Search
  • Follow NativePlanet
Share
» »ఈ అమ్మవారిని దర్శించాలంటే తడవాల్సిందే

ఈ అమ్మవారిని దర్శించాలంటే తడవాల్సిందే

రాయ్ పూర్ కు దగ్గరగా ఉన్న జట్ మాయి దేవాలయానికి సంబంధించిన కథనం.

అటు ఆధ్యాత్మికతను, ఇటు ఆహ్లాదాన్ని సొంతం చేసుకొన్న దేవాలయాలను భారత దేశంలో వేళ్లమీద లెక్కబెట్టవచ్చు. అటువంటి కోవకు చెందిన ఈ దేవాలయం జలపాతం జన్మించే చోట భూమి నుంచి కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ దేవాలయంలోని మాతను దర్శించాలంటే మొదట ఆమె పాదపద్మాల నుంచి జాలువారే జలపాతంలో తడవాల్సిందే. ఈ విధంగా తడవడం వల్ల సకల పాపాలు పోతాయని నమ్ముతారు. అందువల్లే కష్టసాధ్యమైనా జీవితంలో ఒక్కసారైనా ఈ దేవాలయంలోని మాతను సందర్శించాలని స్థానికులు తహతహలాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో సదరు దేవాలయంతో పాటు చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

జట్ మాయి దేవాలయం

జట్ మాయి దేవాలయం

P.C: You Tube

ప్రక`తి రమణీయతల మధ్య చుట్టూ పచ్చటి పర్వతాలు, జలజలరాలే జపాతాల మధ్య ఈ జెట్ మాయి దేవాలయం ఉంది. ఈ దేవిని స్వయంభువుగా చెబుతారు. అయితే ఇక్కడ ఈ దేవాలయం ఎప్పుడు వెలిసింది.

ఈ గుహలను ఏలియన్స్ నిర్మించాయాఈ గుహలను ఏలియన్స్ నిర్మించాయా

జట్ మాయి దేవాలయం

జట్ మాయి దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయాన్ని కట్టించిన వారు ఎవరు అన్న దానికి సరైన ఆధారాలు మాత్రం లేవు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని గరియాబాద్ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం ఈ జెట్ మాయ దేవత. ఈ దేవాలయం కేవలం ఆధ్యాత్మిక వేత్తలకే కాకుండా ప్రకతిని ఆరాధించేవారికి కూడా నచ్చుతుంది.

జట్ మాయి దేవాలయం

జట్ మాయి దేవాలయం

P.C: You Tube

జనావాసాల నుంచి దూరంగా ఉన్న ఈ మాతను సందర్శించడానికి సాహసయాత్రనే చేయాల్సి ఉంటుంది. జలపాతాలను దాటుకొంటూ ముందుకు వెళ్లాలి. ముఖ్యంగా ఘటరా జలపాతాన్ని, అందులో నుంచి జాలువారే నీటిలో తడిస్తేనే అమ్మవారి దర్శనం లభిస్తుంది.

మీలోని కాముడు నిద్రలేచి పరుగెత్తే ప్రాంతాలుమీలోని కాముడు నిద్రలేచి పరుగెత్తే ప్రాంతాలు

జట్ మాయి దేవాలయం

జట్ మాయి దేవాలయం

P.C: You Tube

జెట్ మాయ మాత జలపాతం రాయపూర్ కు 58 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవాలయం మొత్తం గ్రానైట్ నిర్మితం. దేవాలయం పక్కనే ఉన్న జలపాతం మనకంటికి కనువిందును చేస్తుంది. ఈ జలపాతంలో స్నానం చేస్తే సమస్త పాపాలు పోతాయని స్థానిక ప్రజల నమ్మకం.

జట్ మాయి దేవాలయం

జట్ మాయి దేవాలయం

P.C: You Tube

లయబద్దంగా వినిపించే జలపాత హోరు మన మనసులకు ఆహ్లాదం కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ జలపాతంలో తడుస్తూ వెళ్లి భక్తులు అమ్మవారిని దర్శించుకొంటారు. దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో ఈ జట్ మాయ దేవాలయం ఉంటుంది.

జట్ మాయి దేవాలయం

జట్ మాయి దేవాలయం

P.C: You Tube

కోరిన కోర్కెలను తీర్చే తల్లిగా ఈ అమ్మవారికి పేరుంది. ఈ దేవాలయ నిర్మాణం కూడా విశిష్టంగా ఉంటుంది. ఎనిమిది చిన్న స్థంభాల ఆధారంగా నిర్మించిన ఈ దేవాలయం జలపాతం జన్మించే ప్రాంతంలో నిర్మించారు.

జట్ మాయి దేవాలయం

జట్ మాయి దేవాలయం

P.C: You Tube

అందువల్లే ఈ దేవాలయం అటు ఆధ్యాత్మిక వేత్తలను, ఇటు ప్రక`తి ఆరాధకులను సమ్మోహపరరుస్తోంది. ఈ జెట్ మాయి దర్శనానికి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు.

చర్మరోగాలకు మందు ఈ కొలనులో ఉందిచర్మరోగాలకు మందు ఈ కొలనులో ఉంది

జట్ మాయి దేవాలయం

జట్ మాయి దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయానికి దగ్గర్లో బమలేశ్వరీ మాత దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని 2200 ఏళ్ల క్రితం నిర్మించారని చెబుతారు. రాయ్ పూర్ కు 110 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజ వీరసేన మహారాజుకు సంతానం ఉండేది కాదు.

జట్ మాయి దేవాలయం

జట్ మాయి దేవాలయం

P.C: You Tube

దీంతో ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. సమస్య పరిష్కారం కోసం ఆస్థాన పండితుల మేరకు బమలేశ్వరీ మాతను మూడు పూట్లా ఆరాధించేవాడు. ఇతని భక్తికి మెచ్చిన బమలేశ్వరీ మాత మగపిల్లాడిని ప్రసాదించింది.

జట్ మాయి దేవాలయం

జట్ మాయి దేవాలయం

P.C: You Tube

అతనికి మదన్ సేన అనే పేరుతో అల్లారు ముద్దుగా పెంచిన రాజు బమలేశ్వరీ మాతకు ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించాడు. అప్పటి నుంచి సంతానం లేనివారు ఈ మాతను సందర్శించి తమ బాధ నుంచి విముక్తి పొందుతున్నారు.

జట్ మాయి దేవాలయం

జట్ మాయి దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయానికి సంబందించిన మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. విక్రమాదిత్యుడికి ఒక సారి తీవ్రమైన మనోవ్యధ వచ్చింది. దీంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో బమలేశ్వరీ మాత ప్రత్యక్షమయ్యి విక్రమాదిత్యుడిని రక్షిస్తుంది.

జట్ మాయి దేవాలయం

జట్ మాయి దేవాలయం

P.C: You Tube

దీంతో అతను బమలేశ్వరీ మాతకు దేవాలయాన్ని నిర్మింపజేస్తాడు. భూమికి దాదాపు 1600 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవిని దర్శించడానికి ఎక్కువగా ట్రెక్కింగ్ ప్రేమికులు వస్తుంటారు. అందువల్లే వీకెండ్ రోజుల్లో ఈ ప్రాంతం ఎక్కువగా కిటకిటలాడుతూ ఉంటుంది.

రామకృష్ణ పరమ హంసకు కాళీ మాత కనిపించింది ఎక్కడో తెలుసారామకృష్ణ పరమ హంసకు కాళీ మాత కనిపించింది ఎక్కడో తెలుసా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X