» »అక్కడి వారు తమ కోరికలు తీరాలంటే ఆ అమ్మవారిని తిడతారంటా ఎందుకంటే...

అక్కడి వారు తమ కోరికలు తీరాలంటే ఆ అమ్మవారిని తిడతారంటా ఎందుకంటే...

త్రిస్సూర్ జిల్లా లోని చిన్న పట్టణం అయినటువంటి కొడంగలూర్ , మలబార్ తీరం లో ఉంది. ఓడ రేవు కు, దేవి భగవతి మందిరానికి ప్రసిద్ధి చెందిన ఈ ఊరికి శతాబ్దాల చరిత ఉంది. క్రీ.శ. 7 వ శతాబ్దం లో చేరమాన్ ప్రభువుల రాజధాని గా ఉండటం తో దీనికి చారిత్రిక ప్రాముఖ్యం ఏర్పడింది. సముద్రానికి సమీపంలో ఉండటం వల్ల కొడంగలూర్, హిందూ మహా సముద్రం లో ఒక ముఖ్య వాణిజ్య ప్రదేశం గా వర్ధిల్లింది. ఆధునిక చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఈ పట్టణానికి సిరియా, ఆసియా మైనర్, ఈజిప్ట్ లాంటి మధ్య ప్రాశ్చ్య దేశాలతో వర్తక సంబంధాలు ఉండేవి. ప్రాచీన చరిత్రలు, సమోన్నత సంస్కృతులు ... ప్రాచీన కాలం నించి కొడంగలూర్ అనేక విలువైన సువాసనా ద్రవ్యాల ప్రధాన ఎగుమతిదారు గా ఇతర దేశాల్లో పేరు పొందింది. "యవనప్రియ" మిరియాలు ప్రధానం గా ఎగుమతి అయ్యేవి. సముద్రం తో, ఉప్పు నీటి కాలవలతో చుట్టబడిన ఈ పట్టణం, ఘనతకెక్కిన గత చరిత్ర తో వర్ధిల్లుతుంది.

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

ప్రాచీన కొడంగలూర్ రేవు క్రీ.పూ. 1 వ శతాబ్దం లోనే నావిక కార్యకలాపాలతో కోలాహలం గా ఉండేది. క్రైస్తవం, యూదు, మహమ్మదీయ మరియు ఇతర మతాల కి ప్రవేశ ద్వారంగా నిలచిన తీరానికి కొడంగలూర్ సంస్కృతి ఏంతో రుణ పడి ఉంది. కొడంగలూర్ ద్వారానే క్రైస్తవం కేరళ చేరుకుంది. సెయింట్ థామస్ ఇక్కడికి క్రీ.శ 52 "సువార్త" ని ప్రచారం చేయటానికి వచ్చాడని నమ్మిక. ఈ పట్టణం భారత దేశంలోనే మొదటి చర్చి కి చిరునామా.

PC: youtube

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

భారతీయ మహమ్మదీయ చరిత్ర లో కూడా కొడంగలూర్ కి విశిష్ట స్థానం ఉంది. క్రీ.శ 629 లో నిర్మించబడ్డ చేరమాన్ జమా మసీదు భారత దేశంలోనే మొట్ట మొదటి మహమ్మదీయ ప్రార్థనా మందిరం గా పరిగణించబడుతుంది. సంస్కృతుల , మతాల సంగమం ... సమకాలీన సమయంలో కొడంగలూర్ ఒక యాత్రికుణ్ని, ఒక చరిత్రకారుణ్ని సమంగా సంతృప్తి పరుస్తుంది.

PC: youtube

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

ప్రజలు ముఖ్యంగా ఇక్కడి అందమైన తీర ప్రాంతాన్ని వీక్షించడానికి, చరిత్ర లో తల మునకలు అవ్వడానికి, వివిధ మత పరమైన మొక్కులు తీర్చుకోడానికి కొడంగలూర్ ప్రయాణిస్తారు. అరేబియన్ సముద్రం, పెరియార్ నది తో పరివేష్టించబడిన ఈ ప్రదేశం ప్రకృతి ప్రేముకులని దగ్గరకు రప్పిస్తుంది.

PC: youtube

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

ఔత్సాహికులైన పర్యాటకులకు ఈ పట్టణం లెక్కలేనన్ని వినోదాలు చూపిస్తుంది. కేరళ ఆధునిక చరిత్ర లో కొడంగలూర్ ప్రఖ్యాత భగవతి మందిరానికి నెలవు గా పేరు మోసింది. పట్టణ ప్రధాన ప్రాంతంలో గల కురుంబ భగవతి ఆలయం ( కొడంగలూర్ భగవతి ఆలయం లేక కురుంబకవు ఆలయం గా ప్రసిద్ధి ) లో భద్రకాళి అమ్మవారు కొలువు దీరి ఉంటారు. వినుతికెక్కిన కొడంగలూర్ భరణి , తలప్పొలి ఉత్సవాలు లక్షలాది భక్తులని పండుగ రోజుల్లో ఇక్కడికి చేరుస్తాయి.

PC: youtube

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

కేరళ అనగా పచ్చని ప్రకృతి గుర్తుకువస్తుంది. అక్కడి ప్రజల భిన్నమైన జీవన శైలి గుర్తుకువస్తుంది. కాని మిగతా ఏ రాష్ట్రానికి తీసిపోనివిధంగా అక్కడ ప్రాచీన ఆలయాలు ఎన్నో వున్నాయన్నవిషయం మాత్రం చాలామందికి తెలియదు. అలాంటి ఓ అరుదైన ఆలయమే కొడుంగల్లూర్ భగవతీఆలయం.కేరళలోని ముఖ్య పట్టణం కొచ్చిన్ కి కేవలం 29కిమీల దూరంలో కొడుంగల్లూర్ అనే వూరుంది.

PC: youtube

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

ఆ వూరిలో వున్న అతి ప్రాచీనఆలయమే కొడుంగల్లూర్ అమ్మవారి ఆలయం.విష్ణువు అవతారమైన పరశురాముడు కేరళను సముద్రంనుండి వెలికి తీసిన విషయం తెలిసిందే. అందుకే ఆ రాష్ట్రానికి పరశురామక్షేత్రం అనే పేరు కూడా వుంది.అయితే ఇలా వెలికితీసిన తర్వాత కేరళను దారుకా అనే రాక్షసుడు పట్టిపీడించసాగాడట.

PC: youtube

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

అతనినుంచి ఎలాగైనా రక్షించమంటూ పరశురాముడు ఆ మహాదేవుని ప్రార్ధించాడు. అంతట ఆ పరమేశ్వరుడు భద్రకాళిని ప్రతిష్టించమని సూచించాడట.ఆ సూచనమేరకు పరశురాముడు కొడుంగల్లూర్ వూరిలో భద్రకాళిఅమ్మవారిని ప్రతిష్టించారని చెబుతారు. ఆ అమ్మవారి అనుగ్రహంతో దారుకా రాక్షసుడు మృత్యువాత పడ్డాడు.

PC: youtube

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

కొడుంగల్లూర్ భద్రకాళిఆలయం చాలా ప్రాచీనమైనదని చెప్పేందుకు ఇక్కడి ఆచారాలేసాక్ష్యం.రాష్ట్రంలో ఆమాటకు వస్తే దేశంలోనే ఎక్కడా కనిపించని ఆచారాలు కనిపిస్తాయి.ఇక్కడ అమ్మవారికి ఒకప్పుడు విపరీతంగా బలిచ్చేవారట.కానీ ప్రస్తుతంబలులను నిషేదించటంతో బలికి సూచనగా ఎర్రటిఎరుపు రంగులో వున్న దోవతీలను అమ్మవారికి సమర్పిస్తూవుంటారు.

PC: youtube

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

ఇక కావుతీండల్ అనే వుత్సవంసందర్భంగా భక్తులు కర్రలు చేతపట్టుకుని గుడి చుట్టూ ముమ్మారులు ప్రదక్షిణచేసే ఆచారం కల్పిస్తూవుంటుంది. ఒకప్పుడు అమ్మవారు ఆయుధాలు ధరించి రాక్షసులమీద పోరుకు వెళ్ళిన సందర్భానికి ప్రతీకగా భక్తులు ఇలా చేస్తారని కొందరివిశ్లేషణ. వీటన్నిటికంటే చిత్రమైన ఆచారం భరణివుత్సవంలో కనిపిస్తూవుంటుంది.

PC: youtube

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

మార్చి-ఏప్రెల్ నెలలమధ్య వచ్చే ఈ ఉత్సవంసందర్భంగా పూనకం వచ్చిన వారంతా పరుగులు పెడుతూ అమ్మవారిని దుర్భాష్యలాడుతారు.కొడుంగల్లూర్ అమ్మవారి ఆలయంకూడా చాలా విభిన్నంగా వుంటుంది. 10ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో మహావృక్షాల నీడలో ఈ ఆలయం కనిపిస్తుంది.

PC: youtube

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

ఈ ఆలయంలోని అమ్మవారు కూడా 7అడుగుల చెక్కవిగ్రహంలో కనిపిస్తారు. మన సింహాచలంలో లాగా ఇక్కడి అమ్మవారి విగ్రహానికి కూడా ప్రతియేటా చందనోత్సవాన్ని జరుపుతారు. ఆలయంలో అమ్మవారితో పాటు సప్త మాతృకలు వీరభద్రుడుగణపతివిగ్రహాలు కనిపిస్తాయి.

PC: youtube

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

తరతరాలుగా కొడుంగల్లూర్ సంస్థానానికి చెందినరాజులు ఈ ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వాలుమారినా ఇప్పటికీ ఈ ఆలయం మీద వారిదే పైచేయిగా వుంటుంది.కేవలం కొడుంగల్లూర్ రాజులేకాదు. కేరళను పాలించినరాజులెందరో ఈ అమ్మవారిని తమ కుల దేవతగా భావించేవారు.

PC: youtube

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

అందుకే తమిళ ప్రాచీనగ్రంథం శిలప్పదిగారంలో కూడా ఈ దేవతాప్రస్థానం కనిపిస్తూవుంటుందట. ఇంత విశిష్టమైన ఆలయంకాబట్టే కేరళవాసులు వేలసంఖ్యలో నిత్యం ఈ అమ్మవారిని దర్శించుకుంటూవుంటారు.

PC: youtube

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

కీళ్ తలి మహాదేవ ఆలయం, కూడళ్ మాణిక్యం ఆలయం, మర్ తోమ చర్చి, శృంగపురం మహాదేవ ఆలయం, తిరువచిక్కులం మహాదేవ ఆలయం, త్రిప్రయార్ శ్రీ రామ ఆలయం ఇక్కడి ఇతర ముఖ్య మత ప్రదేశాలు. బంగారు వన్నె ఇసుక తీరాలతో , తాటి చెట్ల వరసలతో మనోహరంగా ఉండే కద్దిపురం సముద్రతీరం తీర ప్రేమికులకు, జలక్రీడాకారులకు స్వర్గధామం.

PC: youtube

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

కొట్టప్పురం కోట శిధిలాలు యాత్రికులను ఆకర్షించే మరో విశేషం. ఒక వినూత్నమైన ప్రయాణ అనుభవం ... కేరళ మధ్య భాగం లో ఉండటం వల్ల కొడంగలూర్ కి అనుసంధానం అతి సులభం. ఇది త్రిస్సూర్, కొచ్చి లకు సమ దూరం లో ఉంది. ఉత్తర , దక్షిణ కేరళ నించి కుడా ఇక్కడకి చేరటం తేలిక.

PC: youtube

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

దీని జలమార్గం, కేరళలో ఇతర చిన్న పట్టణాల నించి దీన్ని విభిన్నంగా చేస్తుంది. భారతదేశం లో పశ్చిమ తీర కాలువ అధిక పర్యాటక సంభావ్యం గల ముఖ్య నౌకాయానయోగ్య ప్రాంతం. మరెన్నో ఇతర దక్షిణ భారత పట్టణాల వలే కొడంగలూర్ సంవత్సరం పొడుగునా ఉష్ణ మండీలయ వాతావరణాన్ని అనుభవిస్తుంది.

PC: youtube

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

సాగర తీర సామీప్యత దీనికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కానుకగా ఇస్తుంది. ఆసక్తికరమైన చరిత్రతో , అనేకానేక మతపరమైన ప్రదేశాలతో కొడంగలూర్ పర్యాటకులకి విలక్షణమైన అనుభవం అందిస్తుంది.

PC: youtube

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

అత్యుత్తమ సమయం

కొడంగలూర్ లోని మిశ్రమ వాతావరణం , కేవలం వర్షాకాలం తప్ప, తక్కిన సంవత్సరం పొడుగునా పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. డిసెంబర్ నించి ఫిబ్రవరి ఈ పట్టణం సందర్శిండానికి అత్యుత్తమ సమయం. ఆగష్టు నించి నవంబర్ మధ్య కాలం లో చాలా వేడుకలు జరగడం వల్ల, కొడంగలూర్ వెళ్ళటానికి అది కుడా మంచి సమయం.

PC: youtube

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

రోడ్డు మార్గం

కొడంగలూర్ పట్టణానికి విస్తృతమైన రహదారులు ఉన్నాయి. కేరళ రాష్ట్ర రహదారి రవాణ బస్సులు , ప్రైవేటు బస్సులు విరివిగా ఉన్నాయి. ప్రయాణికులు కొడంగలూర్ కి కొచ్చి (44 కి.మీ), త్రిస్సూర్ (38 కి.మీ ), గురువాయుర్ (50 కి.మీ) నించి చేరుకోవచ్చు. దక్షిణ భారత దేశంలోని ఇతర ప్రధాన నగరాలనించి కూడా బస్సులు ఉన్నాయి.

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

రైలు మార్గం

కొడంగలూర్ కి అత్యంత సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ ఇరింగలకుడ (16 కి.మీ లు). ఇరింగలకుడ నించి కేరళ లోని వివిధ ప్రాంతాలకి విరివిగా రైళ్ళు ఉన్నాయి. రైల్వే స్టేషన్ నించి కొడంగలూర్ పట్టణం చేరుకోవడానికి టాక్సీ సేవలను ఉపయోగించుకోవచ్చు. బస్సులు, ఆటో రిక్షా లు కూడా ఉన్నాయి.

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే

ఇక్కడ అమ్మవారిని తిట్టడమే "పూజ"

విమాన మార్గం

35 కి.మీ ల దూరం లో గల కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం కొడంగలూర్ కి అత్యంత సమీపంలో ఉన్న విమానాశ్రయం . కొచ్చి విమానాశ్రయానికి భారతదేశంలోని చెన్నై,బెంగుళూరు, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి ముఖ్య నగరాల నించి చక్కటి సంధాయకత ఉంది. విమాన మార్గం లో వచ్చే వారు విమానాశ్రయం నించి టాక్సీ సేవలను ఉపయోగించుకోవచ్చు.