Search
  • Follow NativePlanet
Share
» »శ్రీకృష్ణ జన్మభూమి మథుర ఎంత అద్భుతంగా ఉందో చూశారా?

శ్రీకృష్ణ జన్మభూమి మథుర ఎంత అద్భుతంగా ఉందో చూశారా?

మథుర మరియు బృందావనం అనగానే శ్రీకృష్ణూడు, గోపికలు గుర్తుకు వస్తారు. బాల్యంలో యశోదా తనయుడు ప్రదర్శిం చిన లీలలెన్నో మదిలో మెదలుతాయి. ఇక్కడి సందర్శనీయ ప్రాంతాలెన్నో ఆనాటి కృష్ణలీలలతో ముడిపడినవే. గోపికావస్త్రాపహరణం, రాసలీల తదితరాలన్నీ ఇక్కడో చోటు చేసుకున్నట్లు భక్తులు భావిస్తుంటారు. సందర్శిం చేందుకు ఎన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. దగ్గర్లోనే మరెన్నో చారిత్రక, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న స్థలాలు కూడా ఉన్నాయి. ఉత్తర భారతదేశ యాత్రలో తప్పని సరిగా దర్శించాల్సిన పుణ్యక్షేత్రం మథుర, బృందావనం .

శ్రీ కృష్ణుడు అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం. ఇష్టం మాత్రమే కాదు అన్ని ప్రాణుల్లలోనూ చైతన్య స్వరూపుడై ఉండే స్వామిని తలవకుండా ఎవరుంటారు?అటువంటి స్వామి నడియాడిన ప్రదేశమైనా పుట్టిన వూరైనా ఎంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుందో వేరుగా చెప్పాల్సిన అవసరం ఏ మాత్రం ఉండదు కదా. మరి మథుర గురించి ఆ ఆసక్తికరమైన చారిత్రక విషయాలు తెలుసుకుందాం..

కృష్ణుని జన్మస్థలం.

కృష్ణుని జన్మస్థలం.

మథుర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది దాదాపు ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది బృందావన్‌కు 12 కి.మీ. దూరంలో వుంది. ఇది కృష్ణుని జన్మస్థలం. దేవకి, వసుదేవులకు జన్మించాడు. శ్రీకృష్ణుడు చెరసాలలో పుట్టాడు. ఇప్పుడు ఆ చెరసాలను శ్రీ కృష్ణ జన్మభూమి అంటారు. ఇది మధుర కాంప్లెక్స్‌లో వుంది. ఈ గుడిని శ్రీకృష్ణునికి అంకితం చేశారు. ఇది మధుర పద్ధతిలో నిర్మించిన సాంసృ్కతిక భవంతి.

పాత కాలంలో ఒంటెల మీద జరిగే వస్తురవాణా మార్గాలలో ఇది ప్రముఖ కేంద్రం

పాత కాలంలో ఒంటెల మీద జరిగే వస్తురవాణా మార్గాలలో ఇది ప్రముఖ కేంద్రం

ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో దక్షిణంలో శ్రీకృష్ణజన్మభూమి, యమునా నదీ తల్లి పాదస్పర్శతో పునీతమైన నగరం మథుర. ఇది మథుర జిల్లాకు ముఖ్యపట్టణం. ప్రాచీనకాలంలో ఇది ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం. పాత కాలంలో ఒంటెల మీద జరిగే వస్తురవాణా మార్గాలలో ఇది ప్రముఖ కేంద్రం.

శ్రీ కృష్ణుని జన్మస్థలంలో ప్రాచీనకాలంలో కేశవ్‌దేవ్ ఆలయం నిర్మించ బడింది

శ్రీ కృష్ణుని జన్మస్థలంలో ప్రాచీనకాలంలో కేశవ్‌దేవ్ ఆలయం నిర్మించ బడింది

ఈ నగరంలో శ్రీ కృష్ణుడు జన్మించాడు కనుక ఇది శ్రీకృష్ణ జన్మభూమిగా ఖ్యాతి గాంచింది. భూగర్భ చెరసాలలో జన్మించిన శ్రీ కృష్ణుని జన్మస్థలంలో ప్రాచీనకాలంలో కేశవ్‌దేవ్ ఆలయం నిర్మించ బడింది. శ్రీకృష్ణిని మేనమామచే పాలించబడుతున్న సూరసేన సామ్రాజ్యానికి మథుర రాజధాని.

మహిమగల క్షేత్రంగా భక్తిసామ్రాజ్యానికే మకుటాయమానంగా

మహిమగల క్షేత్రంగా భక్తిసామ్రాజ్యానికే మకుటాయమానంగా

ఈ మధుర కేవలం పర్యాటకంగా ప్రభుత్వానికి పైకాన్ని ఆర్జించడం మాత్రమే కాదు... మహిమగల క్షేత్రంగా భక్తిసామ్రాజ్యానికే మకుటాయమానంగా వెలుగొందుతోంది.

మథుర బుద్ధ విగ్రహాలు తయారయ్యే ప్రాచీన రెండు నగరాలలో ఒకటి.

మథుర బుద్ధ విగ్రహాలు తయారయ్యే ప్రాచీన రెండు నగరాలలో ఒకటి.

మథుర బుద్ధ విగ్రహాలు తయారయ్యే ప్రాచీన రెండు నగరాలలో ఒకటి. రెండవ నగరం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న గాంధారం. రెండు నగరాలలో ఒకటిగానే క్రీ.శ మొదటి శతాబ్దంలో బుద్ధిని శిలలు చెక్కడం ఆరంభించినట్లు అంచనా. గాంధారం తయారైన శిలలు ఇండో గ్రీకు సిల్ప శైలిలోనూ మధురలో తయారైన సిలలు హిందూ దేవతల శిల్ప శైలిలోనూ ఉన్నాయి.షెర్లాక్ హోమ్స్ రచించిన 'ది సైన్ ఆఫ్ ఫోర్' నవలలో మథురా నగర వర్ణన ఉంది.

కృష్ణ బలరాం మందిరం

కృష్ణ బలరాం మందిరం

మధురా పట్టణంలో అత్యంత పుణ్యప్రదం ద్వారకాధీశుని మందిర దర్శనం. ప్రాచీన కట్టడాలైనా చూచేవారికి కృష్ణుని బాల్యాన్ని గుర్తుకుతెచ్చి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ మందిరం చెంతనే గీతా మందిరమూ ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మధుర జిల్లాలో ఈ ‘మధుర’సుస్థిరమైంది.

కంసుడు పాలించిన ఈ మధురను

కంసుడు పాలించిన ఈ మధురను

కంసుడు పాలించిన ఈ మధురను కంస సంహారం చేసిన చేసిన కృష్ణుడు రాధా మనోహరుడు. రాధామాధవులకు నెలవుగా ఈ మధుర ప్రసిద్ధి చెందింది. యమునా నది ఒడ్డున ఉన్నది మరియు ఇది రాజధాని నగరం ఢిల్లీకి సుమారు 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరం శ్రీకృష్ణ ప్రసిద్ధ కృష్ణ జన్మ భూమి మందిర్ భక్తులను అత్యంత గౌరవించే అతిధేయ ఆలయంగా ఖ్యాతి చెందింది. వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయ ప్రదేశంలో భగవానుడు జన్మించాడని చెబుతుంటారు. పొరుగు పట్టణాలైన గోవర్ధన్, నందగావ్ మరియు బృందావన ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతం హిందువులకు ఒక ప్రధాన యాత్రా ప్రదేశం. ఈ ఆలయం మథుర నగరానికి మధ్యన ఉంది.

ప్రేమ మందిరం బృందావనం

ప్రేమ మందిరం బృందావనం

బృందావనం శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని గడిపిన ప్రదేశం. కనుక ఇది హిందువుల పుణ్య క్షేత్రంగా ఖ్యాతి గడించింది. శ్రీకృష్ణుడు బాల్యక్రీడలు సల్పిన ప్రాంతం బృందావనం చూపురులను ఆకట్టుకుంటుందిక్కడ.బృందావనంలో భాగవతం గురించి చాటి చెప్పే 5000 ఆలయాలు కలిగి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. చిత్ర కృప : sureshnarsimhan

బృందావనం లో చూడవలసినవి :

బృందావనం లో చూడవలసినవి :

బంకే బిహారీ ఆలయం, గోవింద్ దెఒ ఆలయం, ఇస్కాన్ ఆలయం, మదన మోహన్ ఆలయం, కేసి ఘాట్, జైపూర్ ఆలయం, గోపెశ్వర మహదేవ్ ఆలయం, రంగ్జీ ఆలయం, రాధాగోకులానంద అలాయం, రాధా రామన్ ఆలయం, షాహ్జి ఆలయం.

చిత్ర కృప : cat_collector

 మ్యూజియం:

మ్యూజియం:

మధుర మ్యూజియం పట్టణం మధ్యలో వుంటుంది. పురాతన గ్రంధాలు, విగ్రహాలు దీనిలో కలవు. క్రి. పూ.౩వ శతాబ్దం నాటి వస్తువులు కూడా చూడవచ్చు. మధుర లోను మరియు దాని చుట్టుపక్కల తవ్వి వెలికి తీసిన వస్తువులను అర్కేయోలజికల్ శాఖ ఇక్కడ భద్ర పరచి ప్రదర్శిస్తోంది.

కుసుం సరోవర్:

కుసుం సరోవర్:

కుసుం సరోవర్ గోవర్ధన గిరిలో ఒక ప్రముఖ పవిత్రమైన ట్యాంక్. దీనికి ఆ పేరు ట్యాంక్ చుట్టూ విస్తారంగా పెరిగిన కుసుమ పువ్వుల నుండి వచ్చింది. గోపికలు ఈ ప్రదేశం నుంచి పువ్వులను కోసి వారి ప్రియమైన కృష్ణుడు కోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఇక్కడ నుండి కేవలం అర గంట నడకతో రాధా కుండ్ ను చేరుకోవచ్చు. కుసుమ్ సరోవర్ 450 అడుగుల పొడవు మరియు 60 అడుగుల లోతు కలిగి ఉంటుంది. కృష్ణుడుకి కదంబ చెట్లు ఇష్టమైన చెట్టు కనుక చెరువు కట్ట అంతటా చెట్లను దట్టంగా ఉండేలా అభివృద్ధి చేసారు. తోటలో ఒక పురాతన రాజ కుటుంబానికి చెందిన ఒక స్మృతి చిహ్నం ఉంది.

బృందావన్‌ చంద్రోదయ మందిరం:

బృందావన్‌ చంద్రోదయ మందిరం:

ప్రపంచంలోని అతిపెద్ద ఆలయం ‘చంద్రోదయ మందిరం' మరో అరుదైన ఘనతను సాధించబోతోంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కట్టడమైన బూర్జ్ ఖలీఫా కన్నా పునాదితో ఈ ఆలయాన్ని నిర్మిస్తుండటం గమనార్హం. బూర్జ్ ఖలీఫా పునాదికి 50 మీటర్ల లోతు ఉండగా, అంతకన్నా ఐదు మీటర్ల ఎక్కువ లోతు పునాదితో యుపి బృందావన్‌లో చంద్రోదయ మందిరం నిర్మాణమవుతోంది. కాగా, ఈ ఆలయానికి 55 మీటర్ల లోతు పునాది ఉంటుందని, 2017 మార్చిలోగా పునాది నిర్మాణం పూర్తవుతుందని మందిరం ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహా దాస్ తెలిపారు. చంద్రోదయ మందిరం 700 వందల అడుగుల ఎత్తు, సుమారు 700 కోట్ల వ్యయంతో 2022 నాటికి పూర్తికానుంది.

కేసి ఘాట్ దేవాలయం:

కేసి ఘాట్ దేవాలయం:

మధుర నగరం( (కృష్ణుడు జన్మస్థలం) లో జుగల్ కిషోర్ ఆలయం కలదు. ఈ శాంతియుత పవిత్ర పుణ్యస్థలాన్ని సందర్శించి ఉపశమనం పొందవచ్చు. జుగల్ కిషోర్ ఆలయము మథుర లో కృష్ణుడు అత్యంత ప్రాచుర్యం పొందినది మరియు ఇది పురాతన ఆలయాలల్లో ఒకటి. శ్రీ కృష్ణుడు దేవాలయాన్ని కేసి ఘాట్ దేవాలయం ( శ్రీ కృష్ణుడు నరకాశురున్ని సంహరించిన ప్రదేశం)అంటారు. నరకాశురున్ని సంహరించిన తర్వాత ఘాట్ అటువైపు వున్న నదిలో స్నానం ఆచరించాడని ప్రసిద్ది.

విశ్రాం ఘాట్:

విశ్రాం ఘాట్:

ఇక్కడ కల సుమారు 25 ఘాట్ ల లోను విశ్రాం ఘాట్ ప్రదానమైనది. ఇది బలరాముడు విశ్రాంతి తీసుకొన్న ప్రదేశంగా ఇక్కడివారు చెబుతారు. శ్రీకృష్ణుడు తన మేన మామ అయిన కంసుడిని వధించిన తర్వాత , ఇక్కడ కొంత సమయం విశ్రాంతి పొందాడట. ఇక్కడ బలరామకృష్ణుల విగ్రహాలు ఉన్నాయ.

కంసుడి కోట

కంసుడి కోట

ఈ కోట యమునా నది ఒడ్డున కలదు. ఇపుడు శిధిలమై వుంది. ఈ కోట విశాలమైన ప్రదేశంలో ఎత్తైన గోడలతో బలంగా నిర్మించ బడింది. రాజా మాన్ సింగ్ దీనిని 16 వ శతాబ్దంలో పునరుద్ధరించగా, జైపూర్ మహారాజు సవాయి జై సింగ్ ఇక్కడ ఒక అబ్సర్వేటరీని నిర్మించాడు.

గోకులం:

గోకులం:

మధురకు 10. కి.మీ. దూరంలో వుంది. ఇక్కడ కృష్ణుడు పెరిగాడు. దీనికి చేరువలోనే గోకుల ఆగమన్‌ ఉత్‌కల్‌ బంధన్‌, ఉత్న మోక్ష బ్రహ్మఘాట్‌ ఇక్కడ వున్నాయి. శ్రీ కృష్ణుని నోట్లో ప్రపంచం అంతా ఇక్కడే యశోద చూసింది. మఖన్‌లీలా అష్టశఖ లీలలు ఇక్కడ కృష్ణుడు ప్రదర్శించాడు. బరాముని గుడి కూడా ఇక్కడ ఉంది.

గోవర్ధనగిరి....
ఇక్కడకు 30 కీ.మీ. దూరంలో వుంది. ఈ కొండపై చిన్న చిన్న ఇళ్ళు చెట్లతో వున్నవి నిర్మించారు. గిరిరాజ మహరాజ్‌ ముఖర్‌బిండ్‌ ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. దీనికి కొంచెం దూరంలో తబలా శబ్ధాలు వినిపిస్తాయి.

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

వాయు మార్గం
బృందావనం కు సమీపాన ఉన్న విమానాశ్రయం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 150 కిలోమీటర్ల దూరంలో ఉండి, మూడు గంటల్లో చేరుకొనే విధంగా ఉంటుంది. అక్కడి నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ వంటి ప్రవేట్ వాహనాలను అద్దెకు తీసుకొని బృందావనం చేరుకోవచ్చు.

రైలు మార్గం
బృందావనం లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు. సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ ( 11 కి. మీ. దూరంలో) మథుర రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుండి దేశంలోని ఢిల్లీ, లక్నో, వారణాసి, ముంబై వంటి నగరాలకు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ట్యాక్సీ లేదా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి బృందావనం చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం
ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్ మరియు మథుర వంటి పట్టణాల నుండి బృందావనం క్షేత్రానికి ప్రవేట్ మరియు ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి. చిత్ర కృప : Sreeram Nambiar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X