Search
  • Follow NativePlanet
Share
» »ఈ దేవాలయాల్లో ఇదేమి ఆచారం

ఈ దేవాలయాల్లో ఇదేమి ఆచారం

లక్షల ఏళ్ల చరిత్ర కలిగిన భారత దేశం విభిన్న దేవాలయాల నిలయం. ఇక్కడ ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఆచార వ్యవహారాల్లో కావచ్చు, పూజాది కార్యక్రమాల్లో కావచ్చే లేదా సదరు దేవాలయం నిర్మాణంలో కావచ్చు. ఏది ఏమైనా ప్రతి దేవాలయం తన కంటూ ఒక విశిష్టతను ఏర్పాటుచేసుకొంది. అందులో కొన్నింటికి గల కారణాలు ఇప్పటికీ నిఘూడ రహస్యాలు. ఇక కొన్ని దేవాలయాల ఆచార వ్యవహారాలను తలుచుకొంటే ఆశ్చర్యం వేస్తుంది. అటు వంటి కొన్ని విభిన్న ఆచార వ్యవహారాలు కలిగిన దేవాలయాలకు సంబంధించిన వివరాలు మీ కోసం...

హనుమంతుడిని బేడీలతో బంధించిన క్షేత్రం గురించి తెలుసా

మీకు ఇటువంటి ప్రాంతాలు నచ్చక పోవచ్చు. అయినా ఒక్కసారి ఇటు వైపు

చిదంబరం నటరాజ స్వామి దేవాలయం

చిదంబరం నటరాజ స్వామి దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయంలో ప్రధాన దైవం శివుడు. ఈ నటరాజ స్వామి దేవాలయంలో శివుడు నాట్య భంగిమలో కనిపిస్తాడు. ఇక శివుడు మనుష్య రూపంతో పాటు నాట్య భంగిమ రూపంలో కనిపించే ఏకైక క్షేత్రం ఈ చిదంబరంలోని నటరాజ స్వామి దేవాలయం.

ఉత్సవ మూర్తిగా ఆయనే

ఉత్సవ మూర్తిగా ఆయనే

P.C: You Tube

ఈ దేవాలయం తమిళనాడులో ఉంది. అంతేకాకుండా హిందూ సంప్రదాయాలను అనుసరించి ఉత్సవ సమయంలో ఊరేగించడానికి వేరొక విగ్రహం ఉంటుంది. అయితే చిదంబరంలోని నటరాజ స్వామిదేవాలయంలో మాత్రమే మూలవిరాట్టునే ఉత్సవ మూర్తిగా ఊరేగించడం విశేషం.

ఇక దేవాలయం ప్రవేశానికి రుతుస్రావం అడ్డుకాదు

ఐరావతేశ్వర దేవాలయం

ఐరావతేశ్వర దేవాలయం

P.C: You Tube

తమిళనాడులోని కుంభకోణానికి దగ్గరగా ఉన్న తారాసుర అనే గ్రామంలో ఐరావతేశ్వస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ శిల్పకళా విశేషాలను ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఇక్కడ ఒక చోట వాలి సుగ్రీవులు పోరాట సన్నివేశం చెక్కారు. వీటిని ఒక చోట నుంచి చూస్తే వారిద్దరి చేతిలో బాణాలు ఉంటాయి.

మరో స్తంభం నుంచి చూస్తే

మరో స్తంభం నుంచి చూస్తే

P.C: You Tube

మరో స్తంభం నుంచి చూస్తే మాత్రం ఆ బాణాలు కనిపించవు. ఇక అదే విధంగా ఒక స్తంభం నుంచి చూస్తే వాలి సుగ్రీవులతో పాటు శ్రీరాముడు స్పష్టంగా కనిపిస్తాడు. మరో స్తంభం నుంచి చూస్తే మాత్రం శ్రీరాముడు కనిపించడు. ఇది అప్పటి శిల్పకళా చాతుర్యానికి నిదర్శనం.

కూయమత్తూరు వననాథ స్వామి

కూయమత్తూరు వననాథ స్వామి

P.C: You Tube

సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి దేవాలయం గర్భగుడిలో ఒకే ఒక మూలవిరాట్ ఉంటుంది. దానికే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. కూయమత్తూరు వననాథ స్వామి దేవాయలంలో కందంబవననాథ స్వామి దేవాలయం ఇందుకు విరుద్ధం. ఇక్కడ గర్భగుడిలో రెండు నటరాజస్వామి విగ్రహాలు ఉంటాయి. అన్ని రకాల పూజలను కైకర్యాలను ఈ రెండు నటరాజస్వామి మూర్తులకు ఒకే రకంగా నిర్వహిస్తారు.

చెన్నైలోని పెరంబదూర్ దేవాలయం

చెన్నైలోని పెరంబదూర్ దేవాలయం

P.C: You Tube

పెరంబదూర్ దేవాలయం తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఉంది. ఇది ప్రముఖ హిందూ దేవాలయం. ఇక్కడ ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త శ్రీరామానుజాచార్యుల విగ్రహం ఉంది. సాధారణంగా ప్రతి దేవాలయంలో విగ్రహం రాతి, కంచు, లేదా పంచలోహాలతో చేయబడి ఉంటుంది. ఇక్కడ మాత్రం శ్రీరామానుజాచార్యుల విగ్రమం కర్పూరం, కుంకుమ, పసుపుతో చేయబడి ఉంటుంది.

నిత్యకళ్యాణి సమేత విశ్వనాథ స్వామి దేవాలయం

నిత్యకళ్యాణి సమేత విశ్వనాథ స్వామి దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం కూడా తమిళనాడులోని తిరునెల్ వేలి అనే పట్టణం సమీపంలోని కడయం అనే చిన్నగ్రామంలో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం ఈశ్వరుడు. ఈ దేవాలయం ప్రాంగణంలో ఒక పెద్ద బిల్వ చెట్టు ఉంది.

శివలింగం ఆకారంలో

శివలింగం ఆకారంలో

P.C: You Tube

ఈ చెట్టుకు కాచే పండు సాధారణ బిల్వ కాయలువలే ఉండవు. ఇవి శివలింగం ఆకారంలో ఉంటాయి. అందువల్లే ఇక్కడి ప్రజలు ఆ చెట్టును సాక్షాత్తు ఆ పరమశివుడు వెలిసిన చెట్టుగా భావించి విశేష పూజలు చేస్తారు.

సామర్ల కోట ఆంజనేయస్వామి

సామర్ల కోట ఆంజనేయస్వామి

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో సామర్ల కోట అనే గ్రామం ఉంది. ఇక్కడి ఆంజనేయస్వామి విగ్రహం చాలా ఎత్తైనది. ఈ ఆంజనేయస్వామి కన్ను, భద్రాచలంలోని ఆ రామయ్య పాదాలకు సమాంతరంగా ఉంటుందని చెబుతారు.

ధర్మపురి అభిష్టావరదా స్వామి

ధర్మపురి అభిష్టావరదా స్వామి

P.C: You Tube

తమిళనాడులోని ధర్మపురి అనే గ్రామానికి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో అభిష్టావరదా స్వామి అనే విష్ణు దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో నవగ్రహ మంటపం కూడా ఉంది. ఈ మంటపంలోని నవగ్రహాలన్నీ స్త్రీల రూపంలో ఉండటం విశేషం. ఇలాంటి విగ్రహాలు భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరెక్కడా ఉండవు.

అరుదైన ‘సబ్బురాయి' తో నిర్మించిన దేవాలయాలు ఈ జంట నగరాల్లో

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X