Search
  • Follow NativePlanet
Share
» »ఈ వింతలకు కారణాలు చెప్పినా చెప్పక పోయినా మొక్షం ఖచ్చితం

ఈ వింతలకు కారణాలు చెప్పినా చెప్పక పోయినా మొక్షం ఖచ్చితం

By Beldaru Sajjendrakishore

దేశంలో పూరీ కి విశిష్టమైన ప్రాముఖ్యత ఉన్నది. దేశంలోని ఏడు మోక్షాన్ని ప్రసాదించే దేవాలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయం ఎప్పటిదో, ఎప్పుడు వెలసిందో ఖచ్చితమైన ఆధారాలు లేవు. తొలుత దీన్ని ఇంద్రద్యుమ్నుడు అనే రాజు నిర్మించారని కొంతమంది భావన. కాదు కాదు దీన్ని 12 వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగదేవ్ కట్టించారని మరికొందరి భవన. ఎవరెన్ని చెప్పుకున్నా ఆలయం మాత్రం ప్రాచీనమైనదే. దీని గురించి విష్ణు పురాణంలో పేర్కొనటం జరిగింది.

ఇక్కడకు మీరు వెళితే ...'శని'...మీ నుంచి దూరంగా వెలుతాడు...

దంపతులు జంటగా వెళ్లకూడని ఏకైక దేవాలయం ఇదే...అలా వెలితే విడాకులే...

ఇలా చేస్తే కుజ దోషాలు పోతాయి...పెళ్లి తర్వాత లైఫ్ సాఫీ

జగన్నాథుని ఆలయం (పూరీ) భారతదేశ తూర్పు భాగంలోని ఓడిశా రాష్ట్రంలో కలదు. రాష్ట్ర రాజధానైన భువనేశ్వర్ నుండి ఇది 60 కి. మి. దూరంలో ఉంది. పూరీ సమీపంలోనే బంగాళాఖాతం సముద్రం పర్యాటకులతో, స్థానికులతో సందడి చేస్తుంటుంది. ఈ ఆలయంలో ఎన్నో వింతలు ఉన్నాయి. వాటికి గల కారణాలు ఎవరూ వివరించలేకపోతున్నారు. ఈ వింతలతో పాటు సవివరంగా పూరి గురించిన కథనాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.

1. ఎన్ని వింతలో

1. ఎన్ని వింతలో

1. ఎన్ని వింతలో

Image Source:

జగన్నాథ ఆలయం నీడ ఏ సమయంలోనూ కనిపించదు. ఆలయం మీద ఉన్న సుదర్శన చక్రాన్ని మీరు పూరీ లో ఎక్కడినుంచైనా, ఎటు వైపునుంచైనా చూస్తే, చక్రం మీ వైపే చూస్తున్నట్లు ఉంటుంది. ఆలయ గోపురం మీద ఉండే జెండా వీచే గాలికి ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే రెపరెపలాడుతుంది. పక్షులు, విమానాలు పూరీ జగన్నాథుని ఆలయం మీద నుంచి వెళ్ళవు.

2. మొదట పై మట్టి పాత్ర

2. మొదట పై మట్టి పాత్ర

2. మొదట పై మట్టి పాత్ర

Image Source:

ఏడు మట్టి పాత్రలను ఒకదానిపై మరొకటి పెట్టి వంట చేస్తారు. ముందుగా పైన ఉండే మట్టి పాత్ర వేడి అవుతుంది. ఆతరువాత ఒకదానికొకటి వేడవుతూ చివరగా, అడుగున ఉన్న మట్టి పాత్ర వేడవుతుంది

ఇక్కడ చెప్పుకోవలసినది ప్రసాదం / నైవేద్యం. 64 రకాల పిండివంటలతో స్వామివారికి నైవేద్యం పెడతారు. ఆలయంలో తయారు చేసే ప్రసాదాన్ని 20 లక్షల మందికి పెట్టవచ్చట. ఆయినా సరే ప్రసాదం వృధా కాదు, తక్కువా కాదు.

మీరు ఈ వింతలకు కారణాలు చెప్పినా చెప్పక పోయినా మొక్షం ఖచ్చితం

3. కుక్క నీడ కనిపిస్తుంది

Image Source:

జగన్నాథ ఆలయ వంటశాల భారతదేశంలోనే అతి పెద్ద వంటశాల. సంప్రదాయాల ప్రకారం ఇక్కడ వండిన వాటిని శ్రీమందిర రాణి అయిన మహాలక్ష్మి దేవి పర్యవేక్షిస్తుందని అంటారు. ఒకవేళ అక్కడ తయారైన వంటలలో ఏదైనా లోపం వుంటే వంటశాల దగ్గర కుక్క నీడ కనిపిస్తుందని చెబుతుంటారు.

4. ఇప్పటికీ బావుల నుంచి నీరు

4. ఇప్పటికీ బావుల నుంచి నీరు

4. ఇప్పటికీ బావుల నుంచి నీరు

Image Source:

మహాసురులుగా పిలిచే వంటవాళ్ళు దీన్ని మహాలక్ష్మిదేవి కలతకు ప్రతీకగా భావించి ఆ వంటను సమాధి చేసి మళ్ళీ కొత్తగా వంట మొదలు పెడతారు. ఇక్కడ మొత్తం వంటంతా హిందూ ఆచారాల ప్రకారం జరుగుతుంది. వంటకు మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు. వంట కోసం వంటశాల దగ్గర వున్నా గంగ, యమునా అనే రెండు పవిత్ర బావుల నుంచి తోడిన నీటిని మాత్రమే ఉపయోగిస్తారు.

5. 64 రకాల నైవేద్యాలు

5. 64 రకాల నైవేద్యాలు

5. 64 రకాల నైవేద్యాలు

Image Source:

ఇక్కడ ఐదు ప్రత్యేక ముహుర్తా లలో రత్నవేది మరియు భోగ మండపాలలో ఉన్న ప్రతిమలకు పెట్టడానికి 64 రకాల నైవేద్యాలు ఉన్నాయి.ఆలయ వైదిక కర్మల ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు పెట్టె కోతోభోగ లేదా అబద అనే ప్రసాదం కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. జగన్నాథునికి సమర్పించిన తర్వాత ఈ భోజనాన్ని తగినంత మొత్తంలో మహా ప్రసాదంగా ఆలయంలోని సింహద్వారానికి ఈశాన్యంలో ఉన్న ఆనంద బజారులో పంచుతారు. అక్కడి భక్తులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.

6. సముద్ర ఘోష వినిపించదు

6. సముద్ర ఘోష వినిపించదు

6. సముద్ర ఘోష వినిపించదు

Image Source:

సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉందని తెలుసుకదా ..! ఆ సముద్ర ఘోష (శబ్దం) కూడా ఇక్కడ వినిపించదట. ఆలయ సింహ ద్వారం (ప్రధాన ద్వారం) ప్రవేశం వరకు సముద్ర ఘోష వినిపిస్తుంది. అది దాటి లోనికి వెళితే శబ్దం వినిపించదు. బయటికి వస్తే ఆ శబ్దం మరలా వినిపిస్తుంది.

7. అప్పట్లో

7. అప్పట్లో

7. అప్పట్లో

Image Source:

ఈ ద్వారం తూర్పు ముఖంగా ఉండి బడా దందా లేదా పెద్ద రోడ్డుకు దారి చూపుతుంది .బైసీ పహచ లేదా ఇరవై రెండు మెట్ల వరుస ఆలయ భవనంలోకి దారి చూపుస్తుంది. సంస్కృతంలో పతిత పావన గా పిలిచే జగన్నాథుని శిల్పం ప్రవేశంలో కుడివైపున చెక్కివుంటుంది. పతిత పావన అంటే అణగారిన మరియు దిగజారిన వారి బాంధవుడు అని అర్థం. ప్రాచీన కాలంలో ఆలయంలోకి అంతరానివాళ్ళకు ప్రవేశం వుండేది కాదు కనుక వాళ్ళు ఈ పతిత పావనున్ని పూజించేవాళ్ళు.

8. మహాలక్ష్మి అలిగినందుకు

8. మహాలక్ష్మి అలిగినందుకు

8. మహాలక్ష్మి అలిగినందుకు

Image Source:

జయ, విజయ అనే ఇద్దరు ద్వారపాలకుల ద్వారానికి రెండు వైపులా నుంచుని వుంటారు. రథయాత్ర మొదలయ్యే ముందు జగన్నాథ్, బలభద్ర మరియు సుభద్రల విగ్రహాలను ఈ దారిలోనే తీసుకెళ్తారు. వాటిని గుండీచ మందిరం నుంచి తీసుకు వచ్చేటప్పుడు తనను నిర్లక్ష్యం చేసి తమతో పాటు యాత్రకు తీసుకు వెళ్లనందుకు అలిగిన మహాలక్ష్మిని జాతర రూపంలో శాంత పరుస్తారు. అప్పుడే విగ్రహరూపంలో ఈ ద్వారా తలుపులపైన ఉన్న మహాలక్ష్మి వారిని ఆలయంలోకి రావడానికి అనుమతిని ఇస్తుంది.

9. కోణార్క్ లోనిది

9. కోణార్క్ లోనిది

9. కోణార్క్ లోనిది

Image Source:

ప్రధాన ద్వారం ముందు అద్భుతమైన పదహారు ముఖ ఏకశిలా స్తంభామైన అరుణ స్తంభం కూడా ఉంది. దీని పైభాగంలో సూర్య భగవానుడి రథసారథి అయిన అరుణుడి విగ్రహం కూడా వుంటుంది. అసలు ఈ స్తంభం కోణార్క్ లోని సూర్య ఆలయంలోనిదని చెబుతారు. అయితే ఖుర్దా రాజు ఇక్కడికి మార్పిడి చేయించారని చరిత్ర చెబుతుంది.

10. రథయాత్ర

10. రథయాత్ర

10. రథయాత్ర

Image Source:

ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే, వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి.

11. ప్రతి ఏడాది కొత్త రథం

11. ప్రతి ఏడాది కొత్త రథం

11. ప్రతి ఏడాది కొత్త రథం

Image Source:

వూరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరీ జగన్నాథాలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. వూరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే... జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.

12. నిర్థిష్టంగా

12. నిర్థిష్టంగా

12. నిర్థిష్టంగా

Image Source:

జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢ శుద్ధ విదియనాడే అయినా అందుకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియనాడు రథనిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయతృతీయనాడు రథ నిర్మాణం మొదలుపెడతారు.

13. వేర్వేరు రథాలకు వేర్వేరుగా

13. వేర్వేరు రథాలకు వేర్వేరుగా

13. వేర్వేరు రథాలకు వేర్వేరుగా

Image Source:

1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి యెక్క రథం తయారీకి ఉపయోగిస్తారు. అదే విధంగా 763 కాండాలను బలరాముడి రథనిర్మాణానికి ఉపయోగిస్తారు., 593 భాగాలను సుభద్రాదేవి రథానికీ వినియోగిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమినాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి.

14. నంది ఘోష అంటారు

14. నంది ఘోష అంటారు

14. నంది ఘోష అంటారు

Image Source:

జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటిచారలున్న పసుపువస్త్రంతో ‘నందిఘోష'ను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు. పద్నాలుగు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలివస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు.

15. వేర్వేరు వస్త్రాలతో

15. వేర్వేరు వస్త్రాలతో

15. వేర్వేరు వస్త్రాలతో

Image Source:

సుభద్రాదేవి రథం పద్మధ్వజం. ఎత్తు 43 అడుగులు. పన్నెండు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మ ధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతిరథానికీ 250 అడుగుల పొడవు ఉండే ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఈ మొత్తం సరంజామాను ఆలయ తూర్పుభాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తర ముఖంగా నిలబెడతారు.

16. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకే

16. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకే

16. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకే

Image Source:

లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు.భక్తుల తొక్కిసలాటలో చక్రాలకింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు.

17. మూడు మైళ్లు...12 గంటలు

17. మూడు మైళ్లు...12 గంటలు

17. మూడు మైళ్లు...12 గంటలు

Image Source:

ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే... జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండీచా వద్ద ఉన్న గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు.

18. వారం తర్వాత తిరుగు ప్రయాణం

18. వారం తర్వాత తిరుగు ప్రయాణం

18. వారం తర్వాత తిరుగు ప్రయాణం

Image Source:

వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశినాడు స్వామి వార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ ఉత్సవాన్ని చూడటానికి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు.

19. కొత్త కళ

19. కొత్త కళ

19. కొత్త కళ

Image Source:

సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్రపేరిట పదిరోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్తకళ సంతరించుకుంటుంది. అప్పుడు వాటి అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవు. చుట్టు పక్కల అంతా స్వామి వారి పేరు మార్మోగి పోతుంది.

20 నేపథ్యం ఇది

20 నేపథ్యం ఇది

20 నేపథ్యం ఇది

Image Source:

రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరొకొందరు చెబుతారు. వాటిలో చాలా మంది నమ్మేది కొంత చారిత్రాత్మక నేపథ్యం ఉన్న దాన్ని గురించి మనం తెలుసుకుందాం.

21. ఆలయ ప్రవేశ నిర్ణయం వారిదే

21. ఆలయ ప్రవేశ నిర్ణయం వారిదే

21. ఆలయ ప్రవేశ నిర్ణయం వారిదే

Image Soruce:

ఇప్పటి నవీన సమయాలలో కూడా ఈ ఆలయం రద్దీగా ఉంటూ పనిచేస్తుంది. ఆలయ ప్రవేశానికి ఎవరిని అనుమతించాలో కమిటీ నిర్ణయిస్తుంది. హిందువులు కాని వారిని, అలాగే భారతీయులు కాని హిందువులను ఈ ఆలయ పరిసరాల్లోకి రానివ్వరు. ప్రవేశానికి అర్హులు కాని వారు దగ్గరలోని రఘురామ పుస్తకాలయం మిద్దె పైనుంచి ఆలయ కార్యకలాపాలను వీక్షించవచ్చు. బౌద్ధ మరియు జైన మతస్తులు తమ భారత వంశ సంతతిని నిరూపించుకున్న తర్వాతనే వారికి ప్రవేశం కల్పిస్తారు.

22. ఇది స్థలపురాణం.

22. ఇది స్థలపురాణం.

Image Source:

ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని పన్నెండో శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్‌ మొదలుపెట్టాడు. ఆయన మనుమడు రాజా అనంగభీమదేవ్‌ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనకో కథ ఉంది. జగన్నాథుడు గిరిజనుల దేవుడనీ, నీలమాధవుడనే పేరుతో స్థానికంగా ఉంటున్న గిరిజన, అటవీ జాతి ప్రజలతో పూజలు అందుకున్నాడని చెబుతారు.

23. విశ్వావసుడు పూజించేవాడు

23. విశ్వావసుడు పూజించేవాడు

23. విశ్వావసుడు పూజించేవాడు

Image Source:

అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడతాడు. విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు, అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు.

23. విశ్వావసుడు పూజించేవాడు

23. విశ్వావసుడు పూజించేవాడు

23. విశ్వావసుడు పూజించేవాడు

Image Source:

అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడతాడు. విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు, అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు.

24. ఆవాలు జారవిడుస్తాడు

24. ఆవాలు జారవిడుస్తాడు

24. ఆవాలు జారవిడుస్తాడు

Image Source:

విద్యాపతి తెలివిగా దారిపొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునే లోగానే విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి, అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు.

25. విశ్వకర్మ వస్తాడు

25. విశ్వకర్మ వస్తాడు

25. విశ్వకర్మ వస్తాడు

Image Source:

ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు.

26. రహస్యంగా

26. రహస్యంగా

26. రహస్యంగా

Image Source:

తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ, ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు.

27. అందుకే కళ్లు మాత్రం ఉంటాయి

27. అందుకే కళ్లు మాత్రం ఉంటాయి

27. అందుకే కళ్లు మాత్రం ఉంటాయి

Image Source:

శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించనిదీ అందుకేనంటారు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి.

28. ప్రయాణం ఇలా

28. ప్రయాణం ఇలా

28. ప్రయాణం ఇలా

Image Source:

ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం ఉంది.

భువనేశ్వర్‌లోని బిజూపట్నాయక్‌ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి.

కోల్‌కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్‌ రైల్వేస్టేషన్‌ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో ఉంది.

భువనేశ్వర్‌, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more