Search
  • Follow NativePlanet
Share
» »భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కోటి లింగాల క్షేత్రం..

భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కోటి లింగాల క్షేత్రం..

కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలంలోని ప్రముఖ కోటిలింగాల క్షేత్రం ఉంది. కోటిలింగాల ప్రస్తుతం ఓ కుగ్రామం. కానీ క్రీ.పూ.4వ శతాబ్దం నాటికే ఆంధ్రుల అతి ప్రాచీన రాజధాని నగరం. ఇది మొదట కోటలోని లింగాలుగా ఉండి, తర్వాత కోట లింగాలుగా, అటుపై క్రమంగా కోటిలింగాలగా మారి ఉంటుందని చరిత్రకారులు, భాషాశాస్త్రవేత్తల అభిప్రాయం.

కోటిలింగాల అంటే ఇక్కడ కోటి శివలింగాలు లేవు. కోటలో లింగముండటం వల్ల కోటలింగమైంది. శాతవాహనుల కాలంలో ఇక్కడ 110 ఎకరాల విస్తీర్ణంలో దీర్ఘచతురస్రాకారంలో పెద్దకోట ఉండేది. దానికి ఎత్తైన గోడలతో పాటు నాలుగు మూలాల ఎత్తైన కోట బురుజులు ఉండేవి. వాటి ఈశాన్య మూలన ఉన్న కోట బురుజు శిథిలమై ఎత్తైన గడ్డగా మారిన తర్వాత కాలంలో ఈ గడ్డపైన గుడికట్టి, లింగాన్ని ప్రతిష్ఠించగా దానిని కోటలింగం అని, అదే కాలక్రమేణ కోటిలింగంగా రూపాంతరం చెందింది.

అందులోని దేవుడు కోటేశ్వరస్వామిగా పిలవబడుతున్నాడు. కోటేశ్వరాలయంపై రెండు గోపురాలు, ఆలయం ముందు భాగంలో మహామండపం ఉంది. ఈ ఆలయం ఎక్కడ ఉంది విశేషాలేంటో తెలుసుకుందాం..

కరీంనగర్ నుంచి లక్షెట్టిపేట వెళ్లే దారిలో వెల్గటూర్

కరీంనగర్ నుంచి లక్షెట్టిపేట వెళ్లే దారిలో వెల్గటూర్

కరీంనగర్ నుంచి లక్షెట్టిపేట వెళ్లే దారిలో వెల్గటూర్ నుంచి తూర్పు దిశగా ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే కోటిలింగాల వస్తుంది. దేశంలోనే రెండ అతి పెద్ద జీవనదియైన గోదావరీనది తీరాన శాతవాహనుల చరిత్రకు కంచుకోటలాగా నిలిచిన ఈ మహాపుణ్యక్షేత్రాన్ని శివభక్తులు తప్పక దర్శిస్తారు.ఎలాంటివారికైనా ఇక్కడి స్థలపురాణం గురించి తెలిస్తే తప్పక ఈ క్షేత్ర దర్శనానికి పూనుకుంటారు.

కోటిలింగాల చారిత్రక బౌద్ధక్షేత్రము.

కోటిలింగాల చారిత్రక బౌద్ధక్షేత్రము.

గ్రామానికి తూర్పున దక్షిణం నుండి ఈశాన్యం వైపు ప్రవహించి గోదావరి నదిలో కలుస్తున్న పెద్దవాగు ఉంది. ఈ రెండు కలిసే చోటు మునేరు అంటారు. వెనుకట ఇక్కడ మునులు స్నానం చేసేవారట. అందుకే ఆ పేరు వచ్చింది. కోటిలింగాల చారిత్రక బౌద్ధక్షేత్రము. చరిత్రకారులు ఇది శాతవాహనుల తొలి రాజధానిగా భావిస్తున్నారు.
pc:youtube

శాతవాహన వంశానికి మూలపురుషుడని భావింపబడే శ్రీముఖుడు

శాతవాహన వంశానికి మూలపురుషుడని భావింపబడే శ్రీముఖుడు

శాతవాహన వంశానికి మూలపురుషుడని భావింపబడే శ్రీముఖుడు కోటిలింగాలను రాజధానిగా చేసుకుని పాలించాడని, ఆయన నాణాలు కోటిలింగాలలోలభ్యమైనాక చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికింది.
pc:youtube

హాల చక్రవర్తిగాథా సప్తశతిలోని

హాల చక్రవర్తిగాథా సప్తశతిలోని

ప్రస్తుత జగిత్యాల జిల్లాలో ధర్మపురి నియోజకవర్గంలో, ధర్మపురి క్షేత్రానికి 19కి.మీ.ల దూరాన వెల్గటూరు మండలంలోని గోదావరి, పెద్దవాగు సంగమ స్థానమందుగల కోటిలింగాలలోని పుట్టకోట గోడలు (పూర్వపుకోటలు) ఆంధ్రదేశ పాలకులైన శాతవాహనుల తొలి రాజులకు ఆటపట్టయినవి. హాల చక్రవర్తిగాథా సప్తశతిలోని గోదావరీ వర్ణన ఆధారంగా, లభ్యమైనట్టి సిముఖ నాణాలను బట్టి కోటిలింగాల శాతవాహనుల బలిష్ఠ దుర్గమని స్పష్టమైంది. కోటిలింగాల సమీపమునగల గుట్ట జైన మునుల ఆవాస స్థానముగా ఉండేదని తెలుస్తున్నది.
pc:youtube

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

గోదావరినది ఇసుకను వాడి కోటిఇసుక రేణువుల సాయంతో నిర్మింపబడటం వలన ఈ క్షేత్రానికి కోటిలింగాల అనే పేరొచ్చిందని స్థానికులు మనకు తెలుపుతారు. ప్రధానాలయంలో కోటీశ్వరుడు లింగరూపుడుగా ప్రతిష్ఠితుడుకాగా, దక్షిణ దిశలో ఉత్తర ముఖ గర్భగృహంలో సిద్ధేశ్వరుడు లింగరూపుడై ఉన్నాడు. ఆలయం చాళుక్యకళారీతులలోనుండి గోదావరి ఒడ్డున అనేక శిల్ప ప్రతిమలున్నాయి.
pc:youtube

పాశ్చాత్యులు ఇంకా ఆర్యులు

పాశ్చాత్యులు ఇంకా ఆర్యులు

పాశ్చాత్యులు ఇంకా ఆర్యులు ఈ ప్రాంతాన్ని చాలా తక్కువ దృష్టితో చూస్తారు గాని కోటిలింగాల ఘనచరిత్ర తెలుగువారి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన శాతవాహనులు సమయంనుండి వర్ధిల్లింది అని తెలీనివారికి కూడా తెలియచెప్పటం మన భాద్యత అని మరవకూడదు.
pc:youtube

స్థానికులు చెప్పే త్రేతాయుగంలోని కధ

స్థానికులు చెప్పే త్రేతాయుగంలోని కధ

స్థానికులు చెప్పే త్రేతాయుగంలోని కధ ఆధారంగా సాక్షాత్తూ చిరంజీవి అయిన మహా బాహుబలి ఆంజనేయుడు తెచ్చిన మహాకాశీ లింగ స్థానంలో సమయాభావం వలన మునినిర్మిత ఇసుక రేణువుల లింగం ప్రతిష్టించబడింది అని తెలుస్తోంది.
pc:youtube

అఖండ భారతావనిలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని

అఖండ భారతావనిలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని

అలా దేదీప్యమానంగా అఖండ భారతావనిలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని ఏర్పరచుకున్న ఈ ఆంజనేయ రక్షిత పార్వతిఆధిత దివ్యలింగ క్షేత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.వేల ఏళ్ల చరిత్రగల ఈ ఆలయం గురించి శాస్త్రీయమరియు శాస్త్ర అంశాలు ఇంకా అక్కడినేలలో భద్రంగా నిక్షిప్తమైవున్నాయని వాటిని ఏరోజుకైనా వెలికితీసి ప్రపంచానికి ఈ శైవక్షేత్రవిశిష్టతను హిందూసనాతనధర్మంలోని రాజసం, ఆ దర్పాన్ని, ఆత్మగౌరవాన్ని దిక్కులన్నింటికి చాటిన శాతవాహన చరిత్రను గురించి తెలియపరిచే ధృడసంకల్పంతోటున్న ఆర్కియాలజికల్ సర్వేఆఫ్ ఇండియా ఇంకా తెలంగాణాప్రభుత్వ ఆశయం అత్యంత అభినందనీయం.

pc:youtube

సమీపాన క్రీ.పూ.రెండవ శతాబ్దపుబౌద్ధ స్థూపం పాషాయిగాం గుట్టపైన

సమీపాన క్రీ.పూ.రెండవ శతాబ్దపుబౌద్ధ స్థూపం పాషాయిగాం గుట్టపైన

ఒకనాడు ఇక్కడి గోదావరి ఓడరేవు ద్వారా వాణిజ్య సరుకులు బంగాళాఖాతం తద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా జరిగేదని చారిత్రక పరిశోధకులు తేల్చారు. సమీపాన క్రీ.పూ.రెండవ శతాబ్దపుబౌద్ధ స్థూపం పాషాయిగాం గుట్టపైన ఉండేది. ప్రస్తుతం మధ్యయుగానికి చెందిన దేవాలయం గ్రామంలోఉంది. రెండు గర్భగృహాలకు ఉమ్మడి మంటపముంది. ప్రతి గర్భగృహంలో అంతరాళం ఉంది.
pc:youtube

ఆథ్యాత్మిక మరియు శాస్త్ర ప్రావీణ్యం గల శైవక్షేత్రంగా

ఆథ్యాత్మిక మరియు శాస్త్ర ప్రావీణ్యం గల శైవక్షేత్రంగా

అఖండ భారతావనిలో పేరొందిన అస్మక మహా జానపద సంస్థానం అనబడే స్వల్పజన పరిపాలన వ్యవస్థలుండే నెలకొన్న ప్రాంతం కావటం ఇంకొక విశేషమనేచెప్పాలి. అలాంటి ఆథ్యాత్మిక మరియు శాస్త్ర ప్రావీణ్యం గల శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ మహాపుణ్యక్షేత్రానికి ఏటా భక్తులతాకిడి ఎక్కువకావటం కూడా ఒక శుభపరిణామమనే చెప్పాలి. పురావస్తు శాఖచే త్రవ్వకాలు జరపబడి, పర్యాటక క శాఖ గుర్తింపు పొందింది. ప్రస్తుతం పర్యాటక శాఖ పక్షాన రెండు బోట్లు జలవిహారానికి తోడ్పడుతున్నాయి.

ఉత్సవాలు:

ఉత్సవాలు:

మహాశివరాత్రి పండుగ సమయంలో అనేక మంది యాత్రికులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. గోదావరి పుష్కరాలకు ప్రసిద్ది చెందింది. 12 పుణ్య నదులలో గోదావరి నది ఒకటి. ప్రతి 12 సంవ్సరాలకు గోదావరి పుష్కరాలు జరుగుతాయి.

pc:youtube

కోటిలింగాలు ఎలా చేరుకోవాలి:

కోటిలింగాలు ఎలా చేరుకోవాలి:

కోటిలింగాల వెల్గటూర్ నుండి 4 కి.మీ దూరంలో కరీం నగర్ ధర్మపురి రోడ్డున ఉన్నది. కోటిలింగాలకు రోడ్ మార్గం చాలా ఉత్తమం. కోటిలింగాలకు బస్సు సౌకర్యం ఉన్నా, ఫ్రీక్వెంట్ బస్సులు అంతగా లేవు. వెల్గటూర్ కు బస్సు మరియు ఆటోలో చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X