Search
  • Follow NativePlanet
Share
» »కుమార స్వామి ఎముకలు ఉన్న దేవాలయం చూశారా?

కుమార స్వామి ఎముకలు ఉన్న దేవాలయం చూశారా?

ఉత్తరాఖండ్ లోని కుమారస్వామిదేవాలయానికి సంబంధించిన కథనం.

భారత దేశంలో ఉత్తరాఖండ్ కు దేవతలు కొలువై ఉన్న రాష్ట్రంగా పేరు. హిమాలయ పర్వత పాదాల్లో ఉన్నటు వంటి ఈ రాష్ట్రంలో హిందూ పురాణాలకు సంబంధించిన అనేక దేవాలయాలు ఉన్నాయి. అందులో కొన్నింటి వివరాలు విస్తుగొల్పేవిగా ఉన్నాయి. అటువంటి కోవకు చెందినదే కార్తికేయస్వామి దేవాలయం. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం..

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

కుమార స్వామి దేవాయం శివుడి కుమారుడైన కుమారస్వామికి అంకితం చేయబడిన దేవస్థానం. ప్రక`తి ఒడిలో ఉన్నటువంటి ఈ దేవాలయం హిందువులకు ఎంతో పవిత్రమైనది.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

అంతే కాకుండా ఉత్తర భారత దేశంలోనే కుమారస్వామికి ఉన్న అరుదైన దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటి.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

సముద్రమట్టానికి దాదాపు 3050 మీటర్ల ఎత్తులో ఉన్నటు వంటి ఈ దేవాలయం చేరుకోవడానికి 3 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

హిమాలయాల రాష్ట్రమైన రుద్రప్రయాగ్ జిల్లాలో కనక్ చౌరి గ్రామం సమీపంలో ఈ దేవాలయం ఉంటుంది. కనక్ చౌరి గ్రామం వరకూ వాహనాల్లో వెళ్లవచ్చు.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

అక్కడి నుంచి మాత్రం అత్యంత కఠినమైన మార్గంలో ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే ఈ దేవాలయన్ని చేరుకోగలం. ఇక ఈ దేవాలయం ముందు దాదాపు రెండు వందల గంటలు ఉంటాయి.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

వాటి శబ్ధం 800 మీటర్ల దూరం వరకూ వినిపిస్తుంది. హరిద్వార్ లేదా రిషికేష్ నుంచి రుద్రప్రయాగ్ వరకూ బస్సులో ప్రయాణం చేసి అక్కడి నుంచి కనక్ చౌరి గ్రామాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

అటు పై ట్రెక్కింగ్ ద్వారా ఈ కుమారస్వామిని దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు అన్నీ రుషికేష్ లోనే చేసుకొని ఇక్కడికి రావడం మంచిది.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

ఇదిలా ఉండగా ఉత్తర భారత దేశంలోని అరుదైన ఈ కుమారస్వామి దేవాలయం దర్శనం వల్ల సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని నమ్ముతారు.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం ఇక్కడ ఉండటం వెనుక ఒక ఆసక్తికర కథనం వినిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడా లేనటు వంటి కుమారస్వామికి చెందిన ఎముకలు ఈ దేవాలయంలో ఉన్నాయిని స్థానికులు భావన.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

ప్రమధ గణాలకు అధిపతితో పాటు , దేవుళ్లలో మొదటి పూజ ఎవరికి చేయాలన్న దాని పై తీవ్ర చర్చ జరుగుతుంది. చివరికి ఇందుకు వినాయకుడితో పాటు, కుమరస్వామి సరైన వారిగా అందరు దేవతలు గుర్తిస్తారు.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

అయితే ఒక్కరికి మాత్రమే ఈ గౌరవం దక్కాలని దేవవతలు నిర్ణయిస్తారు. ఇందు కోసం అన్నదమ్ములైన ఆ కుమారస్వామి, వినాయకుడికి పరీక్ష పెట్టాలని ఆ పరమశివుడు నిర్ణయిస్తారు.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

దాని ప్రకారం ఈ భూ మండలాన్ని ఎవరు ఏడుసార్లు చుట్టి, తీర్థాల్లో స్నానం చేసి మొదట ఇక్కడికి వస్తారో వారికే మొదటి పూజ నిర్వహించాలని పరమశివుడు పరీక్ష పెడుతాడు.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

దేవతలతో పాటు కుమారస్వామి, వినాయకుడు కూడా ఈ పరీక్ష విధానం పట్ల మొదట ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే కుమారస్వామి వాహనం నెమలి. అది గాలిలో బాగా ఎగురుతుంది.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

ఇక కుమారస్వామి శరీరం కూడా చాలా సాధారణంగా ఉంటుంది. అయితే వినాయకుడి వాహనం ఎలుక చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది. వినాయకుడి శరీర ఆకారం వేగంగా వెళ్లడానికి సహకరించదు.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

దీంతో ప్రతి ఒక్కరూ ఇక కుమారస్వామి ఈ పరీక్షలో నెగ్గడం ఖాయమని భావిస్తారు. ఇదిలా ఉండగా కుమారస్వామి తన వాహనమైన నెమలి సహాయంతో విశ్వాన్ని చుట్టి రావడానికి బయలుదేరుతాడు.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

బాగా ఆలోచించిన వినాయకుడు తన తల్లిదండ్రులైన ఆ పరమశివుడు, పార్వతీ దేవిల కాళ్లకు నమస్కరించి వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

దీంతో కుమారస్వామి ఏ తీర్థానికి వెళ్లినా మొదట అక్కడ వినాయకుడే కనిపిస్తాడు. అయినా పట్టు విడవని కుమారస్వామి ఈ విశ్వాన్ని ఏడు సార్లు చుట్టి వస్తాడు.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

అయితే వినాయకుడు కుమారస్వామి కంటే ముందే తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుని అక్కడ కుర్చొండిపోతాడు. ఇక పరమశివుడు కూడా వినాయకుడు పరీక్షలో విజయం సాధించినట్లు ప్రకటిస్తాడు.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

ఎవరికైనా తల్లిదండ్రులే ప్రపంచమని వారి పాదపూజ కోటి తీర్థాలతో సమానమని చెబుతాడు. అయితే చిన్నవాడైన కుమారస్వామి ఈశ్వరుడి నిర్ణయం పట్ల అలుగుతాడు.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

దీంతో తన శరీరంలో కఠినంగా ఉండే కొన్ని ఎముకలను తీసి తన తల్లి అయిన పార్వతీ దేవికి ఇచ్చి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోతాడు. ఈ ఘటన మొత్తం జరిగింది ప్రస్తుతం కార్తికేయ దేవాలయం ప్రాంతం.

కార్తిక్ స్వామి దేవాలయం

కార్తిక్ స్వామి దేవాలయం

P.C: You Tube

ఇప్పటికీ కార్తికేయునికి చెందిన ఎముకలను మనం ఈ దేవాలయంలో చూడవచ్చు. అందువల్ల కొంత కఠినప్రయాణమైనా చాలా మంది ఈ దేవాలయానికి వెలుతుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X