Search
  • Follow NativePlanet
Share
» »మచిలీపట్నం బీచ్ లో కేరింతలు..తుళ్లింతలతో మరచిపోలేని మధుర జ్ఝాపకాలెన్నో..

మచిలీపట్నం బీచ్ లో కేరింతలు..తుళ్లింతలతో మరచిపోలేని మధుర జ్ఝాపకాలెన్నో..

మచిలీపట్నం అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి బందరులడ్డు మిఠాయిలు.మచిలీపట్నం (బందర్) నకు 11 కి.మీ దూరంలో ఉండే బెస్తవారు (చేపలు పట్టేవారు) ఉండే చిన్న గ్రామం మంగినపూడి. కృష్ణాజిల్లా ముఖ్యపట్నమైన బందరు తీరప్

మచిలీపట్నం అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి బందరులడ్డు మిఠాయిలు.మచిలీపట్నం (బందర్) నకు 11 కి.మీ దూరంలో ఉండే బెస్తవారు (చేపలు పట్టేవారు) ఉండే చిన్న గ్రామం మంగినపూడి. కృష్ణాజిల్లా ముఖ్యపట్నమైన బందరు తీరప్రాతం కావడంతో బీచ్‌లకు కొదవలేదు. అందులో చెప్పుకొదగినది మంగినపూడి బీచ్‌. ఇక్కడ బీచ్ లోతు తక్కువగా ఉంటుంది. ఈ బీచ్‌కి వారాంతరాల్లో అనేకమంది దూర ప్రాంతాల నుండి వస్తుంటారు. విజయవాడకు 75 కిమీల దూరంలో మచిలీపట్నం సమీపంలో ఈ బీచ్ ఉంది. సెలవు దినాల్లో ఈ బీచ్‌లో ఇసుక కూడా కనిపించనంత జనం ఉంటారు. 2004 సునామీ తర్వాత ఈ బీచ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. దీంతో ఇందులో స్నానాలు చేయడం ప్రమాదకరమని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మరి అంతటి ప్రసిద్ది చెందిన బీచ్ విశేషాలేంటో తెలుసుకుందాం..

మచిలీపట్నం అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి బందరులడ్డు

మచిలీపట్నం అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి బందరులడ్డు

మచిలీపట్నం అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి బందరులడ్డు మిఠాయిలు.మచిలీపట్నం (బందర్) నకు 11 కి.మీ దూరంలో ఉండే బెస్తవారు (చేపలు పట్టేవారు) ఉండే చిన్న గ్రామం మంగినపూడి.

మంగినపూడి బీచ్‌

మంగినపూడి బీచ్‌

కృష్ణాజిల్లా ముఖ్యపట్నమైన బందరు తీరప్రాతం కావడంతో బీచ్‌లకు కొదవలేదు. అందులో చెప్పుకొదగినది మంగినపూడి బీచ్‌. ఇక్కడ బీచ్ లోతు తక్కువగా ఉంటుంది. ఈ బీచ్‌కి వారాంతరాల్లో అనేకమంది దూర ప్రాంతాల నుండి వస్తుంటారు.

మంగినపూడి బీచ్ ఎంట్రెన్స్ లో రెండు చేపల ద్వారం

మంగినపూడి బీచ్ ఎంట్రెన్స్ లో రెండు చేపల ద్వారం

విజయవాడకు 65 నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంగినపూడి బీచ్ ఎంట్రెన్స్ లో రెండు చేపల ద్వారాన్ని దాటుకుంటూ బీచ్ లోకి వెళ్ళవచ్చు.

నాట్యశాల

నాట్యశాల

బీచ్ ఒడ్డున ఉన్న నాట్యశాలలో విద్యార్థలకు కూచినపూడి నృత్యం నేర్పిస్తారు. ఒడ్డునే దత్తాశ్రమము, పురాతన శివాలయం కలవు. ఈ బీచ్లోనే లింగాకారంలో ఉండే 12 బావులు కలవు. ఒకక్కొక్క బావిలోని నీరు ఒక్కొక్క రుచిలో ఉంటాయంటారు.

ప్రకృతి ప్రేమికులకు ప్రశాంతమైన వాతావరణం

ప్రకృతి ప్రేమికులకు ప్రశాంతమైన వాతావరణం

ప్రకృతి ప్రేమికులకు ప్రశాంతంగా గడపటానికి అనువైన వాతావరణం కలిగి ఉన్నది. బీచ్ చూడటానికి ఎలాంటి టికెట్ అవసరం లేదు. బీచ్ పర్యటనకు వచ్చే వారు ఆ సముద్రపు అలలు పాదాలను తాకుతూ ఉంటే ఏదో చెప్పలేని అనుభూతి. అలా సముద్రంలో కాసేపు జలకాలాటలాడి కొన్ని ఫొటోలు, సెల్ఫీలు దిగవచ్చు. నిత్యం పర్యాటకులకు కళకళలాడే విధంగా మంగినపూడి బీచ్‌ను అత్యంత రద్దీగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకునేలా..: ఆహ్లాదం, ఆనందాలను పంచడమే కాకుండా ప్రధాన ఆదాయవనరుగా ఉండటం ఈ బీచ్ యొక్క మరో ప్రత్యేకత.

బీచ్ లో ఇసుకకి బదులుగా నల్లటి మన్ను ఉంటుంది.

బీచ్ లో ఇసుకకి బదులుగా నల్లటి మన్ను ఉంటుంది.

మంగినపూడి బీచ్ మచిలీపట్నానికి 11 కి.మీ. దూరంలో ఉంది. బెస్తవారు ఉండే చిన్న గ్రామమిది. ఇక్కడి బీచ్ లో ఇసుకకి బదులుగా నల్లటి మన్ను ఉంటుంది. విదేశీయులకు తూర్పు తీరానికి చేరడానికి ఇది ముఖ ద్వారముగా ఉండేది. ఇక్కడి బీచ్ లో సముద్రము లోతు తక్కువగా ఉంటుంది.
చిత్రకృప : Ganeshk

దత్తాశ్రమము ఇక్కడ తీరములో ఉన్న దత్తాశ్రమము

దత్తాశ్రమము ఇక్కడ తీరములో ఉన్న దత్తాశ్రమము

దత్తాశ్రమము ఇక్కడ తీరములో ఉన్న దత్తాశ్రమము ఒక పుణ్యక్షేత్రము మరియు తీర్థ స్థలము. దీనిని దత్తరామేశ్వరము అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న శివాలయం చాలా పురాతనమైనది. రామేశ్వరములో ఉన్నట్లుగా ఇక్కడ మంగినపూడిలో పన్నెండు బావులు లింగాకారంలో ఉంటాయి. చిత్రకృప : Datta Peetham

శ్రీ పాండురంగస్వామి దేవాలయము:-

శ్రీ పాండురంగస్వామి దేవాలయము:-

మచిలీపట్నానికి దగ్గరలో ఉన్న చిలకలపూడి లో ఈ పాండురంగస్వామి దేవాలయం ఉంది. ఇది మంగినపూడి బీచ్కి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడి దేవాలయంలో ప్రధాన దైవం విష్ణువు. పండరీపురములో ఉన్న దేవాలయము వలే ఇక్కడ దేవాలయము ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం చాలా విశాలంగా ఉంటుంది. అంతరాలయములోనున్న పాండురంగడి నల్లరాతి విగ్రహం మరియు గర్భగుడి బయటవున్న పాలరాతి అమ్మవార్ల విగ్రహలు చూపరులను భక్తిభావముతో కట్టిపడెస్తాయి. భక్తులు పాండురంగడిని అరాధించి, పటికబెల్లం నైవేద్యముగా సమర్పిస్తారు.

కేరింతలు కొడుతూ..ఈతకొడుతూ ఆనంద సాగరంలో

కేరింతలు కొడుతూ..ఈతకొడుతూ ఆనంద సాగరంలో

ఈ బీచ్ ను సందర్శించే పర్యాటకులంతా సాగరంలో స్నానాలు చేస్తారు, అలల సవ్వడిలో కేరింతలు కొడుతూ..ఈతకొడుతూ ఆనంద సాగరంలో తేలియాడుతారు. ఈ బీచ్ కు కుంటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి సందర్శించవచ్చు.

ఈ బీచ్ లో పారా రైడింగ్

ఈ బీచ్ లో పారా రైడింగ్

ఈ బీచ్ లో పారా రైడింగ్, హెలీరైడింగ్, కార్ రేసింగ్, సైకత కళ వంటి ఈవెంట్లకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుంది. ఆకాశపుటంచులను తాకే విధంగా పారాగ్లైడింగ్ ద్వారా ఎగిరిన పర్యాటకులంతా ప్రత్యేకమైన అనుభూతినికి లోనవుతారు.

 హెలీరైడ్ ద్వారా హెలీకాప్టర్ లో బీచ్ పరిసర ప్రాంతాలన్నీ చుట్టి

హెలీరైడ్ ద్వారా హెలీకాప్టర్ లో బీచ్ పరిసర ప్రాంతాలన్నీ చుట్టి

అలాగే ఒక్కో ట్రిప్ కు అరుగురు చొప్పున నిర్వహించే హెలీరైడ్ ద్వారా హెలీకాప్టర్ లో బీచ్ పరిసర ప్రాంతాలన్నీ చుట్టి రావచ్చు. అలాగే ఇక్కడ బీచ్ ఫెస్ట్ వల్ల కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ బీచ్ ఫెస్టివల్ పర్యాటకులతో చాలా సందండిగా ఉంటుంది. బీచ్ ఫెస్టివ్ సమయంలో సైకత శిల్పం ఆలోచింపచేసే విధంగా ఉంటుంది.

బీచ్ ఫెస్టివల్

బీచ్ ఫెస్టివల్

బీచ్ ఫెస్టివల్ సమయంలో ఇక్కడ అనేక క్రీడలను కూడా నిర్వహిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటుంది. బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, పోటీల్లో క్రీడాకారులంతా హోరాహోరీ తలపడతారు.

అలాగే బోటింగ్ :

అలాగే బోటింగ్ :

మినీ బోటింగ్ జోన్ లో చిన్నారులంతా ఉల్లాసంగా బోటింగ్ చేసి ఆనందోత్సాహాలలో తేలిపోతారు. ఇంకా కొంత మంది పర్యాటకులు గుర్రపు స్వారీలు గుర్రపు స్వారీ చేసి రాజసాన్ని ప్రదర్శించవచ్చు.

ఈ బీచ్ లో పిల్లల కోసం ఏర్పాటు చేసే

ఈ బీచ్ లో పిల్లల కోసం ఏర్పాటు చేసే

ఈ బీచ్ లో పిల్లల కోసం ఏర్పాటు చేసే హల్క్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మాన్, ఐస్ మ్యాన్, ఐరన్ మాన్ వంటి సూపర్ హీరోల బొమ్మల వద్ద చిన్నారులు వారి తల్లిదండ్రులంతా ఉత్సాహంగా సెల్ఫీలు దిగొచ్చు.

బీచ్ లోని ఇసుక తిన్నెలపై

బీచ్ లోని ఇసుక తిన్నెలపై

బీచ్ లోని ఇసుక తిన్నెలపై వివిధ రకాల సీఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ లో రుచికరమైన రొయ్యలు, పీతలు, నత్తగుల్లలు వాటిలో రకాలు తినదగిన ఇతర సముద్ర జవీల ఆహారాలన్నీఈ ఫుడ్ కోర్ట్ లో అందుబాటులో ఉంటాయి.

ఎలా వెళ్లాలి ?

ఎలా వెళ్లాలి ?

ఈ బీచ్ మచిలీపట్నానికి 11 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆటోలలో లేక బస్సులలో వెళ్ళవచ్చు. విజయవాడ నుండి మచిలీపట్నానికి బస్ లేదా రైలు మార్గంలో వెళ్ళవచ్చు.
ముందుగా మచిలీపట్నం ఎలా చేరుకోవాలి
వాయు మార్గం : మచిలీపట్నం సమీపాన విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ కలదు. ఇది మచిలీపట్నం నుండి 67 కిలోమీటర్ల దూరంలో కలదు. ఎయిర్ పోర్ట్ నుండి క్యాబ్ లేదా టాక్సీ ఎక్కి మచిలీపట్నం చేరుకోవచ్చు.
రైలు మార్గం : మచిలీపట్నం లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, గుంటూరు మొదలగు ప్రాంతాల నుండి రైళ్ళు వస్తుంటాయి.
రోడ్డు మార్గం : రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి మచిలీపట్నం కు ప్రభుత్వ/ప్రవేట్ బస్సు సౌకర్యం కలదు. విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నుండి రెగ్యులర్ గా బస్సులు తిరుగుతుంటాయి.
చిత్రకృప : Ganeshk

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X