Search
  • Follow NativePlanet
Share
» »భారత దేశంలో విశాలమైన మానవ నిర్మిత సరస్సులో స్నానం చేశారా?

భారత దేశంలో విశాలమైన మానవ నిర్మిత సరస్సులో స్నానం చేశారా?

నక్కీ సరస్సు గురించి కథనం.

భారత దేశంలో అత్యంత విశాలమైన మానవ నిర్మిత సరస్సులో స్నానం చేయాలని ఉందా? అక్కడికి దగ్గర్లో ఉన్న పర్వత శిఖరాల పై భాగంలో ట్రెక్కింగ్ చేయాలని ఉందా? అయితే మీరు మౌంట్ అబు వెళ్లాల్సిందే. రాజస్థాన్ లోని ఈ హిల్ స్టేషనన్ ప్రకృతిరమణీయతకే కాకుండా ఆధ్యాత్మికతకు కూడా పేరెన్నికగన్నది. ఇక్కడ జైన దేవాలయం, అబు వైల్డ్ లైఫ్ కూడా పర్యాటకులను ఆకర్షిస్తోంది. రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 1220 మీటర్ల ఎత్తులో ఆరావళి పర్వత శ్రేణిలో భాగమైన ఈ హిల్ స్టేషన్ భారత దేశంలో విదేశీయులను ఆకర్షిస్తున్న ప్రముఖ పర్యాటక కేంద్రాల జాబితాలో మొదటి వరుసలో ఉంటుంది.

నక్కీ సరోవరం

నక్కీ సరోవరం

P.C: You Tube

మౌంట్ అబులో నక్కీ సరోవరం ప్రముఖ పర్యాటక కేంద్రం. సముద్ర మట్టానికి 1200 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సరోవరం ఉంది. భారత దేశంలో మానవ నిర్మిత సరోవరాల్లో దీనిదే ప్రథమ స్థానం అని చెబుతారు. ఇక్కడ గాంధీ ఘాట్ కూడా ఉంది. గాంధి అస్థికలను ఇక్కడే నీటిలో వదిలారని చెబుతారు.

సన్ సెట్ పాయింట్

సన్ సెట్ పాయింట్

P.C: You Tube

మౌంట్ అబును సందర్శించేవారిలో ప్రతి ఒక్కరూ ఈ సన్ సెట్ పాయింట్ కు తప్పక వెలుతారు. సూర్యాస్తమయం సమయంలో ఇక్కడ ప్రక`తి అందాలను చూడటం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా హనీమూన్ జంటలకు ఈ ప్రాంతం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

అచల్ ఘర్ కోట

అచల్ ఘర్ కోట

P.C: You Tube

అచల్ ఘర్ కోట మౌంట్ అబు నుంచి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోట చారిత్రాత్మకంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా పేరెన్నిక గన్నది. ఈ కోటలోని అతి ప్రాచీన శివాలయం ఉంది. ఇక్కడ శివుడి కాలివేళ్ల గురుతులు మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్న నంది విగ్రహం కూడా పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ కోటలో పలు జైన దేవాలయాలు కూడా ఉన్నాయి.

దిల్వార జైన దేవాలయం

దిల్వార జైన దేవాలయం

P.C: You Tube

రాజస్థాన్ లో తప్పక చూడాల్సిన పర్యాటక కేంద్రాల్లో దిల్వార జైన దేవాలయం ఒకటి. ఈ దేవాలయం మొత్తం తెల్లటి చలువరాతితో నిర్మితం. భారత దేశంలోని జైలు జీవితంలో ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని సందర్శించాలని భావిస్తారు. ఈ దిల్వార జైన దేవాలయాన్ని కొన్ని సార్లు జైన కాశి అని కూడా పిలుస్తారు.

ఇంకా అనేక పర్యాటక కేంద్రాలు

ఇంకా అనేక పర్యాటక కేంద్రాలు

P.C: You Tube

ఈ మౌంట్ అబు ప్రాంతంలో తాబేలు ఆకారంలోని పెద్ద రాయి పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుంది. దీనిని టెడ్ రాక్ అని పిలుస్తారు. ఈ రాయి నక్కి సరోవరం సమీపంలో ట్రెక్కింగ్ వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. ఇక మౌంట్ అబు అభయారణ్యంలో అంతరించే స్థితికి చేరిన ఎన్నో జంతువులు పక్షులను మనం చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X