Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

హిందూదేవాలయాలకి ఒక ప్రత్యేకత వుంది.హిందూదేవాలయాలు అంటే పాజిటివ్ ఎనర్జీకి కేంద్రబిందువులు. హిందూదేవాలయాలలో వుండే గంటలు, వెండివిగ్రహం, బంగారం మరియు వెండివిగ్రహాలు మరీముఖ్యంగా పంచలోహవిగ్రహాలు.

By Venkatakarunasri

హిందూదేవాలయాలకి ఒక ప్రత్యేకత వుంది.హిందూదేవాలయాలు అంటే పాజిటివ్ ఎనర్జీకి కేంద్రబిందువులు. హిందూదేవాలయాలలో వుండే గంటలు, వెండివిగ్రహం, బంగారం మరియు వెండివిగ్రహాలు మరీముఖ్యంగా పంచలోహవిగ్రహాలు ఇవన్నీ పాజిటివ్ఎనర్జీని కలిగిస్తాయి.అందుకే మనం టెంపుల్ కి వెళ్లినప్రతీ సారి మన మనస్సుప్రశాంతంగా అనిపిస్తుంది.సో మనం ఇప్పుడు 10మోస్ట్ పవర్ ఫుల్ టెంపుల్స్ ఇన్ హైదరాబాద్ ఏంటో చూద్దాం. అందరూ లేడీస్ ఫస్ట్ అంటారుకదా.సో మనం అమ్మవారు దేవాలయంతో పెద్దమ్మ టెంపుల్.

ముందుగా దేవుడికి ఒక దండం పెట్టుకుని మొదలుపెడదాం.ఓం నమో నమః. అసలు ఇందులో టాపిక్ ఏంటంటే దేవుళ్ళు, దండాలు. క్లియర్ గా చెప్పాలిఅంటే గుళ్ళుగోపురాలు అన్నమాట. ఇప్పుడు మనం 10మోస్ట్ పవర్ ఫుల్ టెంపుల్స్ ఇన్ హైదరాబాద్ ఏంటో చూద్దాం.

హిందూదేవాలయాలకి ఒక ప్రత్యేకత వుంది.హిందూదేవాలయాలు అంటే పాజిటివ్ ఎనర్జీకి కేంద్రబిందువులు. హిందూదేవాలయాలలో వుండే గంటలు, వెండివిగ్రహం, బంగారం మరియు వెండివిగ్రహాలు మరీముఖ్యంగా పంచలోహవిగ్రహాలు ఇవన్నీ పాజిటివ్ఎనర్జీని కలిగిస్తాయి.అందుకే మనం టెంపుల్ కి వెళ్లినప్రతీ సారి మన మనస్సుప్రశాంతంగా అనిపిస్తుంది.సో మనం ఇప్పుడు 10మోస్ట్ పవర్ ఫుల్ టెంపుల్స్ ఇన్ హైదరాబాద్ ఏంటో చూద్దాం. అందరూ లేడీస్ ఫస్ట్ అంటారుకదా.సో మనం అమ్మవారు దేవాలయంతో పెద్దమ్మ టెంపుల్.

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

పెద్దమ్మ టెంపుల్

సుమారుగా 300సంలు చరిత్రకలిగిన అత్యంతశక్తివంతమైన గుడి పెద్దమ్మగుడి. జూబ్లీహిల్స్ గ్రామానికి గ్రామదేవతగా పెద్దమ్మతల్లిని పూజిస్తారు. మీరు ఎంత వత్తిడిగా వున్నా సరే మీరు ఒక్కసారి ఈ టెంపుల్ ను దర్శించగానే మీలో పాజిటివ్ ఎనర్జీని నింపి జీవితంపై కొత్తఆశలు చిగురిస్తాయి. ఈ టెంపుల్ కి వున్న విశిష్టతలు గురించి తెలుసుకుందాం.

PC:youtube

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

పెద్దమ్మ టెంపుల్

ఈ టెంపుల్ లో ఒక ప్రత్యేకత వుంది.మనస్సులో ధృడంగా ఒక కోరిక కోరుకుని అక్కడ నేలపై 1రు కాయిన్ ను నిలబెడితే మనం కోరిన కోర్కెలు తీరతాయని భక్తులు గట్టిగా నమ్ముతారు. మీరు ఈ టెంపుల్ లో వున్న నవశక్తి ఆలయాన్ని తప్పక దర్శించుకోండి. ప్రతి రోజూ రాత్రి 7గంల తర్వాత అమ్మవారికి ఆ నవశక్తిఆలయం దగ్గర హారతి ఇచ్చే ఘట్టం చాలా అద్భుతంగా వుంటుంది.

PC:youtube

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

పెద్దమ్మ టెంపుల్

ఈ టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ పులిహోర మాత్రం మిస్సవ్వకండి. మీరు చేతికి అమ్మవారి ఎర్రకంకణం కట్టుకుంటే అది చూసిన ఎవ్వరైనాసరే పెద్దమ్మగుడికి ఎప్పుడు వెళ్ళావ్?అని అడుగుతారు. హైదరాబాద్ లో అంత ఫేమస్ & పవర్ ఫుల్ టెంపుల్ మరి.

PC:youtube

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

పెద్దమ్మ టెంపుల్

ప్రతి ఆదివారం, న్యూ ఇయర్ రోజు, ఉగాది రోజు, శ్రావణశుక్రవారం రోజు భక్తులు ఈ టెంపుల్ కి భారీసంఖ్యలో తరలివస్తారు.వై.యస్.జగన్ దగ్గర నుంచి నారాచంద్రబాబు నాయుడు దాకా, పవన్ కల్యాణ దగ్గరనుంచి బాలకృష్ణదాకా ఈ టెంపుల్ ని దర్శించని వి.ఐ.పి.లేరంటే అతిశయోక్తికాదు. సెకండ్ టెంపుల్ చిలుకూరి బాలాజీ టెంపుల్.

PC:youtube

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

చిలుకూరి బాలాజీ టెంపుల్

శ్రీనివాసా గోవిందా, శ్రీవేంకటేశ గోవిందా

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలోనే కాదండోయ్, వేంకటేశ్వరుడు ఎక్కడవున్నా ఆయన అంతే పవర్ ఫుల్. హైదరాబాద్ లో వీసాలబాలాజీగా పిలవబడే ఈ వెంకన్న చిలుకూరిబాలాజీగా బాగా ఫేమస్ అయ్యాడు.

PC:youtube

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

చిలుకూరి బాలాజీ టెంపుల్

ఒక్కసారైనా పార్టిసిపేట్ చేయనివాళ్ళు కూడా ఈ టెంపుల్ లో అంతరద్దీలో కూడా 108ప్రదక్షిణలు చేయటానికి వెనకాడరు.అలా 108సార్లు ప్రదక్షిణలుచేయటం ద్వారా భక్తులు వాళ్ళ మొక్కును తీర్చుకుంటారు. ఒక్కసారి ఈ బాలాజీని దర్శించి భక్తితో నాకు వీసాకావాలి బాసు అంటే ఆయన ట్రంపు కంటే ముందుగానే అప్రూవ్ చేస్తాడు.అని భక్తులు గట్టిగా నమ్ముతారు.

PC:youtube

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

చిలుకూరి బాలాజీ టెంపుల్

ఈ టెంపుల్ కున్న విశిష్టతలు ఏంటీ అంటే అక్కడ హుండీలు వుండవు.మీరు స్వామివారికి కానుకలు సమర్పించాలి అంటే ఆయన బ్యాంక్ అకౌంట్ లోనే వెయ్యాలి. డిజిటల్ మనీని మొట్ట మొదటిసారిగా ప్రోత్సహించిన గుడిగా చెప్పుకొనవచ్చును.

PC:youtube

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

చిలుకూరి బాలాజీ టెంపుల్

మోడీకి ఈ విషయం తెలిస్తే ఆయనకూడా వచ్చి 108ప్రదక్షిణలు తప్పకచేస్తాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మోడీ వచ్చినా ఇండియన్ ప్రెసిడెంట్ వచ్చినా క్యూలోనే నిలబడి దర్శించుకోవాలి. వి.ఐ.పి కల్చర్ ని మొట్టమొదట బ్యాన్ చేసిన ఘనత కూడా ఈ టెంపుల్ కే వస్తుంది.

PC:youtube

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

చిలుకూరి బాలాజీ టెంపుల్

ఈ దేవాలయంలో నైవేద్యం మోసుకువెళ్ళే అదృష్టం భక్తులకి చాలా అరుదుగా లభిస్తుంటుంది. మనం 1లక్షరూపాయలు ఇచ్చినా ఆ అదృష్టం దొరకదు. మీరు ఏ రోజు వెళ్ళినా అక్కడ భక్తులరద్దీ బాగానే వుంటుంది. మరీ ముఖ్యంగా వీకెండ్స్ చాలా ఎక్కువగా వుంటుంది.

PC:youtube

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్

ఈ హనుమాన్ టెంపుల్ కి ఒక చరిత్ర వుంది.12వ శతాబ్దంలో ఒక కార్తికేయరాజు వేటకు వెళ్లి ఒక చెట్టు కింద సేదతీరుతున్న సమయంలో రామనామం జపిస్తూవున్న ఒక గొంతువినబడింది. అది విన్న ఆ రాజు ఆశ్చర్యంతో అక్కడ ఎవరున్నారు అని వెతకసాగారు.

PC:youtube

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్

అక్కడ ధ్యానఆంజనేయస్వామి రూపంలో వున్న విగ్రహం నుండి ఈ గొంతు వినిపిస్తుందని గ్రహించి నివ్వెరపోయాడు.వెంటనే అక్కడ ఒక హనుమాన్ ఆలయాన్ని నిర్మించాడు ఆ రాజు. సుమారుగా 400ల సంల తరువాత ఔరంగజేబు తన సైన్యాన్ని పంపి భారతదేశంలో వున్న అన్ని దేవాలయాల్ని పడగొట్టమని ఆదేశిస్తాడు.

PC:youtube

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్

కానీ ఆ సైన్యం ఈ టెంపుల్ కాంపౌండ్ వాల్ ని కూడా దాటలేకపోయాయి.ఆ విషయాన్ని తెలుసుకున్న ఔరంగజేబు తన సైన్యంతో తనే స్వయంగా వచ్చి టెంపుల్ ని కూల్చటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఒక భయంకరమైన మెరుపు వచ్చి అతనిచేతిలో వున్న ఆయుధాన్ని ధ్వంసం చేసింది.

PC:youtube

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

అష్టలక్ష్మీ టెంపుల్

లక్ష్మీ దేవి అమ్మవారి 8రూపాలని ఒకే సారి దర్శించుకోవాలని అనుకునేవారు ఈ ఆలయాన్ని తప్పకదర్శించవలసిందే. ఈ గుడి చెన్నైలో వున్న అష్టలక్ష్మీపోలికలతోనే వుంటుంది. 5సంలపాటు నాన్ స్టాప్ గా శ్రమించి నిర్మించిన దేవాలయం ఈ అష్టలక్ష్మీదేవాలయం. సుమారుగా 1కోటి రూపాయలతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ టెంపుల్ లో మొత్తం 134దేవుళ్ళ విగ్రహాలు ఏర్పాటుచేసారు.అంటే 134మంది దేవుళ్ళను ఒకేసారి దర్శించుకోవచ్చన్నమాట.

PC:youtube

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

అష్టలక్ష్మీ టెంపుల్

రూర్ నగర్ వాసవీకాలనీ హైదరాబాద్ లో వున్న ఈ దేవాలయం కంచికామికోటి పీటం వారి ఆధ్వర్యంలో నడుస్తుంది.ప్రతి సం లక్ష్మీ దేవి జయంతి వేడుకలు చాలా వైభవంగా 10రోజులపాటు నిర్వహిస్తారు. శ్రావణశుక్రవారం ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూవుంటుంది.

PC:youtube

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

హైదరాబాద్ లో వున్న అత్యంత శక్తివంతమైన ఆలయాలు

బిర్లామందిర్

గోవిందుడు అలంకారప్రియుడు అంటారు గదా అందుకేనేమో మన బిర్లాబాబాయ్ అత్యంతసుందరమైన బిర్లామందిరాన్ని మన హైదరాబాద్ లో నిర్మించాడు గోవిందుడు కోసం.ఈ టెంపుల్ మొత్తం పాలరాతితో నిర్మించి హైదరాబాద్ లో వున్న అన్ని టెంపుల్స్ కన్నా మేటిఅని పేరు తీసుకువచ్చాడు. అక్కడ వున్న సదుపాయాలు ఏ ఇతర టెంపుల్స్ లో లేవు అని గట్టిగా చెప్పొచ్చు.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X