Search
  • Follow NativePlanet
Share
» »ఈ స్పోడ్ ఎక్కడ అందుబాటులో ఉందో తెలుసా?

ఈ స్పోడ్ ఎక్కడ అందుబాటులో ఉందో తెలుసా?

కేరళ ప్రభుత్వం ఇటీవల వేగ 120 పేరుతో నూతన స్పీడ్‌బోట్‌ను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన కథనం.

కేరళ ప్రభుత్వం భారత పర్యాటక ప్రేమికులకు ఒక తీపివార్తను తీసుకువచ్చింది. ముఖ్యంగా జలక్రీడలంటే ఇష్టపడేవారికి ఈ వార్త అత్యంత సంతోషకరంగా ఉంటుంది. అదే నీటిలో అత్యంత వేగంగా పరుగులు తీసే స్పీడ్ బోట్. దీంతో ఇక పై కేరళకు పర్యాటకానికి వెళ్లేవారు ఈ స్పీడ్‌బోట్‌లో ప్రయాణం చేసి మరింత ఆనందకరంగా తమ పర్యాటకానికి మార్చుకోవచ్చు. ఇందుకు సంబంధించిన కథనం మీ కోసం....

వేగ 120

వేగ 120

P.C: You Tube

కేరళ ప్రభుత్వం వేగ 120 పేరుతో అత్యంత వేగంగా పర్యటించే స్పీడ్ బోట్‌ను లాంచ్ చేసింది. ఈ స్పీడ్‌బోట్ ఎర్నాకులం, కొట్టాయం, అళప్పీ మీదుగా ప్రయాణం చేస్తుంది. కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని ట్వీట్ చేసింది.

గంటకు 25 కిలోమీటర్లు

గంటకు 25 కిలోమీటర్లు

P.C: You Tube

ఈ బోట్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీంతో ఎర్నాకులం, వయోకాం మధ్య ప్రయాణం కేవలం 90 నిమిషాల్లో పూర్తవుతుంది. దీనివల్ల అతి తక్కువ సమయంలోనే ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలవుతుంది.

ఇప్పటివరకూ కేవలం 14 కిలోమీటర్లు

ఇప్పటివరకూ కేవలం 14 కిలోమీటర్లు

P.C: You Tube

ఇప్పటివరకూ కేరళలో స్పీడ్ బోట్ వేగం ప్రతి గంటకు కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే. దీంతో వేగ 120 వచ్చినతర్వాత నది ద్వారా ప్రయాణించేవారికి ఎంతో అనుకూలమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్పీడ్‌బోట్ కు ఫీడర్‌బోట్ సదుపాయం కూడా ఉంది. దీంతో ఎర్నాకులం, కొట్టాయం, అళప్పిలోని ప్రయాణికులకు ఉపయుక్తకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఎంత మంది ప్రయాణించవచ్చు.

ఎంత మంది ప్రయాణించవచ్చు.

P.C: You Tube

ఈ బోట్‌లో ఏసీ కూడా ఉంది. ఒకే సారి ఈ బోట్ ద్వారా 120 మంది ప్రయాణించవచ్చు. 40 మంది ఏసీ క్యాబిన్ లో కుర్చోవడానికి అవకాశం ఉంది. మరో 80 మంది సామాన్య క్యాబిన్‌లో కుర్చొవచ్చు.

టికెట్ ఎంత

టికెట్ ఎంత

P.C: You Tube

ఈ బోట్‌లో నీవు ఏసీ క్యాబిన్ లో ప్రయాణించాలంటే రూ.80 టికెట్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే సామాన్య క్యాబిన్ లో ప్రయాణించాలంటే మాత్రం రూ.40 ఉంటే చాలు. అందువల్లే తక్కువ ఖర్చుతో మనం మన గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.

ఎవరు నిర్మించారు

ఎవరు నిర్మించారు

P.C: You Tube

ఈ బోట్‌ను నవగతి మెరైన్ డిసైన్ అండ్ కన్‌స్ట్రక్షన్ ఏజెన్సీ నిర్మించింది. ఈ బోట్ అన్నికరాల భద్రతా ప్రమాణాలను పాటించి నిర్మించబడిందని ప్రభుత్వం సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. ఇందులో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్‌మెంట్స్ కూడా ఉండటం వల్ల ఎటువంటి భయం లేకుండా ప్రయాణం చేయవచ్చునని చెబుతారు.

పర్యాటకులకు కూడా

పర్యాటకులకు కూడా

P.C: You Tube

ఈ వేగ 120 వల్ల స్థానికులకే కాకుండా పర్యాటకులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. దీని వల్ల పర్యాటక శాఖకు కూడా అధిక ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X