Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ యోని స్రావిత జలన్ని తీర్థంగా సేవిస్తారు

ఇక్కడ యోని స్రావిత జలన్ని తీర్థంగా సేవిస్తారు

By Beldaru Sajjendrakishore

హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని ప్రాంతాలను 'శక్తి పీఠాలు' అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెబుతారు. కొంత మంది 18 అనీ, 51 అనీ, మరి కొందరైతే 52 అనీ, 108 అనీ ఎవరికి తోచింది వారు చెబుతారు. అయితే ఎవరెన్ని చెప్పిన 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారన్నది సత్యం.

శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిలోనూ అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి 18 ప్రదేశాలు. వాటినే అష్టాదశ శక్తి పీఠాలుగా గుర్తించి నేడు పూజిస్తున్నాం. అందులో ఒకటేమో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో (ప్రస్తుతం గుడి ధ్వంసం అయ్యింది), మరొకటేమో శ్రీలంకలో ఉండగా మిగతా పదహారు శక్తి పీఠాలు మన ఇండియాలో ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనదే యోని స్రావిత జలాన్ని తీర్థంగా సేవించే శక్తిపీఠం. ఇది ఎక్కడ ఉంది. దాని విశిష్టతలు ఏమిటి తదితర విషయాలన్నీ నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం...

పురుషాంగ రూపంలో 'లింగ'మయ్య

1. అష్టాదశ పీఠాల్లో ముఖ్యమైనది...

1. అష్టాదశ పీఠాల్లో ముఖ్యమైనది...

Image Source:

శక్తి స్వరూపుణి వెలసిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం. సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠల్లో అత్యంత శక్తిమంతమైనది కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. అస్సాంలోని బ్రహ్మపుత్రా నది ఒడ్డున, గౌహతికి సమీపంలో ఉందీ క్షేత్రం. ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చాంచల్యంగా భావిస్తారు.

2. కామం అంటే అది అర్థం కాదు...

2. కామం అంటే అది అర్థం కాదు...

Image Source:

కానీ, అసలు కామమన్నా, కామరూపిణి అన్నా అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలగడం అని అర్థం. అలా చెయ్యగలగిన శక్తిమంతురాలు కాబట్టే కామరూపిణి ఆ దేవత అయింది. కామాఖ్య దేవి అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. కామాఖ్యా దేవిని త్రిపుర శక్తిదాయినిగా కొలుచుకుంటారు.

3. మూడు రూపాల్లో దర్శనమిస్తుంది

3. మూడు రూపాల్లో దర్శనమిస్తుంది

Image Source:

ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో ఈ తల్లి ఇక్కడ దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది. ఈ రూపం చాల భయంకరంగా ఉంటుంది. . ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహినియై దర్శనమిస్తుంది. పరమే శ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపురసుందరిగా మారుతుంది. ఈ మూడు రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మధన్యమైనట్లు భావిస్తుంటారు.

4. ముందుగా స్వాగత ద్వారం..

4. ముందుగా స్వాగత ద్వారం..

Image Source:

ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది. స్వాగత ద్వారం కూడా ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్టుంటుంది. స్వాగత ద్వారాన్ని దాటుకుని ముందుకు వెడితే అక్కడ స్థూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది. ఆలయం గోపురాదులు, లోపలి శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చవి చూపిస్తుంటాయి.

5. ఇక్కడే కామాఖ్య దేవి కొలువై ఉంటుంది...

5. ఇక్కడే కామాఖ్య దేవి కొలువై ఉంటుంది...

Image Source:

ఇక్కడ కనిపించే వాటిలో పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోనే కామాఖ్యాదేవి కొలువు దీరి ఉంది. ఈ ప్రధాన గోపురంపై ఉన్న శిఖరంపై బంగారు కలశం స్థాపితమై ఉంది. అలాగే, మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి. ప్రధాన గోపురంపై అసంఖ్యాక రీతిలో పావురాళ్లు వాలి ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మవారు విగ్రహరూపంలో దర్శనం ఇవ్వరు. అయినా భక్తులు చాలా దూరం నుంచి అమ్మవారి ఆశిస్సుల కోసం వస్తుంటారు.

6. ఇదీ పురాణ గాథ

6. ఇదీ పురాణ గాథ

Image Source:

ఇందుకో పురాణ కధ ఉంది. దక్షప్రజాపతి యజ్జం చేస్తూ పరమేశ్వరుడిని పిలవడు. అయినా దక్షప్రజాపతి కుమార్తే అయిన సచీదేవి ఆ కార్యానికి వెళ్లి అవమానించబడుతుంది. దీంతో వెంటనే ఆమె ప్రాణత్యాగం చేస్తుంది. దీన్ని భరించలేని పరమేశ్వరుడు అగ్రహోదగ్రుడై వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చెయ్యమని పంపిస్తాడు. అంతేకాకుండా ముల్లోకాలు భయపడేలా శివతాండం చేస్తాడు. దీన్ని చూసి దేవతలే భయపడుతారు.

7.విష్ణువు ఖండిస్తాడు...

7.విష్ణువు ఖండిస్తాడు...

Image Source:

తనలో అర్థభాగమైన భార్య తనను విడిచి ఎక్కడకూ పోలేదని తెలిసిన పరమేశ్వరుడు సాధారణ మానవునిలా లోకాన్ని పట్టించుకోకుండా విరాగిలా మారతాడు. భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని పిచ్చిగా తిరుగుతుంటాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు సుదర్శనంతో ఖండిస్తాడు. అలా ఖండించినప్సుడు ఆ ముక్కలన్నీ చెల్లాచెదురై వివిధ ప్రాంతాల్లో పడతాయి. అవే శక్తి పీఠాలని అంటారు.

8. యోగి భాగం ఇక్కడ పడింది...

8. యోగి భాగం ఇక్కడ పడింది...

Image Source:

ఈ రాతి యోనిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని అంటారు. ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. ఇక్కడ విశేష మేమిటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవీకి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. మృగశిర నక్షత్రం మూడవ పాదంతో మొదలుఎట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకూ అమ్మవారి ఋతు స్రావం జరిగే ప్రత్యేక రోజులు.

9. ఇందులోనే కామాఖ్య దేవినివాసం

9. ఇందులోనే కామాఖ్య దేవినివాసం

Image Source:

ఈ రాతి యోనిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని అంటారు. ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. ఇక్కడ విశేష మేమిటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవీకి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. మృగశిర నక్షత్రం మూడవ పాదంతో మొదలుఎట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకూ అమ్మవారి ఋతు స్రావం జరిగే ప్రత్యేక రోజులు.

10. దేవి భాగవతంలో ప్రత్యేక ప్రస్తావన ఉంది

10. దేవి భాగవతంలో ప్రత్యేక ప్రస్తావన ఉంది

Image Source:

దేవీ భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది. ఈ రోజుల్లో యోనిశిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది. ఈ ఎర్రని స్రావం శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండంలోని నీరుగా చెబుతారు. ఈ ప్రత్యేకమైన మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు. ఆ సమయంలో అక్కడకు వెళ్లడానికి చాలా మంది భయపడుతారు.

11. ఆ వస్త్రాలు ఉంటే...

11. ఆ వస్త్రాలు ఉంటే...

Image Source:

నాలుగో రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. అంతకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు, రజస్వల అయిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం.

12.ఇంద్రాది దేవతలు నిర్మించిన పుష్కరిణి

12.ఇంద్రాది దేవతలు నిర్మించిన పుష్కరిణి

Image Source:

అమ్మవారి ఆలయ శక్తి పీఠం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తిమంతమైంది. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారంటారు. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన. ఇందులో నీరు ఎరుపురంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్య కుండం, పాతక వినాశ కుండం అని పిలుస్తారు. అమ్మ వారి యోని స్రావిత పవిత్ర జలలాతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైనా నశిస్తుందని, బ్రహ్మ హత్యా పాతకమైనా నివారణ మవుతుందని విశ్వాసం.

13. యోని స్రావిత జలన్ని తీర్థంగా సేవిస్తారు

13. యోని స్రావిత జలన్ని తీర్థంగా సేవిస్తారు

Image Source:

దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది. ఇది పార్వతి కుండం. ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీకుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెడతారు. అంటే సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. అక్కడి యోని స్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు. ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతి కుండంలో మరో సారి తలస్నానం చేసి శుచులవ్వడం మంచిదని ఇక్కడి పూజార్లు చెబుతారు.

14. మన్మథుణ్ణి దగ్థం చేసింది ఇక్కడే

14. మన్మథుణ్ణి దగ్థం చేసింది ఇక్కడే

Image Source:

తనను మోహ పరవశుణ్ణి చేసేందుకు వచ్చిన మన్మథుణ్ణి ఈ నీలాచలంపైనే పరమేశ్వరుడు దగ్థం చేశాడు. అనంతరం రతీదేవి ప్రార్థనను ఆలించి ఆమెకు మాత్రమే కనిపించేలా తిరిగి బతికించారు అమ్మాఅయ్యలు. కాబట్టి ఈ ప్రాంతం కామరూప ప్రాంతమైంది. ఇక్కడ సకల దేవతలూ పర్వత రూపంలో ఉంటూ అమ్మను సేవించుకుంటుంటారు. ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్ఠాన దేవత నీల పార్వతి.

15. ఎంతో పురాతనమైనంది...

15. ఎంతో పురాతనమైనంది...

Image Source:

ఈ ఆలయం ఎంతో పురాతనమైనది.12వ శతాబ్దం వరకూ ఈ ప్రాంతాన్ని పాలించిన కామరూపాధిపతి తమ శాసనాల్లో ఆలయం ప్రస్తావన ఎక్కడా తీసుకురానప్పటికీ, తరువాతి వారి శాసనాల మేరకు కామేశ్వరి మహా గౌరి అమ్మవారు ఇక్కడ ఉన్నట్టు తెలుస్తోంది.13వ శతాబ్దం మొదట్లో గుత్తాధిపత్యం కోసం రాజుల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుతుండేవి. ఈ క్రమంలో కూచ్ బిహార్ రాజా విశ్వసింహ్ రాజయ్యాడు.

16. అందరినీ కోల్పోయి...

16. అందరినీ కోల్పోయి...

Image Source:

ఒకసారి జరిగిన యుద్ధంలో అయినవాళ్లనందరినీ కోల్పోయి వారిని విశ్వసింహ్ రాజు నీలాచలంపైకి వస్తాడు ఇక్కడితనికి ఒక వృద్ధురాలు కనిపించి సేద తీరుస్తుంది. ఆ సందర్భంలో అక్కడ కనిపించిన మట్టి దిబ్బ గురించి అవ్వను ప్రశ్ని స్తాడు రాజు. ఇందులోని దేవత చాలా శక్తిమంతురాలని, ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది. వెంటనే రాజు తన అనుచరులంతా తిరిగి రావాలని కోరుకుంటాడు.

17. గురివింద ఎత్తులో బంగారం

17. గురివింద ఎత్తులో బంగారం

Image Source:

వెంటనే వారంతా అతని వద్దకు వస్తారు. రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరవు శాంతిస్తే ఇక్కడ బంగారు గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు. అలాగే, అతని రాజ్యం సస్యశ్యామలమై సుఖవంతమవుతుంది. అప్పుడు రాజు గుడి కట్టించేందుకు మట్టిదిబ్బ తవ్వించగా అక్కడ కామాఖ్యాదేవి రాతిశిల బయటపడుతుంది. ఆ అమ్మకు మట్టి రాయిలో గురివింద ఎత్తులో బంగారాన్ని పెట్టించి తేనెతుట్టు ఆకార గోపురాదులతో ఆలయాన్ని నిర్మింపచేస్తాడు.

18. అంబూచి మేళా..

18. అంబూచి మేళా..

Image Source:

ఇక ప్రతీ ఆషాఢమాసంలో అయిదు రోజుల పాటు అంబుబాచి మేళా జరుగుతుంది. ఈ అంబుబాచి మేళానే కామాఖ్యా కుంభమేళాగా పిలుస్తారు. ఈ మేళా కనీవినని రీతిలో జరుగుతుంది. దీని వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలే తప్ప వర్ణించేందుకు భాష చాలదంటే అతిశయోక్తి కాదు. ఆ శుభ తరుణం రాగానే వేలాదిమంది పండాలు, సిద్దులు వంటి వాళ్లే కాక సామాన్య భక్తులు కూడా ఆలయానికి తరలివచ్చి ఈ మేళాలో పాల్గొని అమ్మపై తమకున్న భక్తిశ్రద్ధలను చాటుకుంటారు.

19. అఘోరాలు...

19. అఘోరాలు...

Image Source:

ఈ సందర్భంగా వారు చేసే తప్పెట్లు, తాళాలు వాయించుకుంటూ చేసే విన్యాసాలు, అభినయించే నృత్యాలు, ఇంతింత బారున జటలు కట్టిన జుట్టుతో ఉన్న సాధులు, సాధ్విలు పెట్టే అభయ ముద్రలు ఆకర్షణీయంగా ఉంటాయి. సాధారణ రోజుల్లో కూడా సాధువులు, సంతులు, అఘోరాలు, తాంత్రికులు ఇక్కడకు వచ్చి అమ్మను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అన్నట్టు ఈ ఆలయం ఎక్కువగా మంత్ర, తాంత్రిక, ఐంద్ర జాలాలకు కామాఖ్యాక్షేత్ర శక్తి పీఠం కేంద్రస్థానంగా చెబుతారు.

20. ఉమానంద భైరవుడిగా...

20. ఉమానంద భైరవుడిగా...

Image Source:

కామాఖ్యా దేవీ మందిరం అధిష్ఠాన దేవత భైరవి కామాఖ్యాదేవి. అమ్మ ఎక్కడుంటే అయ్య కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి నీలాచలమంతా అమ్మాఅయ్యల స్వరూపమే. ఇక్కడ పరమేశ్వరుడు ఉమానంద భైరవునిగా ఉంటాడు. నీలాచలానికి తూర్పుభాగంలో బ్రహ్మపుత్రా నది మధ్యలో వేంచేసి ఉన్నాడీ స్వామి. అందుకే మందిరం కింద ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ శివుడు లింగస్వరూపంలో దర్శనమిస్తాడు.

21. ఇలా వళ్లవచ్చు.

21. ఇలా వళ్లవచ్చు.

Image Source:

అస్సాం రాజధాని గౌహతికి రైలు, విమానం, యాత్రాట్రావెల్స్ ద్వారా కూడా ప్రయాణం చేయవచ్చు. ఇక్కడకు రోడ్డు, రైలులో చేసే ప్రయాణం ఒక మధురానుభూతిని మిగిలిస్తుంది. ఈ ప్రయాణంలో మనతో పాటే సాగివచ్చే ఈ అందమైన ప్రకృతి మన హృదయ సీమలో చెరగని స్థానాన్ని పదిలపరచుకుంటుంది. ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ గౌహతి వచ్చిన వారికి ఇక్కడికి 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న నీలాచల పర్వతాలు మరింత అందాలతో కనువిందు చేస్తాయి.

22. ఒకటిన్నర కిలోమీటరు ఎత్తులో

22. ఒకటిన్నర కిలోమీటరు ఎత్తులో

Image Source:

గుబురుగా, దట్టంగా దారి కనిపించనంత ఎత్తుగా పెరిగిన చెట్టతో నిండి ఆకాశాన్నంటుతూ ఉన్న నీలాచలం - ఈ పర్వతం దిగువ అంచు తాకుతూ ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదీ జలం. ఇంత రామణీయకతను దర్శించిన భక్తుల జన్మ సఫలం. ఈ పర్వతంపైనే శక్తి పీఠం ఉంది. ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తున్న ఈ పర్వతం పైకి ఆటోలు, టాక్సీలపై చేరుకోవచ్చు. అమ్మను దర్శించుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more