• Follow NativePlanet
Share
» »ఆ పర్యటన 15 రోజులు...ప్రదక్షణకు మూడు రోజులు...అయినా దైవ దర్శనం ఉండదు

ఆ పర్యటన 15 రోజులు...ప్రదక్షణకు మూడు రోజులు...అయినా దైవ దర్శనం ఉండదు

Written By: Beldaru Sajjendrakishore

భారత దేశంలో కొన్ని పర్యటనలు అటు ఆద్యాత్మికతతో పాటు ఇటు ఆహ్లాదంతో కూడుకుని కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక పర్యటన....మనం నమ్మిన దైవ దర్శనంతో ముగుస్తుంది. గరిష్టంగా ఏ ఆధ్యాత్మిక పర్యటన అయినా మూడు రోజుల పాటు జరుగుతుంది. అయితే భారత దేశంలో ఒక ఆద్యాత్మిక పర్యటన మాత్రం పది నుంచి పక్షం రోజుల పాటు సాగుతుంది. పోని ఇన్ని రోజుల పాటు సాగిన ఆ పర్యటన దైవ దర్శనంతో ముగుస్తుందా అంటే అదీ లేదు. కేవలం ఆ ప్రాంతంలో ప్రదక్షిణలు మాత్రం వేసి వెనుతిరగాల్సి ఉంటుంది. అయినా దేశ ప్రజలు కనీసం జీవితంలో ఒక్కసారి అయినా ఆ యాత్ర చేయాలని భావిస్తుంటారు. అటు వంటి పర్యటన వివరాలతో పాటు ఆ స్థల మహత్యం గురించిన వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం....

1. లయకారకుడు నివశిస్తూ ఉండేది ఈ పర్వతంలోనే

1. లయకారకుడు నివశిస్తూ ఉండేది ఈ పర్వతంలోనే

Image Source

సృష్టికారకుడు బ్రహ్మ నివశించేది బ్రహ్మలోకం, ప్రతి ప్రాణి అవసరాలు తీర్చిసృష్టిని కాపాడే విష్ణువు నివశించేది వైకుంఠం. ఇక లయ కారుడిగా పేరుగాంచిన ఈశ్వరుడు కులువై ఉండేది కైలాసం. ఆ కైలాసం ఉన్న ప్రాంతమే హిమాలయ పర్వత ప్రాంతాల్లోని కైలాస పర్వతం.

2. అన్నీ నిఘూడ రహస్యాలే...

2. అన్నీ నిఘూడ రహస్యాలే...

Image Source

హిమాలయ పర్వత ప్రాంతాల్లోని మానస సరోవరం ఒడ్డున ఉన్న పర్వతమే కైలాస పర్వతమని వేల కోట్ల సంవత్సరాలుగా హిందువులు నమ్ముతున్నారు. ఈ పర్వతం ప్రస్తావన మహాభారత కాలాల్లో కూడా కనిపిస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎతైన పర్వత శిఖరంగా పేరొందిన మౌంట్ ఎవరెస్ట్ నుంచి ఇప్పటి వరకూ దాదాపు ఐదు వేల మందికి పైగా ఎక్కారు. అయితే ఎవరెస్ట్ కంటే ఎంతో ఎత్తు తక్కువగా ఉండే కైలాసపర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకూ ఒక్కడు కూడా అధిరోహించక పోవడం గమనార్హం.

3. 22 వేల అడుగుల ఎత్తులో

3. 22 వేల అడుగుల ఎత్తులో

Image Source

సముద్రమట్టానికి సుమారు 22 వేల అడుగుల ఎత్తులో టిబెట్ భూభాగంలో ఈ కైలాస పర్వతం ఉంది. హిందువులతో పాటు బౌద్దులు, జైనులు, బోన్ మతస్తులకు కూడా ఈ పర్వత ప్రాంతం పరమ పవిత్రమైన ప్రాంతం. పరమ శివుడు ఇక్కడ తన పరివారంతో కొలవై ఉన్నాడని హిందువులు భావిస్తూ ఉంటారు. హిమాలయాల్లో ఏ పర్వతానికి లేనటు వంటి శక్తి, రూపుతో పాటు విశిష్టత ఈ పర్వతం సొంతం.

4. నాలుగు ముఖాలు...

4. నాలుగు ముఖాలు...

Image Source

ఈ పర్వతానికి నాలుగు ముఖాలు ఉన్నయి. నాలుగు ముఖాలు నాలుగు రూపాలుగా కనిపిస్తాయి. ఇందులో ఒక వైపు సింహం రూపు కనిపిస్తే, మిగిలిన మూడు రూపాలు వరుసాగా గుర్రం, ఏనుగు, నెమలి. ఈ జంతువులన్నీ శివుడి పరివారానికి ప్రతి రూపాలని హిందూ పురాణాలతో పాటు స్థానికుల నమ్మకం.

5. నాలుగు రంగులు

5. నాలుగు రంగులు

Image Source

అదే విధంగా ఈ పర్వతం నాలుగు వైపులా నాలుగు రంగుల్లో కనిపిస్తుంది. అవి బంగారు, తెలుపు, కాషాయం, నీలం. ఇందులో తెలుపు, బంగారు రంగును భక్తులు బాగా గమనించగలుగుతారు. నీలం, మరకతం రంగులు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇలా ఒకే పర్వతం నాలుగు రంగుల్లో కనబడటం ఎలా సాధ్యమన్న విషయం ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నే.

6. ఆరు పర్వతాల మధ్య

6. ఆరు పర్వతాల మధ్య

Image Source

తామరపూవు ఆకారంలోని ఆరు పర్వతాల మధ్య ఈ కైలాస పర్వతం ఉంటుంది. ఈ పర్వతం పై సదాశివుడు కొలువై ఉంటం వల్ల ఈ ఇహలోకంలో ఉన్న కైలాసం పై పాదం మోపడం మహాపాతకంగా హిందువులు భావిస్తారు. కొంతమంది మునులు, ఔత్సాహికులు, సన్యాసులు ఈ పర్వతం పై అధిరోహించలని ప్రయత్నం చేసి ప్రాణాలు పోగొట్టుకొన్న సంఘటనలు ఉన్నాయి. కేవలం ప్రజలే కాకుండా చైనా ప్రభుత్వం కూడా ఈ పర్వతం రహస్యాలను తెలుసుకోవాలని విఫలయ యత్నం చేసింది. ఈ క్రమంలో రెండు హెలిక్యాప్టర్లను కూడా పోగొట్టుకుంది.

7.చెంతకు కూడా వెళ్లలేము

7.చెంతకు కూడా వెళ్లలేము

Image Source

ఇక కైలాస పర్వతం చుట్టు ఉన్న ఆరు పర్వతాల చుట్టు కొలత 52 కిలోమీటర్ల. కైలాసనాథ పర్వతం చుట్టూ ప్రదక్షణ చేయాలంటే ఈ ఆరు పర్వతాల చుట్టూ తిరుగుతారు తప్పిస్తే మధ్యన ఉన్న కైలాస పర్వతం దగ్గరకు ఎవరూ వెళ్లరు. స్థానిక భౌగోళిక, వాతావరణ పరిస్థితులను అనుసరించి ఈ పర్వతం చుట్టూ ప్రదక్షణ చేయడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుంది.

8. బ్రహ్మ మనస్సు నుంచి పుట్టినది

8. బ్రహ్మ మనస్సు నుంచి పుట్టినది

Image Source

ఇక కైలాస పర్వతానికి దగ్గర్లో మానస సరోవరం ఉంటుంది. యాత్రలో భాగంగా దీనిని కూడా చూడవచ్చు. హిందూ పురాణాల ప్రకారం మానస సరోవరాన్ని బ్రహ్మ తన మనస్సు నుంచి సృష్టించాడు. అందువల్లే ఈ సరస్సుకు మానస సరోవరం అని పేరు వచ్చినట్లు చెబుతారు. బ్రహ్మముహుర్త కాలంలో అంటే తెల్లవారుజాము 3 నుంచి 4 గంటల మధ్య పరమశివుడు ఈ మానస సరోవరంలో స్నానం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకు తగ్గట్టే ఆ సమయంలో కైలాస పర్వతం నుంచి మానస సరోవరంలోకి ఓ వెలుగు రావడం చూసామని చాలా మంది భక్తులు చెబుతుంటారు.

9.పున్నమి రోజు

9.పున్నమి రోజు

Image Source

శివుడికి పరమ ప్రీతిపాత్రమైన పున్నమి రోజు ఈ కైలాసపర్వత దర్శనం చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. పరమశివుడుని నుంచి వచ్చిన ఓ ప్రత్యేక శక్తి ఆ సమయంలో మానస సరోవరంలో చేరుతుందని భక్తులు భావిస్తున్నారు. అందువల్ల పున్నమి రోజున ఆ నీటిని తాకితే సర్వ పాపాలు తొలిగిపోతాయాని భక్తుల ప్రగాడ విశ్వాసం.

10. ప్రైవేటు ఆపరేటర్లు

10. ప్రైవేటు ఆపరేటర్లు

Image Source

అందుకు తగ్గట్టు కేంద్రం ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే విదేశీ వ్యవహారాల శాఖ ఈ యాత్రకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఆమేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందిన ప్రైవేటు ఆపరేటర్లు టూర్ ప్లాన్ రూపొందిస్తుంటారు. ఈ కైలాస యాత్ర మే నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో జరుగుతూ ఉంటుంది. ఈ పర్యటనలో భాగంగా హెలీక్యాప్టర్లలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

11. హిందు, బౌద్దులు ఇలా...మిగిలిన వారు అలా

11. హిందు, బౌద్దులు ఇలా...మిగిలిన వారు అలా

Image Source

పట్టాభిషేకం తర్వాత రామలక్ష్మణులు, మహాభారత యుద్ధం తర్వాత పాండవులు, ఆదిశంకరుడు ఈ కైలాసయాత్ర చేశారని భారత పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ మానస సరోవరంలో స్నానమాచరించిన తర్వాత భక్తుల కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. హిందు, బౌద్ధమతస్తులు క్లాక్ వైజ్ లో ప్రదక్షణ చేస్తే, జైన, బోన్ మతస్తులు యాంటి క్లాక్ వైజ్ లో కైలాస పర్వతం చుట్టూ పదక్షణలు చేస్తారు.

12. అన్ని మత గ్రంధాల్లో ప్రస్తావన

12. అన్ని మత గ్రంధాల్లో ప్రస్తావన

Image Source

ఇక బౌద్ధ గ్రంధాల ప్రకారం బుద్ధిని తల్లి మాయాదేవి కూడా ఈ మానస సరోవరంలో స్నానం చేసి తనకు గొప్ప పుత్రుడిని ఇవ్వాలని ప్రార్థించినట్లు తెలుస్తోంది. జైనుల మొదటి తీర్థాంకుడైన వృషభనాథుడు ఇక్కడే మొక్షం పొందినట్లు వారి మత గ్రంధాలు చెబుతున్నాయి. ఇక టిబెట్లోని బోన్ అనే మతస్తుల ప్రకారం సృష్టి ఇక్కడి నుంచే ఆరంభమైదని నమ్ముతారు. అందువల్లే ఇది అటు హిందువులతో పాటు పలు మతస్తులకు పరమ పవిత్రమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది.

13. రెండు మార్గాల్లో...

13. రెండు మార్గాల్లో...

Image Source

సాధారణంగా కైలాస మానస సరోవర యాత్ర రెండు మార్గాల గుండా సాగుతుంది. అందులో మొదటిది లిపులేక్ పాస్ రెండోది, నాథూలా పాస్. ఈ మార్గాలు కాకుండా వాతావరణ పరిస్థితులను అనుసరించి ఈ యాత్ర మార్గాల్లో కొన్ని మార్పులు కూడా ఉంటాయి. ఏ మార్గంలో వెళ్లినా కైలాస పర్వతం చేరుకుని అక్కడ ప్రదక్షణలు మాత్రమే చేయడానికి వీలు కలుగుతుంది కాని మిగిలిన పుణ్యక్షేత్రాల్లో మాదిరి దైవ దర్శనం జరగదు. ఇక ఏ మర్గమైనా కనిష్టంగా 10 రోజుల నుంచి గరిష్టంగా 15 రోజులు (వెళ్లి తిరిగి రావడానికి కలిపి) సాగుతుంది. కొన్ని సారు ఇంకా ఎక్కువ రోజులు కూడా పట్టవచ్చు.

Read more about: yatra యాత్ర

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి