Search
  • Follow NativePlanet
Share
» »పర్యాటక నిలయం ఈ మరయూర్

పర్యాటక నిలయం ఈ మరయూర్

మరయూర్ పర్యాటక కేంద్రానికి సంబంధించిన కథనం.

దేవతల నిలయంగా పేర్కొనే కేరళ భారత దేశంలోనేకాక ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రాంతమన్నవిషయం అందరికీ తెలిసిందే. సముద్ర తీర ప్రాంతాలు, టీ తోటలు, పర్వతాలు, ఆయుర్వేద రిసార్టులు, చారిత్రాత్మక కోటలు ఇలా పర్యాటక పరంగా చూడటానికి ఎన్నో ప్రాంతాలు ఈ కేరళ సొంతం. అలాంటి పర్యాటక స్థలాల్లో ఒకటైన మరయూర్ గురించి ఇప్పుడు తెలుసుకొందాం.

మరయూర్

మరయూర్

P.C: You Tube

చలికాలంలో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చుట్టూ పర్వత శిఖరాలనడమ ఉండే ఈ ప్రాంతం చూపరులను ఇట్టే ఆకట్టుకొంటుంది. మున్నార్ నుంచి మరయూర్‌కు సులభంగా చేరుకోవచ్చు.

మరయూర్

మరయూర్

P.C: You Tube

మరయూర్ గ్రామం కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఒక చిన్న గ్రామం. మర, యూర్ అనే రెండు పదాల కలయిక వల్ల ఈ పేరు వచ్చింది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే రహస్య ప్రాంతం అని అర్థం.

మరయూర్

మరయూర్

P.C: You Tube

మున్నార్ నుంచి మరయూర్‌కు వెళ్లే మార్గం మొత్తం రెండు వైపులా పచ్చని చెట్లు ఉంటాయి. ముఖ్యంగా శ్రీగంధం చెట్లు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అదే విధంగా జలపాతాలు మొదలుకొని చిన్నచిన్న సెలఏర్లు కూడా మీకు కనిపిస్తుంటాయి. వాటిని చూసుకొంటూ అలా ముందుకు సాగిపోవడంతో మీకు సమయమే గుర్తుకురాదు.

మరయూర్

మరయూర్

P.C: You Tube

శ్రీగంధం చెట్లతో కూడిన తోట ఈ మరియూర్‌లో అత్యంత ఆకర్షణీయం. ఈ తోట చూడటానికే చాలామంది ఇక్కడికి వస్తుంటారు. ఏడాది మొత్తం ఈ తోటలను చూడటానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. ఈ శ్రీగంధం చెట్లు స్యాటాలమ్ కుటుంబానికి చెందినవి. వీటి నుంచి సోపులు సుగంధద్రవ్యాలు తయారుచేస్తారు.

మరయూర్

మరయూర్

P.C: You Tube

ఈగ్రామంలో ఉన్న గుహలు చరిత్ర అంటే ఇష్టపడేవారిని ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఈ గుహల్లో ప్రాచీనకాలంనాటి వర్ణచిత్రాలను మనం చూడొచ్చు. ఈ చిత్రాలు ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం విశేషం.

మరయూర్

మరయూర్

P.C: You Tube

మరయూర్‌కు చుట్టు పక్కల మనకు చిణ్ణర్ వన్యప్రాణీ సంరక్షణ కేంద్రం, లకమ్ జలపాతం, ఆనెముడి శిఖరం, కునాడలా జలాశయం తదితరాలు మనకు కనిపిస్తుంటాయి.

మరయూర్

మరయూర్

P.C: You Tube

సాహసక్రీడలంటే ఇష్టపడేవారికి మున్నార్‌తో పాటు ఈ మరయూర్ చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ ట్రెక్కింగ్‌తోపాటు ఇతర అనేక సాహసక్రీడలు అందుబాటులో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X