Search
  • Follow NativePlanet
Share
» »900 ఆలయాలు ఒకే పర్వతం పై, సందర్శనతో

900 ఆలయాలు ఒకే పర్వతం పై, సందర్శనతో

జైనులకు అత్యంత పవిత్రమైన పాలిటానానగరం గురించి కథనం.

సాధారణంగా ఒక పుణ్యక్షేత్రంలో ఒక దేవాలయం ఉంటుంది. కొన్ని క్షేత్రాల్లో మాత్రం ఒకటి కంటే ఎక్కువగా గరిష్టం అంటే పది దేవాలయాలు ఉంటాయి. అయితే భారత దేశంలోని ఒకే ఒక క్షేత్రంలో మాత్రమే ఏకంగా 900 దేవాలయాలు ఉన్నాయి.

అది కూడా ఒక పర్వత శిఖరం పైన. ఆ దేవాలయాన్నీ చలువరాతితో నిర్మించినవే కావడం గమనార్హం. అందులో ఒక ఆలయంలో అతి ప్రాచీనమైన బంగారు ఆభరణాలను భద్రపరిచారు. ఇదిలా ఉండగా ఆ క్షేత్రం ప్రపంచంలోని మొదటి శాఖాహార నగరం కూడా.

ఇన్ని విశిష్టతలు కలిగిన ఆ నగరం జైనులకు పరమ పవిత్రమైన క్షేత్రం. జీవితంలో హిందువులకు కాశీని ఒక్కసారైనా వెళ్లాలని భావించనట్లే జైనులు ఆ క్షేత్రానికి ఒక్కసారైనా వెళ్లాలని కోరుకొంటారు. అంతటి పవిత్రమైన నగరం విశేషాలు మీ కోసం

అతి పురాతన పట్టణం

అతి పురాతన పట్టణం

P.C: You Tube

గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లాల్లో ఉన్న అతి పురాతనమైన పట్టణమే పాలిటానా. ప్రపంచంలో మొదటి శాఖాహార నగరం పాలిటానా. ప్రపంచంలోని 900 దేవాలయాలు కలిగిన హిల్ స్టేషన్ కూడా పాటలీనా కావడం గమనార్హం.

శత్రుంజయ పర్వతం

శత్రుంజయ పర్వతం

P.C: You Tube

ఈ పాలిటానాకు అతి సమీపంలో ఉన్న శత్రుంజయ పర్వత పంక్తులు ఉన్నాయి. జైన మతానికి ఈ శత్రుంజయ పర్వత పక్తులకు విడదీయరాని బంధం ఉంది. జైన మొదటి తీర్థాంకరుడైన అధినాథుడు ఈ శత్రుంజయ పర్వతం పైనే ధ్యానం చేసినట్లు చెబుతారు.

మొత్తం 3వేల దేవాలయాల్లో 900 పాటలీనాలోనే

మొత్తం 3వేల దేవాలయాల్లో 900 పాటలీనాలోనే

P.C: You Tube

అటు పై ఇక్కడ అనేక దేవాలయాలను నిర్మించారు. ఈ పర్వత పంక్తుల్లో మొత్తం 3వేల దేవాలయాలు ఉండగా అందులో పాటలీనాలో మాత్రమే 900 దేవాలయాలు ఉన్నాయి. ఈ మొత్తం దేవాలయాల్లో ప్రదానమైనది రిషభనాధ దేవాలయం.

బంగారు ఆభరణాలను భద్రపరిచారు

బంగారు ఆభరణాలను భద్రపరిచారు

P.C: You Tube

ఈ రిషభనాధ దేవాలయంతో పాటు ఇక్కడ ఉన్న దాదాపు అన్ని దేవాలయాలు చల్లని పాలరాతి నిర్మితాలే. ముఖ్యంగా కుమార్ పాల్, విమల్ షా, సంప్రీతి దేవాలయాలు ముఖ్యమైనవి. కుమార్ పాల్ దేవాలంలో అనేక పురాతన బంగారు ఆభరణాలను భద్రపరిచారు.

3,800 మొట్లు

3,800 మొట్లు

P.C: You Tube

ప్రత్యేక అనుమతితో ఈ ఆభరణాలను చూడవచ్చు. ఇక్కడ ఉన్న శిల్ప సంపద కూడా చాలా బాగుంటుంది. జైన మతస్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలనుకొంటారు. ఈ కొండ పర్వత పాదం నుంచి పర్వత శిఖరం పై వరకూ కొండనే తొలచి 3,800 రాతి మెట్లను నిర్మించారు.

కఠిన ఉపవాస దీక్ష

కఠిన ఉపవాస దీక్ష

P.C: You Tube

ఈ పర్వతం పై చేరే సమయంలో జైనులు ఆహారన్ని, నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తినరు, తాగరు. కఠిన ఉపవాసంతో జైనులు ఈ తీర్థయాత్రను పూర్తి చేస్తారు. ఎంత వేగంగా ఎక్కినా పర్వత శిఖరం పై భాగం చేరడానికి దాదాపు గంటన్నర సమయం పైగా పడుతుంది.

ఆనంద్ జీ, కళ్యాణ్ జీ

ఆనంద్ జీ, కళ్యాణ్ జీ

P.C: You Tube

ఈ పర్వత శిఖరం పై ఉన్న మొత్తం ఈ దేవాలయాల నిర్మాణం 11వ శతాబ్ద కాలం నుంచి 20వ శతాబ్దం వరకూ కొనసాగింది. అదే విధంగా 11వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకూ ఈ దేవాలయాల నిర్వహణను ఆనంద్ జీ, కళ్యాణ్ జీ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది.

ఎలా వెళ్లాలి

ఎలా వెళ్లాలి

P.C: You Tube

పాటలీనాకు దగ్గరగా అంటే భావ్ నగర్ లోవిమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి పాటలీనాకు ప్రైవేటు ట్యాక్సీలు లభిస్తాయి. పాటలీనాలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. భావ్ నగర్ నుంచి పాటలీనాకు ప్రతి గంటకు ఒక ప్రభుత్వ బస్సు అందుబాటులో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X