Search
  • Follow NativePlanet
Share
» »బంగారం ద్వీపానికి పొదామా ..!

బంగారం ద్వీపానికి పొదామా ..!

పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారత తీరాన్ని చేరింది కూడా ఈ దీవుల మీదుగానే. వీటి పేరు లక్షదీవులు... అనే కానీ మనదేశంలోని యూనియన్ టెరిటరీల్లో చిన్నది ఇదే మరి. ఇవి మెత్తం 39 దీవులు సముదాయం.

By Venkatakarunasri

పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారత తీరాన్ని చేరింది కూడా ఈ దీవుల మీదుగానే. వీటి పేరు లక్షదీవులు... అనే కానీ మనదేశంలోని యూనియన్ టెరిటరీల్లో చిన్నది ఇదే మరి. ఇవి మెత్తం 39 దీవులు సముదాయం. ఇందులో కేవలం పదింటిలోనే జనావాసం ఉంది. ఇందులో ఆండ్రోత్తి అనేది అన్నిటికన్నా పెద్దదీవి చిన్నదీవి పేరు బిట్రా. కవరత్తి అనేదీవి ఈ దీవులన్నిటిలోకి ముఖ్యపట్టణం.

వలయాకారంగా ఉండే పగడపు దీవుల్లోకి విహారానికి వెళ్లడం అనే ఆలోచన జానపద సినిమాను తలపిస్తుంటే, సముద్రపు నీటి లోపలికి దూసుకెళ్లే స్కూబా డైవింగ్‌ను తలుచుకుంటేనే కళ్లు మెరుస్తాయి. సముద్రజీవరాశులను దగ్గరగా చూడడానికి పెద్దవాళ్లు ట్యూబ్‌లో వెళ్లి సంతోషపడుతుంటే... యూత్ మాత్రం అంతరిక్ష చోదకుల్లాగ ఒళ్లంతా కప్పేసే వాటర్‌ప్రూఫ్ దుస్తులు ధరించి, ఆక్సిజన్ మాస్కు తగిలించుకుని, కళ్లకు స్విమ్మింగ్ గాగుల్సు పెట్టుకుని జలచరాల్లా నీటిలో చక్కర్లు కొడుతూ ఆనందిస్తుంటారు. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు సంక్షిప్తంగా తెలుసుకుందాం...

లక్షద్వీప్... పేరులో లక్షణంగా లక్ష ఉంది. పచ్చదనాన్ని రంగరించుకున్న నీలం రంగులో సముద్రం, వెండి వెన్నెల లేకపోయినా సరే... తెల్లగా మెరుస్తామంటూన్న తెల్లని ఇసుక తిన్నెలు, దట్టంగా అల్లుకున్న సుగంధద్రవ్యాల వృక్షాలు, స్థానిక జాలరుల సంప్రదాయ జీవనశైలి, అంతర్జాతీయస్థాయి హాలిడే రిసార్టులతో కనువిందు చేస్తున్న ఈ ప్రదేశాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. నిజానికి అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఏర్పడిన ముక్కలు ఈ దీవులు... అని అధ్యయనకారుల అంచనా.

బంగారం ద్వీపానికి పొదామా ..!

బంగారం ద్వీపానికి పొదామా ..!

బంగారం ద్వీపం

బంగారం ద్వీపం అనేది ఒకవిధంగా చెప్పాలంటే ఇది ఉప్పునీటి పాయ చుట్టూ ఉన్న వలయాకార భూభాగం అని చెప్పలి.ఇది లక్షద్వీప్ అనే కేంద్ర పాలిత ప్రాంతం లోని భూభాగం.ప్రస్తుతం ఈ దీవి పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తున్న ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది.ఇది హనీమూన్ ప్రియులకు స్వర్గధామం.ఇక్కడ అల్కహాలుకు కొదవలేదు. ఇక్కడున్న నిర్మలమైన ప్రశాంతత మరెక్కడా దొరకదు.ఈ ప్రాంతానికి వివిధ జాతుల పక్షులు వచ్చి వెళుతుంటాయి.ఇక్కడ సాహసోపేతమైన క్రీడలు చేయవచ్చు.అనగా నీటి క్రీడలు స్కూబాడైవింగ్,విండ్స ర్ఫింగ్, స్నార్క్లింగ్, సర్ఫింగ్, కయాకింగ్, కేనోయింగ్,వాటర్ స్కీయింగ్, యాచ్టింగ్ మరియు ధైర్యసాహసాలతో కూడుకున్న సముద్రంలో నైట్ వాయేజ్ వంటి జలక్రీడలు పర్యాటక ఆకర్షణలలో ప్రబలమైనవి.లక్షద్వీప్ వచ్చి ఇది కనక చూడకపోతే ఒట్టి అన్నం తిన్నట్లుంటుంది.

Photo Courtesy: Binu K S

బంగారం ద్వీపానికి పొదామా ..!

బంగారం ద్వీపానికి పొదామా ..!

కడమట్ ద్వీపం

కడమట్ ద్వీపాన్ని కార్డమామ్ ద్వీపం అని కూడా పిలుస్తారు.ఇక్కడ స్కుబాడైవింగ్, స్నూకరీంగ్ మరియు స్విమ్మింగ్ వంటి ప్రత్యేకం.ఇక్కడ లోతులేని చెరువులో అయినట్లయితే 2500 రూపాయలతో, సముద్రంలో అయినట్లయితే 4000 రూపాయలతో స్కుబాడైవింగ్ చేయవచ్చు.ఇది ఒక పగడాల దిబ్బ, అందువలన ఇక్కడ లోతు మిగతావాటి కన్నా తక్కువ.

Photo Courtesy: Manvendra Bhangui

బంగారం ద్వీపానికి పొదామా ..!

బంగారం ద్వీపానికి పొదామా ..!

అగట్టి ద్వీపం

అగట్టి ద్వీపాన్ని లక్షద్వీప దీవుల ముఖద్వారం గా పిలుస్తారు.భారత దేశం నుండి వెళ్ళే ప్రయాణికులు విమానం లేదా నౌకా ప్రయాణం ఏదైనప్పటికీ తప్పక ఈ ప్రాంతం చేరాల్సిందే. ఇక్కడ కల విమానాశ్రయం కు కోచి మరియు బెంగుళూరు ల నుండి నేరు విమానాలు కలవు.ఒక సన్నని రోడ్డు మార్గం మీకు ద్వీపం అంతా చూపుతుంది.కాలి నడకన సైతం ఈ దీవి లో తిరిగినా ఎక్కువ సమయం పట్టదు.అద్భుత ప్రకృతి దృశ్యాలు తనివి తీరా చూడవచ్చు.అగట్టి దీవిలో స్కూబా డైవింగ్ మరియు స్నోర్కేలింగ్ వంటి నీటి క్రీడలు టూరిస్టులు ఆచరించవచ్చు.వీటి ఖర్చు కూడా తక్కువే.ఫిషింగ్ కూడా కలదు.అయితే, మీరు ఫిషింగ్ కు వెళ్ళేటపుడు,బోటు అడుగున గ్లాస్ ఉండేలా చూసుకోండి.ఆ గ్లాస్ నుండి అందమైన నీటి లోని నాచు ఇతర జీవాలు చూడవచ్చు.పర్యాటక ఏర్పాట్లు బాగానే వుంటాయి.మీరు కనుక చేపలు పట్టుకుంటే, వాటిని వేయించి మీకు తినిపిస్తారు కూడాను.ఈ ప్రదేశం లో దొరికే టూనా చేప ప్రపంచ ప్రసిద్ధి.

Photo Courtesy: icultist

బంగారం ద్వీపానికి పొదామా ..!

బంగారం ద్వీపానికి పొదామా ..!

కవరత్తి

లక్ష ద్వీపాలలో వినోదానికి కవరత్తి ప్రధాన కేంద్రం గా వుంది.ఇండియాలోని కోచ్చి పట్టణానికి 360 కి.మీ.ల దూరంలోనూ, ఆగట్టి ద్వీపానికి 50 కి.మీ.ల దూరం లోను కలదు. ఇండియా నుండి బోటు లో లేదా ఆగట్టి నుండి హెలికాప్టర్ లో చేరవచ్చు.కరవట్టి లక్ష ద్వీప్ దీవుల సముదాయానికి హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది.షాపింగ్ ప్రదేశాలు,కొన్ని హెరి టేజ్, మ్యూజియం, ప్రదేశాలు కలవు.మసీదులు కూడా కలవు.ఈ ద్వీపం సుమారు 4.22 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి అతి తక్కువ సమయం లో చూసేది గా వుంటుంది.రోడ్లు బాగుంటాయి.బైక్ లు అద్దెకు తీసుకుని తిరగవచ్చు.మీకు ఈత వచ్చినా, రాకున్నా సరే నీటిలో దిగి ఆనందిస్తారు.స్కూబా డైవింగ్ అందరికి అందుబాటులో వుంటుంది.గాజు అడుగు గల మోఅట్ లు అద్దెకు తీసుకొని నీటి లో ప్రయాణిస్తూ,అందమైన జల చరాలను చూసి ఆనందించవచ్చు.ఇక్కడ డాల్ఫిన్ డైవ్ సెంటర్ లో నీటి ఆటలు ఆడవచ్చు.

Photo Courtesy: Sankara Subramanian

బంగారం ద్వీపానికి పొదామా ..!

బంగారం ద్వీపానికి పొదామా ..!

కల్పేని దీవి

ఇండియా లోని కోచ్చిన్ కు సుమారు 150 మైళ్ళ దూరంలో కల ఒక చిన్న దీవి కల్పేని. దీని విస్తీర్ణం సుమారు 2.8 చ.కి.మీ.లు కలిగి వుంటుంది. ఉత్తర దక్షిణాలుగా పొడిగించబడిన ఈ దేవి అందమైన 2.8 చ. కి. మీ.ల సముద్రం కలిగి వుంది. కల్పేని ఒక టిప్ బీచ్.తెల్లని ఇసుక కలిగి ఆకుపచ్చని రంగు కల స్వచ్చమైన నీరు కల సముద్రం కలిగి వుంటుంది.కయాకింగ్ , రీఫ్ వాకింగ్ వంటి వాటికి ప్రసిద్ధి.ఈ ద్వీపం లోనే తిలక్కం, పిట్టి, చేరియం ఐలాండ్ లు వుంటాయి.ఇక్కడ 37 మీటర్ల పొడవైన లైట్ హౌస్ కలదు. ఒక్కసారి పైకి వెళ్ళితే, కల్పేని ద్వీప అందాలు, సముద్రం చక్కగా చూడవచ్చు. ఇక్కడ కల కాటేజ్ లను టూరిస్టులు షేరింగ్ పద్ధతి లో అద్దెకు తీసుకోవచ్చు.కోచ్చిన్ నుండి సముద్ర మార్గంలో ఈ దేవికి నేరుగా చేరవచ్చు.

Photo Courtesy: Vaikoovery

బంగారం ద్వీపానికి పొదామా ..!

బంగారం ద్వీపానికి పొదామా ..!

మాలిక్ ద్వీపం

మాలిక్ ద్వీపాన్ని మినీ కాయ్ ద్వీపం లేదా మాలిక్ అటల్ అని కూడా అంటారు.ఈ ద్వీపం లక్ష ద్వీపాలలో దక్షిణ భాగం చివరలో వుంటుంది. మాల్దీవులకు మినీ కాయ్ దీవికి భాష పరంగా మరియు సాంస్కృతి పరంగా అనేక పోలికలు వుంటాయి.ఇది చాల చిన్న ద్వీపం. సుమారు 10 కి.మీ.ల పొడవు 1 కి.మీ. వెడల్పు కలిగి వుంటుంది.ఈ ద్వీపాన్ని 1976 లో ఒక ఒప్పందం మేరకు మాల్దీవుల ప్రభుత్వం ఇండియా కు అప్పగించింది.ఈ ద్వీపం పూర్తిగా కొబ్బరి , తాటి చెట్లతో నిండి, చక్కని ప్రకృతి దృశ్యాలతో ఒక విశ్రాంత ప్రదేశంగా వుంటుంది. ఇక్కడి వాతావరణం , ఆహారం ఏ మాత్రం కలుషితం లేక ఒక నిర్మల ప్రదేశ అనుభవాలను అందిస్తాయి.పర్యాటకులు ఈ దీవి కి తప్పక సందర్శించాలి.

Photo Courtesy: Amog

బంగారం ద్వీపానికి పొదామా ..!

బంగారం ద్వీపానికి పొదామా ..!

ఎప్పుడు వెళ్లాలి?

ఇక్కడి వాతావరణం అక్టోబరు నుంచి ఏప్రిల్ మధ్య ఆహ్లాదంగా ఉంటుంది.

ఎక్కడ ఉండాలి? సీషెల్సు బీచ్ రిసార్టు, ఐలాండ్ హాలిడే హోమ్, లక్షద్వీప్ హోమ్‌స్టే, కోరల్ ప్యారడైజ్, కాడ్‌మట్ బీచ్ రిసార్టు వంటివి చాలా ఉన్నాయి. ఒక రోజుకు ఐదు వందల రూపాయలు వసూలు చేసే గెస్టు హౌస్‌ల నుంచి ఐదు వేలు చార్జి చేసే రిసార్టుల వరకు ఉన్నాయి.

భోజనం ఎలా?

ఈ ప్రదేశం కేరళకు దగ్గరగా ఉండడంతో ఆ ప్రభావం ఆహారం మీద కూడా ఉంటుంది. కొబ్బరి వాడకం ఎక్కువ. వంటల్లో సుగంధద్రవ్యాల వినియోగమూ ఎక్కువే. రెస్టారెంట్లలో ప్రధానమైన మెనూలో సీఫుడ్ రకాలు ఎక్కువగా కనిపిస్తాయి. శాకాహారం కూడా దొరుకుతుంది. కేరళ నుంచి టిన్డ్ ఫుడ్ వస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X