Search
  • Follow NativePlanet
Share
» »కొడ‌చాద్రి ట్రెక్కింగ్ ఈ సీజ‌న్‌లో అద్భుతంగా ఉంటుంది

కొడ‌చాద్రి ట్రెక్కింగ్ ఈ సీజ‌న్‌లో అద్భుతంగా ఉంటుంది

కొడ‌చాద్రి ట్రెక్కింగ్ ఈ సీజ‌న్‌లో అద్భుతంగా ఉంటుంది

కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఉంది కొడచాద్రి. ఇది ప్రసిద్ధ మూకాంబిక ఆలయం ఉన్న కొల్లూరు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం చుట్టూ పచ్చని చెట్లతో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. ఇక్క‌డ‌కు సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ట్రెక్‌ను ఎంచుకోవడానికి ఉత్తమ సమయంగా భావించ‌వ‌చ్చు. ఈ సీజ‌న్‌లో ట్రెక్కింగ్‌ కేవ‌లం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండ‌డమే కాకుండా అనుకూలంగా మరియు సురక్షితంగా ఉంటుంది. 15 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్న బేస్ నుండి మొత్తం కాలిబాట గుండా ట్రెక్కింగ్ చేయవచ్చు. లేకుంటే, జీపులో అనుకూలమైన ప్రదేశానికి వెళ్లి, అక్కడి నుండి ట్రెక్కింగ్ చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంది.

కర్నాటక ప్రభుత్వంచే వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడిన కొడచాద్రి ట్రెక్ భారతదేశంలోని అత్యుత్త‌మ‌ ట్రెక్‌లలో ఒకటిగా పేరుగాంచింది. ట్రెక్కింగ్ స‌మ‌యంలో అత్యుత్తమ వృక్షజాలం, జంతుజాలంతో ప్ర‌కృతి అందాల‌ను ద‌గ్గ‌ర‌గా చూసే అవ‌కాశం క‌లుగుతుంది. ప‌ర్వ‌త శిఖ‌రాల సోయ‌గాలు ప‌ర్యాట‌కుల‌ను మ‌రో ప్ర‌పంచ‌పు వీధుల్లో విహ‌రించే అనుభ‌వాన్ని చేరువ చేస్తాయి. ట్రెక్కింగ్‌ పరంగా, ఈ ప్రదేశాన్ని రెండు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. నిటారుగా ఉండే ట్రయల్స్‌ను ఎంపిక చేసుకోవ‌డం కాస్త క‌ష్ట‌మైన ట్రెక్ అనే చెప్పాలి. ఈ ప్రక్రియలో హిడ్లుమనే జలపాతాన్ని చూసే అవ‌కాశం ఉంటుంది. ఎంతో అందంగా, స‌హ‌జ‌సిద్ధంగా తార‌స‌ప‌డే ఈ జ‌ల‌పాతపు ప్ర‌యాణం ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది

జీప్ తీసుకొని చివరి ఐదు కిలోమీట‌ర్లు

జీప్ తీసుకొని చివరి ఐదు కిలోమీట‌ర్లు

మెజారిటీ ప్రజలు నాగోడి లేదా నిట్టూరు సందర్శించి అక్కడ అందుబాటులో ఉన్న హోమ్‌స్టేలో విడిది చేసేందుకు మొగ్గు చూపుతారు. ఇది వర్షాకాలంలో కొడచాద్రి ట్రెక్ చేయడానికి మరియు చుట్టుపక్కల ప్రదేశాల‌ను అన్వేషించడానికి చాలా సులభంగా ఉంటుంది. జీప్ తీసుకొని చివరి ఐదు కిలోమీట‌ర్లు ట్రెక్కింగ్ చేయాల‌నుకునేవారు త‌ప్ప‌నిస‌రిగా గైడ్ సాయం తీసుకోవాలి. అక్క‌డి ప‌రిస‌రాల‌పై పూర్తి అవ‌గాహ‌న ఉన్న అనుభ‌వ‌జ్ఞులైన గైడ్‌లు నిత్యం అందుబాటులో ఉంటారు. మీ ట్రెక్‌ను విజ‌య‌వంత‌గా పూర్తి చేయాల‌నుకుంటే వీరి స‌హాయం త‌ప్ప‌క అవ‌స‌రం ఉంటుంది.

చేరుకోవడానికి ఉత్తమ మార్గం

చేరుకోవడానికి ఉత్తమ మార్గం

అలాగే, కొడచాద్రికి చేరుకోవడానికి ఉత్తమ మార్గం ఏది అని ఆలోచిస్తున్నారా? కొడచాద్రికి చేరుకోవడానికి సులభమైన మరియు సౌకర్యవంతమైన మార్గం బెంగళూరు. అక్క‌డి నుంచి నిట్టూరు వరకు క్యాబ్‌ను అద్దెకు తీసుకొని, అక్కడే విడిది చేసి, మరుసటి రోజు కొడచాద్రి ట్రెక్‌ను ప్రారంభించవచ్చు. లేదా, కుందపురా రైల్వే స్టేషన్ వరకు రైలులో ప్రయాణించి, నిట్టూరు వరకు క్యాబ్‌లో ప్రయాణించవచ్చు. విమానాశ్రయం నుండి మీ ప్రయాణం సుమారు 2 గంటల 30 నిమిషాలు పడుతుంది. కుందపురా రైల్వే స్టేషన్ నుండి సుమారు 7 గంటలు పడుతుంది.

కొడచాద్రి ట్రెక్ కోసం చిట్కాలు

కొడచాద్రి ట్రెక్ కోసం చిట్కాలు

కొడచాద్రికి ట్రెక్కింగ్ ట్రిప్ విషయంలో గుర్తుంచుకోవలసిన కొన్ని ప్రాథమిక అంశాలు ఉన్నాయి. ఈ చిట్కాలను దృష్టిలో ఉంచుకుంటే, మీ ట్రిప్ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా సాగిపోతుందని భావించ‌వ‌చ్చు.

- వ‌స్తువులు ప్యాకింగ్ చేస్తున్నప్పుడు, మీకు అవసరమైన వస్తువులు, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి మరియు అవసరమైన మందులను ప్యాక్ చేయడం అవసరం. ట్రెక్ ఫ్రెండ్లీ దుస్తులను ధరించండి, అది మిమ్మల్ని తేలిక చేస్తాయి.

- వాటర్ బాటిళ్లను నిత్యం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. పర్యటనలో స్నాక్ ఫుడ్ ఐటమ్స్ ప్యాక్ చేయండి.

- క్యాంపింగ్ చేసే ఆలోచ‌న‌లో ఉంటే అవసరమైన అన్ని క్యాంపింగ్ వస్తువులను కూడా తీసుకెళ్లేలా చూసుకోవాలి. ట్రెక్‌లో ఎటువంటి ప్రాముఖ్యత లేని భారీ వస్తువులను తీసుకెళ్లడం మానుకోండి.
అవసరమైన అనుమతి ఆర్డర్‌లను ముందుగానే పొందండి.

Read more about: kodachadri shimoga karnataka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X