Search
  • Follow NativePlanet
Share
» »మెస్మరైజ్ చేసే ఈ మలంపూజ గార్డెన్స్ ఒక్క సారైనా చూడాలనిపిస్తుంది..!!

మెస్మరైజ్ చేసే ఈ మలంపూజ గార్డెన్స్ ఒక్క సారైనా చూడాలనిపిస్తుంది..!!

కేరళ అనగానే మొదట గుర్తుకు వచ్చేది కొబ్బరి తోటలు, ఏనుగులు, బ్యాక్ వాటర్స్. సంపన్న సంస్కృతులు మరియు సంప్రదాయాల భూమిగా పిలవబడుతున్నది. కేరళలో సందర్శించడానికి అనేక ప్రదేశాలున్నాయి వాటిలో మలంపూజ పార్క్ ఒకటి. 'గాడ్స్ ఓన్ కంట్రీగా' పిలవబడే కేరళ ఆ పేరును సార్థకం చేస్తున్నది.

పాలక్కాడ్ పట్టణానికి 10 కి. మీ. దూరంలో ఉండి, రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకొనే మరో ప్రదేశం మలంపూజ డ్యాం. డ్యాం సైట్ వద్ద అందమైన గార్డెన్ మరియు ఆమ్యూజ్ మెంట్ పార్క్ లు ఉన్నాయి. మలంపూజ పట్టణం దాని సుందర ద్రుస్యలకు, ఆనకట్టలకు మరియు తోటలకు ప్రసిద్ధి.

మలంపూజ తోటలు, మలంపూజ మలంపూజ తోటలని "కేరళ బృందావనం" గా పిలుస్తారు. ఇవి రిజర్వాయర్ ప్రాంత సమీపంలో కలవు. ఈ ప్రాంతంలో ఒక వైపు ప్రకృతి మరో వైపు మానవ నిర్మిత డ్యాం ఎంతో అందంగా కనిపిస్తాయి. గార్డెన్ లో అందమైన పొడవైన కాలిబాటలు, పచ్చటి ప్రదేశాలు , ఆకర్షణీయమైన ఫౌంటైన్స్, సుందరమైన కొలనులు, ఇంకనూ ఇతర చూడ దాగిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. పిల్లలకు ఒక పార్క్ కలదు. గార్డెన్ లోని విశాల ప్రదేశంలో వారి ఆటపాటలకు ఎంతో బాగుంటుంది.

గార్డెన్ లో అక్వేరిం, ఏరిఅల్ రోప్ వే , యక్షి విగ్రహం, రాక్ గార్డెన్, రోజ్ గార్డెన్, స్విమ్మింగ్ పూల్ మరియు కొన్ని ఫౌంటెన్ లు కూడా ఉన్నాయి. ఇక్కడ గల కెనాల్ లో బోటింగ్ కూడా చేయవచ్చు. పర్యాటకులు కాలి నడకలో తోటలోని అనేక ప్రదేశాలను ఆనందించవచ్చు. ఈ పర్యాటక ప్రదేశం వేలాది పర్యాటకులను, ప్రకృతి ప్రియులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతం కేరళలోని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కు గాను దెశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. మరి ఈ మలంపూజ డ్యాంతో మరియు మలంపూజ గార్డెన్స్ పాటు చూడదగ్గ మరిన్ని ప్రదేశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మలంపూజ డ్యాం

మలంపూజ డ్యాం

మలంపూజ డ్యాం పాలక్కాడ్ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఇది కేరళలో అతి పెద్ద సాగునీటి రిజర్వాయర్. ఇది సాగునీటి అవసరాలను తీరుస్తుంది. ఒక మేసోనేరి డ్యాం, ఒక మట్టి డ్యాం కలిగి , ఎన్నో కాలువలు కలిగి ఉంటుంది. డ్యాం వెనుక భాగంలో కల కొండలతో నేపధ్యం ఎంతో అందంగా ఉంటుంది. ఈ డ్యాంలో విహరించాలనుకొనేవారికి బోటింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. పాలక్కాడ్ పట్టణానికి సుమారు 10 కి.మి.ల దూరంలో కల ఈ ప్రదేశానికి రోడ్డు మార్గంలో తేలికగా చేరవచ్చు.

చిత్రకృప : Joseph Lazer

యక్షి విగ్రహం

యక్షి విగ్రహం

మలంపూజ యక్షి విగ్రహం కేరళ రాష్ట్ర పనితనానికి ఒక మంచి ఉదాహరణగా చెబుతారు. ఈ విగ్రహం మలం పూజ గార్డెన్ లో ఉండి వచ్చి పోయే యాత్రికులను ఆకర్షిస్తున్నది. దీనిని 1969 వ సంవత్సరంలో కనాయి కుంహి రామన్ అనే కేరళ శిల్పి నిర్మించాడు.

pc : Pritish Soundararaajan

రాక్ గార్డెన్

రాక్ గార్డెన్

మలం పూజ తోటల లోని రాక్ గార్డెన్, భారత దేశంలో ఉన్న ప్రముఖ రాక్ గార్డెన్ లలో రెండవది. దీనిని నెక్ చాంద్ సాయాని నిర్మించారు. ఈయనే చండీఘడ్ లోని మొదటి రాక్ గార్డెన్ ను కూడా నిర్మించారు. దీనికోసం పగిలిన టైల్స్, ప్లాస్టిక్ బాటిల్లు, చేతి గాజు ముక్కలు ... ఎన్నో పనికిరాని వస్తువులను ఉపయోగించినారు.

pc : Ranjithsiji

థ్రెడ్ గార్డెన్

థ్రెడ్ గార్డెన్

మలంపూజ లోని థ్రెడ్ గార్డెన్ కు లక్షలాది పర్యాటకులు వస్తారు. దీనిలో ఇతర తోటలవలేనే పూవులు మొక్కలు వుంటాయి. కాని అవన్నీ కూడా దారం తో తయారు చేయబడి వుంటాయి. ఇవన్నీ ఎంతో కష్టంతో చేతితో అల్లబడినవి. గ్లాస్ గదులలో అనేక రకాలపూవులు, మొక్కలు ప్రదర్శించబడతాయి.

pc : telugu native planet

ఉడాన్ ఖటోల

ఉడాన్ ఖటోల

ఉడాన్ ఖటోల దక్షిణ భారత దేశంలో మొదటి రోప్ వే ప్రదేశం. ఈ రోప్ వే ని మలం పూజ గార్డెన్ లో 60 అడుగుల ఎత్తులో నిర్మించినారు. 600 మీటర్ల ఎత్తు వరకు పైకి వెళ్ళి పర్వతాలను, అందమైన తోటలను చూసి ఆనందించవచ్చు. ఇలా సుమారు ఇరవై నిమిషాల పాటు ఆకాశం లో హాయిగా విహరించవచ్చు.

pc: Ranjithsiji

తేన్ కురుస్సి

తేన్ కురుస్సి

తెన్ కురుస్సి గ్రామం దాని సహజ అందాలకు మరియు వారసత్వ కట్టడాలకు ప్రసిద్ధి గాంచింది. ఇది పాలక్కాడ్ కు సుమారు 10 కి.మీ. దూరంలో కలదు. తెన్ కురిస్సి నుండి ఒక గంట ప్రయాణించి నారింజ తోటలు, అనేక దేవాలయాలు కల నేల్లియంపతి ప్రదేశాన్ని కూడా చూడవచ్చు. ఈ గ్రామం ప్రసిద్ధి గాంచిన తాయంకావు , ఎలామన్నం సంకరనరాయనన్ మరియు శివ దేవాయలాలు కలిగి ఉంది.

pc : VS Ramachandran

ఫాంటసీ పార్క్

ఫాంటసీ పార్క్

మలం పూజ పాలక్కాడ్ పట్టణానికి 10 కి .మీ. దూరంలో, 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఫాంటసీ పార్క్ స్కూల్ పిల్లలకి, ఒకరోజు పిక్నిక్ కి బాగుంటుంది. ఈ పార్క్ లో అన్ని వయసుల వారికి ఆకర్షిస్తున్నది. అందమైన ఫౌంటెన్ లు , ఆహార దుకాణాలు, ఐస్ క్రీం పార్లర్లు , విశ్రాంతి ప్రదేశాలు కూడా కలవు. బాటరీ కార్ రైడ్ , వాటర్ కిడ్డి రైడ్, బేబీ ట్రైన్ రైడ్ మరియు మినీ టెలి కాంపాక్ట్ వంటివి పిల్లలను ఆనందపరుస్తాయి.

pc : Asokants

స్నేక్ పార్క్

స్నేక్ పార్క్

మలంపూజ డ్యాంకి, గార్డెన్ కి సమీపంలో వివిధ రకాల పాములు కలిగిన స్నేక్ పార్క్ ఉన్నది. అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో నడుపబడే ఈ పార్క్ లో విషపాములు, విషం లేని పాములు చూడవచ్చు.

PC : Ranjithsiji

సౌకర్యాలు

సౌకర్యాలు

తాగు నీరు, చిరు తిండ్లు, షాపింగ్ ప్రదేశాలు, లాకర్ లు విశ్రాంతి ప్రదేశాలు, భద్రతా ఏర్పాట్లు కూడా కలవు.

వారాంతపు సెలవులలో తోటలకు

వారాంతపు సెలవులలో తోటలకు

వారాంతపు సెలవులలో తోటలకు సాయంకాలం 7గంటల నుండి 8 గంటల వరకు లైటింగ్ ఏ ర్పాట్లు చేస్తారు. గార్డెన్ లు పూర్తిగాను , డ్యాం సైట్ ప్రాంతాలు లైటింగ్ పెడతారు.

సమయాలు

సమయాలు

వారం రోజులలో ఉ. 10 గం. నుండి సా. 6 గం. వరకు వారంతం లో ఉ. 10 గం. నుండి రా. 8 గం. వరకు. లైటింగ్ ఉంటుంది.

PC : Shanmugamp7

మలంపూజా ఎలా చేరుకోవాలి ?

మలంపూజా ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : 55 కి. మీ ల దూరంలో కోయంబత్తూర్ విమానాశ్రయం కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో మలంపూజా చేరుకోవచ్చు.

రైలు మార్గం : పాలక్కాడ్ సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. అక్కడ దిగి టాక్సీ లేదా బస్సులలో మలంపూజా చేరుకోవచ్చు.

రోడ్డు / బస్సు మార్గం : కేరళ మరియు తమిళనాడు ప్రాంతాల నుంచి మలంపూజా కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి.

PC : Ranjithsiji

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X