఆదిజైన్‌ శ్వేతాంబర్‌గా గుర్తించారు. ఈ విగ్రహానికి ఆ గ్రామస్తులు అరుగు ఏర్పాటు చేసి ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం సుమారు 2500 సంవత్సరాల పురాతనమైనదిగా భావిస్తున్నారు.ఈ విగ్రహాన్ని భీమవరం ప్రాంత జైనులు పరిశీలించి ఇది ఆదిజైన్‌ శ్వేతాంబర్‌గా ఆలయం నిర్మించారు.

PC:Jai Kishan Chadalawada

విమల నాధుని దేవాలయం

విమల నాధుని దేవాలయం

పదమూడవ జైన తీర్ధంకరుడు విమల నాధుని దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరం గ్రామంలో ఉంది .ఈ విగ్రహం రెండు వేల అయిదు వందల ఏళ్ళ నాటిదని చరిత్ర చెబుతోంది .నల్లరాతితో మలచ బడి పద్మాసనం లోనాలుగు అడుగుల ఎత్తు విమల నాధుని విగ్రహం దర్శనమిస్తుంది .

PC:jainsite.com

 శ్రీ నందన్ విజయాజ్ మహారాజ్ ఆధ్వర్యం లో అక్కడే పేద తిమిరంలో ..

శ్రీ నందన్ విజయాజ్ మహారాజ్ ఆధ్వర్యం లో అక్కడే పేద తిమిరంలో ..

తర్వాత వారు వచ్చి, అది జైన విగ్రహమే నని తెలుసుకొని దాన్ని పేద తిమిరం గ్రామస్తులను తమకు ఇవ్వమని కోరగా వీరు నిరాకరించారు .అప్పుడు రాజ మండ్రి జైన పెద్దలోచ్చి శ్రీ నందన్ విజయాజ్ మహారాజ్ ఆధ్వర్యం లో అక్కడే పేద తిమిరంలో అందరి సహకారంతో జైన దేవాలయాన్ని 1965 ఫిబ్రవరి పదిన నిర్మించి విమల నాధుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

PC: jainsite.com

 పాలరాతితో అద్భుతంగా తీర్చిదిద్దారు.

పాలరాతితో అద్భుతంగా తీర్చిదిద్దారు.

ఆదినాద్ జైన భగవానుడినే విమల నాధుడని పిలుస్తారు. ఆ ఆలయాన్ని గత ఏడాది కోటి రూపాయలతో రాజస్థాన్‌ శైలిలో పాలరాతితో అద్భుతంగా తీర్చిదిద్దారు.

PC: Saksenan

,108 కొబ్బరికాయలతో అభిషేకం చేస్తే వర్షం తప్పక కురిస్తుంది

,108 కొబ్బరికాయలతో అభిషేకం చేస్తే వర్షం తప్పక కురిస్తుంది

ఉత్తర ,దక్షిణ జైనులకు తీర్ధ స్తలం అయింది. సకాలంలో వర్షాలు కురవక పొతే 108కుండలతో ,108 కొబ్బరికాయలతో అభిషేకం చేస్తే వర్షం తప్పక కురిస్తుంది అని నమ్మకం .

PC- Hardik Trivedi

ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు వార్షికోత్సవం

ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు వార్షికోత్సవం

ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు వార్షికోత్సవం అంగరంగవైభవంగా జరుగుతుంది. చెప్పాలంటే ఇది జైన క్షేత్రమే అయినా కులమతాలకి అతీతంగా పరమత సహనాన్ని చాటుతోంది. కులమత పిచ్చిలో మునిగి కొట్టుకుపోయే వారికి ఈ క్షేత్రం ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల నుంచి జైనులు తరలివస్తారు.

PC: YOU TUBE

పాలరాతితో 7 సంవత్సరాల పాటు అంటే 2015నాటికి పూర్తి అయినది.

పాలరాతితో 7 సంవత్సరాల పాటు అంటే 2015నాటికి పూర్తి అయినది.

ఈ ఆలయానికి వచ్చే భక్తుల కానుకలతో 2008 నుండి ఈ మందిరాన్ని పూర్తి పాలరాతితో 7 సంవత్సరాల పాటు అంటే 2015నాటికి పూర్తి అయినది. 2015 ఫిబ్రవరి 2వ తేదీనా అనేక వేల మంది భక్తుల సాన్నిధ్యంలో ఆదినాథ్ విగ్రహంతో పాటు మరో 23 విగ్రహాలను ప్రతిష్టించారు.

PC: Thorsten Vieth

ఆదినాథ్ విగ్రహంతో పాటు మరో 23 విగ్రహాలను ప్రతిష్టించారు

ఆదినాథ్ విగ్రహంతో పాటు మరో 23 విగ్రహాలను ప్రతిష్టించారు

ఈ ఆలయానికి వచ్చే భక్తుల కానుకలతో 2008 నుండి ఈ మందిరాన్ని పూర్తి పాలరాతితో 7 సంవత్సరాల పాటు అంటే 2015నాటికి పూర్తి అయినది. 2015 ఫిబ్రవరి 2వ తేదీనా అనేక వేల మంది భక్తుల సాన్నిధ్యంలో ఆదినాథ్ విగ్రహంతో పాటు మరో 23 విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ విగ్రహ ప్రతిష్ట సమయంలో హెలికాప్టర్ నుండి పుష్ప వర్షం కురిపించబడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఆలయం కేవలం జైనులకు మాత్రమే కాకుండా పెద అమిరం గ్రామ ప్రజలకు కూడా ఎంతో నమ్మదగ్గ పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది.

PC- K.vishnupranay

భీమవరం పట్టణ బస్టాండ్ నుండి 5కిలో మీటర్లు

భీమవరం పట్టణ బస్టాండ్ నుండి 5కిలో మీటర్లు

భీమవరం పట్టణ బస్టాండ్ నుండి 5కిలో మీటర్లు. ఆటోల్లో ప్రజలు తమ ఇష్టదైవాన్ని చేరుకుంటారు. మెయిన్ రోడ్ నుండి ఒక కిలోమీటర్ లోపలకి ఈ ఆలయం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో నెలకొని ఉంది.

PC: Prayash Giria

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X