» » లాల్ బాగ్ ఫ్లవర్ షో - గులాబీల గుబాళింపులు!

లాల్ బాగ్ ఫ్లవర్ షో - గులాబీల గుబాళింపులు!

Posted By:

జనవరి మాసం వచ్చిందంటే చాలు బెంగుళూరు లోని లాల్ బాగ్ గార్డెన్స్ కొత్త రూపు సంతరించుకుంటాయి. పర్యాటకులకు వివిధ రకాల పూలతో స్వాగతం పలుకుతాయి. ప్రతి సంవత్సరం జనవరి రిపబ్లిక్ డే అంటే జనవరి నాటికి ఈ లాల్ బాగ్ లోని గ్లాస్ హౌస్ లో 'ఫ్లవర్ షో' లేదా పూల ప్రదర్శన భారీ ఎత్తున నిర్వహిస్తారు. లాల్ బాగ్ తోటకు ఇది ఒక ప్రత్యేకత.

 లాల్ బాగ్ చరిత్ర

లాల్ బాగ్ చరిత్ర

లాల్ బాగ్ అంటే ఎర్రని తోట అని అర్ధం. బెంగుళూరు దక్షిణ ప్రాంతంలో కల ఈ తోటను మైసూరు పాలకుడు హైదర్ అలీ స్థాపించాడు. తర్వాతి కాలంలో అతని కుమారుడు టిప్పు సుల్తాన్ దీనిని పెంచి పోషించాడు. లాల్ బాగ్ లో ఒక అక్వేరియం, ఒక సరస్సు కూడా కలవు. లాల్ బాగ్ బెంగుళూరు నగర పర్యటనలో ఒక ప్రధాన ఆకర్షణ.

 ఎపుడు తెరచి వుంటుంది ?

ఎపుడు తెరచి వుంటుంది ?

లాల్ బాగ్ తోట ప్రతి రోజూ ఉదయం 6.00 గం నుండి సా. 7.00 గం వరకూ సంవత్సరం పొడవునా తెరచి వుంటుంది. జాగర్లకు, వాకర్లకు, టూరిస్ట్ లకు, ఉదయం ఆరు గంటలనుండి తొమ్మిది గంటల వరకూ మరియు సా. ఆరు గం. నుండి ఏడూ గంటల వరకు ఉచిత ప్రవేశం.
మిగిలిన సమయాలలో రూ. 10 ప్రవేశ రుసుము వసూలు చేస్తారు. స్కూల్ విద్యార్ధులకు, అంగ వైకల్యం కలవారికి ప్రవేశం ఉచితం.

 ఫ్లవర్ షో లు

ఫ్లవర్ షో లు

ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే మరియు ఇండిపెండెన్స్ డే ల సందర్భంగా ఆ వారమంతా ఫ్లవర్ షో లు అతి వైభవంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో మాత్రం ప్రవేశ రుసుములు వేరుగా వుంటాయి.

జానపద జాతర

జానపద జాతర

ఈ లాల్ బాగ్ లో కర్ణాటక ప్రభుత్వం 'జానపద జాతర' అనే పేరుతో ప్రతి నెల రెండు మరియు నాలుగవ వారాలలో అంటే శని వారం మరియు ఆదివారం వివిధ కళాకారులచే జానపద నృత్యాలు, సంగీతం, వంటి సాంప్రదాయక సాంస్కృతిక ప్రోగ్రాం లు నిర్వహిస్తుంది.

 లాల్ బాగ్ ప్రత్యేకత !

లాల్ బాగ్ ప్రత్యేకత !

లాల్ బాగ్ తోట సుమారుగా 240 ఎకరాల విస్తీర్ణంలో కలదు. ఈ తోటలో సుమారు వేయి రకాల కు పైగా మొక్కలు, వృక్షాలు కలవు. ఈ గార్డెన్ లోని చెట్లు వంద సంవత్సరాలకు పైగా కూడా వయసు కలిగి వున్నాయి. బెంగుళూరు నగర వ్యవస్థాపకుడు కెంపే గౌడా నిర్మించిన ఒక టవర్ చుట్టూ ఈ గార్డెన్ వ్యాపించి వుంది. పర్షియా , ఆఫ్ఘనిస్తాన్, ఫ్రాన్స్ ల నుండి తెప్పించిన అనేక రకాల మొక్కలు అరుదైనవి ఈ తోటలో కలవు. అనేక లానులు, పూవుల తోటలు, తామర మడుగులు, ఫౌంటెన్ ల తో ఈ గార్డెన్ చిన్నలను, పెద్దలను ఆకర్షిస్తుంది.

 లాల్ బాగ్ రాళ్ళు !

లాల్ బాగ్ రాళ్ళు !

లాల్ బాగ్ లోని రాళ్ళు ఈ భూమి పైనే అతి పురాతనమైనవిగాను, సుమారు మూడు వేల మిలియన్ సంవత్సరాల నాటివని పరిశోధకులు గుర్తించారు. మరి ఇంత ఘనమైన పర్యాటక చరిత్ర కలిగి, చక్కగా నిర్వహించబడుతున్న లాల్ బాగ్ తోటలో ఈ సంవత్సరం ప్రస్తుతం అతి వైభవంగా నిర్వహించ బడుతున్న 'వార్షిక ఫ్లవర్ షో' కు వెళ్లి ఆనందిద్ద్డామా !

Please Wait while comments are loading...