Search
  • Follow NativePlanet
Share
» »తిరుమల బ్రహోత్సవాల సందర్భంగా మాడ వీధుల్లో ఊరేగేది వేంకటేశ్వరుడు కాదా?

తిరుమల బ్రహోత్సవాల సందర్భంగా మాడ వీధుల్లో ఊరేగేది వేంకటేశ్వరుడు కాదా?

తిరుమల బ్రహోత్సవాల సందర్భంగా మలయప్పస్వామి గురించి కథనం.

తిరుపతి బ్రహోత్సవాలు దగ్గరపడుతున్నాయి. ఈ బ్రహోత్సవాల్లో ఆ తిరుమల వేంకటేశ్వరుడిని వివిధ వాహనాల్లో ఊరేగిస్తుంటారు. బ్రహోత్సవాల్లోనే కాకుండా వివిధ ఉత్సవాల సందర్భంగా ఆ ఏడుకొండలవాడిని ఊరేగించడం తిరుమలలో సర్వసాధారణం. అయితే సదరు ఊరేగింపులో తిరుమలలో కొలువై ఉన్న వేంకటేశ్వరుడు ఊరేగడా? మరెవరు భక్తులకు సదరు ఊరేగింపులో దర్శనభాగ్యం కల్పించేది. ఆ ఉత్సవ మూర్తికి, తిరుమల వేంకటేశ్వరుడికి ఉన్న సంబంధం ఏమిటీ? తదితర వివరాలన్నీ మీ కోసం...

మలయప్ప స్వామి తిరుమల

మలయప్ప స్వామి తిరుమల

P.C: You Tube

తిరుమలోని ఆనందనిలయమే గర్భగుడి. ఇందులో ఉన్న మూలవిరాట్టును ధ్రువభేర అని అంటారు. అంటే కదల కుండా ఒకే చోట ఉండే ప్రతిమ అని అర్థం. ఇది మిగిలిన దేవతలకు కూడా వర్తిస్తుంది.

మలయప్ప స్వామి తిరుమల

మలయప్ప స్వామి తిరుమల

P.C: You Tube

సాధారణంగా మూలవిరాట్టును కదల్చరు. అందుకే ఆ పేరు వచ్చింది. అదే సమయంలో గర్భగుడి వెలుపల జరిగే ఉత్సవాలు, సేవలు, కళ్యాణోత్సవంతో పాటు ఊరేగించేందుకు ఒక ప్రతి ఉండాలి.

మలయప్ప స్వామి తిరుమల

మలయప్ప స్వామి తిరుమల

P.C: You Tube

దీనినే ఉత్సవ భేర అని అంటారు. తిరమలలో ఉన్న ఈ ఉత్సవభేర నే మలయప్ప స్వామి. మూలవిరాట్టుకి జరిగే ప్రతి కార్యక్రమానికి ఈ ఉత్సవభేర ప్రతినిధిగా ఉంటాడు. గర్భగుడిలేని వేంకటేశ్వరుడితో సమాననంగా మలయప్ప స్వామికి కూడా కొన్ని పూజలు నిర్వహిస్తారు.

మలయప్ప స్వామి తిరుమల

మలయప్ప స్వామి తిరుమల

P.C: You Tube

కాబట్టే ఈ స్వామిని మూలవిరాట్టుతో సమానంగా భావించి ఆరాధిస్తారు. మలయప్ప స్వామి ఉత్సవభేరగా ఉండటం వెనుక పెద్ద కథ ఉంది. ఈ విషయాలన్ని లిఖిత పూర్వకంగా ఉన్నాయి.

మలయప్ప స్వామి తిరుమల

మలయప్ప స్వామి తిరుమల

P.C: You Tube

ఒకప్పుడు ఉత్సవాల కోసం ఉగ్రశ్రీనివాసుడి మూర్తిని అంటే ప్రతిమను వినియోగించేవారు. అయితే దాదాపు 700 ఏళ్ల క్రితం జరిగిన బ్రహోత్సవాల్లో స్వామి ఊరేగింపు సందర్భంగా చుట్టు పక్కల మంటలు చెలరేగాయి.

మలయప్ప స్వామి తిరుమల

మలయప్ప స్వామి తిరుమల

P.C: You Tube

దీంతో భక్తులు, అర్చకులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అప్పుడు స్వామివారు ఒక భక్తుని ద్వారా తన సందేశాన్ని వినిపించాడు. మారుతున్న పరిస్థితులు, కాలానికి అనుగుణంగా మరో సౌమ్యమైన ఉత్సవ మూర్తిని వినియోగించాలన్నదే ఆ సందేశ సారాంశం.

మలయప్ప స్వామి తిరుమల

మలయప్ప స్వామి తిరుమల

P.C: You Tube

ఒక కొండ వంగి ఉండే ప్రదేశంలో ఆ మూర్తి కనిపిస్తుందని కూడా తన సందేశంలో స్వామివారి వినిపించారు. ఆ సందేశాన్ని అనుసరించి భక్తులతో పాటు అర్చకులు నూతన ఉత్సవ మూర్తి కోసం వెతకసాగారు.

మలయప్ప స్వామి తిరుమల

మలయప్ప స్వామి తిరుమల

P.C: You Tube

అలా వారికి ఒకచోట శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరుడి విగ్రహాలు లభించారు. ఈ స్వామివారికి తమిళంలో మలై కునియ నిన్ర పెరుమాళ్ అంటే తలవంచిన పర్వతం మీద కొలువైన స్వామి అన్న పేరుతో పిలవడం మొదలు పెట్టారు.

మలయప్ప స్వామి తిరుమల

మలయప్ప స్వామి తిరుమల

P.C: You Tube

అదే కాలక్రమంలో మలయప్ప స్వామిగా మారింది. మలయప్ప స్వామి విగ్రమం పంచలోహాలతో రూపొందింది. తామరపూవ్వు ఆకారంలోని పీఠం మీద మూడు అడుగుల ఎతున ఠీవిగా ఉన్న శ్రీనివాసుని ప్రతి రూపమే మలయప్ప స్వామి.

మలయప్ప స్వామి తిరుమల

మలయప్ప స్వామి తిరుమల

P.C: You Tube

శంఖు చక్రాలతో, వరద హస్తంతో స్వామి వారి దివ్యమంగళ రూపం మనకు కనబడుతుంది. విగ్రహానికి కుడివైపున శ్రీదేవి, ఎడమవైపు భూదేవి అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయి.

మలయప్ప స్వామి తిరుమల

మలయప్ప స్వామి తిరుమల

P.C: You Tube

ఆ విగ్రహాల భంగిమలు కూడా ఒకే రకంగా ఉంటాయి. ఈ విగ్రహాలు దొరికిన కోనని ఇప్పటికీ మలయప్ప కోనగా పిలుస్తారు. ఈ మలయప్ప కోనను తిరుమలకు వెళ్లిన భక్తుల్లో కొంతమంది సందర్శిస్తూ ఉంటారు.

మలయప్ప స్వామి తిరుమల

మలయప్ప స్వామి తిరుమల

P.C: You Tube

దాదాపు 700 సంవత్సరాలకు పూర్వమే లిఖించిన ఒక శాసనంలో ఈ మలయప్ప విగ్రహాల ప్రసక్తి ఉందని చెబుతారు. ఈ శాసనం ఇప్పటికీ చాలా భద్రంగా కాపాడుతూ ఉన్నారు. ముఖ్యమైన అధికారులు, అర్చకులు మాత్రమే దీనిని చూడటానికి వీలవుతుంది.

మలయప్ప స్వామి తిరుమల

మలయప్ప స్వామి తిరుమల

P.C: You Tube

ఇక శ్రీవారికి భక్తులు జరుపే కళ్యాణోత్సవాల్లో, సాయంకాలం సమయంలో జరిగే సహస్రదీపాలంకరణ సేవలో మలయప్ప స్వామివారే కొలువై ఉంటారు. ఆ సమయంలో స్వామి వారిని చూడటానికి రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదు.

మలయప్ప స్వామి తిరుమల

మలయప్ప స్వామి తిరుమల

P.C: You Tube

స్వామివారికి జరిగే కొన్ని అభిషేకాల్లో కూడా ఉత్సవమూర్తికి భాగం ఉంటుంది. పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా మలయప్ప స్వామివారికే నిర్వహిస్తారు. ఈ తెప్పోత్సవం సందర్భంగా చేసే దీపాలంకరణ కంటికే కాదు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

మలయప్ప స్వామి తిరుమల

మలయప్ప స్వామి తిరుమల

P.C: You Tube

అదే విధంగా పద్మావతి పరిణయం, బ్రహోత్సవాల వంటి ఉత్సవాల సందర్భంగా మలయప్ప స్వామి వారు గజ, అశ్వ, గరుడ శేష తదితర వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X