Search
  • Follow NativePlanet
Share
» »ఇంతమంది దేవుళ్లల్లో ఒక్కరు కూడా కేరళను రక్షించలేకపోయారా?

ఇంతమంది దేవుళ్లల్లో ఒక్కరు కూడా కేరళను రక్షించలేకపోయారా?

కేరళలో ఉన్న ప్రఖ్యాత దేవాలయాల గురించి

భారత దేశంలోని పర్యాటక రంగంలో కేరళది ప్రత్యేక స్థానం. ఇక్కడ సహజ ప్రకతి అందాలతో పాటు పురాణ ప్రాధాన్యత కలిగిన ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయం వెనుక ఎన్నో కథలు కూడా దాగి ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని దేవాలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం, గురువాయురు దేవాలయం, అనంత పద్మనాభస్వామి దేవాలయం ఇందులో కొన్ని. అయితే ఇన్ని దేవాలయాలు ఉన్నా ప్రస్తుతం కేరళను అతలా కుతలం చేసిన వరద నుంచి ప్రజలను ఏ దేవుడూ రక్షించలేకపోయాడని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతపద్మనాభ స్మామి ఆలయం

అనంతపద్మనాభ స్మామి ఆలయం

P.C: You Tube

కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన విష్ణు దేవాలయం. ఈ దేవాలయంలో అంతులేని సంపద ఉందని నమ్ముతారు. ఈ దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించారు. అక్టోబర్ లో జరిగే ఆల్ఫాసీ, మార్చిలో జరిగే పంగునీ ఉత్సవాల సందర్భంగా ఇక్కడకు భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. కేరళలోని తిరువనంతపురంలో ఈ అనంతపద్మనాభ స్వామి దేవాలయం ఉంది.

అంబలపూజ శ్రీకృష్ణ దేవాలయం.

అంబలపూజ శ్రీకృష్ణ దేవాలయం.

P.C: You Tube

17వ శతాబ్దంలో నిర్మించిన అంబలపూజ శ్రీ కృష్ణదేవాలయంలో ఆ నల్లనయ్య గోపాల బాలుడి రూపంలో దర్శనమిస్తాడు. అంబలపూజ దేవాలయానికి ప్రతి రోజూ శ్రీ కృష్ణుడు బాలుడి రూపంలో వస్తారని చెబుతారు. ఈ దేవాలయంలో జులై, మార్చి నెలల్లో జరిగే ఉత్సవం సమయంలో ఎక్కువ మంది ప్రజలు హాజరవుతారు.

శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం.

శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం.

P.C: You Tube

శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి చెందినది. పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ దేవాలయానికి ప్రతి ఏడాది సంక్రాంతి సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ప్రతి మలయాళీ నెల మొదటి ఆరు రోజులు ఈ దేవాలయం తెరిచే ఉంటుంది.

గురువయ్యూర్ శ్రీ కృష్ణ దేవాలయం.

గురువయ్యూర్ శ్రీ కృష్ణ దేవాలయం.

P.C: You Tube

గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ బాల కృష్ణుడు రూపంలో ఆ కృష్ణుడు మనకు దర్శనమిస్తాడు. పాతాళశిలతో చేయబడిన మూలవిరాట్టు విగ్రహం అనేక మహిమలు కలిగినదని నమ్ముతారు.

చోట్టానికర దేవి దేవాలయం, ఎర్నాకులం

చోట్టానికర దేవి దేవాలయం, ఎర్నాకులం

P.C: You Tube

ఇక్కడి అమ్మవారిని భగవతి పేరుతో కొలుస్తారు. ఆలయంలోని విగ్రహం 4 నుంచి 5 అడుగుల ఎత్తు ఉంటుంది. మానసిక సమస్యలన్నింటినీ తొలిగించే దేవతగా ఈమెకు పేరు. ఎర్నాకుటానికి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో మత్రమే ఈ చోట్టానికర దేవి దేవాలయం ఉంది.

ఎట్టుమనూర్-వాయ్ కోం-కాదు తురితీ దేవాలయం

ఎట్టుమనూర్-వాయ్ కోం-కాదు తురితీ దేవాలయం

P.C: You Tube

ఎట్టుమనూర్-వాయ్ కోం-కాదు తురితీ దేవాలయం లో ప్రధాన దైవం శివుడు. ఇక్కడ కొలువై ఉన్న పరమేశ్వరుడిని వాయ్ కోం మహాదేవ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ దేవుడిని ఏమి కోరుకొంటే అది జరిగిపోతుందని భక్తులు నమ్ముతారు.

మన్నారసాల నాగరాజ దేవాలయం

మన్నారసాల నాగరాజ దేవాలయం

P.C: You Tube

మన్నారసాల నాగరాజ దేవాలయం పురాణ ప్రాధాన్యత కలిగినది. ఈ దేవాలయం అత్యంత ప్రాచీనమైనది. ఇక్కడ దాదాపు 30000 నాగ ప్రతిమలను చూడవచ్చు. వివాహం అయినా కూడా పిల్లలు కలగని దంపతులు ఇక్కడ ఉన్న నాగ దేవతకు పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని నమ్ముతారు.

తిరువచ్చికులం శివ దేవాలయం, త్రిషూర్

తిరువచ్చికులం శివ దేవాలయం, త్రిషూర్

P.C: You Tube

కేరళలోని త్రిషూర్ జిల్లా కొడంగల్లూర్ లో తిరువచ్చికులం శివ దేవాలయం ఉంది. ఇక్కడి ప్రధాన దైవమైన పరమేశ్వరుడిని మహాదేవ పేరుతో స్థానికులు కొలుస్తారు. కుడ్యచిత్రాలు ఇక్కడ చాలా బాగుంటాయి. అందువల్ల ఈ దేవాలయంలోని గోడలను భారత పురావస్తుశాఖ సంరక్షించే కట్టడాల జాబితాలో చేర్చింది.

లొంకనార్ కావ్ దేవాలయం, కోచికోడ్

లొంకనార్ కావ్ దేవాలయం, కోచికోడ్

P.C: You Tube

కేరళలోని కోచికోడ్ కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే లొంకనార్ కావ్ దేవాలయం ఉంది. ఇక్కడ మండల ఉత్సవం 30 రోజుల పాటు కన్నుల పండువగా జరుగుతుంది. పోరక్కలి అనే జానపద న`త్యాన్ని ఈ ఉత్సవం సందర్భంగా స్థానికులు ప్రదర్శిస్తారు. ఈ న`త్యాన్ని చూడటానికే లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు.

శ్రీ పరసికడవు ముత్తపన్ దేవాలయం.

శ్రీ పరసికడవు ముత్తపన్ దేవాలయం.

P.C: You Tube

వాలపట్టణం నదీ తీరంలో వెలిసిన ఈ దేవాలయంలోని ప్రధాన దైవాన్ని ముత్తప్పన్ అని పిలుస్తారు. భక్తులు ఇక్కడి ప్రధాన దైవానికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పించి దానికి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ దేవాలయంలోకి శునకాలకు ప్రవేశం ఉండటం గమనార్హం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X