» »అందుకే అమిత్ షా ఈ క్షేత్రానికి వెళ్లాడా

అందుకే అమిత్ షా ఈ క్షేత్రానికి వెళ్లాడా

Written By: Beldaru Sajjendrakishore

అపజయాలు ఎదురవుతున్న సమయంలో దోష నివారణ పూజలు చేయడం వల్ల మంచి జరుగుతుందనేది హిందూ ధర్మంలో అనాదిగా వస్తున్న ఆచారం. రాజకీయంగా ఇటీవల కొన్ని ఎదురు దెబ్బలు తిన్న అమిత్ షా వాటి నుంచి ఉప శమనం పొందడానికే కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించినట్లు సమాచారం. ఇక్కడ ఆశ్లేజ బలి పూజ, లేదా కాలసర్ప దోష నివారణ పూజలు చేయడం వల్ల శుభం కలుగుతుందని కథనం. ఈ రెండు వీలుకాని సమయంలో కనీసం స్వామివారిని సందర్శించుకుని పూజ చేస్తే సకల దోషాలు తొలిగి పోతాయని హిందూ పురాణాలు చెబుతాయి. బడ్జెట్ తర్వాత బీజేపీ పై దేశంలో కొంత వ్యతిరేకత పెరుగుతోంది. త్వరలో కర్ణాటకలో ఎన్నికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని దోషాలు పోవడానికి వీలుగా కుక్కే సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని పూజలు చేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థల విశేషాలతో కూడిన కథనం.

1. మొదట కుక్కి పురం

1. మొదట కుక్కి పురం

Image source

మనదేశంలో ఉన్న సబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన క్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. కర్ణాటక రాష్ర్టంలోని మంగళూరు జిల్లాలోని ఈ క్షేత్రం బెంగళూరుకు సుమారు 400 కిలోమీటర్ల దూరం ఉంది. పూర్వం ఈ క్షేత్రాన్ని కుక్కి అని పిలచేవారు. కుక్కి అంటే గుహ అని అర్థం. ఈ క్షేత్రం కుక్కి లింగంగా, కుక్కి పురంగా అటు పై కుక్కి సుబ్రహ్మణ్యంగా రూపాంతరం చెందింది.

2. తారకాసుర వధ తర్వాత

2. తారకాసుర వధ తర్వాత

Image source

స్కంధపురాణానుసారం, షణ్ముఖుడు తారక మరియు శూరపద్మసుర అను రాక్షసులను సంహరించి కలిసి కుమార పర్వతాన్ని చేరుకుంటారు. ఇంద్రుడు కుమారస్వామికి ఇక్కడ ఘనంగా సన్మానించడంతోపాటు తన కుమార్తె అయిన దేవసేనను వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతాడు. ఇందుకు షణ్ముకుడు సంతోషంగా అంగీకరిస్తాడు.

3. అలా కుమార ధార

3. అలా కుమార ధార

Image source

ఇక కుమారస్వామి వివాహం కుమార ఇదే పర్వతం పైన మృఘశిర మాసం శుద్ధ షష్టి నాడు జరుగుతుంది. ఆ విహహ సమయంలో షణ్ముఖుడి దంపతులకు త్రిమూర్తులతో పాటు వివిధ దేవగణాలు దేశం నలుమూలల నుంచి తీసుకువచ్చి పుణ్యనదీ జలాలలతో స్నానం చేయిస్తారు. ఆ నదీ జలాలలే ప్రస్తుతం దేవాలయం దగ్గర ఉన్న కుమారధార నదిగా చెబుతుంటారు.

4. చర్మరోగ నివారిణి

4. చర్మరోగ నివారిణి

Image source

ఇక మరో కథనం ప్రకారం తారకాసుల వధ తర్వాత కుమారస్వామి తన శక్తి ఆయుధాన్ని ఇక్కడ ఈ కుమారధారలో ముంచడం వల్ల ఈ నీటిని విశేషమైన మహిమలు వచ్చాయని చెబుతారు. అందువల్లే చర్మ రోగాలతో బాధపడే వారు ఈ నదిలో స్నానం చేస్తే వారి రోగం నయమవుతుందని ప్రతీతి.

5.వాసుకికి తోడుగా

5.వాసుకికి తోడుగా

Image source

గరుడ దేవుడి దాడి నుంచి తప్పించుకోవటానికి సర్ప రాజు వాసుకి కుక్కే సుబ్రమణ్య క్షేత్రము లోని బిలద్వార గుహలలో శివ తపస్సు చేస్తుంటాడు. వాసుకి తపస్సు కు మెచ్చిన శివుడు, షణ్ముఖుడిని ఎల్లప్పుడూ తన ప్రియ భక్తుడు వాసుకికి అండగా మరియు తోడుగా ఉండమని చెపుతాడు. అందవల్లే షణ్ముకుడు ఇక్కడ కొలువై ఉన్నాడని ప్రతీతి.

6.వెనుక వైపు నుంచి

6.వెనుక వైపు నుంచి

Image source

సాధారణంగా గర్భగుడికి ముందు వైపు నుంచి భక్తులు వెళ్లి దేవుడిని దర్శనం చేసుకుంటారు. అయితే ఇక్కడ దేవస్థానం వెనుక తలుపు గుండా భక్తులు గుడి ప్రాంగణాన్ని చేరుకుని మూలవిరాట్ చుట్టూ ప్రదక్షణలు చేస్తారు. ఇక గర్భగుడికి సరిగ్గా మధ్యలో పీఠం కలదు. ఈ పీఠం పై భాగంలో శన్ముఖుడు మయూర వాహనం పై దర్శనమిస్తాడు. దాని కింద సర్ఫరాజు వాసుకి దర్శనమిస్తుంది. స్వామికి పైన ఆదిశేషుడు ఉంటాడు.

7.అందుకే గరుడ స్థంభం

7.అందుకే గరుడ స్థంభం

Image source

మూలవిరాట్టుకు ప్రధాన ద్వారానికి మధ్య వెండి తాపడం చెయ్యబడిన గరుడస్తంభం ఉంటుంది. ఈ గరుడ స్థంభంలోపలే వాసుకి అనే మహాసర్పం ఉంటుంది. ఈ సర్పం విడిచే విష వాయువల నుంచి కాపాడటానికే గరుడ స్థంభాన్ని ప్రతిష్టించారాని స్థలపురాణం చెబుతుంది.

8.అందుకే ఆ పూజలు

8.అందుకే ఆ పూజలు

Image source

ఈ దేవాలయంలో అనేక దోషాలు తొలిగి పోవడానికి వీలుగా ఆశ్లేష బలిపూజలు, కాలసర్ప దోశ నివారణ పూజలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ పూజలను చేయించుకోవడానికి దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడకు వేల మంది భక్తులు వస్తుంటారు.

9.ఎక్కడ ఉంది

9.ఎక్కడ ఉంది

Image source

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో పశ్చిమ కనుమల్లో కుక్కే సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ఉంది. మంగళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్యస్వామి గుడిని చేరాలంటే 105 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. ఇక బెంగళూరు నుంచి ఈ క్షేత్రానికి 271 కిలోమీటర్ల దూరం. ప్రయాణ సమయం 6 గంటలు.

10.చూడదగిన ప్రదేశాలు

10.చూడదగిన ప్రదేశాలు

Image source

ఈ క్షేత్రానికి దగ్గరగా, దక్షిణ కన్నడ జిల్లాలో చూడదగిన ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో ఓం బీచ్, గోకర్ణేశ్వర టెంపుల్, మంగళాదేవి గుడి తదితరాలను ఇక్కడ చూడవచ్చు.