Search
  • Follow NativePlanet
Share
» » తోడుంటుంది అద్దె బైకు..సాహసం సేయరా డింబకా

తోడుంటుంది అద్దె బైకు..సాహసం సేయరా డింబకా

మనాలి నుంచి లేహ్ కు బైక్ పై ప్రయాణానికి సంబంధించిన కథనం.

మీరు బైకర్లా? సాహస యాత్రలంటే ఇష్టమా? ప్రకృతి ప్రేమికులా? మీ కోసమే ఈ కథనం. సముద్ర మట్టానికి 13,050 అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తూ చుట్టు ఉన్న చిక్కగా ఉన్న పచ్చదాన్ని చూస్తూ ముందుకు సాగిపోవాలనే ఆలోచన ఉన్నవారికి ఈ ప్రాంతం సవాలును విసురుతుంది. అయితే ఏడాది మొత్తం ఆ మార్గం తెరిచి ఉండదు. కేవలం మే, జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రమే మీరు అక్కడ ప్రయాణం చేసి సాహసవీరలనిపించకోండి. మరెందుకు ఆలస్యం కథ చదవి మీ వీరత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయాణం మొదలెట్టండి

బస్సు వద్దు బైకు ముద్దు

బస్సు వద్దు బైకు ముద్దు

P.C: You Tube

లద్దాఖ్ జమ్ము కాశ్మీర్ లో భాగం. కొన్ని పత్యేక కారణాల వల్ల ఈ ప్రాంతానికి ఓ రాజధాని ఉంది. అదే లేహ్. శ్రీనగర్ నుంచి లేహ్ కు 434 కిలోమీటర్లు బస్సులో వెళ్లవచ్చు. అయితే చాలా మంది ముఖ్యంగా యువత బైకుల్లో లేహ్ ను చేరుకోవడానికి ఇష్టపడుతారు.

మొత్తం 473 కిలోమీటర్లు

మొత్తం 473 కిలోమీటర్లు

P.C: You Tube

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి నుంచి లేహ్ కు ఒక్కొక్కరుగా లేదా బ`ందాలుగా కలిసి వెలుతారు. మనాలి నుంచి లేహ్ కు 473 కిలోమీటర్లు. ఏడాదిలో ఎనిమిది నెలలు మంచులో కూరుకుపోయే ఈ మార్గం సుమారు నాలుగు నెలల పాటు పర్యాటకులతో సందడిగా మారుతుంది.

నాలుగు నెలలు

నాలుగు నెలలు

P.C: You Tube

మే, జూన్, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో బైక్ వీరులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు. మనాలి లేహ్ దారి తెరిచానే వార్త వినగానే బైక్ క్లబ్ ల సభ్యులకు ఉత్సాహం పొంగుకు వస్తుంది. దేశం నలుమూలల నుంచి రైడర్ క్లబ్ సభ్యులు జట్లు, జట్లుగా ఇక్కడికి చేరుకొంటారు.

అద్దె బైకులు అందుబాటులో

అద్దె బైకులు అందుబాటులో

P.C: You Tube

కొంతమంది సొంతంగా బైకులు తెచ్చుకొంటే మరికొంతమంది మనాలిలో అద్దెకు బైకులు తీసుకొంటారు. మోడల్ ను అనుసరించి బైక్ అద్దె ట్రిప్పుకు రూ.1,500 నుంచి రూ.2,500 వరకూ ఉంటుంది. పెట్రోలు మనదే. మనాలి నుంచి లేహ్ వెళ్లే దారంతా పర్వాతాల గుండా వెలుతుంది. గరిష్టంగా సముద్ర మట్టానికి రూ.17,582 అడుగుల ఎత్తులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మార్గమధ్యలో హోటల్స్, పెట్రోలు బంకులు కూడా ఉంటాయి.

మార్గమధ్యలో సౌకర్యాలు ఇలా

మార్గమధ్యలో సౌకర్యాలు ఇలా

P.C: You Tube

అంతేకాకుండా మధ్యలో టెంట్లు వేసుకునే వెసులు బాటు కూడా ఉంది. దారి పొడుగునా బీఎస్ ఎన్ ఎల్ సిగ్నల్స్ బాగా ఉంటాయి. ఇక దారి పొడగులా రంగరంగుల పర్వత శిఖరాలు కనిపిస్తాయి. ఒక పర్వత శిఖరం నీలి రంగులో ఉంటే మరో పర్వత శిఖరం పసుపు ముద్దలా కనిపిస్తుంది. దాని పక్కనే ఉన్న మరో పర్వతం కాటుక రంగులో కనిపిస్తే దానికి ఆనుకునే ఉన్న పర్వత శిఖరం ఎర్రగా ఉంటుంది. మరో పర్వత శిఖరం పై భాగంలో తెల్లటి మంచు పొరలు ఉంటాయి. ఈ ప్రయాణం మొత్తం ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

P.C: You Tube

ముందుగా చండీగఢ్ కు వెళ్లి అక్కడి నుంచి మనాలి చేరుకోవాల్సి ఉంటుంది. విజయవాడ నుంచి చండీగఢ్ కు రైలు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా హైదరాబాద్ నుంచి చంఢీగడ్ కు విమాన సర్వీసులు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X