Search
  • Follow NativePlanet
Share
» »మీకు ఇటువంటి ప్రాంతాలు నచ్చక పోవచ్చు. అయినా ఒక్కసారి ఇటు వైపు

మీకు ఇటువంటి ప్రాంతాలు నచ్చక పోవచ్చు. అయినా ఒక్కసారి ఇటు వైపు

మహాత్మాగాంధీ జన్మదినోత్సవం మూడు రోజుల్లో దేశ వ్యాప్తంగా జరగనుంది. భారత దేశ స్వాతంత్రం కోసం ఆయన జరపిన పోరాటమే కాకుండా ఆయన జీవన శైలి కూడా ఎంతోమందికి ఆదర్శనం. అందుకే చాలా మంది ఆయన్ను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో నడిచారు. అయితే ప్రస్తుత కాలంలో పెద్దవారే కాదు యువత కూడా ఆయన గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇది నిష్టూర సత్యం. ఆయన అడుగు జాడకేంద్రప్రభుత్వం అధికారికంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. వ్యక్తిగతంగా కొంతమంది నిర్వహించినా వారిని వేళ్ల పై లెక్కపెట్టవచ్చు. ఇది ఇలాగే కొనసాగితే కొద్ది సంవత్సరాలు పోతే దేశంలో ఒక్కరు కూడా గాంధీ జన్మదినోత్సవాన్ని నిర్వహించేవారు ఉండరేమో. అలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే ఆ మహనీయుడి నడియాడిన ప్రాంతాలను ఒకసారి చూసొద్దాం..

సబర్మతి

సబర్మతి

P.C: You Tube

గుజరాత్ లోని అహ్మదాబాద్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో సబర్మతీ నదీ తీరంలో సబర్మతి ఆశ్రమం ఉంది. 1917లో తన భార్య కస్తూర్బాతో కలిసి ఈ 36 ఎకరాల ఆశ్రమంలో మహాత్మాగాంధీ అడుగుపెట్టాడు. ఇక్కడే ఆయన వ్యవసాయం, పశుపోషనతో పాటు పాఠశాల కూడా నిర్వహించారు.

కొత్త రూపు

కొత్త రూపు

P.C: You Tube

క్రీస్తుశకం 1930 దండి ఉప్పుసత్యాగ్రహం సందర్భంగా భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించేవరకూ నేను సబర్మతి ఆశ్రమంలో అడుగుపెట్టనని ప్రతిజ్జ చేశారు. అన్నమాటకు ఆయన ఎప్పుడూ కట్టుబడే ఉన్నారు. బాపు జ్జాపకలను పదిలం చేస్తూ సబర్మతి ఆశ్రమానికి క్రీస్తుశకం 1963లో కొత్తరూపునిచ్చారు.

ఆయన వాడిన వస్తువులు

ఆయన వాడిన వస్తువులు

P.C: You Tube

ఇప్పుడీ ప్రశాంత వనంలో బాపూ రాసుకున్న బల్ల, ఆయన ధరించిన కుర్తా, వారికి వచ్చిన లేఖలు, గాంధీ స్వయంగా తిప్పిన చరకా ను కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, బెంగళూరు నుంచి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి నాన్ స్టాప్ విమానసర్వీసులు కూడా ఉన్నాయి. అహ్మదాబాద్ నుంచి బస్సులు, ట్యాక్సీల్లో ఆశ్రమానికి చేరుకోవచ్చు.

అగాఖాన్ ప్యాలెస్

అగాఖాన్ ప్యాలెస్

P.C: You Tube

పూణే నగరంలో చారిత్మాత్మ భవనం ఈ అగాఖాన్ ప్యాలెస్. సుల్తాన్ ముహ్మద్ షా అగాఖాన్-3 ఈ భవనాన్ని క్రీస్తుశకం 1892లో కట్టించారు. క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన మరుసటి రోజే అంటే 1942 అగస్టు 92 గాంధీ దంపతులు, ఆయన వ్యక్తిగత కార్యదర్శి మహాదేవ్ బాయ్ తో కలిసి ఈ అగాఖాన్ ప్యాలెస్ లో అడుగుపెట్టారు.

ఇక్కడే కన్ను మూసారు

ఇక్కడే కన్ను మూసారు

P.C: You Tube

ఇక్కడ ఉన్నప్పుడే కస్తూర్బా గాంధీ కన్నుమూసారు. మహాదేవ్ భాయ్ కూడా ఇక్కడే చనిపోయారు. వీరిద్ధరి సమాధులు మనం ఇక్కడ చూడవచ్చు. అటు పై ఈ ప్యాలెస్ ను మ్యూజియంగా మార్చారు. గాంధీ ఉపయోగించిన ఎన్నో వస్తువులు ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.

 గాంధీ జయంతి, వర్ధంతి

గాంధీ జయంతి, వర్ధంతి

P.C: You Tube

గాంధీ జయంతి, వర్ధంతితో పాటు ప్యాలెస్ లో ఎన్నో కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నుంచి పూణేకు రైళ్లు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి నాన్ స్టాప్ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

విజయవాడ

విజయవాడ

P.C: You Tube

గాంధీ అడుగుజాడలు ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. అందులో విజయవాడ కూడా ఒకటి. మహాత్మాగాంధీ మొదటిసారిగా క్రీస్తుశకం 1919లో ఇక్కడికి వచ్చారు. అటు పై 1920 నుంచి 33 మధ్య కాలంలో నాలుగుసార్లు విజయవాడలో పర్యటించారు.

జాతీయ జండా

జాతీయ జండా

P.C: You Tube

క్రీస్తుశకం 1921 పర్యటనలోనే పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను ఆమోదించి పతాకాన్ని ఆవిష్కరించారు. ఇదే సమయంలో కోటిరుపాయల స్వరాజ్య నిధి వసూలు చేశారు. 20 లక్షల రట్నాలను పంపిణీ చేశారు.

గాంధీ కొండ

గాంధీ కొండ

P.C: You Tube

ఈ కార్యక్రమానికంతటికీ విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ పర్వతం వేదికగా నిలిచింది. దీనినే ప్రస్తుతం గాంధీ కొండ అని పిలుస్తారు. కాగా క్రీస్తుశకం 1964లో ఇక్కడ స్మారక స్తూపాన్ని నిర్మించారు. క్రమంగా ప్లానిటోరియం, గ్రంథాలయం కూడా ఇక్కడ నెలకొల్పారు.

మంగళవారం సెలవు

మంగళవారం సెలవు

P.C: You Tube

ప్రస్తుతం ఇది విహార కేంద్రంగా ఉంది. కొండ పై టాన్ ట్రైన్ లో విహరించడానికి అవకాశం ఉంది. కొండపైకి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ అనుమతిస్తారు. మంగళవారం ఈ గాంధీ విహార కేంద్రానికి సెలవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X