Search
  • Follow NativePlanet
Share
» »నాగోన్ చిత్త‌డి నేల‌ల‌పై న‌డుద్దాం ప‌దండి!

నాగోన్ చిత్త‌డి నేల‌ల‌పై న‌డుద్దాం ప‌దండి!

నాగోన్ చిత్త‌డి నేల‌ల‌పై న‌డుద్దాం ప‌దండి!

నాగోన్ నగరం గౌహతి నుండి 120 కిలోమీటర్ల దూరంలో అస్సాంలో ఉంది. ఈ న‌గ‌రాన్ని గతంలో నౌగాన్ అని పిలిచేవారు. కొలాంగ్ నది, బ్రహ్మపుత్ర నదికి ఉపనది అయిన కొలాంగ్ న‌ది ఈ నగరం గుండా ప్రవహిస్తూ దీనిని రెండు ప్రాంతాలుగా విభజిస్తుంది. కొలాంగ్ మరియు కోపిలి నదుల కారణంగా ఎక్కువ భాగం చిత్తడి నేలలతో ద‌ర్శ‌మిస్తుంది.

నాగోన్‌ అస్సాంలోని అతి ముఖ్యమైన నగరాలలో ఒకటి. ఇక్క‌డ నేషనల్ పార్కుల నుండి చారిత్రక స్మారక చిహ్నాల వరకు సందర్శించడానికి వివిధ ప్రదేశాలు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తాయి. నాగోన్‌లో సందర్శించాల్సిన మొదటి ఐదు ప్రదేశాలను చూద్దాం-

లాఖోవా వన్యప్రాణుల అభయారణ్యం

లాఖోవా వన్యప్రాణుల అభయారణ్యం

లవోఖోవా వన్యప్రాణుల అభయారణ్యం బ్రహ్మపుత్ర నదికి దక్షిణ ఒడ్డున ఉంది. ఇది లాఖోవా-బురచపోరి పర్యావరణ వ్యవస్థలో భాగం. ఇది ఖడ్గమృగం మరియు అడవి గేదెలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ అభయారణ్యం ఉష్ణమండల వాతావరణం మరియు దట్టమైన అడవుల కారణంగా అనేక రకాల జంతువుల స్వ‌ర్గ‌ధామంగా విరాజిల్లుతుంది. ఈ అభయారణ్యం రాయల్ బెంగాల్ పులులకు మరియు దాదాపు 225 రకాల పక్షులకు కూడా ప్రసిద్ధి చెందింది. 70 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అభయారణ్యం ప్రకృతి ప్రేమికులు మరియు సాహసాలను ఇష్టపడేవారు తప్పక సందర్శించవలసిన ప్రదేశం !

సిల్‌ఘాట్‌

సిల్‌ఘాట్‌

సిల్‌ఘాట్ ఓడరేవు బ్రహ్మపుత్ర న‌ది ఒడ్డున చారిత్రక నేప‌థ్యానికి ప్రసిద్ధి. ఈ ఓడరేవు చుట్టూ కొండలు నిండి ఉన్నాయి. ఇక్క‌డ‌ పర్యాటకులు సందర్శించగలిగే స్మారక చిహ్నాలు ద‌ర్శ‌న‌మిస్తాయి. 18 వ శతాబ్దంలో నిర్మించిన హతిమురా దేవాలయం ఉన్న సామంతగిరి వీటిలో ఒకటి . అహోం రాజు ప్రమత్త సింహ పాలనలో నిర్మించిన మహిషమర్దిని దేవి ఆలయం కూడా సమీపంలోనే ఉంది. మానవ బలులు నిర్వహించబడిన చారిత్రక ఆధారాల కారణంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ అహోం కాలంలో ఇక్కడ వేడుకల సమయంలో ఉపయోగించిన వివిధ రకాల అవశేషాలకు నిలయంగా ఉంది. చరిత్ర ప్రియులు తప్పక సందర్శించవలసిన ఆలయాలు, అహోం రాజ్యం మరియు దాని వారసత్వం గురించి అరుదైన విశేషాల‌ను అందిస్తుంది.

బోర్డోవా

బోర్డోవా

బోర్డోవా తోరన్ అని కూడా పిలువబడే ఈ ప్రదేశం శ్రీమంత శంకరదేవ జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. అతను అస్సాంలో వైష్ణవ సంప్రదాయ స్థాపకుడు మరియు ప్రచారకుడు. ఇక్క‌డి భ‌వ‌న స‌ముధాయంలో నమ్‌ఘర్, కారిహతి మరియు సింహాసనం ఉన్నాయి. ఫాగువా పండుగతోపాటు వైష్ణవ సాధువులందరి జన్మదినోత్సవాలు ఇక్కడ అత్యంత గౌరవప్రదంగా జరుపుకొంటారు. అస్సామీ సంస్కృతి, సంప్రదాయాలలో ఈ ప్రదేశం మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది.

కజిరంగా నేషనల్ పార్క్

కజిరంగా నేషనల్ పార్క్

ఒక కొమ్ము గల ఖడ్గమృగం కోసం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ నేషనల్ పార్క్ క‌జిరంగా. ఒక కొమ్ము ఖడ్గమృగం, రాయల్ బెంగాల్ టైగర్, ఆసియా ఏనుగు, ఈస్టర్ జింక మరియు అడవి గేదె వంటి ఐదు పెద్ద క్షీర‌దాల‌కు నిల‌యం. ఈ పార్క్‌కు బ్రహ్మపుత్ర నది సమీపంలో ప్రవహిస్తుంది. ఈ ప్రాంతం అంతరించిపోతున్న జంతు మరియు వృక్ష జాతుల నివాసంగా సంరక్షించబడింది. జీప్ సఫారీలు మరియు ఏనుగుల సవారీల కోసం తప్పక సందర్శించాలి.

చంపావతి కుండ‌ జలపాతం

చంపావతి కుండ‌ జలపాతం

చంపావతి కుండ‌ జలపాతం నాగోన్‌లోని చప్నాల్లా పట్టణంలో ఉంది. ఈ జలపాతం ప్ర‌కృతి అందాల‌ను కేంద్రంగా నిలుస్తుంది. దీనిని చూసేందుకు వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌కు ఇక్కడకు వచ్చే అనేక పక్షుల కిల‌కిలారావాలు స్వాగ‌తం ప‌లుకుతున్న అనుభూతిని అందిస్తాయి. ఈ ప్ర‌దేశం చారిత్రాత్మక దేవాలయాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఎగువన ఉన్న లోయ కొన్ని రాళ్ల గుండా వెళుతూ చివరికి జలపాతం దిగువన ఉన్న చెరువులో క‌లుస్తుంది.

Read more about: nagaon assam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X