Search
  • Follow NativePlanet
Share
» »బంగారు నది - ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం దొరుకుతుంది

బంగారు నది - ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం దొరుకుతుంది

By Venkatakarunasri

గంగానది భారతదేశంలోను, బంగ్లాదేశ్‌లోను ప్రధానమైన నదులలో ఒకటి. హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. "గంగమ్మ తల్లి" అనీ, "పావన గంగ" అనీ, "గంగా భవాని" అనీ ఈ నదిని హిందువులు స్మరిస్తారు. "నీరు" అన్న పదానికి సంస్కృతంలో "గంగ" అన్న పదాన్ని వాడుతారు.

మన భారతదేశం అనేక రకాల విశేషతలను కలిగివుంది. ఈ వ్యాసంలో మనం రెండు అద్భుతాలను గురించి తెలుసుకుందాం.

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

మన దేశంలో గంగానది ఎన్నో రకాల ప్రత్యేక గుణాలను కలిగి ప్రపంచంలో మరే నదికి లేనటువంటి విశిష్టతలను ఆ నది కలిగివుంది. సామాన్యంగా అన్ని నదులలో ఇసుకరేణువులు వుంటాయి. కానీ ఈ నదిలో మాత్రం ఇసుకరేణువులుతో పాటు బంగారు రేణువులు కూడా వుంటాయి. ఏంటి తమాషా చేస్తున్నాననుకోకండి. ఇది నిజమే.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

కొన్ని వేల సంవత్సరాల నుండి ఇక్కడ బంగారం అనేది లభిస్తుంది. అయితే ఇసుక రేణువులలో బంగారం లభించడం అనే దానికి ఖచ్చితమైన ప్రమాణాలు అనేవి ఏవీ లేవు.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

కానీ వైజ్ఞానికపరమైన కారణాలు పరిశీలిస్తే మాత్రం ఈ నది అనేక రకాలైన కొండలు, పర్వతాలు దాటుతూ వస్తుందికావున ఆ సంఘర్షణ వలన బంగారురేణువులు ఉత్పన్నం అయివుంటాయని భావిస్తున్నారు. మరి ఈ నది ఎక్కడ వుంది? దాని వివరాలుగురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

PC: youtube

 ఎక్కడ ఉంది?

ఎక్కడ ఉంది?

ఈ నది జార్ఖండ్ రాష్ట్రంలో పశ్చిమబెంగాల్ లో ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రవహిస్తుంది. కేవలం ఈ నదిలో మాత్రమే ఇలాంటి బంగారురేణువులు లభిస్తాయి. ఆ నదిని స్వర్ణరేఖ, సువర్ణ రేఖ అని కూడా అంటారు.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

చేపల కోసం కాకుండా బంగారం కోసం వలలు వేస్తూ వుంటారు. దీనిపై ఆధారపడిఎన్నో కుటుంబాలు జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. అందుకే పూర్వకాలంలో భారతదేశాన్ని సోనీకిచిడా అని పిలిచేవారు.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

నదిలో కూడా బంగారం లభిస్తుంది అంటే అది నిజమేనేమో అనిపిస్తుంది. మన దేశంలో ఎన్నో పవిత్రనదులు, జీవ నదులు వున్నాయి. జీవాధారానికి ప్రాణం పోసే నీరు ఈ నదులద్వారానే లభ్యమౌతున్నాయి. ఈ స్వర్ణ రేఖని అక్కడి ఆదిమవాసులు నందా అని పిలుస్తారు.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

అక్కడి ఆదివాసులు బంగారంకోసం నదిలోని ఇసుకను మొత్తం జల్లెడ పట్టేస్తారు. వారి జీవితాలు అందులోని బంగారాన్ని వెలికితీయడంలోనే వేల సంలుగా గడుస్తూ వున్నాయి.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఇక వీరు ఈ బంగారాన్ని లోకల్ వ్యాపారులకు అమ్మివేస్తారు. అయితే వీరి ద్వారా కోట్లు గడిస్తున్న వ్యాపారులు మాత్రం వీరికి మాత్రం కొంత మొత్తాన్ని మాత్రమే అప్పజెప్పుతారు.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఇక జార్ఖండ్ లోని రాజధానియైన రాంచికి 15కి.మీ ల దూరంలో స్వర్ణరేఖ నది ప్రవహిస్తుంది. రత్నగర్భ అనే ప్రాంతంలో ముఖ్యంగా ఈ బంగారు రేణువులు అనేవి లభ్యంఅవుతాయి.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

సుందర వనాలుడెల్టా దట్టమైన వృక్షాలతో కూడిన అరణ్యం. పర్యావరణ పరంగా విశిష్టమైన చాలా వృక్ష, జంతు సంపదకు ఆలవాలం. ప్రత్యేకించి రాయల్ బెంగాల్ పులి, గంగానది డాల్ఫిన్, ఐరావతి డాల్ఫిన్, మంచినీటి షార్క్ చేప వీటిల్లో ముఖ్యమైనవి.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

పావన గంగ

హిందూ మతం ఆచారాల ప్రకారం గంగానది చాలా పవిత్రమైనది. పావనం చేసేది. ఒక్కమారు గంగానదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలనుండి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగా జలం మింగితే స్వర్గప్రాప్తి నిశ్చయమనీ నమ్మకం.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

చనిపోయిన తమ కుటుంబీకుల అస్తికలను గంగానదిలో నిమజ్జనం చేయడానికి దూరదూరాలనుండి వారాణాసికి, గయకు, ప్రయాగకు, ఇతర గంగానదీ తీర్ధాలకు వస్తారు. గంగా నది జలాన్ని ఒక చిన్న పాత్రలో ఇంటిలో ఉంచుకోవడం శుభప్రథమని భావిస్తారు.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

గంగా నది తీరాన కుంభ మేళ, ఛత్‌పూజ వంటి ఉత్సవాలు జరుగుతాయి. కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద జనసమూహం కూడుకొనే ఉత్సవం.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

వేదాలలో గంగ

పురాతన గ్రంథమైన ఋగ్వేదములోని నదీస్తుతిలో తూర్పునుండి పడమరవరకు ఉన్న నదుల పేర్లు చెప్పబడ్డాయి. వాటిలో గంగానది పేరు వచ్చింది. ఋగ్వేదము 3.58.56లో ఇలా చెప్పారు - "వీరులారా! మీ వంశగృహం, మీ పవిత్ర స్నేహం, మీ సంపద అన్నీ జాహ్నవి ఒడ్డున ఉన్నాయి." ఇది గంగ గురించి కావచ్చును.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్ర్రమాన్ని ముంచెత్తి, "జాహ్నవి" అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

గంగా స్నానం మరియు గంగా మహిమలు

భారతంలో బీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజు కోరికపై బీష్ముడు గంగానది మహిమలు వర్ణించాడు.అవి ఈ క్రింద వివరించబడినాయి. గంగా, యమున ,సరస్వతులు కలసిన సంగమంలో స్నానం చేసినందువలన కలుగు పుణ్యం యజ్ఞ యాగాది దానాదులు చేసినదానికంటే అధికం.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

గంగాజలం కొంచమైననూ దేహమునకు సోకిన సకల పాపములు నశించును.స్వరం లభించును. నరుని ఎముక గంగానదియందు ఎన్ని సంవత్సరములు ఉండునో అతడు అన్ని సంవత్సరములు స్వర్గమున నివసించును.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

గంగాస్నానమాచరించిన వారు పరిశుద్ధులగుటయేకాక ఏడు తరముల వారు పరిశుద్ధులగుదురు. గంగా జలం త్రాగిన కలుగు ఫలితం నూరు చంద్రాయణం చేసినదానికంటే అధికం. శిరస్సు, మ్య్ఖం , దేహంలందు గంగా మృత్తిక(మట్టి)ను రాసుకుని స్నానమాచరించిన గరుత్మంతుని చూచి పాములు పారిపోయినట్లు పాపములు దూరమగును.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఆధారం లేని జనులకు గంగ ఆధారమగును. దేవతలకు అమృతము వలె మునులకు గంగ ప్రియమైనది. గంగానది తరంగముల నుండి వచ్చిన గాలి దేహమునకు సోకిన పరమానందము కలిగించుచూ పాపములను దూరం చేయును. మరణకాలమందు గంగను తలచినవారికి మోక్షం లభించును.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

గంగా నది మహిమలు చెప్పుకొను వారికి పాప భయం, రాజ భయం, చోర భయం, భూత భయం మొదలైన భయములు నశించును. గంగ ఎంతయో పుణ్యరాశి అయినందున ఆకాశము నుండి దిగి వచ్చినప్పుడు ఈశ్వరుడు తలమీద ధరించాడు. గంగ మూడు లోకములందు ప్రవహించి పునీతం లోకాలను చేస్తుంది.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

భగీరధుడు కపిల ముని శాపం వలన భస్మమైన తన పితరులకు మోక్షప్రాప్తి కలిగించడానికి తపమాచరించి బ్రహ్మలోకం నుండి భూలోకానికి తీసుకు వచ్చాడు. గంగా నది బ్రహ్మలోకం నుండి మేరురూపుడైన విష్ణువు నుండి సూర్యుని నుండి చంద్రుని నుండి శివుని జటాజూటం నుండి హిమవంతం నుండి భూమి మీదకు ప్రవహిస్తుంది. గంగ తొలుత విష్ణు పాదం నుండి ఉద్భవించింది కనుక గంగను భక్తితో శరణుజొచ్చిన మోక్షం నిశ్చయం.

PC: youtube

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం

గంగ మహిమను బ్రహ్మాది దేవతలు స్తుతి చేస్తుంటారు. నరులకు గంగానది మహిమ వర్ణించుట సాధ్యము కాదు. తన వర్ణాశ్రమ ధర్మములు నిర్వహించుతూ గంగనది మహిమలను మనోవాక్కాయకర్మల స్మరించు వారికి సకల సౌఖ్యములు కలుగును. గంగాదేవి ఇతిహాసమును వ్రాసినను విన్ననూ చదివిననూ సకల వ్యాధులు నశించి పరమ శుభములు కలుగును.

PC: youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more