Search
  • Follow NativePlanet
Share
» »నక్కలు సాధు జంతువులై ప్రసాదం తినే చోటు...సందర్శనతో

నక్కలు సాధు జంతువులై ప్రసాదం తినే చోటు...సందర్శనతో

గుజరాత్ లోని కాలో దుంగార్ గురించిన కథనం.

By Kishore

నక్కలు క్రూరమృగాలన్న విషయం తెలిసిందే. మనిషి కనబడితే అవి చీల్చి చండాడుతాయి. అయితే ఒక్కచోట మాత్రం వాటిని దైవ స్వరూపంగా భావిస్తారు. అంతేకాకుండా ప్రతి రోజూ వాటికి దేవాలయంలో దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని అందిస్తారు. అటు పై మాత్రమే ఆ నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఈ విషయం మరెక్కడో కాదు భారత దేశంలోని గుజరాత్ రాష్ర్టంలోని కాలో దుంగార్ అనే కొండ పై జరుగుతుంది. ఈ కొండ పై ఉన్న దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లే వారి పై ఈ నక్కలు ఇప్పటి వరకూ దాడి చేయడం జరగలేదని స్థానికులు చెబుతారు. అంతే కాకుండా కోపం ఎక్కువగా ఉన్నవారు ఈ ఆలయ సందర్శనంతో కొంత శాంత స్వభావంగా మారుతారని చాలా కాలంగా విశ్వసిస్తున్నారు. ఇక ట్రెక్కింగ్ కూడా ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన కాలోదుంగార్ వెనక ఉన్న ఆలయం విశిష్టతలతో కూడిన కథనం మీ కోసం...

ఈ 'పుట్ట'సందర్శనతో మీ కడుపున 'కాయ' కాస్తుందిఈ 'పుట్ట'సందర్శనతో మీ కడుపున 'కాయ' కాస్తుంది

1. కచ్ ప్రాంతంలో

1. కచ్ ప్రాంతంలో

P.C:YouTube

గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో అత్యంత ఎతైన ప్రాంతమే కాలో దుంగార్. సముద్రమట్టానికి 462 మీటర్ల ఎత్తులో ఉన్న కాలో దుంగార్ ను బ్లాక్ హిల్ అని కూడా అంటారు. బుజ్ కు 97 కిలోమీటర్ల దూరంలో ఈ హిల్ స్టేషన్ ఉంటుంది.

2. దత్తాత్రేయుడు

2. దత్తాత్రేయుడు

P.C:YouTube

స్థానిక పురాణం ప్రకారం దత్తాత్రేయుడు ఒకనాడు ఈ ప్రాంతం గుండా వెలుతూ ఉంటాడు. ఆ సమయంలో నక్కల గుంపు ఒకటి ఆకలితో బాధపడటం చూస్తాడు. పరమాత్మ స్వరూపుడైన దత్తాత్రేయుడు ఆ నక్కలకు ఆహారం ఇవ్వాలని భావిస్తాడు. అయితే అవి మాంసాహార జీవులు. దీంతో బాగా ఆలోచించి తన లే అంగ్ లే అంగ్ (నా శరీరాన్ని తీసుకో, నా శరీరాన్ని తీసుకో) శరీరాన్నే వాటికి ఆహారంగా అందజేస్తాడు.

3. మరో కథ కూడా

3. మరో కథ కూడా

P.C:YouTube

నక్కలు దత్తత్రేయుడి శరీరాన్ని ఒక వైపు నుంచి తింటూ ఉంటే మరో వైపు నుంచి పునరుత్పత్తి అవుతూ ఉంటుంది. ఇలా అక్కడ నక్కల ఆకలిబాధను తీర్చి దత్తాత్రేయుడు అక్కడి నుంచి వెళ్లి పోయాడు. ఈ క్షేత్రానికి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం స్థానిక రాజు ఒకరు దత్తాత్రేయుని పరమ భక్తుడు. ఆయన్ను పూజించనిదే ఒక్క ముద్ద కూడా తినేవాడు కాదు.

4. నక్కకు ఆహారంగా

4. నక్కకు ఆహారంగా

P.C:YouTube

అంతే కాకుండా దానశీలి కూడా. ఒకసారి దత్తత్రేయుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఆ సమయంలో దత్తాత్రేయుడు రాజుగారి నక్కరూపంలో రాజు వద్దకు వస్తాడు. తనకు ఆకలిగా ఉందని చెబుతారు. దీంతో రాజు తన వద్ద ఉన్న పండ్లు ఆ నక్కకు ఇస్తాడు. అయితే తాను మాంసాహారినని అందువల్ల మాంసం కావాలని నక్క అడుగుతుంది. దీంతో తన చేతిని ఆ నక్కకు ఆహారంగా ఇస్తాడు.

5. 400 ఏళ్లుగా ఆచారం

5. 400 ఏళ్లుగా ఆచారం

P.C:YouTube

రాజు సేవ నిరతికి మెచ్చి దత్తాత్రేయుడు ప్రత్యక్షమయ్యి మోక్షం ప్రసాదించాడని కథనం. అదువల్లే ఈ కొండ పై దత్తాత్రేయుని విగ్రహం కలిగిన చిన్న ఆలయం కూడా ఉంది. ఇక గత 400 ఏళ్లుగా ఒక ఆచారం ఇక్కడ క్రమం తప్పకుండా నడుస్తూ ఉంది. బెల్లం, బియ్యం కలిపి తయారు చేసిన ఆహారాన్ని ప్రతి రోజూ సాయంత్రం ఆలయ పూజారి అక్కడే ఉన్న అరుగు వద్దకు తీసుకువస్తాడు.

6.లే అంగ్...లే అంగ్...అంటూ

6.లే అంగ్...లే అంగ్...అంటూ

P.C:YouTube

అటు పై ఓ పళ్లెం పై కొడుతూ లే అంగ్...లే అంగ్...లే అంగ్ అంటూ అరుస్తాడు. దీంతో చుట్టు పక్కల ఉన్న నక్కలు అక్కడికి వచ్చి ఆహారాన్ని తిని అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఆ నక్కలు ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఒక్కసారి కూడా హాని చేయలేదని భక్తులు చెబుతారు. ఇదంతా ఆ దత్తాత్రేయుని మహిమగా భావిస్తారు.

7.ట్రెక్కింగ్ ప్రియులను ఆకర్షిస్తోంది.

7.ట్రెక్కింగ్ ప్రియులను ఆకర్షిస్తోంది.

P.C:YouTube

ఇటీవల ఈ ప్రాంతం ట్రెక్కింగ్ ప్రియులను ఆకర్షిస్తోంది. వారాంతాల్లో ఎక్కువ మంది ఈ కొండ పైకి ట్రెక్ ద్వారా చేరుకొంటూ ఉంటారు. ఈ కొండ శిఖరం పైకి చూరుకుంటే పాకిస్తాన్ భూ భాగం కూడా కనిపిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X